జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ బాలుర అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు హర్షిత్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బోయిన్‌పల్లిలో సూర్యా టెన్నిస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో హర్షిత్ 6-2, 6-0తో అనురాగ్ అగర్వాల్ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించాడు. తనతో పాటు ప్రీతమ్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 7-5తో రుచిత్ గౌడ్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు.
బాలిక ల అండర్-12 విభాగంలో సంస్కృతి 6-4, 6-1తో అవంతికా రెడ్డి (ఆంధ్రప్రదేశ్)పై, సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6-3, 5-7, 7-6తో సమృతి భాసిన్ (ఆంధ్రప్రదేశ్)పై గెలిచారు. బాలుర అండర్-14 విభాగంలో అనికేత్ (ఆంధ్రప్రదేశ్) 0-6, 6-4, 6-3తో శ్రీహర్ష (ఆంధ్రప్రదేశ్)పై, సాయి కార్తీక్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-0తో హర్షిత్ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందారు. బాలికల అండర్-14 విభాగంలో ఉమర్ మిష్‌గాన్ (ఆంధ్రప్రదేశ్) 3-6, 6-4, 6-4తో జువేరా ఫాతిమ (ఆంధ్రప్రదేశ్)ను, శ్రావ్య శివాని (ఆంధ్రప్రదేశ్) 6-1, 6-1తో శ్రేయ (ఆంధ్రప్రదేశ్)ను ఓడించి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
ఫైనల్లో హర్షిత్
Published Fri, Sep 27 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement