Tennis tournment
-
భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతుంది: లియాండర్ పేస్
ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్‌స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్‌కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల పట్టిక టాప్–10లో నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని పేర్కొన్నాడు. ముంబైలో బుధవారం జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ వేలం సందర్భంగా పేస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పేస్‌తో పాటు మహేశ్ భూపతి, సానియా మీర్జా, సోనాలీ బెంద్రే, రకుల్‌ప్రీత్ పాల్గొన్నారు. ‘దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. వారిని గుర్తించి సానపెట్టాల్సిన అవసరముంది. రాబోయే రోజుల్లో భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా ఎదుగుతుంది’ అని పేస్ ఆశాభావం వ్యక్తంచేశాడు.చదవండి: ENG vs PAK: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌లోని తొలి సింగిల్స్‌లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్‌పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్‌గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్‌గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్...!
జెనీవా: జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఎనిమిదో ర్యాంకర్ ఫెడరర్‌కు 75వ ర్యాంకర్ పాబ్లో అందుహర్ (స్పెయిన్) షాక్ ఇచ్చాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అందుహర్ 6–4, 4–6, 6–4తో ఫెడరర్‌ను ఓడించాడు. చివరి సెట్లో అందుహర్ 2–4తో వెనుకబడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలుపొందడం విశేషం. చదవండి: Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు -
Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు
పార్మా (ఇటలీ): డబ్ల్యూటీఏ ఎమిలియా రొమానో చాలెంజర్ టోర్నీలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6–3, 6–2తో క్వాలిఫయర్ లీసా పిగాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. మూడు నెలల తర్వాత సెరెనాకు దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. ఇక చివరి సారిగా సెరెనా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందింది. అయితే ఈ చాలెంజర్ టోర్నీలో ఆఖరి నిమిషంలో వైల్డ్ కార్డ్‌గా బరిలోకి దిగిన సెరెనా బలమైన ఏస్‌లతో పాటు ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ మ్యాచ్‌ను 68 నిమిషాల్లో ముగించింది. చదవండి: Tejaswin Shankar: అద్భుత ఫీట్.. మరో స్వర్ణం సొంతం -
విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ (ఎఫ్-10) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో నగరానికి చెందిన విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు-శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడి 6-4, 6-2 స్కోరుతో ఎస్కాఫీర్ ఆంటోన్-గ్రెనీర్ హ్యుగో (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విష్ణు 7-6(7), 5-7, 6-4 తేడాతో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌ను ఓడిం చాడు. మరో వైపు ఫ్రాన్స్ ప్లేయర్ ఎస్కాఫీర్ ఆంటోన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అతను 6-4, 6-2, 6-3తో భారత ఆటగాడు బాలాజీ శ్రీరామ్‌పై గెలుపొందాడు. -
శ్రేయస్, జైవంత్ ముందంజ
ఏస్టర్ మైండ్స్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ మెంస్టేట్ ర్యాంకింగ్ జూనియర్ టెన్నిస్ టోర్నట్లో శ్రేయస్ శంకర్, జైవంత్ గణేష్ శుభారంభం చేశారు. బోయిన్‌పల్లిలోని కృష్ణస్వామి టెన్నిస్ అకాడమీలో గురువారం తొలి రౌండ్ పోటీలు జరిగాయి. అండర్-10 బాలుర సింగిల్స్‌లో శ్రేయస్ 6-0తో విభువంత్ తేజపై, జైవంత్ 6-2తో శౌర్యపై గెలుపొందారు. ఇతర పోటీల్లో శ్రీశరణ్ 6-0తో సాయి ఆకాశ్‌పై, అమోఘ్ రెడ్డి 6-1తో కృష్ణ ఆదిత్యపై, నిలయ్ త్రివేది 6-0తో కబీర్‌పై, అభిషేక్ 6-4తో లిఖిత్ రెడ్డిపై, ఆర్య జాదవ్ 6-0తో నెహన్పై, వర్షిత్ 6-3తో హేమంత్పై, ప్రణీత్ 7-6 (7/2)తో కావ్యాన్ష్ శర్మపై విజయం సాధించారు. అండర్-12 బాలుర సింగిల్స్‌లో జైవంత్ గణేష్ 7-4తో ఆదిత్యపై, శ్రీరామ్ 7-5తో నిఖిల్ భట్‌పై, హేమంత్ 7-3తో నిలయ్ త్రివేదిపై, హితేశ్ 7-3తో ఆర్య గోపాల్‌పై, సాత్విక్ రాజు 7-4తో క్రిష్‌పై, శ్రీశరణ్ 7-2తో అనురాగ్‌పై, ఫజల్ 7-0తో సాయికిరణ్‌పై, సాయి నివేద్ 7-0తో కృష్ణవంశీపై, ఆదిత్య 7-4తో రుత్విక్‌పై గెలుపొందారు. -
ఫైనల్లో శివాని, హుమేర
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అమినేని శివాని సత్తాచాటింది. బాలికల సింగిల్స్, డబుల్స్‌లో ఆమె టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సింగిల్స్‌లో షేక్ హుమేరా బేగంతో అమీతుమీ తేల్చుకోనుంది. బాలుర సింగిల్స్‌లో యెడ్ల కుశాల్, హిమాన్షు మోర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. లియోనియా రిసార్ట్స్‌లోని ఇండోర్ టెన్నిస్ టోర్నమెంట్లో గురువారం జరిగిన అండర్-14 బాలికల సెమీఫైనల్లో మూడో సీడ్ అమినేని శివాని 6-1, 6-3తో రెండో సీడ్ మహక్ జైన్‌పై అలవోక విజయం సాధించింది. రెండో సెమీస్‌లో షేక్ హుమేర 6-4, 6-3తో స్వాతిశ్రీ సురేశ్‌పై గెలుపొందింది. బాలుర సెమీస్‌లో క్వాలిఫయర్ కుశాల్ 6-3, 6-0తో ఆరో సీడ్ నీల్ గరుద్పై సునాయాస విజయం సాధించాడు. రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ హిమాన్షు మోర్ 6-7 (3/7), 6-1, 6-2తో తీర్థ శశాంక్‌పై గెలిచాడు. బాలికల డబుల్స్ విభాగంలో సాయిదేదీప్య-మహక్ జైన్ జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో దేదీప్య జంట 6-4, 6-3తో నేహ-స్వాతిశ్రీ ద్వయంపై, రెండో సీడ్ శివాని-శ్రావ్య జోడి 6-1, 6-1తో మూడో సీడ్ పాన్యభల్లా-శ్రీవల్లి రష్మిక జంటపై విజయం సాధించాయి. బాలుర డబుల్స్ సెమీఫైనల్లో రిత్విక్ చౌదరి-సచిత్ శర్మ జోడి 6-4, 7-6 (7/3)తో శ్రీవత్స రాతకొండ-హిమాన్షు మోర్ ద్వయంపై, రోహన్ రెడ్డి-తీర్థ శశాంక్ ద్వయం 6-4, 6-2తో నీల్ గరుద్-మొహమ్మద్ అతిఫ్ షేక్ జంటపై గెలుపొందాయి. శుక్రవారం సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. -
క్వార్టర్స్‌లో రష్మిక, శివాని
షాజిహా కూడా... ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని, షాజిహా బేగం సత్తాచాటారు. వీరంతా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. నగర శివారులోని లియోనియా రిసార్ట్స్ ఇండోర్ టెన్నిస్ కోర్టుల్లో మంగళవారం ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. అండర్-14 బాలికల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీవల్లి 6-2, 6-4తో రచనపై, నాలుగో సీడ్ శివాని 6-7 (3/7), 6-3, 7-5తో తహూర షేక్‌పై, షాజిహా 6-1, 3-6, 6-3తో శరణ్య గవరేపై విజయం సాధించారు. మూడో సీడ్ సాయిదేదీప్య 6-0, 6-1తో స్మృతి బాసిన్‌పై, షేక్ హుమేరా 6-2, 0-6, 6-1తో పాన్య భల్లాపై, రెండో సీడ్ మహక్ జైన్ 6-2, 6-1తో నేహ ఘరేపై గెలుపొందారు. అండర్-14 బాలుర సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు శ్రీవత్స క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సంపాదించాడు. ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండ 7-6 (7/5), 6-3తో రోహన్ కె. రెడ్డిపై, కుశాల్ 6-3, 6-3తో సాయి కార్తీక్‌పై, నాలుగో సీడ్ రిత్విక్ 6-2, 6-4తో అమన్ అయూబ్ ఖాన్‌పై, నీల్ గరుద్ 6-3, 6-3తో ఓంకార్ ఆప్టేపై, తీర్థ శశాంక్ 6-1, 6-0తో వల్లభ్‌పై, ప్రలోక్ ఇక్కుర్తి 6-1, 6-2తో రాహుల్ జైదీప్‌పై, హిమాన్షు మోరె 6-2, 7-5తో విపుల్ మెహతాపై విజయం సాధించారు. -
సత్తాచాటిన శివాని, రచన
ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయిలు అమినేని శివాని, రచన రెడ్డిలు ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అస్సాంలోని చాచల్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో వీరిద్దరు బాలికల అండర్-14, 16 సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో శివాని 4-2, 4-1తో భక్తి పార్వని (గుజరాత్)పై, రచన 4-0, 5-3తో అలీషా సమల్ (ఒడిశా)పై, ముబషిర అంజూమ్ షేక్ (ఏపీ) 4-1, 5-3తో లెనిన్ జమిర్ (అస్సాం)పై, రష్మిక 4-0, 5-3తో తనీషా కశ్యప్ (అస్సాం)పై గెలుపొందారు. అండర్-14 బాలుర విభాగంలో శశాంక్ (ఏపీ) 4-1, 5-3తో రోనిత్ బొర (అస్సాం)పై, రోహిత్ (ఏపీ) 4-1, 4-2తో సందేశ్ (కర్ణాటక)పై నెగ్గారు. గౌరవ్ (ఏపీ) 2-4, 0-4తో అమిత్ బెనివాల్ (హర్యానా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అండర్-16 బాలికల ప్రిక్వార్టర్స్‌లో శివాని 5-3, 4-1తో అలీషా (ఒడిశా)పై, రచన 4-1, 4-0తో లెనిన్ జమీర్ (అస్సాం)పై విజయం సాధించారు. బాలుర ప్రిక్వార్టర్స్‌లో శశాంక్ 1-4, 2-4తో యుగల్ బన్సల్ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నాడు. -
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య, శివాని
ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు సాయిదేదీప్య, అమినేని శివాని, శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లోని సీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శివాని 6-1, 6-0తో పాశ్చల్పై అలవోక విజయం సాధించగా, శ్రీవల్లి రష్మిక 2-6, 6-4, 6-2తో ఏడో సీడ్ పాన్యబాలపై చెమటోడ్చి నెగ్గింది. ఇతర పోటీల్లో టాప్ సీడ్ సాయిదేదీప్య 4-6, 6-2, 6-3తో అయేషా పటేల్‌పై గెలుపొందగా, ఆరో సీడ్ ప్రింకిల్ సింగ్ 6-3, 6-1తో శ్రావ్య శివానిని ఓడించింది. నాలుగో సీడ్ మహక్ జైన్ 6-0, 6-0తో శరణ్య షెట్టిపై, ప్రకృతి భన్వాని 6-0, 6-1తో నికితా దేవిపై, ఆర్.జాదవ్ 6-1, 6-1తో అశ్‌ప్రీత్ కౌర్‌పై, ఈశ్వరి మాటెరే 6-2, 6-4తో కుశ్‌బీన్ కౌర్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. బాలికల అండర్-14 డబుల్స్ తొలిరౌండ్లో శ్రీవల్లి-పాన్యబాల జోడి 6-7, (4/7), 7-6 (7/4), 10-5తో అశ్ప్రీత్కౌర్-అలీషా మీనన్ జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సాయి దేదీప్య-మహక్ జైన్ జోడికి, ప్రింకిల్ సింగ్-శివాని జంటకు తొలి రౌండ్లో బై లభించింది. ఈశ్వరి మాటెరే-అయేషా పటేల్ ద్వయం 6-1, 6-0తో ఐశ్వర్య- ఎస్.మెహతా జోడిపై, తనీషా బన్సాల్-రియా జంట 6-2, 6-2తో హిమాద్రి- నిఖిత జోడిపై, శ్రావ్య శివాని-శరణ్య షెట్టి జోడి 6-3, 6-2తో ప్రకృతి-రితూజా జాదవ్ జంటపై, కుశ్‌బీన్ కౌర్-రాహ మంగత్ జంట 6-3, 6-2తో ప్రియాంక-బిందు జోడిపై గెలుపొందాయి. -
ఇండోనేషియాపై భారత్ గెలుపు
