దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్ఠించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్.. మంగళవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. పార్ల్ రాయల్స్‌పై కేప్‌టౌన్ విజయంలో సాధించడంలో డెవాల్డ్ కీలక పాత్ర పోషించాడు. ఇక శుక్రవారం(జనవరి 13)న డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించేందుకు బ్రెవిస్ సిద్దమవతున్నాడు. కాగా ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం విధితమే.
ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా బ్రెవిస్
ఇక ఐపీఎల్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు తన అద్భుత ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ 19 ఏళ్ల యువ ఆటగాడిని అభిమానులు "జూనియర్ ఏబీగా" పిలుచుకుంటున్నారు. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ ఓపెనర్‌గా అదరగొడుతున్న "జూనియర్ ఏబీడి" కి ఐపీఎల్‌లో ప్రమోషన్ దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో తమ జట్టు ఓపెనర్‌గా బ్రెవిస్‌ను పంపాలని ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది ఐపీఎల్‌లో ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రారంభించారు. అయితే ఐపీఎల్-2023లో మాత్రం రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ఐపీఎల్ 2023లో ముంబై జట్టు:
కామెరాన్ గ్రీన్, జే రిచర్డ్‌సన్, పీయూష్ చావ్లా, దువాన్ జాగర్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, రాఘవ్ గోయల్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మాధ్వల్
చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
Comments
Please login to add a commentAdd a comment