South Africa T20 League
-
SA20 2025: తొలిసారి విజేతగా ఎంఐ కేప్‌టౌన్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్‌గా నిలవాలన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్‌టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్‌మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్‌టౌన్- సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఎస్టెర్హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.సన్రైజర్స్బ్యాటింగ్ ఆర్డర్ కుదేలుఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్‌టౌన్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో ఎంఐ కేప్‌టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగాఅవార్డుల వివరాలు👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్‌టౌన్) 👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్‌టౌన్ 👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్‌టౌన్) 👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్‌టౌన్) 👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్) 👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) 👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) ఎస్ఏ20 2025 విశేషాలు 👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397 👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు 👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25 👉అత్యధిక సిక్స్‌లు- బ్రేవిస్ 25 👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47 ప్రైజ్‌మనీ వివరాలు👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్లు (రూ. 15 కోట్ల 46 లక్షలు) 👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్లు (రూ. 7 కోట్ల 70 లక్షలు). చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK— Betway SA20 (@SA20_League) February 8, 2025 -
ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 విజేతగా ఎంఐ కేప్‌టౌన్ నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 76 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఎంఐ కేప్‌టౌన్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( 15 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 33), రాస్సీ వాన్డర్డుస్సెన్(23) అద్బుతమైన ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఎస్టర్‌హుజెన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 39), డెవాల్డ్ బ్రెవిస్(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్, డాసన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, మార్క్రమ్ చెరో వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన రబాడ..అనంతరం 182 పరుగుల భారీ లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్ల దాటికి ఈస్ట్రన్ కేప్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో టామ్ అబెల్(30),టోనీ డిజోర్జే(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఎంఐ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో నిప్పులు చెరగగా.. బౌల్ట్, లిండే తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రషీద్ ఖాన్, కార్బన్ బోష్ తలా వికెట్ సాధించారు. దీంతో వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌గా నిలవాలనుకున్న సన్‌రైజర్స్ ఆశలపై ఎంఐ కేప్‌టౌన్ నీళ్లు చల్లింది.ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జాన్సెన్..ఇక ఈ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. 13 మ్యాచ్‌ల్లో 18.42 సగటుతో జాన్సెన్ 19 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ జాన్సెన్ 204 పరుగులు చేశాడు.చదవండి: PAK vs NZ: ఫిలిప్స్ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్ -
‘హ్యాట్రిక్’ టైటిల్‌పై సన్‌రైజర్స్ గురి
సెంచూరియన్: భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టి20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేసింది. ‘ఎస్ఏ20’ పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్(Sunrisers Eastern Cape team) వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే టైటిల్స్‌ను గెలుచుకుంది. రెండో క్వాలిఫయర్‌లో మొదట రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రిటోరియస్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు క్రెయిగ్ ఓవర్టన్, జాన్సెన్, ఒటెనీల్, మార్క్రమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. టోని డి జొర్జి (49 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మాన్ (48 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జొబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించిన 24 గంటలకే మరో ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నెగ్గి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కు చెందిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని కేప్‌టౌన్ జట్టు 39 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌పై గెలిచింది. -
రాయల్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా మూడో సారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పార్ల్ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెర్మాన్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్(59) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.టోనీ ఊచకోత..అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఈస్ట్రన్ కేప్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్స్ బౌలర్లను టోనీ ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఎంఐ కేప్‌టౌన్‌తో ఢీ..ఇక శనివారం(ఫిబ్రవరి 8)న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో సన్‌రైజర్స్, ఎంఐ కేప్‌టౌన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కేప్‌టౌన్‌కు ఇదే తొలి ఫైనల్ కాగా.. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది ముచ్చటగా మూడో ఫైనల్. తొలి రెండు సీజన్లలోనూ మార్క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కాగా ఈస్ట్రన్ కేప్ జట్టు ఐపీఎల్ ప్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే సంబంధించినదే కావడం గమనార్హం. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
వారెవ్వా ఫాఫ్.. 40 ఏళ్ల వయస్సులో అద్భుత విన్యాసం! వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్-2025లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. సెంచూరియన్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టింది. 185 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులకే పరిమితమైంది. జోబర్గ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(37), డెవాన్ కాన్వే(30) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో డాసెన్, ఓవర్టన్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ మార్క్రమ్(40 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెడింగ్హామ్(27), స్టబ్స్(26), జాన్సెన్(23) రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో తహిర్, విల్జోయెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన తహిర్.. తొలి బతిని డేవిడ్ బెడింగ్హామ్కు ఫ్లైట్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో బెడింగ్హామ్ ఆ బంతిని మిడ్-ఆఫ్ దశగా లాఫ్టెడ్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి మిడ్-ఆఫ్‌లో ఉన్న 40 ఏళ్ల డుప్లెసిస్ అద్బుత విన్యాసం కనబరిచాడు. ఫాప్ తన ఎడమవైపునకు గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నారు. ఈ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఢీ..ఇక గురువారం జరగనున్న క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరోవైపు పార్ల్ రాయల్స్ సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు' Absolutely FAF-tastic 🤯 Faf du Plessis continues to defy the laws of physics #BetwaySA20 #SECvJSK #WelcomeToIncredible pic.twitter.com/WAnGnTex5P— Betway SA20 (@SA20_League) February 5, 2025 -
సన్‌రైజర్స్ ఘన విజయం.. సూపర్ కింగ్స్ ఎలిమినేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్‌గా నిలిచింది.గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్‌కు గురిపెట్టిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.హ్యాట్రిక్ పరాజయాలుజనవరి 9న లీగ్ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.ఆపై విజయాల బాట పట్టిఅయితే, నాలుగో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్‌రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్‌లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో తలపడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ఓపెనర్లు బెడింగ్హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్‌రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సూపర్ కింగ్స్ ఎలిమినేట్ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ధనాధన్ దంచికొట్టాడు.కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్‌తో ఢీసన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పర్ల్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో టైటిల్ కోసం తలపడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్‌టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్‌టౌన్ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఛేదనలో రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంటుంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్(Dinesh KarthiK అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్తీక్.. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.ముఖ్యంగా జోబర్గ్ పార్ట్‌టైమ్ బౌలర్ విహాన్ లుబ్బేకు కార్తీక్ చుక్కలు చూపించాడు. పార్ల్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన లుబ్బే బౌలింగ్‌లో కార్తీక్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అతడి విరోచిత ఇన్నింగ్స్ ఫలితంగా పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.రాయల్స్ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు రూబిన్ హెర్మాన్(28) రాణించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డెవాన్ ఫెరీరా, సిపామల తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు విల్జోయెన్, తహీర్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని జోబర్గ్ సూపర్ కింగ్స్.. 17.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడీ, ముజీబ్, కీత్ డడ్జియన్ తలా వికెట్ సాధించింది. ఇక ఈ విజయంతో సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు బెర్త్‌కు మరింత చేరువైంది.జోరు తగ్గని డీకే..కాగా గతేడాది ఐపీఎల్ సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కార్తీక్ విడ్కోలు పలికాడు. బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కార్తీక్ సౌతాఫ్రికా టీ20లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. జోరూట్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్లు సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో కార్తీక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కాస్త ముందుగానే లభించింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని డికే సద్వినియోగపరుచుకున్నాడు. తొలి ఎస్ఎ 20 హాఫ్ సెంచరీని కార్తీక్ నమోదు చేశాడు.39 ఏళ్ల కార్తీక్ 362 టీ20 ఇన్నింగ్స్‌లలో 27.09 సగటు, 136.83 స్ట్రైక్ రేట్‌తో 7504 పరుగులు చేశాడు. ఇందులో 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 261 సిక్సర్లు, 722 ఫోర్లు కొట్టాడు. అటు ధోనీ 342 టీ20 ఇన్నింగ్స్‌లలో 38.11 సగటుతో 7,432 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 517 ఫోర్లు, 338 సిక్సర్లు బాదాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్ రద్దు MAIDEN SA20 FIFTY FROM DINESH KARTHIK. 🙇♂️🌟pic.twitter.com/1c7uReQZ8l— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025 -
వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ స్టార్, ఎంఐ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్రెవిస్ తన అద్బుత విన్యాసంతో సన్‌రైజర్స్ బ్యాటర్ టామ్ అబెల్ను పెవిలియన్‌కు పంపాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన కార్బిన్ బాష్ ఆఖరి బంతిని షార్ట్ పిచ్ డెలివరీగా అబెల్‌కు సంధించాడు. ఆ బంతికి అబెల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ బౌండరీ లైన్‌వద్ద ఉన్న బ్రెవిస్ అద్భుతం చేశాడు. గాల్లోకి దూకి తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి మరి సింగిల్ హ్యాండ్‌తో బ్రెవిస్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లంతా బిత్తర పోయారు. కాగా జూనియర్ ఏబీడీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ అభివర్ణిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో అంతకుముందు జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్‌ను కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు.ప్లే ఆఫ్స్‌కు ఎంఐ..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 10 వికెట్ల తేడాతో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) చిత్తు చేసింది. దీంతో తొలిసారి ఎస్ఎ20 ప్లేఆప్స్‌కు ఎంఐ ఆర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ మార్క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే చేధించింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.Brevis just defied gravity with that catch! 🤯#BetwaySA20 #MICTvSEC #WelcomeToIncredible pic.twitter.com/NNE8lUVtWM— Betway SA20 (@SA20_League) January 29, 2025చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
సన్‌రైజర్స్ చిత్తు.. ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) జట్టు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. న్యూలాండ్స్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape)తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎంఐ జట్టు తొలిసారి తమ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. స్టార్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జానెసన్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జానెసన్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.4 వికెట్లతో చెలరేగిన కార్బిన్ బాష్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ మార్క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. కాగా ఎంఐ కేప్ టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందనిదే కావడం గమనార్హం.సన్‌రైజర్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతుందా?ఎస్ఎ20-2025లో పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మరో రెండు స్ధానాల కోసం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ప్రిటోరియా క్యాపిటల్స్ కంటే సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్ల్ రాయల్స్‌తో తలపడనుంది.అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. ఎందుకంటే ఈస్ట్రన్ క్యాప్ ఖాతాలో 19 పాయింట్లు ఉన్నాయి. జోబర్గ్ సూపర్ కింగ్స్(15), ప్రిటోరియా(14) పాయింట్లతో మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నాయి. జోబర్గ్, ప్రిటోరియా జట్లకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జోబర్గ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తుంది. ఒకవేళ ప్రిటోరియా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే జో బర్గ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గేమ్లోనైనా ఓటమి చెందాలి. ఈ సమయంలో ప్రిటోరియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌కు ‘బోనస్’ షాక్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ భారీ షాకిచ్చింది.సన్‌రైజర్స్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్’ పాయింట్(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులోనూ రైజర్స్‌తో పోటీకి సై అంటోంది. కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌తో తలపడ్డ.. డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.వరుసగా నాలుగు విజయాలుఅనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన మార్క్రమ్ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్స, జొబర్గ్ సూపర్ కింగ్స్‌పై గెలుపొందింది.ఈసారి మాత్రం ఘోర పరాజయంఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో జొబర్గ్ జట్టుతోనే తలపడిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్‌బర్గ్ వేదికగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, జొబర్గ్ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బెడింగ్హాం(40 బంతుల్లో 48), వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) మాత్రమే రాణించారు.మిగతా వాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే, అబెల్, జోర్డాన్ హెర్మాన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, బేయర్స్ స్వానెపోయెల్ డకౌట్ కాగా.. లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్‌మన్, రిచర్డ్ గ్లెసాన్(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్ బౌలర్లలో విల్జోన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.What a start for the Joburg Super Kings 🏎️#BetwaySA20 #JSKvSEC #WelcomeToIncredible pic.twitter.com/jQhU4dIW85— Betway SA20 (@SA20_League) January 26, 2025 డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్‌ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ ఆదిలోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధనాధన్ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ , 25 రన్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు.ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలుపొంది.. అదనపు పాయింట్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆరు జట్లు లీగ్ దశలో పదేసి మ్యాచ్‌లు ఆడతాయి. పాయింట్ల కేటాయింపు ఇలామ్యాచ్ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్‌రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్ పాయింట్ కూడా వస్తుంది.జొబర్గ్ సూపర్ కింగ్స్ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్ పాయింట్ సాధించి.. ఓవరాల్‌గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్ రాయల్స్ ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.మరోవైపు.. ఎంఐ కేప్‌టౌన్ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్‌రైజర్స్ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్ సూపర్ జెయింట్స్ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ -
చరిత్ర సృష్టించిన పార్ల్ రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ అయిన పార్ల్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 20 ఓవర్లను స్పిన్నర్లతో వేయించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించింది. ఫోర్టుయిన్, వెల్లలగే, ముజీబ్,ఎన్ పీటర్, రూట్ తలో నాలుగు ఓవర్లు వేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ జో రూట్ అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. రూట్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆఖర్లో కెప్టెన్ డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ 18 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. రాయల్స్ ఆటగాళ్లలో ప్రిటోరియస్ (0), రూబిన్ హెర్మన్ (9), వాన్ బుర్రెన్ (5), దునిత్ వెల్లలగే (15) నిరాశపరిచారు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఈథన్ బాష్, సెనూరన్ ముత్తుస్వామి, కైల్ సైమండ్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్ రాయల్స్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ విల్ జాక్స్ అర్ద సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. కైల్ వెర్రిన్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్, వెర్రిన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్ 6, మార్కస్ ఆకెర్మ్యాన్ 2, రిలీ రొస్సో 4, జేమ్స్ నీషమ్ 1, కీగన్ లయన్ 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్, ముజీబ్ రెహ్మాన్, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో భీకరఫామ్‌లో ఉన్న రూట్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. -