ఆసియా ఓసియానియా టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో ఇండోనేషియాపై గెలుపొందింది. టోర్నీలో 5 నుంచి 8వ స్థానాల కోసం జరుగుతున్న పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రాంజల 6-0, 6-2 తేడాతో రైఫాంటీ డ్వికఫియానిపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో అబినికా రంగనాథన్ 6-4, 1-6, 2-6 తేడాతో అర్రుమ్ దమర్సరి చేతిలో ఓడడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జోడి 4-6, 6-4, 6-3 తేడాతో కఫియాని-దమర్సరి జంటను ఓడించి భారత్‌కు విజయాన్నందించారు. తమ తదుపరి మ్యాచ్‌ను భారత్ శనివారం చైనీస్ తైపీతో ఆడనుంది. -
థాయ్‌లాండ్ చేతిలో భారత్ ఓటమి
ఆసియా ఓషియానియా టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ వరుస విజయాలకు బ్రేక్‌పడింది. థాయ్‌లాండ్ 2-1తో భారత్‌ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్‌లో గెలిచినా డబుల్స్‌లో ఓడటంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. మలేసియాలోని కూచింగ్‌లో బుధవారం జరిగిన తొలి సింగిల్స్‌లో కర్మాన్ కౌర్ తాండి 3-6, 6-2, 6-7 (2/7)తో మనితా బుత్సరకోమ్విసిత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. భారత్ 0-1తో వెనుకబడిన దశలో రెండో సింగిల్స్ బరిలోకి దిగిన ప్రాంజల 6-2, 6-4తో బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. దీంతో 1-1తో స్కోరు సమం కాగా నిర్ణాయక డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జంట 6-3, 2-6, 5-7తో పిచయతిదా జాండేంగ్- బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో కంగుతింది. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లపై క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌ను థాయ్‌లాండ్ ఓడించింది. -
ఫైనల్లో శ్రీవత్స, దేదీప్య
ఎస్‌ఎమ్‌టీఏ-ఐటా టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ) - ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాతకొండ శ్రీవత్స, యెడ్ల కుశాల్ అండర్-14 బాలుర విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్ఎమ్టీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీవత్స 6-3, 6-2తో మెంగ రోహిత్‌పై గెలుపొందగా, కుశాల్ 6-4, 6-2తో తెయ్జో ఓజెస్ను కంగుతినిపించాడు. అండర్-12 బాలుర సెమీస్‌లో ఆర్యన్ జవేరి 7-5, 6-1తో దేవ్ జెవియాపై, మహేశ్ మహాపాత్ర 6-2, 4-6, 6-2తో ఎస్.భూపతిపై విజయం సాధించారు. బాలికల అండర్-12 సెమీస్‌లో రిచా చోగులే 4-6, 6-0, 6-0తో శ్రేయ కుదుమాలపై గెలుపొందగా, రేష్మ మారురి 6-1, 6-2తో ధ్రుతి కపూర్‌పై నెగ్గింది. బాలికల అండర్-14 సెమీఫైనల్లో సాయి దేదీప్య 6-1, 6-4తో అమినేని శివానిపై, ధరణ ముదలియార్ 7-6 (7/5), 6-1తో రితిక బాజర్పై విజయం సాధించారు. -
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య
ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయిదేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో మెరిసింది. పుణెలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో ఓడిన మరో ఏపీ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీస్‌కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాయిదేదీప్య 6-3, 6-1తో పాన్య భల్లాపై, రాష్ట్రానికి చెందిన ఐదో సీడ్ అమినేని శివాని 6-3, 6-3తో ఆద్యా చల్లాపై గెలుపొందారు. శ్రీవల్లి 1-6, 2-6తో ఏడో సీడ్ ప్రకృతి భన్వాని చేతిలో ఓడింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-పాన్య భల్లా జోడి 6-1, 7-5తో నేహా గరే- శరణ్య జంటపై విజయం సాధించగా, సాయిదేదీప్య-ఈశ్వరి మాత్రే జంట 6-4, 6-1తో శ్రేయ సగాడే-రుతూజ జాదవ్ ద్వయాన్ని ఓడించింది. అమినేని శివాని-ఇషితా పరేఖ్ జోడి 6-4, 6-0తో నేహ మొకాషి- పరాడే జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడి
మోంటెకార్లో: ఏటీపీ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-ఖురేషీ ద్వయం 7-6 (7/2), 6-4తో జూలియన్ నోల్ (ఆస్ట్రియా)-వాసెక్ పోస్పిసిల్ (కెనడా) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఈ ఇండో-పాక్ జంట పైచేయి సాధించింది. రెండో సెట్లో బోపన్న జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా... తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న-ఖురేషీ తదుపరి రౌండ్లో ఏడో సీడ్ లుకాస్ కుబోట్ (పోలండ్)-రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)లతో పోటీపడతారు. -
సానియా జోడి శుభారంభం
ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 6-4తో కీస్ మాడిసన్-అలీసన్ రిస్కీ (అమెరికా) జంటపై గెలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఫెడరర్ జంట చేతిలో బోపన్న జోడి ఓటమి ఇదే వేదికపై జరుగుతోన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) జోడి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం 6-2, 6-7 (4/7), 10-6తో ఐదో సీడ్ బోపన్న-ఖురేషి జంటను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. -
ఫైనల్లో సంస్కృతి, సంజన
ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-12 బాలికల విభాగంలో సంస్కృతి, సంజన ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో సంస్కృతి 8-0తో ప్రాచిపై గెలుపొందగా, సంజన 8-2తో శ్రీహర్షితపై నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. అండర్-14 బాలికల విభాగంలో సంస్కృతి 6-2తో సృజనపై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-1తో అర్చిత రెడ్డిపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో శశిప్రీతమ్ 7-6 (7/5)తో వరుణ్ కుమార్‌పై గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. తనతో పాటు చెన్నాడి సాహిల్ 7-4తో అర్జున్ రెడ్డిపై, తనిష్క్ 7-6తో సుహిత్ రెడ్డిపై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నారు. అండర్-12 బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో అన్నే ఆకాశ్ 7-5తో శశిధర్‌పై, కార్తీక్ నీల్ 7-2తో అనికేత్‌పై, తన్మయ్ 7-6తో కౌషిక్ కుమార్ రెడ్డిపై గెలిచారు. అండర్-10 విభాగంలో కార్తీక్ నీల్ 7-2తో ముకుంద్ రెడ్డిని ఓడించగా, సిద్ధార్థ్ రెడ్డి 7-0తో జయ్ కృష్ణపాల్‌పై గెలిచాడు. రుషికేశ్ 7-0తో యశ్వంత్ చౌదరిని, వర్షిత్ కుమార్ 7-6తో ప్రతినవ్ను ఓడించారు. -
దేదీప్య అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య కోల్‌కతాలో జరుగుతున్న సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో అదరగొడుతోంది. అఖిల భారత టెన్నిస్ టోర్నీకి అర్హత కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో దేదీప్య అండర్-14 సింగిల్స్‌తో పాటు అండర్-16 సింగిల్స్, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. సోమవారం జరిగిన అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనన్య యాదవ్‌పై 6-0, 6-1తో అద్భుత విజయం సాధించిన దేదీప్య అండర్-16 ప్రిక్వార్టర్స్‌లో అదే రాష్ట్రానికి చెందిన శ్రుతి గుప్తాపై 6-1, 6-4తో గెలుపొందింది. ఇక అండర్-14 క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన షేక్ హుమేరాతో, అండర్-16 క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ అమ్మాయి ఆర్జా చక్రవర్తితో దేదీప్య తలపడనుంది. -
టెన్నిస్ చాంప్ జ్ఞానభాస్కర్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: మీరా స్మారక ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జ్ఞానభాస్కర్ కైవసం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను గోవర్ధన్,ప్రదీప్ రెడ్డి జోడి గెల్చుకుంది. రమ్యాస్ టెన్నిస్ అకాడమీలో మంగళవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో జ్ఞానభాస్కర్ 10-7 స్కోరుతో ఎం.సాయి జితేష్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో జ్ఞాన భాస్కర్ 9-3తో పి.అజయ్‌పై, జితేష్ స్వామి 9-8 (7-4)తో సూర్య పవన్‌పై నెగ్గారు. డబుల్స్ ఫైనల్లో గోవర్ధన్, ప్రదీప్ రెడ్డి జోడి 9-5తో పి.అజయ్, సాయికుమార్ జోడిపై గెలిచింది. పురుషుల 35+ సింగిల్స్ ఫైనల్లో డి.రామకృష్ణ 8-3తో కె.వి.ఎన్.మూర్తిపై గెలిచాడు. సెమీఫైనల్లో కె.వి.ఎన్.మూర్తి 9-7తో వహీద్పై, రామకృష్ణ 9-6తో డి.మనీష్‌పై గెలిచారు. డబుల్స్ ఫైనల్లో వహీద్, మూర్తి జోడి 9-4తో రామకృష్ణ, మనీష్ జోడిపై గెలిచింది. -
రెండో రౌండ్లో ఇస్కా తీర్థ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రాష్ట్ర క్రీడాకారిణులు ఇస్కా తీర్థ, అక్షర ఇస్కా, వైష్ణవి శ్రీపెద్దిరెడ్డిలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ క్లబ్లో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఇస్కా తీర్థ 6-1, 6-7, 6-0 స్కోరుతో లిఖిత శెట్టి (కర్ణాటక)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో అక్షర ఇస్కా (ఏపీ) 6-2, 6-3తో నిత్య రాజ్ బాబు (తమిళనాడు)పై, శ్వేత శ్రీహరి (తమిళనాడు) 6-2, 6-3తో రష్మిత పసుల రెడ్డి(ఏపీ)పై, వైభవి త్రివేది (గుజరాత్) 6-4, 6-0తో సూర్య తేజస్విని(ఏపీ)పై, వైష్ణవి శ్రీపెద్ది రెడ్డి 6-3,6-0తో డయానా(తమిళనాడు)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రోజు ఫలితాలు: ఎస్.పృథ్వీ (తమిళనాడు) 6-3, 6-3తో మణీందర్ సింగ్ (హర్యానా), కునాల్ ఆనంద్ (ఢిల్లీ) 6-7, 6-4, 6-1తో విఘ్నేష్ వీరభద్రన్(తమిళనాడు)పై, నిఖిల్ సాయి (ఏపీ) 6-1, 2-6, 6-2తో ప్రజ్వల్ దేవ్(కర్ణాటక)పై, అజయ్ కుమార్ (ఏపీ) 6-3, 0-6, 6-2తో చంద్రిల్ సూద్ (యూపీ)పై నెగ్గారు. -
ప్రాంజల శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మొదటి రౌండ్లో ప్రాంజల 6-4, 6-0తో కొమోల ఉమరోవ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందింది. తొలి సెట్లో ప్రాంజలకు కొంత పోటీ ఎదురైనప్పటికీ గెలుపు సాధించగా... రెండో సెట్లో అలవోకగా దూసుకువెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. బుధవారం రెండో రౌండ్లో ప్రాంజల బెల్జియంకు చెందిన నైనాతో తలపడనుంది. -
హర్షిత్ శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టె న్నిస్ టోర్నీలో అండర్-12 బాలుర సింగిల్స్ విభాగంలో కొసరాజు హర్షిత్ శుభారంభం చేశాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడ మీలో శనివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హర్షిత్ 8-0తో ఆర్యంత్ రెడ్డిపై నెగ్గాడు. కౌశిక్ కుమార్ రెడ్డి 8-0తో అక్షిత్‌పై గెలిచాడు. సోహన్ 8-6తో హితేష్‌పై, అనికేత్ 8-4తో వరుణ్ కుమార్‌పై, రాహుల్ 8-1తో తరుణ్‌పై, సాయితేజ 8-2తో అర్చిత్‌పై నెగ్గారు. మిగతా ఫలితాలు: యశ్వంత్ 8-4తో ప్రతీ క్‌పై, సృజన్ 8-1తో అఖిలేష్‌పై, ప్రీతమ్ 8-2తో శౌర్యపై, బృహత్ 8-3తో విదుర్‌పై, శశిధర్ 8-2తో హర్షవర్ధన్‌పై, ఇక్బాల్ 8-0తో ఆది రోహన్‌పై, ప్రణవ్ 8-1తో రుషికేశ్పై, జయంత్ 8-5తో కార్తీక్‌పై, దీపక్ 8-5తో శివాన్వేష్పై, ఆకాశ్ 8-3తో వంశీకృష్ణపై నెగ్గారు. బాలికల అండర్-12 మొదటి రౌండ్: ప్రవళిక 8-0తో రితికా రెడ్డిపై, వేద వర్షిత 8-7, 7-4తో అదితిపై, సుమన 8-3తో మేఘనపై, సాహిష్న సాయి 8-3తో తనుషితా రెడ్డిపై, నిధి 8-1తో సౌమ్య జైన్‌పై గెలిచారు. -
సెమీఫైనల్లో నిధి, సౌజన్య
ఔరంగాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు జాతీయ చాంపియన్ ప్రేరణ బాంబ్రీ, రెండో సీడ్ ప్రార్థన తొంబరే సెమీస్ పోరుకు అర్హత సంపాదించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ నిధి వరుస సెట్లలో మూడో సీడ్ రిషిక సుంకరకు షాకిచ్చింది. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆమె 6-3, 6-3తో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున ఏపీ అమ్మాయి రిషికను కంగుతినిపించింది. సౌజన్య 6-4, 7-5తో రుతూజా భోంస్లేపై చెమటోడ్చి నెగ్గింది. ప్రేరణ బాంబ్రీ 4-6, 6-2, 6-3తో అంకిత రైనాపై, ప్రార్థన 6-2, 6-7 (4/7), 6-0తో నటాషా పల్హాపై గెలిచారు. సౌజన్య డబుల్స్‌లోనూ సెమీస్ఫైనల్లోకి అడుగుపెట్టింది. సౌజన్య-శర్మదా బాలు జోడి 6-0, 6-0తో ఎమి ముతగుచి-చిహిరో న్యునోమ్ జంటపై గెలుపొందగా, రిషిక-శ్వేతా రాణా ద్వయం 6-4, 6-1తో తీర్థ అక్షర-ఇస్కా (ఏపీ) జోడీని ఓడించింది. అనుష్క భార్గవ (ఏపీ)- ఈతీ మెహతా జంట 2-6, 5-7తో అంకిత రైనా-ప్రార్థన తొంబరే జోడి చేతిలో పరాజయం చవిచూసింది. -
సి.వి.ఆనంద్ శుభారంభం
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: జీవీకే-ఏఐటీఏ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నీలో 45+ పురుషుల సింగిల్స్‌లో సి.వి.ఆనంద్ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన 45+ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 6-1, 6-0 స్కోరుతో అవలీలగా డి.ఎస్.రాజుపై విజయం సాధించి రెండో రౌండ్‌కి చేరారు. తొలి రౌండ్ ఇతర మ్యాచ్‌ల్లో కె.మహారా ప్రకాష్ 6-3, 6-2తో మునికృష్ణరెడ్డిపై, ఎస్.నరేంద్రనాథ్ 6-1, 6-0తో బి.జోజిరెడ్డిపై, పాల్ మనోహర్ 6-4, 6-4తో సూర్యప్రకాష్‌పై, బి.జి.నాగేష్ 6-3, 6-2తో బి.వి.ఆనంద్‌పై, జయంత్ పవార్ 6-3, 6-3తో ఎ.ఎస్.ఖాన్‌పై, జి.చంద్రబాబు 6-3, 5-7, 6-3తోజి.అప్పలరాజుపై గెలిచారు. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి రౌండ్ ఫలితాలు: 55+ పురుషుల సింగిల్స్: ఆర్.ఇ.సుదర్శన్ 6-0, 6-0తో వై.ప్రసాద్‌పై, మహ్మద్ అజాముల్లా 7-5, 6-2తో మన్మథ రావుపై, ఎ.భాస్కర్‌రెడ్డి 7-5, 6-2తో ఎం.ఎస్.ప్రసాద్‌పై, ఎం.నరేష్ 6-2, 6-0తో ఎన్.సుధాకర్‌రెడ్డిపై, కె.రాధాకృష్ణ మూర్తి 6-0, 6-4తో సత్యనారాయణపై, ఎ.ఆర్.రావు 6-3, 7-5తో పి.కె.పట్నాయక్‌పై, డాక్టర్ రామ్మోహన్ రావు 6-2, 6-1తో బి.జి.రెడ్డిపై, ఎస్.సేతు 6-3, 6-1తో రవి నగర్కర్పై గెలిచారు. -
సెమీస్‌లో సౌజన్య జోడి
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టికి మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లో ఓడిన సౌజన్య... డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ మగ్దా లినెట్టి (పోలెండ్) 6-2, 6-2తో సౌజన్యను ఓడించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌజన్య-షర్మదా (భారత్) ద్వయం 6-7 (1/7), 6-3, 10-8తో తమారా కురోవిక్ (సెర్బియా)-డయానా మార్సికెవికా (లాత్వియా) జంటపై గెలిచింది. క్వార్టర్స్‌లో నిధి ముంబైలో జరుగుతున్న ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి సూరపనేని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిధి 6-2, 6-3తో తనూశ్రీపై నెగ్గింది.