ధోని జెర్సీని ప్రదర్శిస్తున్న అభిమాని (Photo Couresy: Twitter/CSKFansOfficial)
FIFA WC 2022 Brazil vs Serbia: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ మిస్టర్ కూల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని ఫిఫా ప్రపంచకప్-2022 వేదికపై ధోనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఫ్యాన్స్ సందడి.. బ్రెజిల్ ఘన విజయం
బ్రెజిల్ జట్టు మద్దతుదారుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. సాకర్ మెగా ఈవెంట్‌లో భాగంగా గ్రూప్- జిలోని మాజీ చాంపియన్ బ్రెజిల్ గురువారం సెర్బియాతో తలపడింది. దోహాలోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీ పడగా.. నేమార్ బృందం సెర్బియాను చిత్తు చేసింది. 2-0తో ప్రత్యర్థిని ఓడించి ఘనంగా టోర్నిని ఆరంభించింది. ఇక బ్రెజిల్ జట్టును ఉత్సాహపరిచే క్రమంలో ఫ్యాన్స్ ఎల్లో జెర్సీలతో దర్శనమిచ్చారు.
ధోని జెర్సీతో అభిమాని
ఇందులో భాగంగా నాబీల్ అనే వ్యక్తి బ్రెజిల్‌కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలను సీఎస్‌కే ఫ్యాన్ క్లబ్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ .. ‘‘ఎక్కడికెళ్లినా.. అక్కడ ఎల్లో’’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది.
బ్రెజిల్‌కు ఊహించని షాక్
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్రెజిల్ కెప్టెన్ నేమార్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి కుడి పాదానికి దెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 80వ నిమిషంలో సెర్బియా ఫుట్‌బాలర్ నికోలా మిలెన్‌కోవిచ్ ఢీకొట్టగా నేమార్ నొప్పితో విలవిల్లాడాడు. అతడు మైదానాన్ని వీడగా ఆంటోని నేమార్ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా తమ తదుపరి మ్యాచ్‌లో బ్రెజిల్ స్విట్జర్లాండ్‌తో పోటీ పడనున్న తరుణంలో సారథి ఇలా గాయం బారిన పడటం గమనార్హం.
చదవండి: FIFA WC 2022: వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
Everywhere we go, there’s always Yellove! 💛 https://t.co/xMRix13Ea1
— Chennai Super Kings (@ChennaiIPL) November 25, 2022
Comments
Please login to add a commentAdd a comment