రాణించిన కిల్లర్ మిల్లర్.. రాయల్స్‌కు హ్యాట్రిక్ విక్టరీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) పార్ల్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ రెండో స్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్‌స్టో పుణ్యమే. బెయిర్‌స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ వాన్ బెర్రెన్ (44), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (40 నాటౌట్) రాణించి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డ్రి ప్రిటోరియస్ 27 పరుగులు చేయగా.. జో రూట్ 6, రూబిన్ హెర్మన్ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్‌కు జతగా దినేశ్ కార్తీక్ (2) అజేయంగా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్డస్ సిపామ్లా 2, ఇమ్రాన్ తాహిర్, ఫెరియెరా తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్‌లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్‌ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
జో రూట్ విధ్వంసం.. శివాలెత్తిపోయిన రికెల్టన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 18) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్, పార్ల్ రాయల్స్ తలపడగా.. రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ అమీతుమీ తేల్చుకున్నాయి.రూట్ విధ్వంసంప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్, దయ్యన్ గేలిమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఎహసాన్ మలింగ ఓ వికెట్ దక్కించుకున్నాడు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో పార్ల్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో క్యాపిటల్స్ నాలుగో స్థానంలో ఉంది.శివాలెత్తిపోయిన రికెల్టన్రెండో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో రీజా హెండ్రిక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో డుప్లెసిస్ టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్‌లో రికెల్టన్ కోవిడ్‌తో బాధపడుతూ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్, మతీశ పతిరణలకు తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఎంఐ కేప్‌టౌన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. -
ప్రిటోరియస్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (64 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో ఎంఐ కేప్‌టౌన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 30.. అజ్మతుల్లా 11 బంతుల్లో 13, జార్జ్ లిండే 10 బంతుల్లో 10, డెవాల్డ్ బ్రెవిస్ 4 బంతుల్లో 8, డెలానో పాట్గెటర్ 5 బంతుల్లో 2 (నాటౌట్) పరుగులు చేశారు.డస్సెన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్వేనా మఫాకాకు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో డస్సెన్ రెండు సిక్సర్లు, బౌండరీ సహా 20 పరుగులు పిండుకున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన జో రూట్ ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్ 16, 18, 20 ఓవర్లు వేసిన రూట్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెండు, రూట్, గేలిమ్ తలో వికెట్ పడగొట్టారు.ప్రిటోరియస్ విధ్వంసం159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ (52 బంతుల్లో 83; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకం బాది రాయల్స్ విజయానికి గట్టి పునాది వేశాడు. రూట్ 15, మిచెల్ వాన్ బూరెన్ 22, డేవిడ్ మిల్లర్ 24 (నాటౌట్), దినేశ్ కార్తీక్ (10), అండైల్ ఫెహ్లుక్వాయో 1 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో రాయల్స్ గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.అదరగొడుతున్న ప్రిటోరియస్ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్ రాయల్స్ యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 68.67 సగటున, 179.13 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరుస్తున్న ప్రిటోరియస్ సౌతాఫ్రికాకు ఆశాకిరణంలా మారాడు.SA20 2025లో ప్రిటోరియస్ స్కోర్లు..సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై 51 బంతుల్లో 97 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 12 బంతుల్లో 26ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 52 బంతుల్లో 83 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్) -
రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. -
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి. -
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో డర్బన్ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శుక్రవారం కింగ్స్‌మీడ్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో డర్బన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది.డర్బన్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్( 40 బంతుల్లో 60 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ బ్రైస్ పార్సన్స్ (28 బంతుల్లో 47), ఫినిషర్ వియాన్ మల్డర్ (19 బంతుల్లో 45 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.విధ్వంసకర ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. క్లాసెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ప్రిటోరియా బౌలర్లలో ముత్తుసామి 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ ఒక్క వికెట్ సాధించారు.గుర్బాజ్ పోరాటం వృథా..అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 12 ఓవర్లలోనే 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.గుర్బాజ్(43 బంతుల్లో 89 పరుగులు, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సెటిల్ అయిన విల్ జాక్స్(35 బంతుల్లో 64 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ డర్బన్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో ప్రిటోరియా విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. నవీన్ ఉల్హాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో క్యాపిటల్స్ లక్ష్య చేధనలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులకు పరిమితమైంది. డర్బన్ బౌలర్లలో నూర్ ఆహ్మద్, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మహారాజ్, నవీన్ ఉల్హాక్ చెరో వికెట్ సాధించారు.ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్..కాగా ఈ మ్యాచ్‌తోనే న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కేన్ మామ డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఈ కివీస్టార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన విలియమ్సన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ -
జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.ఎంఐ ఆల్‌రౌండర్ డెలానో పోట్గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పోట్గీటర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ రెండు, లిండే, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.బ్రెవిస్ విధ్వంసం..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేసిన కేప్‌టౌన్ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.Marco rocked, and Reeza was left shocked! 🤯☝️Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో కేప్‌టౌన్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.Dewald Brevis 🔛🔥Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025 కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్ డాసన్, హర్మర్ తలా వికెట్ సాధించారు.ఇదే తొలి విజయం..కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై ఎంఐకేప్టౌన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పోట్గీటర్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు -
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
జనవరి 9 నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా వేదికగా SA20-2025 లీగ్ (మూడో ఎడిషన్) మొదలవుతుంది. 30 రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాధరణ కలిగిన ఈ లీగ్ ఆరు వేదికల్లో (గెబెర్హా, డర్బన్, పార్ల్, జొహనెస్‌బర్గ్, సెంచూరియన్, కేప్‌టౌన్) జరుగనుంది. ఈ లీగ్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్) ఫిబ్రవరి 4న మొదలవుతాయి. ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ఈ లీగ్ ముగుస్తుంది. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్. ఈ జట్టు వరుసగా రెండు సీజన్లలో (2023, 2024) విజేతగా నిలిచింది.ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్) పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో గత ఎడిషన్లలోలాగే ఒక్కో జట్టు 10 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఈ లీగ్‌లో డే మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. నైట్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ లీగ్‌లోని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్‌తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది.జట్ల వివరాలు..డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసెన్, జోన్-జాన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే కింగ్ (రూకీ).జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వీస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).ఎంఐ కేప్ టౌన్: రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రీవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్ , డెలానో పోట్గీటర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌవ్, ఈథన్ బాష్, వేన్ పార్నెల్, సెనూరన్ ముత్తుసామి, కైల్ వెర్రెయిన్, డారిన్ డుపావిల్లోన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫార్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలియం, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరియాస్ (రూకీ).సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే (ఇంగ్లాండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హర్మన్, ప్యాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిల్ సిమెలన్, డేవిడ్ బెడింగ్హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ). -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా రషీద్ ఖాన్..
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్‌కు దూరమయ్యాడు.ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్‌కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్‌టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్లో కూడా ముంబై తలరాత మారలేదు.రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.కాగా ఎస్ఏ 20-2025 సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్‌టౌన్ జట్టులో స్టోక్స్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్‌టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్హ్యుజెన్చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025 ఎడిషన్‌కు సంబంధించిన వేలం నిన్న (అక్టోబర్ 1) ముగిసింది. ఈ సారి వేలంలో సౌతాఫ్రికా ఆటగాడు రీజా హెండ్రిక్స్‌కు భారీ ధర లభించింది. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ హెండ్రిక్స్‌ను 4.3 మిలియన్ల ర్యాండ్లకు సొంతం చేసుకుంది. వేలంలో భారీ మొత్తం అందకున్న వారిలో ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ (2.3 మిలియన్ల ర్యాండ్లు), విండీస్ బ్యాటర్ ఎవిన్ లెవిస్ (1.5 మిలియన్ల ర్యాండ్లు) ఉన్నారు. వేలంలో 13 స్లాట్ల కోసం 188 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. SA20 2025 ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.SA20 2025 వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ (ఎంఐ కేప్‌టౌన్)రీజా హెండ్రిక్స్ (ఎంఐ కేప్‌టౌన్)మార్కస్ అకెర్మన్ (ప్రిటోరియా క్యాపిటల్స్)రూబిన్ హెర్మెన్ (పార్ల్ రాయల్స్)విహాన్ లుబ్బే (జోబర్గ్ సూపర్ కింగ్స్)ఎవాన్ జోన్స్ (జోబర్గ్ సూపర్ కింగ్స్)ఒకుహ్లే సెలె (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్)రిచర్డ్ గ్లీసన్ (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్)డేన్ పియెడ్ట్ (ఎంఐ కేప్‌టౌన్)ఎవిన్ లెవిస్ (ప్రిటోరియా క్యాపిటల్స్)షమార్ జోసఫ్ (డర్బన్ సూపర్ జెయింట్స్)డౌగ్ బ్రేస్‌వెల్ (జోబర్గ్ సూపర్ కింగ్స్)కైల్ సిమండ్స్ (ప్రిటోరియా క్యాపిటల్స్)వేలం పూర్తయిన తర్వాత ఆరు ఫ్రాంచైజీల ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, మహీశ్ తీక్షణ, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కొయెట్జీ, డేవిడ్ వీస్, లూస్ డు ప్లూయ్, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, డొనొవన్ ఫెరియెరా, ఇమ్రాన్ తాహిర్, సిబొనేలో మఖాన్యా, తబ్రేజ్ షంషి, విహాన్ లుబ్బే, ఎవాన్ జోన్స్, డౌగ్ బ్రేస్‌వెల్, జేపీ కింగ్, మతీష పతిరణముంబై ఇండియన్స్ కేప్‌టౌన్: రషీద్ ఖాన్, బెన్ స్టోక్స్, కగిసో రబడా, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార, కానర్ ఎస్టర్‌హుజెన్, డెలానో పోట్గీటర్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్, కార్బిన్ బోష్, ఇన్‌గ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్డర్బన్ సూపర్ జెయింట్స్: బ్రాండన్ కింగ్, క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్, కేన్ విలియమ్సన్, క్రిస్ వోక్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, జోన్-జోన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పర్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కీ, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, షమర్ జోసెఫ్, సీజే కింగ్ప్రిటోరియా క్యాపిటల్స్: అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్, విల్ జాక్స్, రహ్మానుల్లా గుర్బాజ్, లియామ్ లివింగ్‌స్టోన్, విల్ స్మీడ్, మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసౌ, ఈతాన్ బాష్, వేన్ పార్నెల్, సెనురాన్ ముత్తుసామి, కైల్ వెర్రేన్నే, డారిన్ డుపవిలోన్, స్టీవ్ స్టాల్క్, టియాన్ వాన్ వురెన్, మార్కస్ అకెర్మన్, ఎవిన్ లెవిస్, కైల్ సిమండ్స్, లయన్-కాచెట్పార్ల్ రాయల్స్: డేవిడ్ మిల్లర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సామ్ హైన్, జో రూట్, దినేష్ కార్తీక్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్, డయాన్ గాలీమ్, జాకబ్ బెథెల్, రూబిన్ హెర్మాన్, దేవాన్ మరైస్సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్: ఐడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హెర్మాన్, పాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్, టామ్ అబెల్, సైమన్ హర్మర్, డేవిడ్ బెడింగ్హామ్, అండీల్ సైమ్‌లేన్, ఓకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్, డేనియల్ స్మిత్చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025 ఎడిషన్ (సీజన్-3) షెడ్యూల్ ఇవాళ (సెప్టెంబర్ 2) విడుదలైంది. ఈ లీగ్ జనవరి 9న ప్రారంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన సెయింట్ జార్జ్స్ పార్క్‌లో జరుగనుంది. లీగ్ ఫైనల్ మ్యాచ్ జొహనెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 8న జరుగనుంది.SA20 2025 FIXTURES...!!!!- Starts on January 9th & Final on February 8th. THE CRICKET CARNIVAL IN SOUTH AFRICA ⚡ pic.twitter.com/jZZKyeEAAJ— Johns. (@CricCrazyJohns) September 2, 2024ఈసారి లీగ్‌లో మొత్తం 30 లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మొదటి క్వాలిఫయర్ ఫిబ్రవరి 4న జరుగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి 5న.. క్వాలిఫయర్-2 ఫిబ్రవరి 6న జరుగనున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో కేన్ విలియమ్సన్, జో రూట్, బెన్ స్టోక్స్, దినేశ్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు కొత్తగా పాల్గొననున్నారు. ఈ లీగ్ యొక్క మ్యాచ్‌లు వయాకామ్18 స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఎస్ఏ20 లీగ్ యొక్క వివరాలు..డిఫెండింగ్ ఛాంపియన్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్కేప్అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు-సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (2)ఇప్పటి వరకు జరిగిన సీజన్లు-2అత్యధిక పరుగులు- హెన్రిచ్ క్లాసెన్ (810)అత్యధిక వికెట్లు- ఓట్నీల్ బార్ట్‌మన్ (30)లీగ్‌లో మొత్తం జట్లు-6జట్ల పేర్లు..సన్‌రైజర్స్ ఈస్ట్రన్కేప్ఎంఐ కేప్టౌన్డర్బన్ సూపర్ జెయింట్స్జోబర్గ్ సూపర్ కింగ్స్పార్ల్ రాయల్స్ప్రిటోరియా క్యాపిటల్స్ -
సూపర్ కింగ్స్‌లోకి టీ20 వీరుడు.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డెవాన్ కాన్వే సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ మరో జట్టులో భాగమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ జొబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మూడు టీ20 లీగ్లలోకాగా డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా జొబర్గ్ టీమ్‌లోనూ చోటు దక్కించుకున్న కాన్వే.. సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్ని టీ20 జట్లకు ఆడుతున్న క్రికెటర్‌గా నిలిచాడు.కివీస్‌తో తెగిన బంధంఇక ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కాన్వే వదులుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కివీస్ బోర్డు గురువారం ధ్రువీకరించింది. మరుసటి రోజే అతడు జొబర్గ్తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. డెవాన్ కాన్వేతో పాటు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ సైతం వచ్చే ఏడాది జొబర్గ్కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.