బెల్‌గ్రేడ్: ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెర్బియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం కెనడాతో ముగిసిన సెమీఫైనల్లో సెర్బియా 3-2తో విజయం సాధించింది. శనివారం 1-2తో వెనుకబడిన సెర్బియా ఆదివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచింది.
తొలి సింగిల్స్‌లో జొకోవిచ్ 7-6 (7/1), 6-2, 6-2తో రావ్‌నిక్‌పై నెగ్గి స్కోరును 2-2వద్ద సమం చేశాడు. నిర్ణాయక మ్యాచ్‌లో టిప్సరెవిచ్ 7-6 (7/3), 6-2, 7-6 (8/6) తో పోస్‌పిసిల్‌ను ఓడించి సెర్బియాకు విజయాన్ని అందించాడు. నవంబరు 15 నుంచి 17 వరకు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌తో సెర్బియా ఆడుతుంది.
డేవిస్‌కప్ ఫైనల్లో సెర్బియా
Published Mon, Sep 16 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement