Dewald Brevis
-
సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం
అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. బ్రెవిస్‌కు టెస్ట్ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు ఇదే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్ సైతం గాయపడ్డాడు. అతని స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్డేట్ చేసిన జట్టు వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్ 11) వెల్లడించింది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రేన్నేబంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్..తొలి టెస్ట్ (అక్టోబర్ 21-25, ఢాకా)రెండో టెస్ట్ (అక్టోబర్ 29-నవంబర్ 2, చట్టోగ్రామ్)చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో) -
ఇదేమి షాట్‌రా బాబు.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్ టౌన్ ఆటగాడు, ప్రోటీస్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా బ్రెవిస్ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ ఓ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. కేప్ టౌన్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన డుపావిలోన్ బౌలింగ్‌లో తొలి బంతిని చూడకుండానే బ్రెవిస్ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. జూనియర్ ఏబీడీ కొట్టిన ఆ షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రిటోరియాపై 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్ టౌన్ విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను కేప్‌టౌన్ సజీవంగా ఉంచుకుంది. A NO-LOOK SIX BY DEWALD BREVIS ....!!!! 🔥pic.twitter.com/rURTI6gYNx — Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024 -
ఆసీస్‌తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే..!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు తొలిసారి పిలుపునిచ్చారు. ఇతనితో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెర్రీరా, యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీలను కూడా తొలిసారి ఎంపిక చేశారు. ఆసీస్ పర్యటనలోని 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన యువ జట్టును ప్రకటించారు. సీనియర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేల గైర్హాజరీలో సెలెక్టర్లు యువకులకు అవకాశం ఇచ్చారు. పైపేర్కొన్న సీనియర్లంతా ఇదే పర్యటనలో జరిగే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తారు. టీ20 సిరీస్‌కు ఎయిడెన్ మార్క్రమ్, వన్డే సిరీస్‌కు టెంబా బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గాయం కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కేశవ్ మహారాజ్ సైతం రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, సిసంద మగాల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ షెడ్యూల్.. ఆగస్ట్ 30: తొలి టీ20 (డర్బన్) సెప్టెంబర్ 1: రెండో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 2: మూడో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 7: తొలి వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 9: రెండో వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 12: మూడో వన్డే (పోచెఫ్‌స్ట్రూమ్) సెప్టెంబర్ 15: నాలుగో వన్డే (సెంచూరియన్) సెప్టెంబర్ 17: ఐదో వన్డే (జోహనెస్బర్గ్) -
విల్ జాక్స్ ఊచకోత.. చెలరేగిన బేబీ ఏబీడీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌తో నిన్న (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. విల్ జాక్స్ (46 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జాక్స్‌కు జతగా డి బ్రూన్ (23 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో క్యాపిటల్స్ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో క్యాపిటల్స్ బౌలర్లు పార్నెల్ (2/20), ఆదిల్ రషీద్ (2/46), నోర్జే (1/37), నీషమ్ (1/13), ఈథన్ బాష్ (1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (29 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన ఎంఐ బౌలర్లు లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన మరో మ్యాచ్‌లో రబాడ (2/12), రషీద్ ఖాన్ (2/18), జార్జ్ లిండే (2/25), ఓడియన్ స్మిత్ (2/10) రెచ్చిపోవడంతో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగా, ఎంఐ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తా చాటగా.. ఆఖర్లో సామ్ కర్రన్ (15 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్-పార్ల్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. -
ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా 'బేబీ ఏబీడీ'.. మరి రోహిత్?
దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్ఠించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్.. మంగళవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. పార్ల్ రాయల్స్‌పై కేప్‌టౌన్ విజయంలో సాధించడంలో డెవాల్డ్ కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం(జనవరి 13)న డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించేందుకు బ్రెవిస్ సిద్దమవతున్నాడు. కాగా ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం విధితమే. ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా బ్రెవిస్ ఇక ఐపీఎల్లో డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతడు తన అద్భుత ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ 19 ఏళ్ల యువ ఆటగాడిని అభిమానులు "జూనియర్ ఏబీగా" పిలుచుకుంటున్నారు. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ ఓపెనర్‌గా అదరగొడుతున్న "జూనియర్ ఏబీడి" కి ఐపీఎల్లో ప్రమోషన్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో తమ జట్టు ఓపెనర్‌గా బ్రెవిస్‌ను పంపాలని ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది ఐపీఎల్లో ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రారంభించారు. అయితే ఐపీఎల్-2023లో మాత్రం రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఐపీఎల్ 2023లో ముంబై జట్టు: కామెరాన్ గ్రీన్, జే రిచర్డ్సన్, పీయూష్ చావ్లా, దువాన్ జాగర్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, రాఘవ్ గోయల్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మాధ్వల్ చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం.. -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. -
పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు..!
టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) టీ20 ఛాలెంజ్ లీగ్ ఈ ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. పొట్టి క్రికెట్లో ఒక్క మ్యాచ్‌లోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఈ స్థాయిలో పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ లీగ్‌లో భాగంగా టైటాన్స్-నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 పరుగులు సాధించాయి. గతంలో టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్ల స్కోర్లు కలిపి) 497 పరుగులుగా ఉండింది. 2016లో సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్-ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఈ స్కోర్ సాధించాయి. ఇక, అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు 2016లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 489 పరుగులు నమోదయ్యాయి. #CSAT20Challenge@Titans_Cricket claim a comfortable 41-run victory over @KnightsCricket in a game that broke the world record for the highest match aggregate in a T20 game - 5⃣0⃣1⃣ 🤯 🗒️ Ball by ball https://t.co/QxPLEjNMQg 📺 SuperSport 208#BePartOfIt #SummerOfCricket pic.twitter.com/yu4wsSfwxH — DomesticCSA (@DomesticCSA) October 31, 2022 ఇదిలా ఉంటే, సీఎస్ఏ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. డెవాల్డ్ బ్రెవిస్ (57 బంతుల్లో 162; 13 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఛేదనలో నైట్స్ సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి, లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 36 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. That record-breaking innings 🤯#CSAT20Challenge #BePartOfIt #SummerOfCricket pic.twitter.com/C7KLkPBHzD — DomesticCSA (@DomesticCSA) November 1, 2022 -
జూనియర్ 'ఏబీడీ' విధ్వంసం.. 57 బంతుల్లో 162 పరుగులు
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టి20 క్రికెట్లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. సీఎస్ఏ చాలెంజ్ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. 35 బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. గేల్ (175), ఫించ్ (172) తర్వాత టి20 క్రికెట్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. కాగా బ్రెవిస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. తద్వారా నైట్స్‌పై 41 పరుగుల తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. ఇక నైట్స్ బ్యాటర్లలో గిహాన్ క్లోయెట్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టైటాన్స్ బౌలర్లలో నైల్ బ్రాండ్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆరోన్ ఫాంగిసో రెండు, బ్రెవిస్, హర్మర్ తలా వికెట్ సాధించారు. చదవండి: బంగ్లాదేశ్‌లో పర్యటించే టీమిండియా ఇదే.. తెలుగు ఆటగాడికి అవకాశం -
'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్.. బేబీ ఏబీ అని పిలుచుకున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినప్పటికి వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన బ్రెవిస్ 30 పరుగులు పిండుకున్నాడు. సీపీఎల్‌లో డెవాల్డ్ బ్రెవిస్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గురువారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అకిల్ హొసెన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని మిస్ చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత వరుస మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయింది. 20వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన డారిన్ దుపావిల్లన్ బౌలింగ్‌లో చివరి రెండు బంతులు ఆడిన బ్రెవిస్ రెండు సిక్సర్లు బాదాడు. అలా తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికి... ఓవర్లు అయిపోవడంతో తృటిలో ఆరు సిక్సర్ల రికార్డు మిస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 7 పరుగులుతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాల్డ్ బ్రెవిస్ 30 నాటౌట్, బ్రావో 23 పరుగులు చేశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Dewald Brevis 5 sixes in a row 30*(6) 🔥🔥🔥 pic.twitter.com/faGyEvD84z — ° (@anubhav__tweets) September 22, 2022 చదవండి: ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం.. -
తిలక్ వర్మతో స్నేహం దేవుడిచ్చిన గొప్ప బహుమతి! మేమిద్దరం..
అండర్-19 ప్రపంచకప్-2022 టోర్నీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బేబీ ఏబీడీని.. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మెగా వేలం-2022లో భాగంగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో అతడు 7 ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేశాడు. అయితే, ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం పద్నాలుగింటికి కేవలం 4 మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, బ్రెవిస్‌కు మాత్రం పలువురు మేటి క్రికెటర్ల సలహాలతో పాటు కొంతమంది స్నేహితులూ దొరికారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడిన డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణంలోని జ్ఞాపకాలు పంచుకున్నాడు. ‘‘ఇంతకంటే గొప్ప జట్టు ఉంటుందని నేను అనుకోను.. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉంది. దిగ్గజాలతో కలిసి ఆడటం గొప్ప అనుభవం. నా ఆటను మెరుగుపరుచుకునే ఎన్నో సలహాలు నాకు లభించాయి’’ అని బ్రెవిస్ పేర్కొన్నాడు. దేవుడిచ్చిన వరం ఇక హైదరాబాదీ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో స్నేహం గురించి చెబుతూ.. ‘‘నాకు అక్కడ ఓ స్పెషల్ ఫ్రెండ్ ఉన్నాడు. తనతో స్నేహం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తాను. ఈ స్నేహబంధం నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. నాకోసం తిలక్ అన్ని వేళలా అండగా నిలబడతాడు’’ అని బేబీ ఏబీడీ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘మేము ఇద్దరం ఒకరినొకరం సపోర్టు చేసుకుంటాం. మాకు కాస్త హాస్య చతురత ఎక్కువ. ఒకరినొకరం ప్రాంక్ చేసుకోవడమే కాదు.. సహచర ఆటగాళ్లను కూడా ఆటపట్టించేవాళ్లం. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) బస్సు ప్రయాణాల్లోనూ మా అల్లరికి అంతే ఉండేది కాదు. వేకువజామునా.. లేదంటే అర్ధరాత్రులు అనే తేడా లేకుండా ఇద్దరం కలిసి నెట్‌ఫ్లిక్స్ చూసేవాళ్లం’’ అంటూ తిలక్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలను బ్రెవిస్ గుర్తు చేసుకున్నాడు. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. చదవండి: Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్ View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భలే ఛాన్స్.. ఇంగ్లండ్‌కు పయనం!
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోహిత్ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. వాళ్లందరికీ అవకాశం ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్‌లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్‌కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ట్రిప్‌లో భాగమైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా(అంచనా) ఎన్టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్‌దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 -
IPL: ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా.. కెప్టెన్ అవుతా!
IND Vs SA T20 Series: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. ఏదో ఒకరోజు క్యాష్ రిచ్ లీగ్‌లో తప్పకుండా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే కెప్టెన్‌గా కూడా వ్యవహరించే అవకాశం రావాలని ఆశిస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్ రావాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ల నుంచి బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ వరకు ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ తదితరులు తాము ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు. రబడ వంద వికెట్లు తీయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తానూ ఏదో ఒకరోజు ఐపీఎల్లో ఆడతానని ఈ 32 ఏళ్ల బ్యాటర్ పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘నేను కూడా అక్కడ ఆడతాను. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నిజానికి అక్కడ ఓ జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది. ఇది నా ఫాంటసీ. అయితే, ముందు ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి అనుభవం గడించాలి కదా’’ అని క్రికెట్మంత్లీతో బవుమా చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం. ఇక జూన్ 9 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. చదవండి 👇 అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా Welcome to the #Proteas, Tristan Stubbs 🇿🇦💚#INDvSA #BePartOfIt pic.twitter.com/EJWx8agZKV — Cricket South Africa (@OfficialCSA) June 1, 2022 -
వామ్మో తిలక్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా.. పాపం బేబీ ఏబీడీ!
IPL 2022- Mumbai Indians- Tilak Varma: ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉన్నా ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. తాజా ఎడిషన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక ఆట విషయాన్ని పక్కన పెడితే.. సహచర ఆటగాళ్లతో ఇట్టే కలిసిపోయే స్వభావం తిలక్ వర్మది. ముంబై ఇండియన్స్ జట్టులోని యువ ఆటగాళ్లు ముఖ్యంగా దక్షిణాఫ్రికా సంచలనం, జూనియర్ ఏబీడీగా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్‌తో తిలక్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తిలక్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ‘పేస్ట్ బిస్కట్’తో బ్రెవిస్, రిలే మెరెడిత్, టిమ్ డేవిడ్‌ను ఆటపట్టించాడు. అసలేం జరిగిందంటే.. ముందుగా బిస్కట్లలో క్రీమ్ తీసేసిన తిలక్ వర్మ.. దానికి బదులు అందులో పేస్ట్‌ను పూశాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వాటిని ప్యాక్ చేసి.. మెల్లగా సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లాడు. తన చేతిలోని బిస్కట్లు తినమంటూ వారికి ఆఫర్ చేశాడు. పాపం తిలక్ ‘స్కెచ్’ గురించి తెలియని డేవిడ్, బ్రెవిస్, మెరెడిత్ ఎంచక్కా వాటిని లాగించేశారు. రుచి కాస్త భిన్నంగా ఉన్నా పర్లేదులే అనుకుంటూ తినేశారు. అయితే, ఆఖర్లో అసలు విషయాన్ని బయటపెట్టాడు క్రేజీ తిలక్. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. పర్లేదు ఇది మింట్ ఫ్లేవర్ బిస్కట్ అనుకున్నా. ఏదమైనా దంతాలకు ఇది మంచిదేగా అంటూ డేవిడ్, మెరెడిత్ నవ్వుతూ వ్యాఖ్యానించడం విశేషం. ఈ ప్రాంక్ వీడియోను ముంబై తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇందుక స్పందించిన నెటిజన్లు.. ‘‘వామ్మో తిలక్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా! ఏదేమైనా మీ మధ్య అనుబంధం.. ముఖ్యంగా బ్రెవిస్‌తో నీ స్నేహబంధం ముచ్చటగొలుపుతోంది’’అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అండర్-19 భారత జట్టులో సభ్యుడైన తిలక్ వర్మను ముంబై మెగా వేలం-2022లో 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తద్వారా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. చదవండి👉🏾 Sanju Samson: ఆరోజు పిచ్చిపట్టినట్లయింది.. బ్యాట్ విసిరేసి వెళ్లిపోయా.. రాత్రి వచ్చి చూస్తే View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
'సలహాలు అవసరం లేదు.. ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు'
ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన ముంబై బోణీ కొట్టలేపోయింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు వచ్చినప్పటికి ముంబై ఇండియన్స్‌ను రనౌట్లు కొంపముంచాయి. ఆ రనౌట్లలో పరోక్షంగా సూర్యకుమార్ యాదవ్ పాత్ర ఉంది. అయితే మ్యాచ్‌లో జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 25 బంతుల్లోనే 49 పరుగులు చేసిన బ్రెవిస్.. రాహుల్ చహర్‌ను ఉతికారేశాడు. అతను వేసిన ఒక ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది హడలెత్తించాడు. అతనితో పాటు తిలక్ వర్మ కూడా ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. వీరిద్దరు ఔట్ కాని పక్షంలో ముంబై ఇండియన్స్ పరిస్థితి వేరుగా ఉండేది. అందుకే వీరిద్దరిపై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. శుక్రవారం ఎన్డీటీవీ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ పాల్గొన్నాడు. ''ఈ సీజన్లో మాకు మంచి ఆరంభం లభించలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. మ్యాచ్‌లు ఓడాలని మాకు ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలని ప్రయత్నిస్తున్నాం.. కానీ ఓటములు పలకరిస్తున్నాయి. కచ్చితంగా కుదురుకుంటాం.. విజయాలు అందుకుంటాం. అయితే జట్టుగా విఫలమైనా మాకు ఇద్దరు ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు దొరికారు. ఆ ఇద్దరే డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ. 19 ఏళ్ల వయసులో వీరిద్దరు అద్బుతాలు చేస్తున్నారు. తమ విధ్వంసకర ఆటతీరుతో అభిమానాన్ని చూరగొంటున్నారు. నిజానికి ఒక సీనియర్‌గా వాళ్లకి సలహాలు ఇవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆ స్థాయిని వాళ్లిద్దరు ఎప్పుడో దాటేశారు. ఒక రకంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు వాళ్లగా షాట్లు ఎందుకు ఆడలేకపోయానా అని నాకే ఆశ్చర్యమేస్తోంది. కచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద పేరు సంపాదించడం ఖాయం. అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు! -
దటీజ్ జానియర్ 'ఏబీ'.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు జానియర్ 'ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు చుక్కలు చూపించాడు. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రాహుల్ చాహర్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, 1 ఫోర్ బాది బ్రెవిస్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లోనే నాలుగో బంతికి బ్రెవిస్ 112 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లివింగ్ స్టోన్ 108 మీటర్ల దూరంతో భారీ సిక్స్ బాదిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 49 పరుగులు సాధించిన బేబి 'ఏబీ' కేవలం ఒక్క పరుగు దూరంలోను తన తొలి అర్ధ సెంచరీను చేజార్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగల తేడాతో ముంబై ఓటమి పాలైంది. కాగా ఈ సీజన్లో వరసుగా ఐదో మ్యాచ్‌లో ముంబై ఓటమి చెందడం గమనార్హం. చదవండి: IPL 2022 MI Vs PBKS: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ 112 meter six by Dewald Brevis - longest in #IPL2022 pic.twitter.com/ofDn7NjrfI — Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) April 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్
ఐపీఎల్లో గత సీజన్ వరకు తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన ఏబీ డివిలియర్స్ ఈ సారి నుంచి దూరమయ్యాడు. అయితే అతడిని గుర్తు చేసేలా 18 ఏళ్ల దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌కు బ్రెవిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 49 పరుగులు సాధించి ముంబై విజయంపై ఆశలు రేకెత్తించాడు. కాగా రాహుల్ చహర్ ఓవర్లో బ్రెవిస్ వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 6, 6 (మొత్తం 28 పరుగులు) బాదడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెవిస్(49), సుర్యకూమార్ యాదవ్(43) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ముంబై కు విజయం వరించలేదు. పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై పరాజాయం పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో వరుసగా ఐదో ఓటమిని ముంబై చవి చూసింది. చదవండి: IPL 2022: తీరు మారని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో ఓటమి.. పంజాబ్ ఘన విజయం 1, 4, 6, 6, 6, 6 Baby AB" Dewald Brevis is putting up a batting show against PBKS 🔥💥#DewaldBrevis #BabyAB #IPL2022 #MIvsRCB pic.twitter.com/1916DYWONK — Pritam Biswas (@pritambiswas_18) April 13, 2022 -
జూనియర్ ఏబీ ఖాతాలో మరో అరుదైన ఘనత
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో తానే వేసిన తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాడిగా జూనియర్ ఏబీ చరిత్ర సృష్టించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన డెవాల్డ్ బ్రెవిస్ తన తొలి బంతికే కోహ్లి వికెట్ దక్కించుకున్నాడు. గుడ్ లెంగ్త్‌తో పడిన బంతి కోహ్లి ప్యాడ్లను తాకి బ్యాట్‌ను తాకింది. దీంతో బ్రెవిస్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే కోహ్లి రివ్యూకు వెళ్లినప్పటికి ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో డెవాల్డ్ బ్రెవిస్ ఖాతాలో కోహ్లి రూపంలో తొలి వికెట్ పడింది. ఇక ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. 152 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం -
దటీజ్ "జూనియర్ ఏబీ".. బంతిని చూడకుండానే భారీ సిక్సర్
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బుధవారం(ఏప్రిల్ 6) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఆడిన బ్రెవిస్ 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు బాదిన ఓ సిక్సర్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ముంబై ఇన్నింగ్స్ 8 ఓవర్ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో.. బంతిని చూడకుండానే బ్రెవిస్ అద్భుతమైన సిక్స్ బాదాడు. కాగా అదే ఓవర్లో ఐదో బంతికి బ్రెవిస్ స్టంపౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం. బ్రెవిస్ సిక్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దక్షణాఫ్రికాకు చెందిన ఈ యువ ఆటగాడిని అభిమానులు "జూనియర్ ఏబీగా" పిలుచుకుంటున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో కూడా బ్రెవిస్ అదరగొట్టాడు. ఐపీఎల్లో మెగా వేలంలో అతడిని రూ. 3కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: IPL 2022: బుమ్రాకు అక్షింతలు.. నితీష్ రాణాకు జరిమానా! pic.twitter.com/qGIdoAGcka — Jemi_forlife (@jemi_forlife) April 6, 2022 -
అనుభవలేమి 'జూనియర్ ఏబీ' కొంపముంచింది
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్-19 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తరపున టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన బ్రెవిస్‌ను జూనియర్ ఏబీగా అభివర్ణిస్తున్నారు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్ చేసింది 29 పరుగులే అయినప్పటికి అతని ఇన్నింగ్స్‌లో చూడచక్కని రెండు బౌండరీలు.. రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే అనుభవంలేమి జూనియర్ ఏబీ కొంపముంచింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలి బంతికే డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఆ తర్వాతి మూడు బంతులు పరుగులు రాలేదు. ఓవర్ ఐదో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చేశాడు. ఇది గమనించిన సామ్ బిల్లింగ్స్ వేగంగా వికెట్లను గిరాటేశాడు. అయితే రిప్లేలో బ్రెవిస్ కనీసం క్రీజులోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. Courtesy: IPL Twitter తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న టెన్షన్ అతనిలో స్పష్టంగా కనిపించింది. తాను క్రీజులోనే ఉన్నానని భ్రమించినట్టున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో బ్రెవిస్ చేసేదేం లేక నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. ఉన్నది కాసేపే అయినా మంచి ఇన్నింగ్స్ ఆడిన బ్రెవిస్‌ను పాట్ కమిన్స్ సహా ఇతర ఆటగాళ్లు అభినందించడం విశేషం. డెవాల్డ్ బ్రెవిస్ ఔట్ కోసం క్లిక్ చేయండి -
సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి పోరుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. బ్రబౌర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అతడి స్దానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. డెవాల్డ్ బ్రెవిస్ జూనియర్ ఏబీడిగా పేరుపొందిన దక్షిణాఫ్రికా అండర్-19 ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. బ్రెవిస్ అచ్చం డివిలియర్స్ లాగే అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచకప్‌లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా రాణించాడు. బ్రెవిస్ మూడవ స్థానంలో యాదవ్‌కు సరైన రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అన్మోల్ప్రీత్ సింగ్ ఈ 23 ఏళ్ల ఆల్ రౌండర్ గతంలో ముంబై ఇండియన్స్ తరుపున 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో మళ్లీ ముంబై కొనుగోలు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ ఇండియా-ఎ,ఇండియా బ్లూ, ఇండియా సి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్మోల్ప్రీత్ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. ఈ క్రమంలో యాదవ్ స్థానంలో అన్మోల్ప్రీత్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫాబియన్ అలెన్ ఈ ఏడాది మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్లో ప్రాతినిద్యం వహించాడు. అలెన్ గతేడాది కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అదే విధంగా అతడు స్పిన్ బౌలింగ్‌తో పాటు, బెస్ట్ ఫినెషర్గా కూడా మ్యాచ్‌ను ముగించగలడు. ఈ క్రమంలో యాదవ్‌కు ప్రత్యామ్నాయంగా అలెన్‌ను ముంబై తీసుకునే అవకాశం ఉంది. -
విధ్వంసం సృష్టించిన జూనియర్ ఏబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలవ్వనుందా?
ఐపీఎల్ 2022లో మార్చి 27న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై గత సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి మాత్రం మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకోవడంతో పాటు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యంగ్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ముఖ్యంగా జూనియర్ ఏబీగా పిలుస్తోన్న డెవాల్డ్ బ్రెవిస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా బ్రెవిస్ ఆ అంచనాలు అందుకునేలా కనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అసలు బంతి ఎటువైపు వస్తుందో కూడా చూడని బ్రెవిస భారీ షాట్లు ఆడాడు. అతని షాట్లు కూడా కళ్లు తిప్పికోకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి.. చూడకుండా ఉండలేకపోతున్నాం అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా వేలంలో బ్రెవిస్ రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. Can't stop looking at DB's 👀 𝑵𝒐 𝑳𝒐𝒐𝒌 👀 shots! 🔥#OneFamily #DilKholKe #MumbaiIndians #DewaldBrevis MI TV pic.twitter.com/QQzPUxDdB2 — Mumbai Indians (@mipaltan) March 26, 2022 -
జూనియర్ ఏబీ క్రికెట్ రూంలో ఆశ్చర్యకర విషయాలు
డెవాల్డ్ బ్రెవిస్.. దక్షిణాఫ్రికాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఒక సంచలనం. ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో బ్రెవిస్ 506 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. జూనియర్ ఏబీగా మన్ననలు పొందిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ బ్రెవిస్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తరపున బ్రెవిస్ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకుంటాడేమో చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ముంబై ఇండియన్స్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇంటర్య్వూ చేసింది. ఆ ఇంటర్య్వూలో తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో జూనియర్ ఏబీ తన క్రికెట్ రూంను చూపించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తొలుత తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫోటోను చూపించాడు. మాస్టర్ బ్లాస్టర్ ఫేమస్ షాట్ అప్పర్‌కట్‌తో ఇచ్చిన ఫోజును పెద్ద ఫోటోగా బ్రెవిస్ తన రూంలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరో మాజీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫోటోను చూపించాడు. యాదృశ్చికంగా సచిన్, హర్భజన్లు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బ్రెవిస్ కూడా ముంబై తరపున ఆడనున్నాడు. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ 15వ సీజన్ జరగనుంది. తొలుత 25శాతం ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు Mohammed Siraj: సిరాజ్‌కు ప్రమోషన్.. ఇకపై ఎంత జీతం అంటే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
IPL 2022 Auction: ఆర్సీబీకి ఆడాలని ఉందన్న బేబీ ఏబీడీ.. 3 కోట్లు.. కానీ పాపం..!
IPL 2022 Mega Auction- Dewald Brewis: దక్షిణాఫ్రికా యువ కెరటం డెవాల్డ్ బ్రెవిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి రోజు మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ‘బేబీ ఏబీడీ’ని సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మెగా ఈవెంట్లో మొత్తంగా 58.88 సగటుతో 530 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా... అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు అధిగమించాడు. ఇక ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌లో 45 బౌండరీలు, 18 సిక్సర్లు బాదిన యువ సంచలనం బ్రెవిస్‌ను అభిమానులు ముద్దుగా ఏబీ డివిలియర్స్ 2.0, బేబీ ఏబీడీ అని పిలుచుకుంటున్నారు. కాగా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయడానికి కూడా బ్రెవిస్ సిద్ధంగా ఉంటాడు. మిడిల్ ఓవర్లలో ఈ రిస్ట్ స్పిన్నర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. కాగా ఐపీఎల్ ఆడాలని ఉందని, ఒకవేళ అవకాశం వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడతానని బ్రెవిస్ ఇటీవల తన మనసులోని మాట బయటపెట్టాడు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ తనకు ఇష్టమైన ప్లేయర్లు అని పేర్కొన్నాడు. మరోవైపు.. రిటెన్షన్‌లో భాగంగా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై వదిలేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బేబీ ఏబీడీ.. అతడి స్థానాన్ని భర్తీ చేయగలడని విశ్లేషకులు అంటున్నారు. ఇక కృనాల్‌ను లక్నో ఫ్రాంఛైజీ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. తొలిరోజు వేలంలో ముంబై ఇషాన్ కిషన్ : రూ. 15 కోట్ల 25 లక్షలు, డెవాల్డ్ బ్రెవిస్: రూ. 3 కోట్లు, మురుగన్ అశ్విన్: రూ. 1 కోటి 60 లక్షలు, బాసిల్ థంపి: రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Auction Day 1: ఆ ఇద్దరి కోసం భారీగా ఖర్చు చేసిన ఆర్సీబీ...! తొలిరోజు కొన్న ప్లేయర్లు వీరే -
చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే..!
అండర్ 19 ప్రపంచకప్‌లో ప్రకంపనలు సృష్టించి, బేబీ ఏబీ డివిలియర్స్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఓ అరుదైన ఘనత సాధించాడు. సీనియర్ స్థాయిలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి 2022) అవార్డుకు నామినేట్ అయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నాన్ సీనియర్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. బ్రెవిస్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి) రేసులో దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్, బంగ్లా బౌలర్ ఎబాదత్ హొసేన్ ఉన్నారు. కాగా, ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 84.33 సగటున 506 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అండర్ 19 స్థాయి క్రికెట్లో పలు రికార్డులను నెలకొల్పాడు. సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్(505 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ఒక్క పరుగుల తేడాతో బద్ధలు కొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సైతం ఎగరేసుకుపోయాడు. ఇదిలా ఉంటే, జూనియర్ స్థాయిలో పరుగుల వరద పారిస్తున్న బేబీ ఏబీడీపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ కన్నేశాయి. త్వరలో జరగనున్న మెగా వేలంలో అతనికి భారీ ధర దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు -
సంచలన ఇన్నింగ్స్.. ధావన్ రికార్డు బద్దలు.. బేబీ ఏబీడీ సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 3న జరిగిన ప్లే ఆఫ్(ఏడో స్థానం) మ్యాచ్‌లో 130 బంతుల్లో 138 పరుగులు స్కోరు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో మెగా టోర్నీలో ఇప్పటి వరకు మొత్తంగా 506 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2004లో భారత అండర్ 19 జట్టులో భాగమైన ధావన్ ఆ ఈవెంట్లో మొత్తంగా 505 పరుగులు చేయగా.. బ్రెవిస్ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు. ఇక అండర్ 19 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెవిస్ ఒక్క పరుగు తేడాతో అగ్రస్థానానికి చేరుకోగా.. ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలను బ్రెట్ విలియమ్స్(ఆస్ట్రేలియా- 471 పరుగులు), కామెరూన్ వైట్(ఆస్ట్రేలియా- 423 పరుగులు), డెనోవాన్ పాగన్(వెస్టిండీస్- 421 పరుగులు) ఆక్రమించారు. కాగా ఈ టోర్నీలో బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 84.33 సగటుతో 506 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక బ్రెవిస్ ఆటతీరుకు ఫిదా అవుతున్న అభిమానులు అతడిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తున్నారు. బేబీ ఏబీడీ, ఏబీడీ 2.0 అంటూ ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. కాగా ఈ ప్రొటిస్ యువ సంచలనం ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ప్రొటిస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కోర్లు: బంగ్లాదేశ్ అండర్- 19: 293/8 (50) దక్షిణాఫ్రికా అండర్- 19: 298/8 (48.5) చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! South Africa’s Dewald Brevis now holds the record for the most runs in a single edition of the #U19CWC 🙌 pic.twitter.com/O5UCelEIdn — ICC (@ICC) February 3, 2022