పొట్టి ఫార్మాట్ వీరుడుకాగా లెఫ్టాండర్ బ్యాటర్ అయిన డెవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్ తాజా ఎడిషన్ టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 143.62 స్ట్రైక్‌రేటుతో 293 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ సౌతాఫ్రికన్- కివీ ఓపెనర్ 187 మ్యాచ్‌లు ఆడి 6028 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. బొటనవేలికి గాయం కారణంగా కాన్వే ఐపీఎల్-2024కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ 2023లో ఆరంభమైంది. అరంగేట్ర సీజన్లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్.. ఈ ఏడాది కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు.. జొబర్గ్ రెండు సీజన్లలో సెమీస్‌కు అర్హత సాధించినా.. ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్ కోసం ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టుకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ను కూడా ఎంపిక చేసుకుంది ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం. ఈ జట్టులో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, రస్సీ వాన్ వర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, నువాన్ తషార లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. 14 మంది సభ్యుల జట్టును ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. కాగా, బెన్ స్టోక్స్ తాజాగా హండ్రెడ్ లీగ్ ఆడుతూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో స్టోక్స్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.ఇదిలా ఉంటే, ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు రెండు ఎడిషన్లు జరిగాయి. రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఫ్రాంచైజీనే విజేతగా నిలిచింది. ఎస్ఏ20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలై ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్‌హ్యుజెన్ -
బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్‌కు బట్లర్ గుడ్‌బై
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20) నుంచి దూరం అవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లీగ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం.. 2023లో తమ సొంత లీగ్‌ను ఆరంభించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలు ఈ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాయి. వరుసగా.. ఎంఐ కేప్‌టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట ఆరు జట్లు కొనుగోలు చేశాయి.పర్ల్ రాయల్స్ తరఫునఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్.. సౌతాఫ్రికా లీగ్‌లోనూ అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. రెండేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్.. 2025 సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు.విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది‘‘వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్ మ్యాచ్‌లతో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. పర్ల్ రాయల్స్‌ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో’’ అంటూ జోస్ బట్లర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.రెండు సీజన్లలో విజేతగా సన్రైజర్స్ఈ వీడియోను షేర్ చేసిన పర్ల్ రాయల్స్.. ‘‘జోస్.. ది బాస్.. మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్ షాట్స్ మేము కచ్చితంగా మిస్ అవుతాం’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా అరంగేట్ర 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.ఇక 2023లో పది మ్యాచ్‌లకు గానూ నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పర్ల్ రాయల్స్.. 2024లో పదికి ఐదు గెలిచి మూడో స్థానంతో ముగించింది. రెండుసార్లు సెమీ ఫైనల్ చేరినా ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.Thank you for everything, Jos the Boss. We’ll miss the scoops, we’ll miss you! 💗 pic.twitter.com/OTYR4cfWw2— Paarl Royals (@paarlroyals) August 6, 2024 -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న దినేష్ కార్తీక్.. తొలి భారత క్రికెటర్‌గా
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్లో పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ ఆడనున్నాడు. వచ్చే ఏడాది సీజన్‌కు గాను విదేశీ ప్లేయర్ కోటాలో డీకేతో పార్ల్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది.తద్వారా ఎస్ఎ టీ20లో ఆడనునున్న తొలి భారత ఆటగాడిగా కార్తీక్ నిలిచాడు. కాగా ఐపీఎల్-2024 అనంతరం అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్లకు కార్తీక్ విడ్కోలు పలికాడు. కాగా భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే కచ్చితంగా అన్ని ఫార్మాట్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ క్రమంలోనే కార్తీక్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడే ఛాన్స్ లభించింది. ఇక ఇటీవలే ఎస్ఎ టీ20 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్తీక్ ఎంపికయ్యాడు. కాగా టీ20ల్లో కార్తీక్‌కు అపారమైన అనుభవం ఉంది. తన కెరీర్లో 401 టీ20లు ఆడిన డీకే.. 136.96 స్ట్రైక్-రేట్‌తో 7407 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఏకంగా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదే విధంగా భారత్ తరుపన దినేష్ 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కాగా డీకేతో పాటు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌ను కూడా పార్ల్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది.పార్ల్ రాయల్స్ జట్టుడేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్, మిచెల్ వాన్ బ్యూరెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్జియోన్, న్కాబా పీటర్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, దయాన్ గలీమ్చదవండి: 'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు' -
సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.ఎస్ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్. -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు. SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్మన్కు (30 వికెట్లు) దక్కుతుంది. కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
మరో క్రికెట్ లీగ్‌కు విస్తరించనున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన త్వరలో మరో పాపులర్ క్రికెట్ లీగ్‌కు విస్తరించనుందని తెలుస్తుంది. 2023 ఐపీఎల్ సీజన్లో తొలిసారి పరిచయం చేయబడిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2025 ఎడిషన్ నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ రూల్‌కు ఆమోదం లభిస్తే ఐపీఎల్ తరహా మెరుపులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ చూసే అవకాశం ఉంటుంది.వాస్తవానికి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గతేడాదే అమల్లోకి రావాల్సి ఉండింది. అయితే ఈ రూల్ గురించి చర్చ జరిగే సమయానికి అన్ని ఫ్రాంచైజీలు జట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లో ఉంటే జట్ల ఎంపిక వేరేలా ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రాంచైజీలు అప్పట్లో దీనికి నో చెప్పాయి. ఈ రూల్ వల్ల ఐపీఎల్ రక్తి కడుతుండటంతో తాజాగా సౌతాఫ్రికా లీగ్ దీన్ని పునఃపరిశీలనలోకి తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తుంది.ఇదిలా ఉంటే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అదనపు ఆటగాడిని ఆడించొచ్చనే మాట తప్పితే పెద్దగా ప్రయోజనాలేమీ లేకపోగా చాలా మైనస్‌లు ఉన్నాయి. ఈ రూల్ వల్ల సంప్రదాయ క్రికెట్ చచ్చిపోతుందని చాలా మంది దిగ్గజాలు ఆరోపిస్తున్నారు. రూల్ వల్ల ఆల్‌రౌండర్ల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారుతుందని అంటున్నారు. ఈ రూల్ అమల్లో ఉంటే బ్యాటర్ లేదా బౌలర్‌వైపే మొగ్గు చూపుతారు కాని ఆల్రౌండర్లను పట్టించుకోరని వాదిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్ కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆటను రక్తి కట్టించడం కోసం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఐపీఎల్లో అమలు చేస్తుంటే దీని ప్రభావం జాతీయ జట్టు ఆల్రౌండర్లపై పడుతుందని అన్నాడు. శివమ్ దూబే లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని వాపోయాడు. జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ప్రమాదమైన నిబంధన అని తెలిపాడు.కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో అంటే రెగ్యులర్ క్రికెట్‌కు భిన్నంగా 11 మందితో కాకుండా 12 మంది ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశం ఉంటుంది. అవసరాల దృష్ట్యా స్పెషలిస్ట్ బ్యాటర్లో లేదా స్పెషలిస్ట్ బౌలర్లో జట్లు బరిలోకి దించుతాయి. దీని వల్ల ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుంది. వీరికి పెద్దగా అవకాశాలు రావు. -
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్‌టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి. -
రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్ అవతరించింది. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈస్టర్న్ కేప్.. తుదిపోరులోనే తమకు తిరుగులేదని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. కావ్య పాప సెలబ్రేషన్స్.. ఇక ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంబరాలు అంబరాలను అంటాయి. డర్బన్ ఆఖరి వికెట్ రీస్ టోప్లీ ఔట్ అవ్వగానే కావ్య పాప ఎగిరి గంతేసింది. వెంటనే మైదానంలో వచ్చి తమ జట్టు ఆటగాళ్లను కావ్య అభినంధించింది. అంతకముందు సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కూడా బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య స్టాండ్స్‌లో నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఆ తర్వాత మైదానంలో కావ్య మాట్లాడుతూ.. రెండో సారి ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కావ్య సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్లో కూడా కావ్య స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటుంది. చదవండి: SA20 2024: సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా] Here comes the winning message from kavya herself,her voice is very sweet tbh ❤️ #Bundesliga #RealMadrid #OrangeArmy #SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION #ILT20 #SA20Finalpic.twitter.com/9RrJcj8lZB — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 Congratulations to Sunrisers Eastern Cape and boys for making Kavya maran win another title 🫣#SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION pic.twitter.com/e5fMnxnqrI — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 -
హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 30 బంత్లులో! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ప్రోటీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్.. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ కింగ్స్ బౌలర్లను హెన్రిచ్ ఊచకోత కోశాడు. తొలుత ఆచితూచి ఆడిన క్లాసెన్ 15 ఓవర్ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుక్కు క్లాసెన్ చుక్కలు చూపించాడు. 18 ఓవర్ వేసిన కుక్ బౌలింగ్‌లో క్లాసెన్ హ్రాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈమ్యాచ్‌లో కేవలం 30 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా క్లాసెన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన 208.87 స్ట్రైక్ రేట్‌తో క్లాసెన్ 447 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ కింగ్స్‌పై 69 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. దీంతో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో డర్బన్ అడుగుపెట్టింది. 𝐇𝐞𝐢𝐧𝐫𝐢𝐜𝐡 𝐊𝐥𝐚𝐚𝐬𝐞𝐧 - Remember the name 😌#DSGvJSK #WelcomeToIncredible #SA20onJioCinema #SA20onSports18 #JioCinemaSports pic.twitter.com/SJzzo54dzK — JioCinema (@JioCinema) February 8, 2024 -
సూపర్ కింగ్స్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన డర్బన్ సూపర్ జెయింట్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఫైనల్లో అడగుపెట్టింది. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జెయింట్స్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. డర్బన్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో వియాన్ ముల్డర్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నంద్రే బర్గర్, బ్రెస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, గాలైం తలా వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మొయిన్ అలీ(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డర్బన్ బౌలర్లలో జూనియర్ డాలా 4 వికెట్లతో సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, ప్రిటోరియస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఫిబ్రవరి 10న కేప్‌టౌన్ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తాడొపేడో తెల్చుకోనున్నాయి. -
పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో దాదాపు రెండు సెకండ్లపాటు గాల్లోనే ఉన్న మార్కరమ్ విజయవంతంగా క్యాచ్ పట్టి.. కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్- డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడింది. కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ను ఆదిలోనే కష్టాలపాలైంది. అతడికి తోడుగా వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) రాణించినా మిగతా వాళ్ల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు. ఒంటిచేత్తో సంచలన క్యాచ్ ఈ క్రమంలో రైజర్స్ పేసర్ల ధాటికి తలవంచిన డర్బన్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ 2024-ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మార్కరమ్ పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ ఐదో బంతికి రైజర్స్ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో.. నాలుగో నంబర్ బ్యాటర్ జేజే స్మట్స్ మిడాన్ దిశగా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగానే మెరుపువేగంతో కదిలిన మార్కరమ్ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. 4 బంతులు ఎదుర్కొన్న స్మట్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చదవండి: దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ 𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్‌తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్‌మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్‌కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్‌లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్‌టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 31 బంతుల్లో
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో లైడ్ డాసన్, మార్కో జనెసన్, స్వాన్‌పోయెల్ తలా రెండు వికెట్లు సాధించారు. పార్ల్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానెసన్ విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు టామ్ ఎబెల్ 46 పరుగులతో రాణించాడు. కాగా సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. చదవండి: IND vs ENG: డబుల్ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్ -
ఇదేమి షాట్‌రా బాబు.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్ టౌన్ ఆటగాడు, ప్రోటీస్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా బ్రెవిస్ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ ఓ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. కేప్ టౌన్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన డుపావిలోన్ బౌలింగ్‌లో తొలి బంతిని చూడకుండానే బ్రెవిస్ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. జూనియర్ ఏబీడీ కొట్టిన ఆ షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రిటోరియాపై 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్ టౌన్ విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను కేప్‌టౌన్ సజీవంగా ఉంచుకుంది. A NO-LOOK SIX BY DEWALD BREVIS ....!!!! 🔥pic.twitter.com/rURTI6gYNx — Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024 -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో గురువారం ఏంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 32 సిక్స్‌లు బాదారు. ఆఖరికి ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌టౌన్ విజయం సాధించింది. రికెల్టన్ విధ్వంసం.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ కూడా ఆఖరిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా కెప్టెన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. వెర్రెయిన్నే సెంచరీ వృథా.. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విరోచిత సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడికి మరో ఆటగాడు సపోర్ట్‌గా నిలిచివుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఏంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పొలార్డ్, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కూడా!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో పాటు పార్ల్ రాయల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్‌తో కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో స్ధానం కోసం సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, ఏంఐ కేప్‌టౌన్ పోటీపడతున్నాయి. నిప్పులు చేరిగిన సన్‌రైజర్స్ పేసర్లు.. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్‌పోయెల్, జానెసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మాడ్సెన్ (32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ముగించారు. -
జట్టు నిండా విధ్వంసకర వీరులే... కట్ చేస్తే 78 పరుగులకే ఆలౌట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. జోబర్గ్ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. జో బర్గ్ కెప్టెన్ డుప్లెసిస్, రెజా హెండ్రిక్స్, మొయిన్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా 3 వికెట్లతో జోబర్గ్ పతనాన్ని శాసించగా.. స్వాన్‌పోయెల్, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ..11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ఫినిష్ చేశారు. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్ -
SA20, 2024: డుప్లెసిస్ ఊచకోత.. 34 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్‌టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥 JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs — Johns. (@CricCrazyJohns) January 29, 2024 వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్‌స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯 - Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x — Johns. (@CricCrazyJohns) January 30, 2024 అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్‌కు ఇది ఊరట కలిగించే విజయం. -
జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరగడంతో ప్రిటోరియా 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్లు విల్ జాక్స్(12), సాల్ట్(10) మినహా మిగితా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. వారెల్ మూడు, మార్కో జానెసన్ రెండు వికెట్లు సాధించారు. అయితే జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రిటోరియా 52 పరుగులకే ఆలౌట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. క్యాపిటల్స్ జట్టులో ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, రూసో, నీషమ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా 52 పరుగులకే ఆలౌటైన ప్రిటోరియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ప్రిటోరియా నిలిచింది. 6.5 ఓవర్లలోనే.. 53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 6. 5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ప్రిటోరియా చవిచూసింది. చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు! -
రాకాసి సిక్సర్.. కొడితే ఏకంగా..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రాకాసి సిక్సర్ బాదాడు. లియామ్ డాసన్ బౌలింగ్‌లో క్లాసెన్ బాదిన ఈ సిక్సర్ ఏకంగా 105 మీటర్ల దూరం వెళ్లి, లీగ్ చరిత్రలోనే భారీ సిక్సర్‌గా రికార్డైంది. కళ్లు చెదిరే ఈ షాట్ చూసి అభిమానులు ముగ్దులవుతున్నారు. ఆధునిక క్రికెట్లో అతి భారీ సిక్సర్ అంటూ కొనియాడుతున్నారు. భారీ కాయుడైన క్లాసెన్ బలంగా బాదడంతో బంతి ఏకంగా స్టేడియం రూఫ్ ఎక్కింది. క్రికెట్ చరిత్రలో లాంగెస్ట్ సిక్సర్‌కు సంబంధించిన పూర్తి డేటా లేకపోవడంతో ఈ సిక్సర్‌కు ఎలాంటి అధికారిక గుర్తింపు దక్కలేదు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వరకైతే ఇదే అతి భారీ సిక్సర్ అని లీగ్ నిర్వహకులు ప్రకటించారు. మొత్తానికి ఈ రాకాసి సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరవలవుతుంది. Just the longest six of the #Betway #SA20 so far… no big deal. 🫨🙌#WelcomeToIncredible #DSGvSEC pic.twitter.com/7F4xjI9Rxi — Betway SA20 (@SA20_League) January 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో వియాన్ ముల్దర్ (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయాడు. బ్రీట్జ్కీ (35), క్లాసెన్ (31), ప్రిటోరియస్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ వారెల్, బార్ట్‌మన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (66 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జన్సెన్ (24 నాటౌట్), మార్క్రమ్ (38), హెర్మన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్టోయినిస్ 2, రీస్ టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సన్‌రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. -
