ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్‌కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల పట్టిక టాప్–10లో నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని పేర్కొన్నాడు.
ముంబైలో బుధవారం జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా పేస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పేస్‌తో పాటు మహేశ్ భూపతి, సానియా మీర్జా, సోనాలీ బెంద్రే, రకుల్‌ప్రీత్ పాల్గొన్నారు. ‘దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. వారిని గుర్తించి సానపెట్టాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతుంది’ అని పేస్ ఆశాభావం వ్యక్తంచేశాడు.
చదవండి: ENG vs PAK: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment