
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు తుది జట్టులోకి అవకాశమివ్వాలని సీఎస్‌కే మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బ్రెవిస్ డెబ్యూపై సీఎస్‌కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ హింట్ ఇచ్చాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్ ఆడే అవకాశముందని ఫ్లెమింగ్ తెలిపాడు.
"మాకు ఉన్న బ్యాటింగ్ అప్షన్స్‌లో బ్రెవిస్ ఒకడు. అతడికి రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా అవకాశం దక్కుతుంది. అయితే ఇతర ఆటగాళ్లు టోర్నీ ఆరంభం నుంచి మా జట్టులో ఉన్నారు. తుది జట్టు ఎంపికలో వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నాము. ఈ మ్యాచ్‌లో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనున్నాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తొలుత ఐపీఎల్-2025 మెగా వేలంలో బ్రెవిస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఈ ఏడాది సీజన్‌కు గాయం కారణంగా దూరమైన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో జూనియర్ ఏబీడీని సీఎస్‌కే తీసుకుంది.
బ్రెవిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 21 ఏళ్ల బ్రెవిస్ దుమ్ములేపాడు. బ్రెవిస్ మిడిలార్డర్‌లో వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టోర్నీలో ఏంఐ కేప్ టౌన్ తరపున 12 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్.. 184.17 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తాఉంది.
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు సీఎస్‌కే తుది జట్టు: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోని (కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ, అశ్విన్
చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?