రోహిత్‌ శర్మ ఫ్లైయింగ్‌ కిస్‌.. ఫొటోలు డిలీట్‌ చేసిన సన్‌రైజర్స్‌ | IPL 2024: Rohit Sharma Flying Kiss To Mayank Agarwal SRH Delete Photo after Posting | Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫ్లైయింగ్‌ కిస్‌.. ఫొటోలు డిలీట్‌ చేసిన సన్‌రైజర్స్‌

Published Wed, Mar 27 2024 10:10 AM | Last Updated on Wed, Mar 27 2024 1:20 PM

IPL 2024: Rohit Sharma Flying Kiss To Mayank Agarwal SRH Delete Photo after Posting - Sakshi

మయాంక్‌ అగర్వాల్‌తో రోహిత్‌ శర్మ(PC: X/SRH)

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక సమయంలో కాస్త గట్టిగానే సలహాలు, సూచనలు ఇచ్చే హిట్‌మ్యాన్‌.. అప్పుడప్పుడూ చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాడు కూడా!

తాజాగా రోహిత్‌ శర్మ ‘బాధితుల’ జాబితాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ చేరాడు. కాగా ఐపీఎల్‌-2024లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొన్న సందర్భంగా రోహిత్‌ శర్మ.. మయాంక్‌ అగర్వాల్‌ను టీజ్‌ చేశాడు. మయాంక్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తూ అల్లరి చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ హర్షిత్‌ రాణాను ఇమిటేట్‌ చేస్తూ అతడిని ఆటపట్టించాడు. దీంతో మయాంక్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘ఇక చాల్లే’’ అన్నట్లుగా రోహిత్‌కు సైగలు చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎక్స్‌లో షేర్‌ చేసింది. ‘‘ఫ్లైయింగ్‌ కిస్సులు.. స్నేహపూర్వక శత్రుత్వాలు’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఈ ఫొటో నెట్టింట వైరల్‌ కాగా.. కాసేపటికే డిలీట్‌ చేసింది. మయాంక్‌ పట్ల హర్షిత్‌ రాణా ప్రవర్తించిన తీరును కూడా ప్రమోట్‌ చేస్తారా అంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌.. కేకేఆర్‌తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ తొలి ఓవర్‌ నుంచే హర్షిత్‌ రాణాను టార్గెట్‌ చేస్తూ వరుస బౌండరీలు బాదాడు.

అయితే, అనూహ్యంగా అతడి బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు.  ఈ క్రమంలో కోపంగా.. మయాంక్‌ను చూస్తూ ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తూ వికెట్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు హర్షిత్‌. ఆ తర్వాత హెన్రిచ్‌ క్లాసెన్‌ విషయంలోనూ దూకుడుగా ప్రవర్తించాడు.

ఈ నేపథ్యంలో హర్షిత్‌ రాణా అతి చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు. అదీ సంగతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement