
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ స్టార్, ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్రెవిస్ తన అద్బుత విన్యాసంతో సన్‌రైజర్స్ బ్యాటర్ టామ్ అబెల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన కార్బిన్ బాష్ ఆఖరి బంతిని షార్ట్ పిచ్ డెలివరీగా అబెల్‌కు సంధించాడు. ఆ బంతికి అబెల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ బౌండరీ లైన్‌వద్ద ఉన్న బ్రెవిస్ అద్భుతం చేశాడు.
గాల్లోకి దూకి తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి మరి సింగిల్ హ్యాండ్‌తో బ్రెవిస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లంతా బిత్తర పోయారు. కాగా జూనియర్ ఏబీడీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ అభివర్ణిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో అంతకుముందు జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్‌ను కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు.
ప్లే ఆఫ్స్‌కు ఎంఐ..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 10 వికెట్ల తేడాతో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) చిత్తు చేసింది. దీంతో తొలిసారి ఎస్ఎ20 ప్లేఆప్స్‌కు ఎంఐ ఆర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్‌హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు.
కెప్టెన్ మార్‌క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే చేధించింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.
Brevis just defied gravity with that catch! 🤯#BetwaySA20 #MICTvSEC #WelcomeToIncredible pic.twitter.com/NNE8lUVtWM
— Betway SA20 (@SA20_League) January 29, 2025
చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్‌లో ఉన్నది ఆమెతోనే?