Serbia
-
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్‌పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్‌కు ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
ఇంగ్లండ్‌ను గెలిపించిన జూడ్ బెలింగమ్
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ పట్టణంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1–0 గోల్ తేడాతో సెర్బియాపై నెగ్గింది. ఆట 13వ నిమిషంలో జూడ్ బెలింగమ్ ఇంగ్లండ్‌కు గోల్ అందించాడు. మరోవైపు రొమేనియా జట్టు 24 ఏళ్ల తర్వాత ‘యూరో’ టోరీ్నలో తొలి విజయం అందుకుంది. మ్యూనిక్‌లో జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో రొమేనియా 3–0తో ఉక్రెయిన్‌పై గెలిచింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన గ్రూప్ ‘ఇ’ మరో మ్యాచ్‌లో స్లొవేకియా 1–0తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించింది. -
కొడుకు కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఇప్పుడిలా ఆటతోనే..
22 మే,1999.. బెల్గ్రేడ్ నగరంలో తనకిష్టమైన టెన్నిస్ కోర్టులో జొకోవిచ్ 12వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఒక వైపు తల్లిదండ్రులు హ్యపీ బర్త్‌డే అంటూ పాడుతున్నారు. ఆ కుర్రాడిలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా సైరన్ మోత.. పెద్ద శబ్దాలతో యుద్ధ విమానాలు తమపై నుంచే వెళ్లసాగాయి. మరో వైపు నుంచి దూసుకొచ్చిన పెద్ద బాంబు తమకు సమీపంలోనే పడింది. అంతే వారంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తిపోయారు. బాంబు దాడితో కొద్ది దూరంలోనే ఉన్న పవర్ స్టేషన్ కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. అందరిలోనూ తీవ్రమైన భయం. యూగస్లావియా యుద్ధం సాగుతున్న ఆ టైమ్‌లో ఇలాంటి దృశ్యాలను చాలాసార్లే చూశారు అక్కడి ప్రజలు. జొకోవిచ్ కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్నవాడే. 78 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో బెల్గ్రేడ్పై బాంబుల దాడి కొనసాగింది. అలాంటి వాతావరణం నుంచి ఎదిగిన జొకోవిచ్ కఠోర శ్రమ, పోరాటంతో టెన్నిస్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరాడు. యుద్ధం కొనసాగిన సమయంలోనూ 12 ఏళ్ల జొకో ప్రాక్టీస్ ఆపలేదు. ఒకరోజు ఒకచోట బాంబు పడితే మరుసటిరోజు మరో చోటకు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. వరుసగా రెండు రోజుల పాటు ఒకే చోట బాంబులు వేయరనేది వారి నమ్మకం. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం, రికార్డు స్థాయిలో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగడం, లెక్కలేనన్ని ఘనతలు ఖాతాలో వేసుకోవడం మాత్రమే జొకోవిచ్‌ను గొప్పవాడిగా మార్చలేదు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎదురొడ్డి అత్యుత్తమ స్థాయికి చేరిన తీరు ఈ సెర్బియా స్టార్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ 2011లో జొకోవిచ్ మొదటిసారి వింబుల్డన్ టైటిల్ గెలిచినప్పుడు సెర్బియా దేశం మొత్తం ఊగిపోయింది. ఒకప్పుడు యుద్ధానికి కేరాఫ్ అడ్రస్‌గా.. చరిత్రలో చెడ్డపేరుతో గుర్తొచ్చిన దేశం నుంచి ఒక స్టార్ పుట్టడం ఆ దేశవాసులకు అమితానందాన్ని పంచింది. ప్రతి వీథిలో అతని పోస్టర్ వెలసింది. సిగరెట్ లైటర్లు, క్యాండీ బ్యాగ్‌లు, కీ చైన్లు ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. సెర్బియాకు ఒక కొత్త హీరో అవసరం అనిపించింది. జొకోవిచ్ ఆ స్థానాన్ని అందుకోగలిగాడు. అతను స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు బెల్గ్రేడ్లో లక్ష మందితో స్వాగతం లభించింది. దేశాధ్యక్షుడు ‘నా పదవీ నువ్వే తీసుకో’ అంటూ జోక్ కూడా చేశాడు. అమెరికాతో పాటు అగ్రశ్రేణి యూరోపియన్ దేశాల్లో ఉండే సౌకర్యాలు, ప్రోత్సాహంతో పోలిస్తే సెర్బియాలాంటి చోట నుంచి టెన్నిస్‌లో ఒక ఆటగాడు పై స్థాయికి రావడం అసంభవం. అలాంటిది జొకోవిచ్ సాధారణ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది! యుద్ధం తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఎలాంటి స్థితిలోనైనా పోరాడాలనే స్ఫూర్తిని నింపిందని అతను చెప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదీ సులువుగా దక్కదని, లభించిన ప్రతిదానినీ గౌరవించాలనే విషయాన్ని తెలుసుకున్నానని అంటాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జొకోవిచ్ది సాధారణ కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులిద్దరూ కలసి బేకరీ నిర్వహించేవాళ్లు. వారి షాప్ ఎదురుగా ఉండే ఒక టెన్నిస్ కోచింగ్ సెంటర్ కారణంగా అతనికి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. సరిగ్గా నాలుగో ఏట.. 1991లో తొలిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. అప్పటివరకు స్కీయింగ్, ఫుట్‌బాల్‌లను ఇష్టపడ్డా చివరకు టెన్నిస్ వైపే అతని అడుగులు పడ్డాయి. స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా ఆడుకునేందుకు స్నేహితులు ఎప్పుడు పిలిచినా అతను వెళ్లలేదు. టెన్నిస్ మాత్రమే ఆడతానంటూ ఠంచనుగా ప్రాక్టీస్‌కు హాజరైపోయేవాడు. దేశం వదలక తప్పదు ఏడేళ్ల ప్రాథమిక శిక్షణ తర్వాత ఇక తాను అతనికి నేర్పించేదేమీ లేదని తొలి కోచ్ జెలెనా జెన్సిచ్ స్పష్టం చేసింది. ‘మీ అబ్బాయి టెన్నిస్‌లో ఎదగాలి అనుకుంటే దేశం వదలక తప్పద’ని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు 12 ఏళ్ల జొకోను జర్మనీలోని మ్యూనిక్‌కు పంపించారు ప్రత్యేక శిక్షణ కోసం! దీనికోసం వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. సహాయం చేసేవారు లేక చాలాసార్లు అధిక వడ్డీలకు అప్పులూ తెచ్చారు. ఇందుకు ఒకే ఒక్క కారణం తమ అబ్బాయి ప్రతిభపై ఉన్న నమ్మకమే! ఏదో ఒకరోజు అతను అద్భుతాలు చేస్తాడని విశ్వసించారు. జొకో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ శిక్షణ ఫలితాలు రెండేళ్ల తర్వాత రావడం మొదలుపెట్టాయి. 14వ ఏట యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు గెలవడంతో పాటు వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 16 ఏళ్ల వయసులో తొలిసారి ఏటీపీ పాయింట్లు అతని ఖాతాలో చేరడంతో జొకో భవిష్యత్తు ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది. తర్వాతి ఏడాదే సెర్బియా జాతీయ జట్టు తరఫున డేవిస్ కప్ ఆడాడు. అదే జోరు కొనసాగిస్తూ 19 ఏళ్ల వయసులో అతను తన తొలి ఏటీపీ టైటిల్‌ను గెలుచుకోవడంతో అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. 2006లో నెదర్లాండ్స్‌లోని అమర్స్ఫూర్ట్లో అతను ఈ విజయాన్ని అందుకున్నాడు. అదే ఏడాది ఫ్రాన్స్‌లోని మెట్జ్లోనూ విజేతగా నిలవడంతో టాప్–20 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా జొకోవిచ్ నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ ప్రస్థానం.. టెన్నిస్‌లో ఏ ఆటగాడికైనా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయినా గెలవాలనేది కల. ఇతర ఎన్ని టోర్నీల్లో విజేతగా నిలిచినా.. ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆటగాడి కెరీర్‌నే మార్చేస్తుంది. తొలి మూడు సీజన్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ ఆడి ఒకసారి ఫైనల్ వరకు చేరినా ట్రోఫీ దక్కలేదు. అయితే జొకోవిచ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కలగన్న సమయం 2008లో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో వచ్చింది. ఫైనల్లో విల్‌ఫ్రెండ్ సోంగాను ఓడించి తొలిసారి మేజర్ టైటిల్‌ను జొకో ముద్దాడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డతో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే అదే గ్రాండ్‌స్లామ్‌ను అతను మరో తొమ్మిదిసార్లు సొంతం చేసుకోగలిగాడు. తర్వాతి రెండేళ్లు గ్రాండ్‌స్లామ్ దూరమైనా.. 2011లో అతని అద్భుతమైన ఆట మళ్లీ స్థాయిని పెంచింది. ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లతో వన్నె తగ్గని ప్రతిభను కనబరచాడు. ఆ తర్వాత ఇంకెన్నో గొప్ప విజయాలు, మరెన్నో సంచలనాలను ఝుళిపించిందా రాకెట్. ఇక వరల్డ్ నంబర్‌వన్‌గా అతని కీర్తి అసాధారణం. 2011లో తొలిసారి అగ్రస్థానాన్ని అందుకున్న అతను వేర్వేరు దశల్లో (ఎనిమిది సార్లు) కలిపి ఏకంగా 400 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక ఆటగాడిగా తన ర్యాంక్‌ను పటిష్ఠం చేసుకున్నాడు. రెండోస్థానంలో ఉన్న ఫెడరర్ (310 వారాల) ఒక్కడే 300 వారాలు దాటిన మరో ఆటగాడు కావడం జొకో స్థాయిని చూపిస్తోంది. అభిమానులతోనూ తలపడి.. 2011 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్.. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్లేయర్ రోజర్ ఫెడరర్‌తో మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్ జొకోవిచ్ తలపడుతున్నాడు. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ మెడోస్ మైదానమంతా ఫెడరర్ నామస్మరణతో ఊగిపోతోంది. అతని ఆటను అభిమానించడంతో పాటు అతనికున్న మంచి అబ్బాయి ఇమేజ్ కూడా అందుకు ఒక కారణం కావచ్చు. జొకోవిచ్ విషయానికి వస్తే.. అప్పుడప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచిన అతనంటే సామాన్య ప్రేక్షకులకు సదభిప్రాయం లేదు. బాగా ఆడుతున్న మరో ఆటగాడిని కూడా కనీసం గౌరవించాలనే ఆలోచన వారిలో కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే 24 వేల మంది ఉన్న స్టేడియంలో 23 వేల మంది ఫెడరర్‌కు మద్దతు పలుకుతున్నారు. అదే హుషారుతో ఫెడరర్ తొలి రెండు సెట్లు గెలుచుకున్నాడు. ఇక ఫైనల్ చేరడమే తరువాయి అన్నట్లుంది ఆ పరిస్థితి. కానీ జొకోవిచ్ పట్టు వదల్లేదు. ప్రత్యర్థితో పాటు ప్రేక్షకులతోనూ తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చి జొకోవిచ్ చెలరేగిపోయాడు. అంతే.. అతని పదునైన షాట్లకు బదులివ్వలేక ఫెడరర్ అనూహ్య రీతిలో తడబడ్డాడు. దూకుడును కొనసాగించిన జొకో వరుసగా మూడు సెట్లు గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. మ్యాచ్ గెలిచాక జొకోవిచ్.. ‘మీ అంత మంచి అభిమానులు ఎక్కడా ఉండరు. ఎందుకంటే నేను మానసికంగా ఇంకా దృఢంగా, గ్రానైట్‌లా మారేందుకు మీరు సహకరించారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యక్తిత్వమే జొకోవిచ్‌ను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ల వేటలో మిగతా ఇద్దరు ఫెడరర్, నాదల్‌లతో పోలిస్తే జొకోవిచ్ దాటిన ప్రతికూలతలు అసాధారణం. అతని సరదా చేష్టలు అతనికి జోకర్ అనే పేరును తెచ్చిపెట్టాయి. సీరియస్ ఆటలో అతనో కమేడియన్ అంటూ కామెంట్లు వినిపించాయి. ఓడినప్పుడు ఆగ్రహావేశాలతో రాకెట్లు విరగొట్టినప్పుడు ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేని ఆటగాడు ప్రపంచటెన్నిస్ చరిత్రలో ఇతనొక్కడే అంటూ విమర్శలూ వినిపించాయి. ఒక దశలో టెన్నిస్ అభిమానులంతా మాకు నచ్చని ఆటగాడు అతనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు మైదానంలో అతనికి కనీస మద్దతు కూడా లభించలేదు. కానీ ఎప్పుడూ దానిపై అతను ఫిర్యాదు చేయలేదు. ‘నేనేంటో నా ఆటతోనే చూపిస్తాను’ అంటూ చెలరేగి.. అత్యున్నత స్థానానికి చేరాడు. ‘ఇలాంటివి నన్ను మరింత దృఢంగా మార్చాయే తప్ప నన్ను కుంగదీయలేదు’ అన్న జొకోవిచ్ ఇప్పటికీ తనకు నచ్చినట్లుగానే ఆడుతున్నాడు.. గెలుస్తున్నాడు! -మొహమ్మద్ అబ్దుల్ హాది -
డేవిస్ కప్ సెమీస్‌లో సెర్బియా
మలగ (స్పెయిన్): ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్‌కు చేర్చాడు. తద్వారా డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్ ఈవెంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో లోమిర్ కెమనొవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)ను ఓడించగా... రెండో సింగిల్స్‌లో జొకోవిచ్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్ లాజొవిక్తో కలిసి జొకోవిచ్ డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. డేవిస్ కప్ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్ స్టార్ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్‌గా ఈ టీమ్ ఈవెంట్లో రికార్డు స్థాయిలో జొకోవిచ్ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్‌నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్‌లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్‌లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
యూఎస్ ఓపెన్ విజేతగా జొకోవిచ్.. మార్గరెట్ కోర్టు రికార్డు సమం
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 మెన్స్ సింగిల్ విజేతగా జొకోవిచ్ నిలిచాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్.. నాలుగో సారి యూఎస్ ఓపెనర్ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకుముందు 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి మెద్వెదేవ్ చరిత్రపుటలకెక్కాడు. దీంతో ఈసారి ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతుందని అంతా భావించారు. కానీ జకోవిచ్ మాత్రం ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ తుది పోరులో వరుస సెట్లలో 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో మూడో సీడ్ మెద్వెదెవ్‌ను జకో ఓడించాడు. ఈ విజయంతో కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జకో తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన క్రీడాకారిణిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్టు (24) రికార్డును ఈ సెర్భియా యోదుడు సమం చేశాడు. ఏడాది చాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌కు రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. చదవండి: Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్ Novak Djokovic continues to write history.@AustralianOpen | @rolandgarros | @Wimbledon pic.twitter.com/RrBFOQdiN6 — US Open Tennis (@usopen) September 11, 2023 -
గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు)
-
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
క్లబ్లో ‘ఊ అంటావా మావా’ పాటకు సమంత చిందులు .. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సామ్‌కి జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. ఒకపక్క షూటింగ్ చేస్తూనే.. మరోపక్క విరామ సమయంలో సెర్బియా అందాలను వీక్షిస్తుంది సమంత. (చదవండి: సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక ) ఇక తాజాగా సెర్బియాలోకి ఓ క్లబ్‌కి వెళ్లిన సామ్.. సరదాగా ‘ఊ అంటావా మావా’ పాటకు స్టెప్పులేసి అలరించింది. సామ్ కాలు కదపగానే అక్కన ఉన్నవారంతా జోష్‌తో చిందేశారు. పక్కనే వరుణ్.. డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్ చేశాడు. బెల్గ్రేడ్ క్లబ్లో సమంత డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు కోలుకొని ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం పట్ల కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు ఇలా బీర్ కొడుతూ డ్యాన్స్ చేయడం అవసరమా? అని కామెంట్ చేస్తున్నారు. Samantha item song craze is unbelievable 🥵🥵#SamanthaRuthPrabhu #Pushpa pic.twitter.com/BNZ2V6BOwj — Actress Glam (@actressglam) June 10, 2023 -
సెర్బియాలో కాల్పులు.. 8 మంది మృతి
బెల్గ్రేడ్: సెర్బియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకీ పట్టుకున్న ఒక దుండగుడు కదులుతున్న కారులోంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బెల్గ్రేడ్కు దక్షిణంగా కారులో ప్రయాణిస్తూ మూడు గ్రామాల పరిధిలో ఆటోమేటెడ్ గన్‌తో అతను ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితుడ్ని అదుపులోనికి తీసుకుంది. ఆ వ్యక్తి ధరించిన నీలం రంగు టీ షర్ట్‌పై నాజీల అనుకూల నినాదాలు ఉన్నాయి. అయితే అతను ఎందుకు ఈ కాల్పులు జరిపాడో ఇంకా తెలియాల్సి ఉంది. స్కూలు విద్యార్థి జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రెండు రోజులకే మరొకటి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. -
స్కూల్లో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి
బెల్గ్రాడ్: సెర్బియా దేశంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌లోని వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్లో బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు సెర్బియా హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. టీచర్‌తోపాటు పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కాల్పులకు తెగబడిన విద్యార్థిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. టీచర్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ముందుగా టీచర్‌పై కాల్పులు జరిపి తరువాత మిగతా విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు క్లాస్‌లోని విద్యార్థుల్లో ఓ చిన్నారి తండ్రి చెప్పారు. అయితే తన కూతురుకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. తుపాకీ పేలిన శబ్ధం రావడంతో పాఠశాల నుంచి పిల్లలు అందరూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే మృతి -
జొకోవిచ్ ‘నంబర్‌వన్’ రికార్డు
దుబాయ్: టెన్నిస్ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 6,980 పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉంది. గ్రాఫ్ 377 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్ మేటి రోజర్ ఫెడరర్ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ‘మీరందరి ప్రేమాభిమానం కారణంగా నా కెరీర్లో ఎన్నో కొత్త ఘనతలు సాధించాను. తాజాగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని దుబాయ్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన జొకోవిచ్ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించాడు. అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్–5 ప్లేయర్లు 1. జొకోవిచ్: 378 వారాలు 2. స్టెఫీ గ్రాఫ్ : 377 వారాలు 3. మార్టినా నవ్రతిలోవా : 332 వారాలు 4. సెరెనా విలియమ్స్: 319 వారాలు 5. రోజర్ ఫెడరర్ : 310 వారాలు -
ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..
Hardik Pandya- Natasa Stankovic Love Story: అమ్మానాన్న.. తోబుట్టువులు మినహా.. జీవితంలో అచ్చంగా తమకు మాత్రమే సొంతమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా సదరు వ్యక్తి ముందు మాత్రమే తమ మనసులోని భావాలు వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా వాళ్లతోనే పంచుకోవడానికే ఇష్టపడతారు. తాము పూర్తిగా నమ్మిన వ్యక్తి.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే.. చెప్పేదేముంది! ఎగిరి గంతేయడం సహజం. మనసుకు నచ్చితే చాలు.. ‘‘మనవాళ్లా’’, ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వారితో ముడిపడిపోతారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధాన్ని బలపరచుకుంటారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ఈ కోవకు చెందినవాళ్లే! సాధారణ మధ్య తరగతి కుటుంబం హార్దిక్- నటాషా విభిన్న ధ్రువాలకు చెందిన వాళ్లు. గుజరాత్‌లోని సూరత్‌లో 1993 అక్టోబరు 11న జన్మించాడు హార్దిక్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే, కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో సహా వడోదరకు ఫిష్ట్ అయ్యారు. కొడుకులు కృనాల్, హార్దిక్‌కు క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోన్ ఏజెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి ప్రోత్సాహంతో అన్న కృనాల్‌తో కలిసి కిరణ్ మోరే అకాడమీలో చేరిన హార్దిక్.. అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే, అప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆటను వదల్లేదు. ఆటంటే ప్రాణం తొమ్మిదో తరగతిలోనే హార్దిక్ స్కూల్‌కు వెళ్లడం మానేసి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. జూనియర్ లెవల్లో రాణిస్తూ.. క్లబ్ క్రికెట్లో సత్తా చాటాడు. నిజానికి 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. బరోడా కోచ్ సనత్ కుమార్ సూచనతో ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ఆడిన హార్దిక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ దృష్టిలో పడటంతో అతడి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. 2015 నుంచి 2021 వరకు అదే జట్టుతో కొనసాగిన హార్దిక్.. ఆర్థికంగానూ, టీమిండియా క్రికెటర్‌గానూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భావి కెప్టెన్‌గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు. ‘ప్లే బాయ్’ ఇమేజ్ అయితే, కొన్నిసార్లు తన ఆటిట్యూడ్ వల్ల హార్దిక్ తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి.. 2019లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన హార్ది్క్ పాండ్యా.. నటాషానూ మధ్యలోనే వదిలేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెర్బియా నుంచి వచ్చి బాలీవుడ్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటాషాకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుపులు. అయితే, ఎవరెన్ని మాటలు అన్నా నటాషా వెనుకడుగు వేయలేదు.. హార్దిక్‌ను నమ్మిన నటాషా ఓ పార్టీలో తనకు పరిచయమైన హార్దిక్‌ను హార్దిక్‌లానే చూసింది. తన కంటే వయసులో దాదాపు ఏడాది చిన్నవాడైన అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. ఆమె నమ్మకాన్ని హార్దిక్ వమ్ముచేయలేదు. 2020 జనవరిలో నటాషా చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ముచ్చటైన కుటుంబం మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ గోముగా అడిగాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందే మనసిచ్చిన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది మేలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలల్లోనే వీరి దాంపత్యానికి గుర్తుగా కుమారుడు అగస్త్య జన్మించాడు. వీరిది ఇప్పుడు ముగ్గురితో కూడిన ముచ్చటైన కుటుంబం. మరోసారి తన ‘రాణి’తో నిజమైన ప్రేమకు విధి కూడా సహకరిస్తుంది అంటారు. ఇలా రెండు వేర్వేరు దేశాల్లో జన్మించి.. విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన హార్దిక్- నటాషా.. ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వేడుకగా పెళ్లిచేసుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనుంది. తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్, నటాషాను వివాహమాడనున్నాడు. రాజస్థాన్ కోటలో తన ‘హృదయపు పట్టపురాణి’ని మనువాడి మరో చిరకాల జ్ఞాపకాన్ని మిగిల్చబోతున్నాడు. భార్య విశ్వాసాలకు గౌరవమిస్తూ ‘వైట్ థీమ్ వెడ్డింగ్’కు ఏర్పాట్లు చేయించి మరోసారి ఆమె మనసు గెలుచుకున్నాడు. వాలంటైన్స్‌డే-2023 సందర్భంగా ప్రేమ పక్షులు.. సారీ సారీ ప్రేమతో ముడిపడిన దంపతులు.. మరోసారి పెళ్లిచేసుకోబోతున్న అగస్త్య అమ్మానాన్న హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌కు శుభాకాంక్షలు!! చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! -
సెర్బియా జైల్లో హైదరాబాద్ వ్యాపారి.. ఆరా తీస్తున్న అధికారులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వ్యాపార నిమిత్తం సెర్బియాకు వలసవెళ్లిన ఫెరోజ్ ఖాన్ అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. పది నెలలుగా ఆయన విషయంపై సిటీలో ఉంటున్న తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. సెర్బియాలోనే స్థిరపడిన ఫెరోజ్ సోదరి ఆరా తీయగా జైల్లో ఉన్న విషయం బయటపడింది. నేరుగా జోక్యం చేసుకోవడానికి అక్కడి భాతర రాయబార కార్యాలయం నిరాకరించడంతో సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఫెరోజ్ సోదరుడు నూమన్ హుస్సేన్ జునైదీ విదేశాంగ శాఖకు లేఖ రాశాడు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన అధికారులు సోమవారం ఫెరోజ్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. బెల్గ్రేడ్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసి.. ఫస్ట్ లాన్సర్‌లోని ఖాజానగర్ ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్ (44) తండ్రి మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం తండ్రి, తల్లి కూడా అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితయ్యారు. పదిహేనేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న ఫెరోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు. సెర్బియాలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఫెరోజ్ బిజినెస్ వీసాపై 2020లో అక్కడికి వలస వెళ్లాడు. బెల్గ్రేడ్లో ఉన్న బ్రాంకోవా–19లో ఇండో–అరబ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వెళ్లి సెర్బియాలో స్థిరపడిన వారు ఫెరోజ్ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉండే వాళ్లు. నాటకీయ పరిణామాల మధ్య మిస్సింగ్... సెర్బియా నుంచి అనునిత్యం నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడే ఫెరోజ్ ఆఖరుసారిగా గతేడాది మార్చి 10న కాల్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఫోన్లు పని చేయకపోవడంతోపాటు ఆచూకీ లేదు. దీంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లు ఎదురుచూశారు. చివరకు సెర్బియాలో ఉన్న ఫెరోజ్‌కు సోదరి వరుసయ్యే మహిళను సంప్రదించారు. బ్రాంకోవాలోని ఇండో–అరబ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన ఆమె అది చాన్నాళ్ల క్రితమే మూతపడినట్లు గుర్తించింది. చుట్టుపక్కల ఆరా తీయగా గతేడాది మార్చి 9న రెస్టారెంట్లో కొందరు భారతీయులు–బంగ్లాదేశీయుల మధ్య గొడవ జరిగిందని, వారికి ఫెరోజ్ సర్దిచెప్పాడని, ఆ మర్నాడే అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారని తెలిసింది. ఈ విషయం నగరంలో ఉన్న ఫెరోజ్ తల్లిదండ్రులకు చెప్పిన ఆమె... సెర్బియాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్నీ సంప్రదించింది. ఢిల్లీ నుంచి ఉత్తర్వులు రావాలనడంతో... అక్కడి జైల్లో మగ్గుతున్న ఫెరోజ్ వివరాలు ఆరా తీయడానికి నిరాకరించిన రాయబార కార్యాలయం తాము జోక్యం చేసుకోవాలంటే ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) నుంచి ఆదేశాలు రావాలని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫెరోజ్ సోదరుడు, ఆలియాబాద్ వాసి నూమన్ శుక్రవారం భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఎంబీటీ పార్టీ నేత అమ్జదుల్లా ఖాన్ ఎంఈఏకు ట్వీట్ చేస్తూ ఫెరోజ్‌పై సెర్బియాలో నమోదైన కేసు వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఆయనకు న్యాయం చేయడంతో పాటు భారత్‌కు రప్పించడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. నూమన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఫెరోజ్ జైల్లో ఎందుకు ఉన్నాడో తెలీదు. దీనిపై అక్కడి పోలీసులు కనీసం అతడి తల్లిదండ్రులకూ సమాచారం ఇవ్వలేదు. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందన మొదలైంది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చి పూర్తి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఫెరోజ్‌కు న్యాయం చేయాలని కోరుతున్నా’ అన్నారు. చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం -
సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు..
Australian Open 2023- మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదోసారి విజేతగా నిలిచేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడు విజయాల దూరంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–2, 6–1, 6–2తో 22వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 126 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కేవలం ఐదు గేమ్‌లను మాత్రమే తన ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆరుసార్లు అలెక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 26 విన్నర్స్ కొట్టాడు. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు నెగ్గిన అతను తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. గట్టెక్కి రెండోసారి.. మరోవైపు.. ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఐదు సెట్ల హోరాహోరీ పోరులో గట్టెక్కి రెండోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 6–3, 3–6, 6–3, 4–6, 7–6 (11/9)తో హోల్గర్ రూన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. సంచలనం సృష్టించి.. జొకోవిచ్‌తో పాటు అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారులు టామీ పాల్, బెన్ షెల్టన్ తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టామీ పాల్ 6–2, 4–6, 6–2, 7–5తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, బెన్ షెల్టన్ 6–7 (5/7), 6–2, 6–7 (4/7), 7–6 (7/4), 6–2తో జేజే వుల్ఫ్ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుబ్లెవ్తో జొకోవిచ్; బెన్ షెల్టన్‌తో టామీ పాల్ తలపడతారు. చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. -
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్‌లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది. -
సెర్బియా కంపెనీలో సోనాకు వాటాలు
ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్‌లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్ 'డ్రా'
ఫిపా ప్రపంచకప్-2022 గ్రూప్ జిలో భాగంగా కామెరూన్, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. ఇరు జట్లు చెరో మూడు గోల్స్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ వచ్చి చేరింది. మ్యాచ్ 28వ నిమిషంలో చార్లెస్ కాస్టెల్లెట్ కామెరూన్‌కు తొలి గోల్‌ను అందించాడు. తొలి భాగంలో గోల్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించిన సెర్బియా.. కామెరూన్ డిఫెన్స్ ముందు తలవంచింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో మ్యాచ్ రిఫరీ 6 నిమిషాల అదనపు సమయం కేటాయించాడు. ఈ సమయంలో సెర్బియా ఆనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఒక్క సారిగా సెర్బియా ఆధిక్యంలో వచ్చింది. (45+1వ నిమిషంలో) పావ్లోవిచ్ సెర్బీయా తరపున తొలి గోల్ సాధించగా.. మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో) మరో గోల్‌ను సాధించాడు. దీంతో మ్యాచ్ తొలి భాగం ముగిసే సరికి 2-1తో దిక్యంలో సెర్బియా నిలిచింది. రెండో భాగంలో సెర్బియా తన జోరును కోనసాగించింది. 53వ నిమిషంలో మిత్రోవిచ్ సెర్బియాకు మరో గోల్‌ను అందించి తిరుగులేని అధిక్యంలో నిలిపాడు. ఇక అంతా సెర్బియాదే విజయం అని భావించారు. ఈ సమయంలో కామెరూన్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. వరుసగా రెండు గోల్స్‌ను సాధించి సెర్బియాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. కాగా సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన విన్సెంట్ అబుబకర్ (63 నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) గోల్స్ సాధించి కామెరూన్ హీరోలుగా నిలిచారు. చదవండి: Christiano Ronaldo: రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు! -
FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం రాత్రి సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే బ్రెజిల్ స్టార్ నెయ్మర్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనే సంశయం మొదలైంది. కానీ నెయ్మర్ స్థానంలో వచ్చిన రిచర్లీసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రెజిల్ చేసిన రెండు గోల్స్ రిచర్లీసన్ కొట్టినవే కావడం విశేషం. అతను కొట్టిన రెండు గోల్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు 25 ఏళ్ల రిచర్లీసన్ పేరు ఫిఫా వరల్డ్‌కప్‌లో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు ఆరో టైటిల్ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రిచర్లీసన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అయితే రిచర్లీసన్ అనుకున్నంత ఈజీగా ఫుట్‌బాలర్ అవ్వలేదు. ఫుట్‌బాలర్ అవ్వడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు స్టార్‌గా పేరు సంపాదించినప్పటికి ఒకప్పుడు పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మాడు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రిచర్లీసన్ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఉన్నాయి. తన స్నేహితులు డ్రగ్స్ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అలా చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం" అని చెప్పుకొచ్చాడు. అప్పటికి రిచర్లీసన్ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్ గుర్తు చేసుకున్నాడు. అలా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచకున్న రిచర్లీసన్ ఒక వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతని ప్రాత్సాహంతోనే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు. ఇక రిచర్లీసన్ అమెరికా మినీరో క్లబ్‌కు వెళ్లాకా అతని దశ మారిపోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే ఎవర్టన్ క్లబ్ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఏది ఏమైనా సెర్బియాతో మ్యాచ్‌లో నెయ్మర్ లేని లోటును రిచర్లీసన్ తీర్చాడని బ్రెజిల్ అభిమానులు కామెంట్ చేశారు. On the biggest night of his career, Richarlison turned opportunity into greatness. Can Brazil’s number 9 fire his way to the Golden Boot in Qatar? 🇧🇷 #BRASER 🇷🇸 #POTM #YoursToTake @Budweiser @Budfootball pic.twitter.com/TYCYXUSQz0 — FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022 Richarlison! What have you done?! 🤯#FIFAWorldCup | @richarlison97 pic.twitter.com/kCKFdlINXq — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని -
FIFA WC: ఫిఫా వరల్డ్‌కప్‌లో ధోని హవా! గెలుపొందిన బ్రెజిల్‌కు ఊహించని షాక్!
FIFA WC 2022 Brazil vs Serbia: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ మిస్టర్ కూల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని ఫిఫా ప్రపంచకప్-2022 వేదికపై ధోనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఫ్యాన్స్ సందడి.. బ్రెజిల్ ఘన విజయం బ్రెజిల్ జట్టు మద్దతుదారుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. సాకర్ మెగా ఈవెంట్లో భాగంగా గ్రూప్- జిలోని మాజీ చాంపియన్ బ్రెజిల్ గురువారం సెర్బియాతో తలపడింది. దోహాలోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీ పడగా.. నేమార్ బృందం సెర్బియాను చిత్తు చేసింది. 2-0తో ప్రత్యర్థిని ఓడించి ఘనంగా టోర్నిని ఆరంభించింది. ఇక బ్రెజిల్ జట్టును ఉత్సాహపరిచే క్రమంలో ఫ్యాన్స్ ఎల్లో జెర్సీలతో దర్శనమిచ్చారు. ధోని జెర్సీతో అభిమాని ఇందులో భాగంగా నాబీల్ అనే వ్యక్తి బ్రెజిల్‌కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలను సీఎస్కే ఫ్యాన్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ .. ‘‘ఎక్కడికెళ్లినా.. అక్కడ ఎల్లో’’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. బ్రెజిల్‌కు ఊహించని షాక్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్రెజిల్ కెప్టెన్ నేమార్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి కుడి పాదానికి దెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 80వ నిమిషంలో సెర్బియా ఫుట్‌బాలర్ నికోలా మిలెన్‌కోవిచ్ ఢీకొట్టగా నేమార్ నొప్పితో విలవిల్లాడాడు. అతడు మైదానాన్ని వీడగా ఆంటోని నేమార్ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా తమ తదుపరి మ్యాచ్‌లో బ్రెజిల్ స్విట్జర్లాండ్‌తో పోటీ పడనున్న తరుణంలో సారథి ఇలా గాయం బారిన పడటం గమనార్హం. చదవండి: FIFA WC 2022: వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్ IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! Everywhere we go, there’s always Yellove! 💛 https://t.co/xMRix13Ea1 — Chennai Super Kings (@ChennaiIPL) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ATP Finals: ఆరోసారి విజేతగా జొకోవిచ్.. ఫెడరర్ రికార్డు సమం
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్’లో సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆరు టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7–5, 6–3తో మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై గెలిచాడు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ లభించింది. అతను 47 లక్షల డాలర్లు (రూ. 38 కోట్ల 35 లక్షలు) గెల్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015లలో ఈ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు. చదవండి: FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన -
వికెట్ తీసిన ఆనందం.. ఎవరు ఊహించని సెలబ్రేషన్
క్రికెట్లో ఒక్కో ఆటగాడికి యూనిక్ సెలబ్రేషన్స్ ఉండడం సహజం. బౌలర్ వికెట్ తీసినప్పుడో.. బ్యాటర్ సెంచరీ కొట్టినప్పుడో వింత ఎక్స్ప్రెషన్స్ సహా తమ చర్యలతో ఆకట్టుకుంటారు. తాజాగా సెర్బియాకు చెందిన అయో మేనే-ఎజెగి అనే క్రికెటర్ కూడా వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్‌కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ గ్రూఫ్-ఏలో సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అయో మేనే-ఎజెగి నాలుగు వికెట్లతో మెరిశాడు. ఒక వికెట్ తీసిన సందర్భంలో గ్రౌండ్‌పై రెండుసార్లు ఫ్లిప్(గెంతులు) చేసి ఆ తర్వాత నేలపై తన చేతులను చాచి పడుకున్నాడు. ఈ వింత సెలబ్రేషన్ అక్కడున్న వారి చేత నవ్వులు పూయించింది. ఈ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్ చేసిన ఐసీసీ.. ''వందో వికెట్ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్న సెర్బియా క్రికెటర్ అయో మేనే-ఎగిజి'' అని క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోకు దాదాపు 1,85,000 లైక్స్ రావడం విశేషం. ఇక మ్యాచ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్ 68 పరుగుల తేడాతో సెర్బియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సెర్బియా పూర్తి ఓవర్లు ఆడినప్పటికి ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఆతిథ్య హోదాలో ఆస్ట్రేలియా సహా భారత్, న్యూజిలాండ్ లాంటి టాప్-8 దేశాలు అర్హత సాధించాయి. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆసీస్ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టి20 ప్రపంచకప్ సూపర్ 12 స్టేజీ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా? -
నంబర్ 1 ర్యాంకు పోయింది.. అయినా నువ్వు మారవా! ఎందుకీ పంతం?
Serbian Tennis Star Novak Djokovic- న్యూయార్క్: సెర్బియన్ సూపర్‌స్టార్ నొవాక్ జొకోవిచ్ తన మొండివైఖరి వీడట్లేదు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును కోల్పోయిన అతను, కోవిడ్ వ్యాక్సిన్‌కు ససేమిరా అనడంతో ఇప్పుడు అమెరికాలో జరిగే కీలక టోర్నీలకూ దూరమయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజ చాంపియన్ ఇప్పుడు టీకా వ్యతిరేకతతో ప్రముఖ టోర్నీలైన ఇండియన్‌వెల్స్, మయామి, కాలిఫోర్నియా ఈవెంట్లకు దూరమయ్యాడు. ఇతని ఫామ్ దృష్ట్యా ఇందులో ఎదురయ్యే ప్రత్యర్థులు, సాధించే విజయాలు ఏమంత విషయం కానేకాదు. కానీ వ్యాక్సినేషన్‌కు దూరం కావడంతో ఇప్పుడు టైటిళ్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) నిబంధనల ప్రకారం విదేశీయులెవరైనా తప్పనిసరిగా టీకా తీసుకుంటేనే అమెరికాలో అనుమతిస్తారు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఆడలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..! View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
అందుకే వచ్చాను... మరి ఇప్పుడేంటి ఇలా: జొకోవిచ్
Novak Djokovic On Australia Visa Row Thanks Fans: ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడేద్దామనుకున్న ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా అధికారులు నిలిపివేసి షాకిచ్చారు. ప్రభుత్వం వీసా రద్దు చేసింది. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్న జొకోకు తిరుగుటపా కట్టడం ఇష్టం లేదు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో స్వదేశం సెర్బియా నుంచి అతని అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సెర్బియన్ స్టార్ తనకు వెన్నంటే నిలిచి మద్దతు పలికిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. సోమవారం జరిగే కోర్టు విచారణలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది తేలిపోతుంది. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
ఏటీపీ కప్‌నుంచి తప్పుకున్న జొకోవిచ్..
వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ 2022 తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. శనివారంనుంచి సిడ్నీలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సన్నాహక టోర్నీ ఏటీపీ కప్‌నుంచి అతను తప్పుకోవడం దీనికి మరింత బలం చేకూర్చింది. వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఆడాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు విధించగా... వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ మొదటినుంచి దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. చదవండి: SA Vs IND: "అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్.. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు" -
ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర పరాభవం.. పరువు పాయే
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్, ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. మరోవైపు డ్రాగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ.. అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు. మరి కొన్ని నెలలు పరిస్థితి ఇలానే కొనసాగితే.. పాకిస్తాన్ ప్రభుత్వంలో భారీ మార్పుల చోటు చేసుకుంటాయి. పాక్ ప్రభుత్వంపై సామాన్యులతో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా పీకల్దాక కోపం ఉంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ఎండగడతూ రూపొందిచిన ఓ పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తన ట్విటర్లో షేర్ చేసింది. (చదవండి: ఈ కడుపుమంట ఎందుకు?) ‘‘ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇమ్రాన్ ఖాన్.. మీరు ఇంకేత కాలం ప్రభుత్వ అధికారులు నోరు మెదపకుండా.. మీ కోసం పని చేయాలని ఆశిస్తున్నారు. గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఫీజు కట్టకపోవడంతో మా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇంకెంత కాలం మొద్దు నిద్ర నటిస్తారు.. ఇదేనా కొత్త పాకిస్తాన్’’ అనే క్యాప్షన్‌తో పెరడీ పాట వీడియోను షేర్ చేశారు. ఇక దీనిలో ఓ వ్యక్తి.. ‘‘సబ్బు ధర పెరిగిందా.. వాడకండి.. పిండి ఖరీదు ఎక్కువగా ఉందా.. తినకండి.. మందుల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లకండి.. మీరు కేవలం పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి. మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా పర్వాలేదు. పాకిస్తాన్ ఎప్పటికి మేల్కొదు’’ అని సాగుతూ ఉంటుంది. ఇక ప్రతి వైఫల్యం దగ్గర ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పిన డైలాడ్ ‘కంగారు పడకండి’ అని వస్తుంది. అంటే తిండి లేకపోయినా సరే కంగారు పడకండి అని సాగుతుంది ఈ పాట. (చదవండి: ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన) ఈ వీడియోని ట్విటర్లో షేర్ చేసిన కాసేపటికే ఇది తెగ వైరలయ్యింది. దాంతో అధికారుల స్పందించారు. ట్విటర్ నుంచి వీడియోని తొలగించారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రిత్వ ‘‘సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశాలు సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చినవి కావు’’ అని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ఉంది. The Twitter, Facebook and Instagram accounts of the Embassy of Pakistan in Serbia have been hacked. Messages being posted on these accounts are not from the Embassy of Pakistan in Serbia. — Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) December 3, 2021 చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ -
FIFA World Cup 2022: రొనాల్డో జట్టుకు షాకిచ్చిన సెర్బియా..
FIFA World Cup 2022: Serbia Qualified After Beat Portugal Shock To Ronaldo Team: మరో ఐదు నిమిషాలు సెర్బియాను గోల్ చేయకుండా నిలువరించి ఉంటే... విఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది ఖతర్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించేది. కానీ మ్యాచ్ 90వ నిమిషంలో సెర్బియా ప్లేయర్ మిత్రోవిచ్ గోల్ చేసి తమ జట్టును 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా ఐదు నిమిషాలు జతచేయడంతో పోర్చుగల్‌కు స్కోరును సమం చేసేందుకు అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. దాంతో సెర్బియా విజయం ఖాయ మైంది. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సెర్బియా 20 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. 17 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది మార్చిలో ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది. చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్ ముందు కివీస్‌కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. ఎందుకంటే.. FIFA World Cup 2022: ఫ్రాన్స్ అర్హత.. బెల్జియం, క్రొయేషియా కూడా -
Mitrabha Guha: 72వ గ్రాండ్ మాస్టర్‌గా మిత్రభా గుహా
Kolkata Mitrabha Guha Becomes India 72nd Grandmaster: కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ల మిత్రభా గుహా భారత్ నుంచి 72వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్ రసెల్ జీఎం టోర్నీలో మిత్రభా రెండో జీఎం నార్మ్‌ను సాధించాడు. అంతేకాకుండా జీఎం హోదా దక్కడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌నూ దాటాడు. చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నరేందర్ ముందంజ..
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో నరేందర్ 4–1తో ఒస్కార్ సఫర్యాన్ (పోలాండ్)పై నెగ్గగా... సుమిత్ 5–0తో డామన్ ఒనీల్ (జమైకా)ను చిత్తు చేశాడు. గోవింద్ 3–2తో అరియస్ ఒరిట్జ్ (ఈక్వెడార్)పై, నిశాంత్ 5–0తో లాస్లో కొజాక్ (హంగేరి)పై విజయం సాధించారు. 86 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్ తొలి రౌండ్లో కిమ్ హైంగ్కియు (కొరియా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్ -
20 ఏళ్లుగా గుహకే పరిమితం.. టీకా ఇచ్చిన అధికారులు
బెల్గ్రేడ్: సెర్బియాకు చెందిన పాంటా పెట్రోవిక్(70) మనుషుల ప్రవర్తనతో విసిగిపోయాడు. ముఖ్యంగా జనాల్లో పెరిగిపోతున్న అవినీతిని చూసి తట్టుకోలేకపోయాడు. చుట్టూ జరుగుతున్న దారుణాలను చూసి ఎంతో బాధపడ్డాడు. వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు.. తానే మారిపోయాడు. మనుషులకు దూరంగా అడవిలోకి వెళ్లి.. ఓ గుహలో జీవించసాగాడు. గత 20 ఏళ్ల నుంచి పాంటా ఇలా గుహలోనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పాంటా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ‘‘జనావాసాలకు దూరంగా ఉంటున్నావ్ కదా.. నీకేందుకు భయం’’ అంటే.. ‘‘అసలే అది కరోనా వైరస్.. ఎవరిని వదిలిపెట్టదు.. ఇక్కడకు రాగలదు.. నా గుహలోకి కూడా ప్రవేశిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా టీకా తీసుకున్నాను. అదనపు డోస్‌తో కలిపి మూడు టీకాలు తప్పకుండా తీసుకుంటాను. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకోండి’’ అని కోరాడు పాంటా. గతేడాదే తనకు వైరస్ గురించి తెలిసిందన్నాడు. ఇక ఇలా మనుషులకు దూరంగా.. గుహలో జీవించడం గురించి పాంటా మాట్లాడుతూ.. ‘‘నగరంలో ప్రశాంతంగా.. స్వేచ్ఛగా బతకలేకపోయాను. ఎవరో ఒకరితో అనుక్షణం గొడవపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి గొడవలు ఏం ఉండవు. ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను’’ అని తెలిపాడు. ఈ గుహలోకి రావడానికి ముందు దినసరి కూలీగా పని చేసేవాడు. గుహ జీవితం ప్రాంరభించడానికి ముందు తన ఆస్తులను చుట్టుపక్కలవారికి దానం చేశాడు పాంటా. ఇక ఆహారం కోసం పాంటా అడవిలో అన్వేషిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సమీపంలోని చెరువులో చేపలు పట్టడం చేస్తుంటాడు. ఎక్కువగా పుట్టగొడుగులను తింటుంటాడు. ఇక గుహలో పడుకోవడానికి రెండు బెంచీలు, ఓ టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘‘దొరికింది తింటూ.. అడవిలో సంచరిస్తూ.. స్వేచ్ఛగా జీవిస్తున్నాను.. ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది’’ అంటున్నాడు పాంటా. -
చరిత్రకు చేరువగా...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు. షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు. 1976 తర్వాత... తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. -
సంగీతంతో సమరభేరి.. అయినా సరే, ‘తగ్గేదే లేదు’
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు... అదేమిటోగానీ సెర్బియాలోని ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో శతాబ్దాలుగా తిష్ట వేసిన పురుషాధిక్య భావజాలంపై సమరభేరీ మోగిస్తోంది. బాల్య వివాహాలను నుంచి గృహహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తుంది. కేవలం సమస్య గురించి మాట్లాడడమే కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది.ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్‌ది నల్లేరుపై నడకేమీ కాదు. ‘పెళ్లివిందు దగ్గర బ్యాండ్ వాయించండి. మీ వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వెక్కిరించిన వాళ్లు కొందరైతే ‘మా పిల్లల పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు!’ అంటూ భౌతికదాడులు చేసినవారు ఇంకొందరు. అయినా సరే, ‘తగ్గేదే లేదు’ అంటు ముందుకు సాగుతున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని అరికట్టడానికి సెర్బియన్ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం రాలేదు. అయితే రోమా బ్యాండ్ ప్రచారం వల్ల తరతరాల సంప్రదాయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ‘మీకంటూ ఒక సొంతవ్యక్తిత్వం ఉంది. భవిష్యత్‌ను నిర్మాణం చేసుకునే హక్కు పూర్తిగా మీ మీదే ఉంది’లాంటి మాటలు వినేవారికి మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను గ్రహించడం మొదలైంది’ అంటోంది 24 సంవత్సరాల సిల్వియా సినాని అనే సభ్యురాలు. ఫిమేల్ బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో చాలామంది బాల్యవివాహాలకు దూరంగా ఉన్నారు. చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ తెలియని వయసులో బాల్యవివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది! ర్యాప్ అండ్ ట్రెడిషనల్ రోమా–ఫోక్ బీట్ మిళితం చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్–ఫిమేల్ బ్యాండ్’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్ బ్యాండ్’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్–ఫిమేల్ బ్యాండ్ మొదలైంది. అప్పుడు కేవలం వినోదం కోసం అయితే ఇప్పుడు ‘స్త్రీ చైతన్యం’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తోంది. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన ఈ బ్యాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శం అయింది. -
ఇటు జొకోవిచ్... అటు బార్టీ
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) దూసుకుపోతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 12వసారి జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 4–6, 4–6, 6–0, 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–1, 6–3, 7–5తో ఎనిమిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–3, 6–1తో ఇవాష్క (బెలా రస్)పై, 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–4, 6–3, 5–7, 10–8తో ‘బర్త్‌డే బాయ్’ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై; ఫీలిక్స్ ఉజర్ అలియాసిమ్ (కెనడా) 6–4, 7–6 (8/6), 3–6, 3–6, 6–4తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై... ఆన్స్ జెబర్ (ట్యూనిషియా) 5–7, 6–1, 6–1తో స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచారు. సబలెంకా 6–3, 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై, కెర్బర్ 6–4, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై, ముకోవా 7–6 (8/6), 6–4తో బదోసా (స్పెయిన్)పై, గోలూబిచ్ 7–6 (7/3), 6–3తో కీస్ (అమెరికా)పై, ప్లిస్కోవా 6–2, 6–3 తో సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇందులో ముకోవా, కెర్బర్ మినహా మిగతా వారంతా ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరారు. -
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
‘దశ ధీర’ నాదల్
రోమ్: మట్టికోర్టులపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 7–5, 1–6, 6–3తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ స్పెయిన్ స్టార్ 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019లలో కూడా ఇక్కడ టైటిల్ సాధించాడు. తద్వారా ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను... బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకోవిచ్ (36 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును నాదల్ (36 టైటిల్స్) సమం చేశాడు. అంతేకాకుండా జొకోవిచ్‌తో ముఖాముఖి రికార్డులో ఆధిక్యాన్ని 28–29కి తగ్గించాడు. రోమ్ ఓపెన్ విజేత హోదాలో నాదల్కు 2,45,085 యూరోల (రూ. 2 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ జొకోవిచ్ ఖాతాలో 1,45,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 29 లక్షలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఐదుసార్లు విజేతగా నిలిచి, ఆరుసార్లు రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో తొలి సెట్ హోరాహోరీగా జరిగింది. 75 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లోని 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి నాదల్ సెట్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో జొకోవిచ్ దూకుడుకు నాదల్ తడబడ్డాడు. అనవసర తప్పిదాలు చేసి కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచి సెట్‌ను కోల్పోయాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో నాదల్ మళ్లీ లయలోకి వచ్చాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘ఈ టోర్నీలో నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. ముఖ్యంగా షపవలోవ్తో జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కాను. ఓవరాల్‌గా ఈ టోర్నీలో బాగా ఆడాను.’ –రాఫెల్ నాదల్ -
ఏందిది కికా.. నిజమా లేక భ్రమా!
కికా రంగంలోకి దిగితే ఇలాగే ఉంటుంది. చిన్నప్పుడే మొదలైంది పెయింటింగ్ మీద ఆసక్తి.. అలా మొదలైన ప్రయాణం ఇదిగో ఇలాంటి చిత్రవిచిత్రమైన బాడీ పెయిటింగ్ టెక్నిక్‌ల దాకా చేరింది. నిజమా లేక భ్రమా అన్నట్లుగా బాడీ పెయింటింగ్ టెక్నిక్‌ను వాడటంలో సెర్బియాకు చెందిన మిర్జానా కికా మిలోసెవిక్ది అందె వేసిన చేయి.. మోడళ్లను వాడదు.. అన్నీ ప్రయోగాలు తనపైనే.. అదిరిపోలే.. అందుకే సోషల్ మీడియాలో తనకు తెగ క్రేజ్ ఉంది. -
ఫైనల్లో డొమినిక్ థీమ్
లండన్: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్ థీమ్ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు. రెండో సెట్లో నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకున్న థీమ్... నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ మరో పాయింట్ గెలిచినా... ఆ వెంటనే థీమ్ మరో పాయింట్ సాధించి 7–5తో టైబ్రేక్తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మెద్వెదేవ్ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్ ఆడతాడు. -
జొకోవిచ్‌నూ వదలని మహమ్మారి
యూరప్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినా... అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఫిట్నెస్ గొప్పగా ఉన్న వాళ్లూ ఈ మహమ్మారి బారిన పడటం ఖాయమని తేలిపోయింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడంలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్‌ను మనం ఆహ్వానించినట్లేనని టెన్నిస్ ప్రపంచంలోని తాజా ఉదంతం చెబుతోంది. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారుల కోసం నిధులు సేకరించాలనే సదుద్దేశంతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ టోర్నీలపై వివాదం చెలరేగింది. ఈ టోర్నీల్లో ఆడిన దిమిత్రోవ్, బోర్నా చోరిచ్ కరోనా బారిన పడగా... వీరిద్దరి సరసన స్వయంగా నొవాక్ జొకోవిచ్, అతని సహచరుడు విక్టర్ ట్రయెస్కీ చేరడంతో టెన్నిస్ ప్రపంచంలో కరోనా కలకలం సృష్టించింది. జొకోవిచ్, ట్రయెస్కీలతోపాటు వారిద్దరి భార్యలకూ కోవిడ్–19 పాజిటివ్ ఫలితం రావడం గమనార్హం. బెల్గ్రేడ్ (సెర్బియా): కరోనా మహమ్మారి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. తనతోపాటు భార్య జెలెనాకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందని... అయితే ఇద్దరిలోనూ ఈ వైరస్ లక్షణాలు లేవని జొకోవిచ్ ప్రకటించాడు. తమ ఇద్దరి పిల్లలకు మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చిందని నొవాక్ తెలిపాడు. 14 రోజులపాటు తామిద్దరం స్వీయ నిర్బంధంలోకి వెళ్లి చికిత్స తీసుకుంటామని... తమ టోర్నీల కారణంగా కరోనా బారిన పడ్డ వారందరూ పెద్ద మనసుతో క్షమించాలని నొవాక్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరాడు. జొకోవిచ్ సహచరుడు, ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన సెర్బియాకే చెందిన మరో టెన్నిస్ ప్లేయర్ విక్టర్ ట్రయెస్కీ, గర్భవతిగా ఉన్న అతని భార్యకు కూడా కోవిడ్–19 పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న ప్రపంచ 19వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), క్రొయేషియా ఆటగాడు బోర్నా చోరిచ్, నొవాక్ ఫిట్నెస్ కోచ్ మార్కో పానిచి సోమవారమే ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా నొవాక్, ట్రయెస్కీలకు ఈ మహమ్మారి సోకడంతో ప్రపంచ టెన్నిస్‌లో కలకలం చోటు చేసుకుంది. గత వారం తన సోదరుడు జార్జెతో కలిసి తానే నిర్వాహకుడిగా మారి జొకోవిచ్ ఒక టెన్నిస్ ఎగ్జిబిషన్ టోర్నీలను నిర్వహించాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తొలి అంచె పోటీలు బెల్గ్రేడ్లో జరగ్గా... క్రొయేషియా వేదికగా రెండో అంచె టోర్నీ జరిగింది. ఈ టోర్నీ సందర్భంగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో దిమిత్రోవ్, చోరిచ్లతో పాటు జొకోవిచ్ ఫిట్నెస్ కోచ్‌కు కరోనా అని తేలింది. దాంతో టోర్నీని నిలిపేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ టోర్నీలను నిర్వహించడమే కాకుండా వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు. ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం చేశారు. మ్యాచ్‌లు ముగిశాక జొకోవిచ్‌తో సహ ఇతర ఆటగాళ్లందరూ నైట్‌క్లబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకున్నారు. చివరకు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. -
టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్‌కు కరోనా పాజిటివ్
బెల్గ్రేడ్ : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారీన పడుతూ వస్తున్నారు. తాజాగా టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా జొకోవిచ్ వెల్లడించాడు. జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనాకు పాజిటివ్ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయంపై జోకోవిచ్ మాట్లాడుతూ..' నేను బెల్గ్రేడ్కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. రిపోర్టులో నాకు, నా భార్యకు పాజిటివ్ రాగా, పిల్లలకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లోనే ఉంటు చికిత్స తీసుకుంటా' అని పేర్కొన్నాడు.('కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది') కాగా అంతకుముందు జొకోవిచ్ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్ సిరీస్ ఈవెంట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జొకోవిచ్ క్షమాపణ చెప్పాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరుగుతుండగానే బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్, క్రొయేషియా యువ ఆటగాడు బొర్నా చోరిచ్లతో పాటు జోకోవిచ్ ఫిట్నెస్ కోచ్ మార్కో పానిచి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మ్యాచ్‌ల సందర్భంగానే జొకోవిచ్ వారితో కలిసి టెన్నిస్ ఆడడంతోనే కరోనా సోకినట్లు జొకోవిచ్ సోదరుడు జార్జె జొకోవిచ్ వెల్లడించాడు. మరోవైపు కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ టోర్నీలేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శకులతో పాటు టెన్నిస్ వర్గాలు జొకోవిచ్ నిర్వాకంపై మండిపడుతున్నారు. -
ఏటీపీ కప్ విజేత సెర్బియా
సిడ్నీ: తొలి ఏటీపీ కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా సెర్బియా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ సారథ్యంలోని సెర్బియా 2–1తో రాఫెల్ నాదల్ నాయకత్వంలోని స్పెయిన్‌పై గెలుపొందింది. రెండో సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లో బరిలో దిగిన జొకోవిచ్ రెండు మ్యాచ్‌లనూ గెలిచి జట్టుకు ఒంటి చేత్తో కప్‌ను అందించాడు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో బాటిస్టా అగుట్ (స్పెయిన్) 7–5, 6–1తో డుసాన్ లజోవిచ్ (సెర్బియా)పై గెలుపొంది స్పెయిన్‌కు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రెండో సింగిల్స్ మ్యాచ్ బరిలో దిగిన జొకోవిచ్ 6–2, 7–6 (7/4)తో ప్రపంచ నంబర్‌వన్ నాదల్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. తొలి సెట్లో జోకర్ బలమైన సరీ్వస్‌లకు నాదల్ దగ్గర సమాధానమే లేకపోయింది. కానీ రెండో సెట్లో మాత్రం నాదల్ కాస్త ప్రతిఘటించాడు. దీంతో సెట్ టై బ్రేక్‌కు వెళ్లింది. అక్కడ మరోసారి విజృంభించిన జొకోవిచ్ టై బ్రేక్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. 2013 నుంచి హార్డ్ కోర్టులపై నాదల్‌తో జరిగిన ప్రతీ మ్యాచ్‌లోనూ జొకోవిచ్ గెలవడం విశేషం. ఇక కప్ విజేతను నిర్ణయించే డబుల్స్ పోరులో జొకోవిచ్–విక్టర్ ట్రయెస్కీ ద్వయం 6–3, 6–4తో లోపెజ్–కరెనో బుస్టా జోడీ (స్పెయిన్)పై గెలిచింది. దాంతో ఏటీపీ కప్ సెర్బియా సొంతం అయింది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జొకోవిచ్, బాటిస్టా అగుట్ ఖాతాలో 750 ఏటీపీ పాయింట్లు చేరాయి. -
జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్‌బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం. -
నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రస్ అల్ ఖైమా (రాక్) ఫిర్యాదు మేరకు సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ శుక్రవారం విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వాన్‌పిక్‌లో పెట్టుబడులకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని రస్ అల్ ఖైమా యాజమాన్యం యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే. అక్కడి కోర్టు నుంచి లుకౌట్ నోటీసులు పొందిన రాక్ వాటి ఆధారంగా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో బెల్గ్రేడ్లో దిగిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు అక్రమమని, వాన్‌పిక్ ప్రాజెక్టు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న కారణంగా ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇందులో ప్రసాద్ తప్పేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి కార్యాలయానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రసాద్‌ను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసాద్ తరఫున న్యాయవాదులు విడుదలకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయన శుక్రవారం విడుదలైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వివాదమేంటి? ప్రకాశం జిల్లాలో చేపట్టిన వాన్‌పిక్ ప్రాజెక్టుకు రస్ అల్ ఖైమా స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్ ను గతంలో ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో రాక్ 26% వాటా తీసుకొని దాదాపు రూ.535 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. తర్వాత తలెత్తిన న్యాయపరమైన వివాదాల వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టుకోసం భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన భూములను సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. దీంతో ప్రధాన భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు సైతం అం దులో ఇరుక్కుపోయాయి. తమ పెట్టుబడులపై తగిన రాబడి రాలేదంటూ తాజాగా రాక్.. యూఏఈ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్జుడికేటింగ్ అథారిటీ చేసిన ఈ అటాచ్మెంట్ సరికాదంటూ గతవారమే ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. ఆస్తులను జప్తు నుంచి విడుదల చేస్తూ రూ.235 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కోరింది. దీంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకు లు తొలగినట్లు అయింది. అదేసమయంలో బెల్గ్రేడ్లో నిమ్మగడ్డ అరెస్టు కావడం గమనార్హం. -
సెమీస్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 7–5, 6–3తో పదో సీడ్ నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 6–7 (4/7)తో ఐదో సీడ్ కామిల్ మజార్జక్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జెమీ సెరాటాని (అమెరికా) ద్వయం 6–7 (9/11), 6–4, 9–11తో యాన్ బాయ్–ఫాజింగ్ సన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
బాండ్ ఫేమ్ రెజీన్ కన్నుమూత
జేమ్స్‌బాండ్ ఫేమ్ నడ్జా రెజీన్ (87) ఇకలేరు. ఆమె మృతిచెందినట్లు జేమ్స్‌బాండ్ అధికారిక ట్వీటర్పేజీలో పోస్ట్ చేశారు ‘జేమ్స్‌బాండ్’ ఫ్రాంచైజీ ప్రతినిధులు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన ‘‘ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్‌ఫింగర్’ చిత్రాల్లో నటించిన నడ్జా రెజీన్ కన్నుమూశారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. రెజిన్ ఆత్మకు శాంతి కలగాలి. ఈ బాధాకర సమయంలో ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం’’అని జేమ్స్‌బాండ్ ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సెర్బియాలో 1931 డిసెంబర్ 2న జన్మించారు నడ్జా రెజీన్. బెల్గ్రేడ్లో చదువుకున్నారు. ఆ తర్వాత కొన్ని టీవీషోలు కూడా చేశారు. ద మ్యూజిక్ స్వార్డ్ (1950), ద మ్యాన్ వితవుట్ బాడీ (1957), సోలో ఆఫ్ స్పారో (1962) రెజిన్ నటించిన మరికొన్ని చిత్రాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా రెజీన్ తుది శ్వాస విడిచారు. -
మూడో రౌండ్లో జొకోవిచ్
ఫ్లోరిడా: మయామి మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ సెర్బియా ప్లేయర్ రెండో రౌండ్లో 7–6 (7/2), 6–2తో ప్రపంచ 81వ ర్యాంకర్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ మూడో రౌండ్లో డెల్బోనిస్ (అర్జెంటీనా)తో ఆడతాడు. మరోవైపు మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన థీమ్ మయామి ఓపెన్‌లో మాత్రం నిరాశ పరిచాడు. తొలి రౌండ్లో బై పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన థీమ్ 4–6, 4–6తో హుర్కాజ్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు. -
అయ్యో అమ్మాయ్!
మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం సెర్బియా. గావ్రిలో ప్రిన్సిప్ అనే సెర్బియన్ పౌరుడు ఆస్ట్రియా రాజకుటుంబ వారసుడిని కాల్చి చంపడంతో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ముగిసిన వందేళ్ల తర్వాత ఇప్పుడు.. అదే సెర్బియా నుంచి.. పదేళ్ల క్రితం విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన కొసావోలోని డాంజ్ సడికు అనే ఒక బాక్సింగ్ క్రీడాకారిణిని బరిలోకి రానివ్వని కారణంగా ప్రపంచ క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారతదేశానికి స్థానం లేకుండా పోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి! ఢిల్లీలో ఇవాళ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి 24 వరకు. కొసావో దేశ బాక్సింగ్ క్రీడాకారిణి డాంజ్ సడికు కూడా ఈ పోటీలకు సిద్ధం అయింది. పందొమ్మిదేళ్లు ఆ అమ్మాయికి. తన పదిహేడవ యేటే.. టర్కీలో జరిగిన ఐరోపా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో గోల్డ్‌మెడల్ కొట్టింది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇండియా వీసా ఇవ్వలేదు! కొసావోను ఇండియా ఒక దేశంగా గుర్తించకపోవడమే డాంజ్కు వీసా ఇవ్వకపోవడానికి కారణం. గతేడాది డిసెంబర్లో గౌహతిలో జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా ఇండియా డాంజ్ని రానివ్వలేదు. కొసావోలో భారత రాయబార కార్యాలయం లేదు కాబట్టి, సెర్బియా వెళ్లి అక్కడి ఇండియన్ ఎంబసీలో వీసాకు దరఖాస్తు చేసుకుంది డాంజ్. బుధవారం సాయంత్రం వరకు డాంజ్కి వీసా రాలేదు. గురువారం నుంచి పోటీలు.ఒలింపిక్ కమిటీ 2012లో ఒలింపిక్స్‌లోకి మహిళల బాక్సింగ్‌ని కూడా చేర్చాక బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బి.ఎఫ్.ఐ.) తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలివి.వీటిల్లో కనుక డాంజ్ని ఆడనివ్వకపోతే ఏ ఆటలోనైనా ప్రపంచకప్పు నిర్వహించేందుకు వీల్లేకుండా ఇండియాను బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని ఐ.ఒ.సి. (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఇప్పటికే హెచ్చరించింది కూడా. కానీ బి.ఎఫ్.ఐ. ఏమీ చేయలేని పరిస్థితి! వీసా ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించవలసింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ. నిజానికి ఆ శాఖ కూడా చేయగలిగిందేమీ లేదు. కొసావోను ఒక దేశంగానే ఇండియానే గుర్తించనప్పుడు, మంత్రిత్వశాఖ మాత్రం ఏం చేస్తుంది? అప్పటికీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐ.ఓ.ఎ.) డాంజ్కు వీసా ఇచ్చే విషయాన్ని క్రీడల మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది. విదేశీ వ్యవహారాల శాఖలానే అదీ ఒక మంత్రిత్వ శాఖ కనుక ఈ విషయంలో క్రీడల శాఖ కూడా చేయగలిగిందీ ఏమీ లేదు. ప్రతి దేశంలోనూ క్రీడలకు అంతర్జాతీయ ఫెడరేషన్లు ఉంటాయి. బాక్సింగ్ ఫెడరేషన్, హాకీ ఫెడరేషన్, వాలీబాల్ ఫెడరేషన్.. ఇలా. ఇప్పుడు ఆ ఫెడరేషన్లన్నింటికీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒక లెటర్ పంపించబోతోంది.. ఇండియాను ఏ చాంపియన్‌షిప్‌లకు కూడా హోస్ట్‌ను కానివ్వొద్దని! డాంజ్ని మొదటిసారి నిరుత్సాహపరిచినప్పుడే ఐ.ఒ.సి. ఇండియాకు వార్న్ చేసింది. ఇప్పుడిక బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం ఒక్కటే మిగిలింది. ‘మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయిల్ అథ్లెట్స్‌ని ఆహ్వానిస్తున్నప్పుడు కొసావోకు ఎంట్రీ ఇవ్వడానికి ఇండియాకు ఏమైంది?’ అని ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా అడుగుతున్నారు.రాజకీయాల్నీ, క్రీడల్నీ ముడిపెట్టడం ఏమిటన్నది ఆయన ప్రశ్న. బుధవారం నాడు బాత్రా.. స్పోర్ట్స్ మినిస్ట్రీకి ఘాటైన పదజాలంతో ఉత్తరం రాస్తూ, డాంజ కనుక ఈ పోటీల్లో లేకపోతే, ఇండియా ఐ.ఒ.సి. లిస్ట్‌లోనే లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్నేయ ఐరోపాలో మధ్యదరా సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్య ఉన్న దేశాలను బాల్కన్ రాజ్యాలు అంటారు. అక్కడి బాల్కన్ పర్వతాల నుంచి బాల్కన్ అనే పేరు వచ్చింది. అల్బేనియా, బోస్నియా హెర్జెగొవీనా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీస్, మాసిడోనియా, మాంటెనిగ్రో, రొమేనియా, సెర్బియా, స్లొవేనియా.. ఇవన్నీ బాల్కన్ దేశాలు. వీటిల్లో ఒకటైన సెర్బియా నుంచి విడిపోయి, కొసావో 2008లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు మన బాక్సింగ్ క్వీన్ డాంజ్కి తొమ్మిదేళ్లు. సెర్బియాకు ఒక సరిహద్దు అల్బేనియా. అందులోని వివాదాస్పద భౌగోళిక ప్రదేశమే కొసావో. సెర్బియా నుంచి విడిపోయి, స్వతంత్రాన్ని ప్రకటించుకున్న కొసావోను ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలలో 113 దేశాలు మాత్రమే ఒక దేశంగా గుర్తించాయి. గుర్తించని వాటిలో ఇండియా, రష్యా, చైనా వంటివి ఉన్నాయి. ‘దేనికదే విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకుంటే దేశ సార్వభౌమత్వం బలహీనపడుతుందని, ఒక దాన్ని చూసి ఒకటి నేర్చుకుంటే ప్రపంచమే ముక్కలుచెక్కలైపోతుందని’ ఇండియా వాదన. అందుకే కొసావోను గుర్తించలేదు. ఆ దేశం నుంచి వచ్చిన క్రీడాకారిణినీ గుర్తించడం లేదు. ‘అయ్యో అమ్మాయ్’ అనిపించవచ్చు. ప్రతిభ గల క్రీడాకారిణికి ఈ దేశం కాకుంటే మరో దేశం. ఈ ఈవెంట్ కాకుంటే మరో ఈవెంట్. దౌత్య పరిమితుల్ని దాటలేక ప్రతిభను. ఈవెంట్లను చేజార్చుకుంటే.. అప్పుడు మన దేశం ‘అయ్యో భారత్’ అనిపించుకుంటుంది. -
ఒక్క గెలుపు లేకుండానే...
క్రాల్‌జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్‌లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి. ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. -
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
భారత్ 0 – సెర్బియా 2
క్రాల్‌జివో (సెర్బియా): యూఎస్ ఓపెన్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ లేకపోయినా ఆ అవకాశాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా సెర్బియా జట్టుతో శుక్రవారం మొదలైన పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 4–6, 6–7 (2/7), 2–6తో ప్రపంచ 86వ ర్యాంకర్ లాస్లో జెరె చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 3–6, 3–6తో ప్రపంచ 56వ ర్యాంకర్ దుసాన్ లాజోవిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మిలోజెవిచ్–పెట్రోవిచ్ జోడీతో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ జంట ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం గెలిస్తేనే ఈ పోటీలో భారత ఆశలు సజీవంగా ఉంటాయి. -
భారత్(vs)సెర్బియా
బెల్గ్రేడ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, సెర్బియా జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. సెర్బియా తరఫున యూఎస్ ఓపెన్ తాజా చాంపియన్ నొవాక్ జొకోవిచ్ బరిలోకి దిగడంలేదు. భారత్ తరఫున సింగిల్స్‌లో రామ్‌కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సాకేత్ మైనేని... డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ బరిలోకి దిగనున్నారు. -
లియాండర్ పేస్పై వేటు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను సెర్బియాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో ఈ పోటీ జరుగుతుంది. గత ఏప్రిల్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు (43) సాధించిన ప్లేయర్‌గా లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సెర్బియాతో మ్యాచ్ కోసం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న–దివిజ్ డబుల్స్ మ్యాచ్ ఆడుతుంది. యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్, ప్రజ్నేశ్ సింగిల్స్‌లో పోటీపడతారు. మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా, జీషాన్ అలీ కోచ్‌గా వ్యవహరిస్తారు. -
ఫెడరర్ జోరు కొనసాగేనా?
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
బ్రెజిల్ దూసుకెళ్లింది
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీలా బ్రెజిల్ కూలిపోలేదు. మరో షాక్‌కు తావివ్వలేదు. మరో పరాభవానికి చోటివ్వ లేదు. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ అంచనాలకు తగ్గట్టే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ దూసుకుపోయింది. మెరుగైన ప్రదర్శనతో సెర్బియాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాస్కో: జోరుమీదున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరింది. ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2–0 గోల్స్‌తో సెర్బియాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో బ్రెజిల్కిది వరుసగా రెండో విజయం. స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కోస్టారికాపై గెలిచింది. దీంతో గ్రూప్ ‘ఇ’లో ఓటమి ఎరుగని బ్రెజిల్ టాపర్‌గా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెర్బియాతో బుధవారం జరిగిన పోరులో పాలిన్హో, తియాగో సిల్వా ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే బ్రెజిల్ దాడులు మొదలయ్యాయి. కానీ సమన్వయం కుదరక నాలుగో నిమిషంలోనే గోల్ చేసే చక్కని అవకాశాన్ని కోల్పోయింది బ్రెజిల్. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌కు అత్యంత సమీపంగా బంతిని తీసుకొచ్చిన జీసస్ షాట్... నెమార్, కౌటిన్హో సమన్వయలేమితో నిష్ఫలమైంది. ఆ తర్వాత కూడా బ్రెజిల్ పదేపదే లక్ష్యం దిశగా గురిపెట్టింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ఆట 36వ నిమిషంలో కౌటిన్హో ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ పాలిన్హో మెరుపువేగంతో గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో బ్రెజిల్ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. 1–0 ఆధిక్యంతో ఫస్టాఫ్‌ను ముగించింది. డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంతిని బ్రెజిల్ గోల్‌పోస్ట్‌వైపు తీసుకెళ్లేందుకే సెర్బియా ఆపసోపాలు పడింది. ఇక ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్ ఆధిపత్యమే కొనసాగింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచేందుకు ఆటగాళ్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో బ్రెజిల్ రెండో గోల్ నమోదైంది. ఆట 68వ నిమిషంలో స్ట్రయికర్ నెమార్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను డిఫెండర్ తియాగో సిల్వా హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0 ఆధిక్యంతో దూసుకెళ్లిన బ్రెజిల్‌ను సెర్బియా ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఆటగాళ్లు ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టగా రెండు సార్లు విజయవంతమయ్యారు. ప్రత్యర్థి సెర్బియా జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే టార్గెట్‌కు చేరినప్పటికీ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. జూలై 2న జరిగే ప్రిక్వా ర్టర్ ఫైనల్లో మెక్సికోతో బ్రెజిల్ ఆడుతుంది. అభిమానుల ఘర్షణ సాకర్ క్రేజ్ ఆకాశమంత అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్‌కప్ కోసం ప్రాణాలిస్తారు. చేదు ఫలితాలొస్తే జీర్ణించుకోలేక ప్రాణాలొదిలేస్తారు. మైదానంలో తమ జట్లు పోరాడితే... ప్రేక్షకుల గ్యాలరీల్లో అభిమానులు బాహాబాహీకి దిగుతుండటం కూడా ఇక్కడ సహజం. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్ ముగిశాక ఇరు దేశాల అభిమానులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రేక్షకురాలు ఇదంతా చూసి భయాందోళనకు గురైంది. పోలీసులు ఈ సంఘటనలో బాధ్యులైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
సెర్బియా చిత్తు.. నాకౌట్‌కు సాంబా జట్టు
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్నడూ లేనంతగా ఆగ్రశ్రేణి జట్లు నాకౌట్ చేరడానికి నానాతంటాలు పడుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లే పంజా విసిరి పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచకప్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ సులభంగా నాకౌట్‌కు చేరుతుందనుకున్నారు. కానీ లీగ్ చివరి మ్యాచ్‌లో సెర్బియాపై గెలిస్తేనే రౌండ్ 16కి వెళ్లే అవకాశం.. డ్రా అయితే కొంచెం కష్టం ఇది సాంబా జట్టు పరిస్థితి. అలాంటి మ్యాచ్‌లో బెబ్బులిలా పంజా విసిరింది. బుధవారం గ్రూప్ ఈలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో సెర్బియాను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన బ్రెజిల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో సాంబా జట్టు స్టార్ నెమార్ చిరుతలా కదిలాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు కూడా నెమార్ మీదే ఆధారపడకుండు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ప్రథమార్థంలో నెమార్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మిడ్ ఫీల్డర్ పాలిన్హో హెడర్ గోల్ చేసి బ్రెజిల్ జట్టుకు తొలి గోల్ అందిచాడు. తొలి భాగం ముగిసే సరికి బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో భాగంలో బ్రెజిల్ మరో గోల్ నమోదు చేయడానికి చాలా సమయమే పట్టింది. బ్రెజిల్ చేసిన గోల్ ప్రయత్నాలను సెర్బియా రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 68వ నిమిషంలో టి సిల్వా మరో గోల్ చేసి జట్టుకు మరింత ఆధిక్యాన్ని పెంచాడు. రెండో భాగం ముగిసినా, ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు కాకపోవడంతో బ్రెజిల్ విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఈ లో టాపర్‌గా రౌండ్ 16 లోకి అడుగుపెట్టింది. జులై 2 న నాకౌట్ పోరులో మెక్సికోతో బ్రెజిల్ తలపడనుంది. -
ఫిఫా ప్రపంచకప్: సెర్బియా విజయానందం
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సమరా ఎరినా మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా జట్టు 1-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరు జట్లు ప్రథమార్థంలో ఒక్క గోల్ నమోదు చేయలేకపోయాయి. ద్వితీయార్థంలో కొంచెం దూకుడు పెంచిన ఇరు జట్లు గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించాయి. కానీ మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు కావడానికి 56 నిమిషాలు పట్టింది. ఫ్రీకిక్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెర్బియా కెప్టెన్ అలెగ్జాండర్ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో సెర్బియా 1-0తో ఆధీనంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో మరొక గోల్ నమోదు కాకపోవడంతో సెర్బియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిఫరీ ఇద్దరు సెర్బియా (ఇవనోవిక్, ప్రిజోవిక్), ఇద్దరు కోస్టారికా ఆటగాళ్ల(కాల్వొ, గుజ్మన్)కు ఎల్లో కార్డు చూపించారు. నేటి మ్యాచ్‌లో కోస్టారికా 14 అనవసర తప్పిదాలు చేయగా, సెర్బియా 11 తప్పిదాలు చేసింది. -
మీకు పెంకా తెలుసా?
కొన్ని రోజుల క్రితం వరకు మీకే కాదు.. ఆమె యజమాని ఇవాన్‌కు తప్పిస్తే.. పెంకా అంటే ఎవరికీ తెలియదు.. ఆవులు, గేదెలు అంటే.. అలా పక్కనున్న పొలాల్లో, తోటల్లో గడ్డి మేయడం కోసం వెళ్లడం మామూలే.. పెంకా కూడా అలాగే వెళ్లింది.. అలా వెళ్లినందుకు పెంకాకు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష!! ► పెంకా ఓ ఆవు.. బల్గేరియాలోని సరిహద్దు గ్రామం కొపిలోట్సీలో ఉంటుంది.. ఓ 20 రోజుల క్రితం గడ్డి మేస్తూ.. మేస్తూ.. అలా కొంచెం దూరం వెళ్లింది.. తోడేళ్లు వెంటపడ్డాయి.. పరిగెడుతూ.. పరిగెడుతూ అనుకోకుండా సరిహద్దును దాటింది.. సెర్బియాలోకి వెళ్లిపోయింది.. పెంకా కనిపించకపోయేసరికి ఆమె యజమాని ఇవాన్, అతని కుమారులు అన్ని చోట్లా వెతికారు. సరిహద్దు భద్రత అధికారులకు విషయం తెలియజేశారు. ► కొన్ని రోజుల క్రితం.. పెంకా సెర్బియాలోని బోసిల్గ్రాడ్ గ్రామంలో ఉందని తెలిసింది.. ఇవాన్ ఆనందానికి అవధుల్లేవు.. వెంటనే బయల్దేరాడు.. బోసిల్గ్రాడ్ చేరుకున్నాడు.. దారితప్పి వచ్చిన పెంకాను అక్కడివాళ్లు బాగానే చూసుకున్నారు. పెంకా ఆరోగ్యంగానే ఉందని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని సెర్బియా పశు వైద్యుడు కూడా ధ్రువీకరించడంతో దాన్ని పట్టుకుని.. ఇవాన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ► పేపర్స్ ఏవి.. ప్రశ్నించాడు బల్గేరియాలోని సరిహద్దు భద్రతాధికారి.. పేపర్స్ ఏమిటి అన్నాడు ఇవాన్. పెంకా దారి తప్పిన విషయం చెప్పాడు.. యూరోపియన్ యూనియన్ రూల్స్ గురించి తెలియవా అంటూ çహూంకరించాడా అధికారి. బల్గేరియా ఈయూ సభ్య దేశం.. సెర్బియా కాదు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా.. ఈయూ సభ్యదేశంలోని వారు వేరే దేశానికి వెళ్లడం.. తగు పత్రాలు లేకుండా తిరిగి దేశంలోకి రావడం నిషేధం.. వాళ్ల లెక్క ప్రకారం పెంకా అక్రమంగా సరిహద్దు దాటింది.. ఇప్పుడు కూడా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటి రావాలని చూస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఆ అపరాధానికి శిక్ష.. మరణమే.. ► మరికొన్ని రోజులే.. ఇవాన్‌కు చెప్పాడు అతడి గ్రామంలోని పశువైద్యుడు. నేను చేయగలిగింది ఏమీ లేదు.. చట్టాలు అలాగున్నాయని అన్నాడు.. పెంకా అక్రమంగా సరిహద్దు దాటడమొక్కటే కాదు.. సెర్బియా నుంచి ఏమైనా రోగాలను మోసుకొచ్చిందేమోనన్న అనుమానం కూడా అధికారులకు ఉంది. అలాగని పరీక్షలు చేయలేదు. సెర్బియా వైద్యుడు పరీక్ష చేసి ఇచ్చిన పత్రాన్నీ నమ్మలేదు.పెంకాకు మరణ శిక్ష విధించడంపై తొలుత అక్కడి సోషల్‌మీడియాలో గగ్గోలు రేగింది. తర్వాత తర్వాత అది ఈయూ అంతా వ్యాపించింది. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది.. ఏమిటి హద్దు.. ఏమిటి సరిహద్దు అన్నది పశువులకు ఎలా తెలుస్తుంది? చట్టాలు కఠినమే.. కానీ కామన్సెన్స్ అన్నది కూడా ఒకటుండాలిగా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. పెంకాను రక్షించాలంటూ సంతకాల ఉద్యమమూ ఉధృతమైంది. ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతటా పెరిగింది. ► మీకో విషయం తెలుసా? పెంకా.. గర్భవతి.. రెండు, మూడువారాల్లో మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది.. మరి.. పెంకా బతుకుతుందా? మరో బుల్లి పెంకాకు బతుకునిస్తుందా? -
సాంబాకు ఎదురుందా!
జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, పోర్చుగల్... ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అంటే ఈ దేశాలు మాత్రమేనా! అప్పుడప్పుడు మెరిసే ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో ఉన్నాయి. సంచలనం సృష్టించేందుకు సదా సిద్ధం అనిపించే కొరియా, కొలంబియా, డెన్మార్క్‌లు కూడా బరిలో నిలిచాయి. 32 దేశాలు పాల్గొనే విశ్వ సమరంలో ఒక్కో జట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అగ్రశ్రేణి జట్లు అద్భుత ఆటను చూపిస్తాయనడంలో సందేహం లేకున్నా... అనామక టీమ్‌లు కూడా అభిమానులకు వినోదం పంచడంలో ఎక్కడా తగ్గవు. తీవ్ర పోటీ ఉండే క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ఇక్కడి వరకు వచ్చాయంటే వాటి సత్తాను తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్ కప్ బరిలో నిలిచిన జట్ల పరిచయం, వాటి నాకౌట్ అవకాశాల వివరాలు నేటి నుంచి... ముందుగా ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఉన్న గ్రూప్ ‘ఇ’పై విశ్లేషణ. బ్రెజిల్... పూర్వ వైభవం కోసం 2014లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ సెమీస్‌లో జర్మనీ చేతిలో 1–7తో బ్రెజిల్ చిత్తు చిత్తుగా ఓడినప్పుడు ఆ దేశ అభిమానులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల గుండెలు బద్దలయ్యాయి. ఆ తర్వాత కోలుకొని ఈ నాలుగేళ్లలో బ్రెజిల్ మరోసారి వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. 2018 వరల్డ్ కప్‌కు అందరికంటే ముందుగా అర్హత సాధించిన దేశం బ్రెజిల్. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనాను 3–0తో ఓడించడం సహా వరుసగా 9 మ్యాచ్ లు గెలవడం ఆ జట్టు ఫామ్‌ను చూపిస్తోంది. కీలక ఆటగాడు: నెమార్ ప్రస్తుతం 26 ఏళ్ల నెమార్ తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో, ఫిట్నెస్తో ఉన్నాడు. తన ఆటతో చెలరేగి బ్రెజిల్‌ను గెలిపించేందుకు అతనికి ఇది సువర్ణావకాశం. అదే జరిగితే మెస్సీ, రొనాల్డోలను వెనక్కి తోసిన ఘనత నెమార్‌కు దక్కుతుంది. కోచ్: అడెనార్ బాకీ (టిటె). అట్టర్ ఫ్లాప్ జట్టు నుంచి ఇతను బ్రెజిల్‌ను ఫేవరెట్‌గా మలిచాడు. 2016 సెప్టెంబర్‌లో టిటె బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రెజిల్ 13 మ్యాచ్‌లు గెలిచి, 3 డ్రా చేసుకుంది. వరల్డ్ ర్యాంక్: 2 చరిత్ర: టోర్నీ జరిగిన 20 సార్లూ ఆడింది. 5 సార్లు విజేత (1958, 1962, 1970, 1994, 2002), రెండుసార్లు రన్నరప్ (1950, 1998). ‘స్విస్’ టైమ్ బాగుంటుందా! అప్పుడప్పుడు తమ ఆటతో కొన్ని మెరుపులు ప్రదర్శించిన స్విట్జర్లాండ్ ఈ సారైనా అన్ని రంగాల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కనీసం క్వార్టర్ ఫైనల్ లక్ష్యంగా జట్టు బరిలోకి దిగుతోంది. 2009 అండర్–17 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ సారి వరల్డ్ కప్ జట్టులో ఉండటం తమ బలంగా ఆ జట్టు భావిస్తోంది. ఇన్నేళ్లలో వీరంతా అనుభవంతో కూడా రాటుదేలారు. 1954లో ఆఖరి సారి నాకౌట్ మ్యాచ్ గెలవగలిగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో బలహీనమైన గ్రూప్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు నెగ్గి అర్హత సాధించింది. కీలక ఆటగాడు: వలోన్ బెహ్రామి వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడుతున్న సీనియర్. కుర్రాళ్లను మైదానంలో సమన్వయపరుస్తూ ఫలితం సాధించగలడు. క్వాలిఫయింగ్‌లో అతను ఆడని మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ చిత్తయిందంటే వలోన్ విలువేమిటో తెలుస్తుంది. అకాన్జీవంటి అత్యుత్తమ డిఫెండర్ జట్టులో ఉన్నాడు. గత వరల్డ్ కప్ ఆడిన ‘ఆర్సెనల్’ స్టార్ జాకా కూడా జట్టు రాతను మార్చగలడు. కోచ్: వ్లదీమర్ పెట్కోవిక్ మూడేళ్లుగా జట్టును తీర్చిదిద్దాడు. ఇతనికి ఇదే తొలి వరల్డ్ కప్ ప్రపంచ ర్యాంక్: 6 చరిత్ర: 10 సార్లు పాల్గొని 3 సార్లు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. కోస్టారికా... క్వార్టర్స్ చేరేనా! నాలుగేళ్ల క్రితం ఈ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరి షూటౌట్లో నెదర్లాండ్స్ చేతిలో చిత్తయింది. 50 లక్షలకంటే తక్కువ జనాభా ఉన్న కోస్టా రికా ఐదో వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది. కీలక ఆటగాడు: గోల్ కీపర్ నవాస్ లీగ్స్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఆడే ఈ గోల్ కీపర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బలహీన జట్టునుంచి ప్రపంచానికి తెలిసిన ఆటగాడు ఇతనొక్కడే. బ్రైన్ రూయిజ్, సెల్సో బోర్జెస్ కూడా సత్తా చాటగలరు. 2014లో క్వార్టర్స్ చేరడంలో రూయిజ్దే ప్రధాన పాత్ర. కోచ్: ఆస్కార్ రమిరెజ్. ఇటలీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ ర్యాంక్: 25 చరిత్ర: 4 సార్లు పాల్గొంటే 2014లో క్వార్టర్ ఫైనల్స్ చేరడం అత్యుత్తమ ప్రదర్శన. సెర్బియా... సంచలనంపై గురి 2006లో స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ఈ దేశం వరల్డ్ కప్ బరిలోకి దిగుతుండటం ఇది రెండోసారి. ఈసారి క్వాలిఫయింగ్‌లో తమ గ్రూప్‌లో సెర్బియా అత్యధికంగా 20 గోల్స్ కొట్టింది. అదే జోరును కనబరిచి లీగ్ దశ దాటాలని పట్టుదలతో ఉంది. కీలక ఆటగాడు: బ్రనిస్లావ్ ఇవనోవిక్ చెల్సీ తరఫున గొప్ప ప్రదర్శన కనబర్చిన డిఫెండర్. క్వాలిఫయింగ్‌లో అన్ని మ్యాచ్‌లూ (10) ఆడాడు. కోచ్: కటాజిక్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వరల్డ్ ర్యాంక్: 35 చరిత్ర: 2010లో తొలిసారి బరిలోకి దిగి లీగ్ దశలోనే నిష్క్రమించింది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉన్నాయి. తమ గ్రూప్‌లోని మిగిలిన మూడు ప్రత్యర్థులతో ఆయా జట్లు తలపడతాయి. పాయింట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్ట్సర్స్కు అర్హత సాధిస్తాయి. పాయింట్లు సమమైతే గోల్స్ ఆధారంగా ఎవరు ముందుకు వెళ్లాలో తేలుస్తారు. తుది అంచనా: గ్రూప్ ‘ఇ’ నుంచి బ్రెజిల్, స్విట్జర్లాండ్ నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. బెహ్రామి, నవాస్, ఇవనోవిక్ -
ఒక రాజు ఒక రాణి
అరవై నాలుగు గడుల ఆటలో వారి ప్రేమ తొలి అడుగు వేసింది. ఇప్పుడు ఆ బంధం బలపడి ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఒకరి ఎత్తుకు మరొకరు పైఎత్తులు వేసే చదరంగం ఆడుతూనే వారిద్దరు ఒకరి ప్రేమకు మరొకరు చిత్తయ్యారు. దేశం వేరు, సంస్కృతి వేరు. కానీ ఆటతో మొదలైన పరిచయం జీవితకాలపు అనుబంధంగా మారేందుకు మాత్రం అలాంటివేమీ హద్దుగా మారలేదు. భాగ్యనగరానికి, బెల్గ్రేడ్కు మధ్య ఉన్న ఆరు వేల మైళ్ల దూరాన్ని చెరిపేస్తూ వారిద్దరు పరిణయంతో ఒకటి కాబోతున్నారు. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) తెలుగు తేజం పెంటేల హరికృష్ణ, సెర్బియా క్రీడాకారిణి నాడ్జ స్టొయానొవిక్ మధ్య సాగిన ప్రేమ కథ ఇది. భారత్‌కు చెందిన ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు విదేశీ వనితను వివాహమాడటం ఇటీవలి కాలంలో ఇదే కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మార్చి 3న వివాహం చేసుకోబోతున్నాడు. వధువు సెర్బియా దేశానికి చెందిన నాడ్జ స్టొయానొవిక్. హరికృష్ణ 2745 రేటింగ్‌తో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్నాడు. నాడ్జ గతంలో సెర్బియా జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత యూరోపియన్ చెస్ యూనియన్‌లో ఆర్బిటర్, మీడియా మేనేజర్‌గా పని చేస్తోంది. చెస్ సర్క్యూట్లో మొదలైన వీరిద్దరి పరిచయం ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ వివాహం గురించి ‘సాక్షి’తో హరికృష్ణ స్వయంగా చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... ‘చెస్ క్రీడాకారుడిగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్దా, చిన్నా టోర్నీలలో నేను పాల్గొంటుంటాను. సాధారణంగా యూరప్ కేంద్రంగా చుట్టుపక్కల ఉండే దేశాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొంత మందిని తరచుగా కలవడం, వారిలో కొందరు ఆత్మీయ స్నేహితులుగా మారిపోవడం సహజం. ఈ తరహాలో చెస్ సర్క్యూట్లో కలిగిన పరిచయం తెలుగు కుర్రాడినైన నా పెళ్లి ఒక సెర్బియా అమ్మాయితో జరగడం వరకు వెళుతుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు. ఉమెన్ ఫిడే మాస్టర్ (డబ్ల్యూఎఫ్‌ఎం) అయిన నాడ్జ యుగొస్లేవియా దేశంగా ఉన్నప్పుడు జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. దాదాపు ఏడేళ్ల క్రితం మేమిద్దరం తొలిసారి పరిచయమయ్యాం. అయితే ఆ తర్వాత మేం పెద్దగా కలుసుకోలేదు. కొంత విరామం వచ్చేసింది. నిజంగా ప్రేమ మొదలైంది మాత్రం దాదాపు రెండేళ్ల క్రితమే. ఆ సమయంలోనే ఒకరి గురించి మరొకరం బాగా తెలుసుకున్నాం. చెస్ గురించి మాట్లాడటం మొదలు పెట్టి ఇష్టా ఇష్టాల వరకు వెళ్లడంతో తెలీకుండానే దగ్గరయ్యాం. నాడ్జకు ప్రయాణాలు చేయడం, కొత్త సంస్కృతులు గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అదే క్రమంలో ఆమె అప్పటికీ భారత్ గురించి చాలా చదివేసింది. ఇది కూడా నాకు కలిసొచ్చింది. దాంతో ఆమెతో స్నేహంతోనే ఆగిపోకుండా మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొని నేనే పెళ్లి గురించి ప్రతిపాదించాను. ఆమె వెంటనే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తల్లిదండ్రులతో చర్చించి కొన్ని నెలల తర్వాత ఓకే చెప్పింది. అప్పుడు నేను మా అమ్మానాన్నలతో ఈ విషయం చెప్పాను. సహజంగానే వెంటనే ఆమోదం ఏమీ లభించలేదు. జీవన శైలి, ఇతర సంప్రదాయాల గురించి వారు బాగా ఆలోచిస్తారు కాబట్టి ఎలాంటి నిర్ణయానికి రాలేదు. దాంతో మెల్లిగా ఒప్పించే ప్రయత్నం చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా ప్రయత్నంకంటే కాలమే వారు అంగీకరించేలా చేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత నా పెళ్లికి వారు ఒప్పుకున్నారు. నాడ్జ ఆ తర్వాత మా అమ్మా నాన్నలతో మాట్లాడటం, ఇక్కడి విషయాలు, తెలుగు సంస్కృతి గురించి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ పోయింది. మన పెళ్లి వీడియోలు కొన్ని చూపించి సంప్రదాయాల గురించి వివరించాను. అంతా కుదురుతున్న తర్వాతే పెళ్లి తేదీని ఖరారు చేశారు. హైదరాబాద్‌లో పెళ్లికి ఆమె తల్లి, సోదరుడు, చెల్లితో పాటు కొందరు ఫ్రెండ్స్ వస్తున్నారు. అనారోగ్యంతో తండ్రి మాత్రం రావడం లేదు. చెస్ ప్రపంచంలో దాదాపు అందరికీ మా ప్రేమ గురించి తెలుసు. వారంతా మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీ కారణంగా విశ్వనాథన్ ఆనంద్ పెళ్లికి రాలేకపోతున్నా... ఆయన సతీమణి అరుణ మాత్రం వస్తున్నారు. అనేక మంది భారత, విదేశీ చెస్ ఆటగాళ్లు కూడా హాజరవుతున్నారు. పెళ్లి తర్వాత సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో విందు జరిగే అవకాశం ఉంది. తరచుగా టోర్నీల్లో పాల్గొనడం కోసం నేను ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. వివాహానంతరం అక్కడికే వెళ్లిపోతాను. నాడ్జ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోంది. కలిసి చాలా తెలుగు సినిమాలు చూశాం. ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇష్టపడిన వ్యక్తితో నా ప్రేమ చివరకు పెళ్లి దాకా చేరడం చాలా సంతోషంగా ఉంది.’ -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలనం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు చుంగ్ హెయన్ సోమవారం సంచలన విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన మూడు సెట్ల మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్‌కు షాకిచ్చాడు చుంగ్. 7-6, 7-5, 7-6 తేడాతో జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దీంతో దక్షిణ కొరియా నుంచి ఓ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు చుంగ్. మ్యాచ్ మొత్తంలో 19 అనవసర తప్పిదాలు చేసిన జకో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. జకో సర్వీసులను చుంగ్ రెండుసార్లు బ్రేక్ చేయగా.. ఒక్కసారి మాత్రమే చుంగ్ సర్వీసును జకో బ్రేక్ చేశాడు. ఈ ఓటమితో సెర్బియా స్టార్ జకోవిచ్ టోర్ని నుంచి నిష్క్రమించాడు. జకోవిచ్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
సెర్బియా, జమైకా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై జీఎంఆర్ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ విదేశీ గడ్డపై మరో రెండు విమానాశ్రయ ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయనుంది. వీటిలో సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ సమీపంలోని నికోలా టెస్లాతోపాటు, జమైకాలోని కింగ్స్టన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి విస్తరణ, ఆధునీకరణ పనులకు బిడ్లను దాఖలు చేయనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ తెలిపారు. బిడ్ల దాఖలు చేయడానికి కావాల్సిన అర్హతలను కంపెనీ సాధించింది. గతేడాది నికోలా టెస్లా విమానాశ్రయం నుంచి 49 లక్షలకుపైచిలుకు, కింగ్స్టన్ ఎయిర్పోర్ట్ నుంచి 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విశాఖపట్నంలోని కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుకు సైతం బిడ్ దాఖలు చేయనున్నట్టు సిద్ధార్థ్ వెల్లడించారు. -
యుగోఇంపోర్ట్‌తో రిలయన్స్ డిఫెన్స్ ఒప్పందం
సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ♦ మిడ్‌క్యాప్స్ కొంటున్నారా? ♦ జోరు మీదున్న టాటా గ్రూప్ షేర్లు ♦ 11 రోజుల్లో 101 శాతం లాభం ♦ బాగా పెరిగిన ఐదు ఫార్మా షేర్లు ♦ ఈ స్టాకుల్లో ఎంఏసీడీ ర్యాలీ సూచన ♦ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. ♦ WWW.SAKSHIBUSINESS.COM న్యూఢిల్లీ: సెర్బియాకు చెందిన యుగోఇంపోర్ట్‌తో అనిల్ అంబానీ గ్రూపులో భాగమైన ‘రిలయన్స్ డిఫెన్స్ అమ్యూనిషన్’ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మందుగుండు సామగ్రి సహా ఇతర అంశాల్లో రెండు కంపెనీలు కలసి పనిచేయడంతోపాటు వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ ఒప్పందంలో భాగమని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మందుగుండు సామగ్రి ఎగుమతికీ అవకాశాలున్నాయని పేర్కొంది. సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్‌తో అనిల్ అంబానీ భేటీ అయిన మర్నాడే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. యుగోఇంపోర్ట్ సెర్బియా ప్రభుత్వ రంగ సంస్థ. మందుగుండు తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారత ప్రభుత్వం కోసం భారత్‌లో తయారీకి గాను సాంకేతిక సహకారం అందించేందుకు ఈ సంస్థ సంసిద్ధతను తెలియజేసింది. భారత సాయుధ దళాల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు తదుపరి తరం మందుగుండును రెండు సంస్థలు సంయుక్తంగా అబివృద్ధి చేయనున్నట్టు రిలయన్స్ డిఫెన్స్ తెలిపింది. ప్రస్తుతం మన దేశ మందుగుండు అవసరాల్లో రూ. 10,000 కోట్ల (50 శాతం) మేర దిగుమతి చేసుకుంటున్నారు. -
ఒక్క రోజులోనే కోటీశ్వరురాలైంది!
సెర్బియాకు చెందని ఓ వృద్ధురాలు ఒక్క రోజులోనే కోటీశ్వరురాలు అయ్యింది. దాదాపు 6.70 కోట్ల రూపాయల నగదు, 27 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దక్కాయి. సెర్బియా తూర్పు ప్రాంతంలో మేరీ జ్లాటిక్ (86) కొన్ని దశాబ్దాలుగా ఓ చిన్న గుడిసెలో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుక్కలు మాత్రమే తోడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే 6700 రూపాయల పెన్షనే ఆమెకు జీవనాధారం. మేరీ జ్లాటిక్కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆమె భర్త మొమ్కిలో జ్లాటిక్ 2011లో ఆస్ట్రేలియాలో మరణించాడు. మొమ్కిలో సంపద ఆయన వారసత్వంగా మేరీకి దక్కింది. కాగా కోర్టులో కేసు పరిష్కారమై డాక్యుమెంట్లు చేతికి రావడానికి నాలుగేళ్లు పట్టింది. జ్లాటిక్ దంపతులు 1956లో సెర్బియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మొమ్కిలో ఓ కంపెనీలో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. మేరీ కొంతకాలం ఆస్ట్రేలియాలో గడిపిన తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సొంతూరు సెర్బియాలోని బొల్జెవక్ పట్టణానికి తిరిగి వచ్చింది. తల్లి మరణించిన తర్వాత ఆమె మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఆస్ట్రేలియాలో ఉండే ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మేరీకి తన భర్తతో సంబంధాలు తెగిపోయాయి. నాలుగేళ్ల క్రితం మొమ్కిలో మరణవార్త విని ఓ వ్యక్తి మేరీకి సాయపడ్డాడు. మొమ్కిలో దాచిన డబ్బు, సంపద ఆమెకు దక్కింది. కోట్ల రూపాయల సంపద దక్కినా మేరీ మాత్రం తన చిన్న గుడిసెలోనే ఉంటానని చెబుతోంది. -
పాపం.. పసివాళ్లు!
-
వలస వెతలు
-
డేవిస్ కప్ ప్లే ఆఫ్ పోరులో భారత్ ఓటమి
బెంగళూరు: డేవిస్ కప్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-3తో సెర్బియా చేతిలో ఓటమి చవిచూసింది. భారత ఆటగాడు యుకీ భాంబ్రీ 3-6, 4-6, 4-6 స్కోరుతో ఫిలిప్ క్రజినోవిక్ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. భారత్ వచ్చే ఏడాది ఆసియా/ఓసియానియా జోన్లో ఆడనుంది. -
బాస్కెట్‌బాల్ లో తిరుగులేని అమెరికా
మాడ్రిడ్: బాస్కెట్‌బాల్ లో తమకు ఎదురులేదని అమెరికా మరోసారి రుజువు చేసింది. ప్రపంచకప్ టైటిల్ ను నిలబెట్టుకుని తమ హవా కొనసాగించింది. మాడ్రిడ్ పాలసియో డీ రిపోర్టిస్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో సెర్బియాను 129-92 తేడాతో ఓడించి వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ప్రపంచ రికార్డు స్కోరుకు 8 పాయింట్ల దూరంలో నిలిచింది అమెరికా. 1994 నాటి ప్రపంచకప్ ఫైనల్లో 137 పాయింట్లు సాధించింది. తమ కంటే మెరుగ్గా రాణించిన అమెరికాకు ప్రపంచ కప్ టైటిల్ దక్కడం నూటికి నూరుపాళ్లు సమంజసమని సెర్బియా వ్యాఖ్యానించి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. -
తొలి రోజు నిరాశే
బెంగళూరు: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ లేకపోయినా... భారత్‌కు ఎలాంటి లాభం చేకూరలేదు. సెర్బియాతో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో తొలి రోజు భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయారు. తమ స్టార్ ప్లేయర్ జొకోవిచ్‌తోపాటు టిప్సరెవిచ్, విక్టర్ ట్రయెస్కీలాంటి మేటి ఆటగాళ్లు ఈ పోటీకి దూరంగా ఉన్నా... వారి గైర్హాజరీని మరిపిస్తూ యువ క్రీడాకారులు దుషాన్ లాజోవిచ్, ఫిలిప్ క్రాజినోవిచ్ అద్భుత విజయాలు సాధించి సెర్బియాకు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 153వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ 3-6, 2-6, 5-7తో ప్రపంచ 61వ ర్యాంకర్ లాజోవిచ్ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 144వ ర్యాంకర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 1-6, 6-4, 3-6, 2-6తో ప్రపంచ 107వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్ ఆశలు సజీవంగా ఉండాలంటే శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి తప్పనిసరిగా గెలవాలి. లాజోవిచ్తో రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ మూడో సెట్లో కాస్త పోటీనిచ్చాడు. 59 అనవసర తప్పిదాలు చేసిన ఈ ఢిల్లీ ఆటగాడు లాజోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసినా... తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు జరగకుండా తక్కువ షాట్లలోనే గేమ్‌లను ముగించాలనే వ్యూహంతో ఆడిన యూకీ ఆరంభంలో విజయవంతమయ్యాడు. కానీ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న లాజోవిచ్ ఆటతీరుకు యూకీ వద్ద సమాధానం లేకపోయింది. తొలి మ్యాచ్‌లో యూకీ ఓడిపోవడంతో... ఒత్తిడిలో బరిలోకి దిగిన సోమ్‌దేవ్ రెండో సెట్లో మినహా మిగతా మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బేస్లైన్వద్ద ఆటను ఎక్కువగా ఇష్టపడే సోమ్‌దేవ్ ఈ మ్యాచ్‌లో దానిని సరిగ్గా అమలు చేయలేదు. క్రాజినోవిచ్ పదునైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన షాట్లతో భారత నంబర్‌వన్‌కు ఇబ్బందులు సృష్టించాడు. అతను కొట్టిన డ్రాప్ షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి. రెండు గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రాజినోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. సోమ్‌దేవ్ ఏడు ఏస్‌లు సంధించి.. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 41 అనవసర తప్పిదాలు చేశాడు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లకు ఆధిక్యం డేవిస్ కప్ సెమీఫైనల్స్‌లో తొలి రోజు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాయి. ఇటలీతో జెనీవాలో జరుగుతున్న తొలి సెమీఫైనల్లోని సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 7-6 (7/5), 6-4, 6-4తో సిమోన్ బోలెలి (ఇటలీ)పై, వావ్రింకా 6-2, 6-3, 6-3తో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచారు. చెక్ రిపబ్లిక్‌తో పారిస్‌లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ గాస్కే 6-3, 6-2, 6-3తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై, సోంగా 6-2, 6-2, 6-3తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. -
డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
బెంగళూర్: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్ కు తన తొలి మ్యాచ్ లో చుక్కెదురైంది. డేవిస్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసింది. సెర్బియా స్టార్ ఆటగాడు దుసాన్ లాజోవిచ్ 6-3,6-2,7-5 తేడాతో భారత క్రీడాకారుడు యుకీ బాంబ్రీని మట్టికరిపించాడు. దీంతో డేవిస్ కప్ లో సెర్బియా తొలి విజయాన్ని నమోద చేసింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శుక్రవారం ఆరంభమైన ఈ పోరులో యుకీ బాంబ్రీ తీవ్ర ఒత్తిడితో ఆటను కొనసాగించాడు. వరుస సెట్లను కోల్పోయి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమై ఓటమి చవిచూసింది. 2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది. -
సింగిల్స్ గెలిస్తేనే...
- సెర్బియాతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి - యూకీ X లాజోవిచ్; సోమ్‌దేవ్ X క్రాజినోవిచ్ బెంగళూరు: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు సెర్బియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సొంత గడ్డపై ఈ టోర్నీ ఆడటం భారత్‌కు అనుకూలాంశంమే అయినప్పటికీ ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. 2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది. యూకీతో లాజోవిచ్... ఈ టోర్నీలో భారత్ ముందడుగు వేయాలంటే సింగిల్స్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. తొలి సింగిల్స్‌లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ... ప్రపంచ 61వ ర్యాంకర్ డుసాన్ లాజోవిచ్ను ఎదుర్కొంటాడు. మడమ గాయం నుంచి కోలుకున్న యూకీ ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాళ్లతో ఆడిన మ్యాచ్‌ల్లో లాజోవిచ్ కేవలం నాలుగుసార్లు మాత్రమే ఓడటం అతని సత్తాను తెలియజేస్తోంది. రెండో సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్.. ప్రపంచ 107వ ర్యాంకర్ క్రాజినోవిచ్తో అమీతుమీ తేల్చుకుంటాడు. అయితే గత ఆరు నెలలుగా ఏటీపీ సర్క్యూట్లో సోమ్‌దేవ్ తొలి రౌండ్‌ను దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ లియాండర్ పేస్-రోహన్ బోపన్న... జిమోన్జిక్-బొజోల్జిక్లతో తలపడతారు. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగుతాయి. ఈ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుందని పేస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒత్తిడిని ఎంత వరకు జయిస్తామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నాడు. మరోవైపు యూకీ తొలి సింగిల్స్ ఆడటంపై నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోపన్నకు ‘నిబద్ధత’ అవార్డు భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న డేవిస్ కప్ కమిట్మెంట్ అవార్డు అందుకోనున్నాడు. డేవిస్ కప్‌లో తమ జాతీయ జట్టు తరఫున అంకిత భావంతో ఆడే ఆటగాళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఆటగాళ్ల శ్రమకు ఈ అవార్డు గుర్తింపు ఇస్తుందని ఐటీఎఫ్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో రికీ అన్నారు. శుక్రవారం ఇక్కడ సెర్బియాతో మ్యాచ్ సందర్భంగా బోపన్నకు అవార్డు అందజేస్తారు. లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా), గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. -
సెలక్టర్లదే నిర్ణయం
డేవిస్‌కప్‌కు సీనియర్ల ఎంపికపై ఏఐటీఏ ముంబై: సెర్బియాతో జరిగే డేవిస్ కప్‌కు సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతిని ఆడించాలా? లేక యువ ఆటగాళ్లతోనే ముందుకెళ్లాలా అనేది జాతీయ సెలక్షన్ కమిటీ తేల్చుకోవాల్సి ఉందని అఖిల భారత టె న్నిస్ సంఘం (ఐటా) కార్యదర్శి భరత్ ఓజా స్పష్టం చేశారు. తాము ఈ టోర్నీకి అందుబాటులో ఉంటామని ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇటీవలప్రకటించారు. ‘మా కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్, కోచ్ జీషన్ అలీతో పాటు సెలక్షన్ కమిటీ కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లను పిలిపించాలా లేక యువ జట్టుతోనే ముందుకెళ్లాలా అనేది తేల్చాలి’ అని ఓజా అన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు సెర్బియాతో మ్యాచ్‌ల కోసం జట్టును జూలైలో ప్రకటించనున్నారు. -
భారత్ x సెర్బియా
న్యూఢిల్లీ: ఆరేళ్ల తర్వాత డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించిన భారత్‌కు ఈ రౌండ్లో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి 14 వరకు సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో 2010 చాంపియన్ సెర్బియాతో భారత్ తలపడనుంది. సెర్బియా గనుక పూర్తి జట్టును బరిలోకి దించితే ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ఆటను భారత అభిమానులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. సింగిల్స్‌లో జొకోవిచ్‌తోపాటు ప్రపంచ 76వ ర్యాంకర్ దుసాన్ లాజోవిచ్, 90వ ర్యాంకర్ టిప్సరెవిచ్, 112వ ర్యాంకర్ విక్టర్ ట్రయెస్కీలతో సెర్బియా పటిష్టంగా ఉంది. డబుల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ నెనాద్ జిమోనిచ్ కూడా ఆడే అవకాశముంది. ఇక భారత్ నుంచి సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని బరిలోకి దిగవచ్చు. భారత్, సెర్బియాల మధ్య ఇప్పటివరకు డేవిస్‌కప్‌లో ముఖాముఖి పోరు ఒకేసారి జరిగింది. 2011లో సెర్బియాలోని నోవిసాద్‌లో జరిగిన వరల్డ్‌గ్రూప్ తొలి రౌండ్లో భారత్ 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ పోటీలో జొకోవిచ్ బరిలోకి దిగలేదు. -
నదీ జలాల మధ్య ఆకట్టుకునే ఇల్లు
చూడ్డానికి పెయింటింగ్‌లా కనిపిస్తోంది కదూ.. కానీ ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది. సెర్బియాలోని బజీనా బాస్టా పట్టణంలో డ్రైనా నది మధ్యలో ఈ నివాసాన్ని నిర్మించారు. గతేడాది హంగేరియన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రానికి నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ వారి ‘ఫొటోస్ ఆఫ్ ది డే’ పురస్కారం కూడా లభించింది. అప్పట్నుంచి ఈ నది మధ్యలోని నివాసంపై ప్రపంచ పర్యాటకుల దృష్టి పడింది. ఈ ఇంటిని 1968లో కొందరు కుర్రాళ్లు నిర్మించారట. సెర్బియాలో అది ఫేమసేగానీ.. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలిసింది తక్కువే. ప్రస్తుతం ఇది అంతటా ప్రాచుర్యం పొందడంతో దీన్ని చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారట. గులాబీ సరస్సు... ఇదో సరస్సు! చూశారుగా.. గులాబీ రంగులో ఎంత చక్కగా కనిపిస్తోందో.. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ఉప్పు నీటి సరస్సు ఆస్ట్రేలియాలోని రిషెర్ష్ ఆర్కిపెలాగో ద్వీపంలో ఉంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్‌లా కనిపించే హిల్లియర్ అనే ఈ సరస్సు ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. దీని మీదుగా విమానాలు వెళ్లినప్పుడు అందులోని ప్రయాణికులు తమ సీట్లలోంచి లేచి.. కిటికీల వద్దకు చేరిపోతారట. ఇంతకీ దీనికీ రంగు రావడానికి గల కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈ సరస్సులో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ఈ రంగు వచ్చిందనే వాదన వినవస్తున్నా.. దాన్ని కూడా ఎవరూ కచ్చితంగా నిర్థరించడం లేదు. -
డేవిస్‌కప్ ఫైనల్లో సెర్బియా
బెల్గ్రేడ్: ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం కెనడాతో ముగిసిన సెమీఫైనల్లో సెర్బియా 3-2తో విజయం సాధించింది. శనివారం 1-2తో వెనుకబడిన సెర్బియా ఆదివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచింది. తొలి సింగిల్స్‌లో జొకోవిచ్ 7-6 (7/1), 6-2, 6-2తో రావ్నిక్పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. నిర్ణాయక మ్యాచ్‌లో టిప్సరెవిచ్ 7-6 (7/3), 6-2, 7-6 (8/6) తో పోస్పిసిల్ను ఓడించి సెర్బియాకు విజయాన్ని అందించాడు. నవంబరు 15 నుంచి 17 వరకు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌తో సెర్బియా ఆడుతుంది.