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడి విధ్వంసం.. 18 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ డొనొవన్ ఫెరియెరా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఫెరియెరా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న ఫెరియెరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. వెర్రిన్ (52 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఫెరియెరా మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆఖర్లో కెప్టెన్ వేన్ పార్నెల్ 22, ఆదిల్ రషీద్ 15, విల్జోన్ 10 పరుగులు చేయడంతో క్యాపిటల్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మెరుపు వీరులు ఫిల్ సాల్ట్ (12), విల్ జాక్స్ (1), రిలీ రొస్సో (0), ఇంగ్రామ్ (0), జిమ్మీ నీషమ్ (6) తక్కువ స్కోర్లకే ఔటై నిరుత్సాహపరిచారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, లిజాడ్ విలియమ్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టగా.. నండ్రే బర్గర్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ కింగ్స్.. ఫెరియెరా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 18 ఓవర్లలోనే విజయతీరాలకు (4 వికెట్ల నష్టానికి) చేరింది. సూపర్ కింగ్స్‌లో ఫెరియెరాతో పాటు మఖన్యా (40), డు ప్లూయ్ (33), మొయిన్ అలీ (25 నాటౌట్) రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఆదిల్ రషీద్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల్లో సూపర్ కింగ్స్‌కు ఇది తొలి విజయం. -
94 నాటౌట్.. ఎంఐ కేప్‌టౌన్ ఘన విజయం! పొలార్డ్ ప్రశంసలు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో కేప్‌టౌన్‌కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు. రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక.. వన్‌డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్‌టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అనంతరం ఎంఐ కేప్‌టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్ను ప్రశంసించాడు. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్.. కొనసాగుతున్న రాయల్స్ జైత్రయాత్ర
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. లుంగి ఎంగిడి (3/17), ఓబెద్ మెక్కాయ్ (2/31) ధాటికి 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డు ప్లూయ్ (71) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. రీజా హెండ్రిక్స్ (8), డుప్లెసిస్ (10), మొయిన్ అలీ (18), డొనొవన్ ఫెరియెరా (5), రొమారియో షెపర్డ్ (0) నిరాశపరిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్‌తో పాటు విహాన్ లుబ్బే (39) రాణించడంతో 14.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (5), డేవిడ్ మిల్లర్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో లిజాడ్ విలియమ్స్, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్‌పై విజయంతో రాయల్స్ ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
సన్‌రైజర్స్ ఓపెనర్ మెరుపు శతకం.. పోరాడి ఓడిన ముంబై
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటకీ.. ముంబై ఆటగాళ్లు గట్టిగా పోరాడటంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. సన్‌రైజర్స్ బౌలర్ ఒట్నీల్ (4-0-35-3) బార్ట్‌మన్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ముంబై గెలుపును అడ్డుకున్నాడు. ముంబై చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒట్నీల్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్ జోర్డన్ హెర్మన్ (62 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ (37 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమతమై స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వాన్ డర్ డస్సెన్ (41), ర్యాన్ రికెల్టన్ (58), సామ్ కర్రన్ (37 నాటౌట్), కీరన్ పోలార్డ్ (24) ముంబైను గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. ఒట్నీల్ బార్ట్‌మన్ (3/35) ముంబైని దెబ్బకొట్టాడు. డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో సూపర్ జెయింట్స్ ఓపెనర్ బ్రీట్జ్కీ కొట్టిన షాట్‌ను రొమారియో షెపర్డ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ROMARIO SHEPHERD.... THAT'S AN ABSOLUTE SCREAMER...!!! 🤯 pic.twitter.com/riWEILas3w — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 షెపర్డ్ కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. ఇది చూసిన వారు తాము చూస్తున్నది నిజమేనా అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. బౌలర్ నండ్రే బర్గర్ అయితే ఈ క్యాచ్‌కు చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అలరించినప్పటికీ ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు సూపర్ జెయింట్స్ చేతిలో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప ఛేదనలో సూపర్ కింగ్స్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమై ఓటమిని కొనితెచ్చుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. లిజాడ్ విలియమ్స్ (4/26) సూపర్ జెయింట్స్ పతనాన్ని శాశించాడు. అనంతరం రీస్ టాప్లే (3/19), రిచర్డ్ గ్లీసన్ (2/22), కేశవ్ మహారాజ్ (2/17) చెలరేగడంతో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రీజా హెండ్రిక్స్ (38), మొయిన్ అలీ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 16) ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ తలపడనున్నాయి. -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. నిప్పులు చెరిగిన ఎంగిడి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ బురెన్ (40 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్‌లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. మిల్లర్, బురెన్, బట్లర్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (5), విహాన్ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో డుపవిల్లోన్, జేమ్స్ నీషమ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించాడు. విల్ జాక్స్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (0), డి బ్రూయిన్ (4), కొలిన్ ఇన్‌గ్రామ్ (1) నిరాశపరిచారు. -
చెలరేగిన పూరన్, స్మట్స్.. 48 బంతుల్లోనే శతక్కొట్టిన డస్సెన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఆటగాళ్లు వాన్ డర్ డస్సెన్, రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్బన్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్మట్స్ రెచ్చిపోయారు. డస్సెన్ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్ జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్ లిండే, ఓలీ స్టోన్ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్, రబాడ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డు ప్లూయ్ (48), రొమారియో షెపర్డ్ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చెలరేగిన పూరన్, స్మట్స్.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో) నికోలస్ పూరన్ (31 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో టామ్ ఏబెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (55), మార్క్రమ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్మట్స్, ప్రిటోరియస్, గ్లీసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. క్లాసెన్ ఊచకోత దెబ్బకు డర్బన్ సూపర్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొందింది. WHAT A KNOCK, HENRICH KLAASEN....!!!! An iconic innings in SA20 league, Durban was down & out in the chase then a one man show from Klaasen, smashed 85 runs from just 35 balls against MI Capetown - The beast. 🔥 pic.twitter.com/AklROoddtN — Johns. (@CricCrazyJohns) January 11, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (51 బంతుల్లో 87; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. కెప్టెన్ పోలార్డ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 25; 3 సిక్సర్లు), వాన్‌డర్ డస్సెన్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డర్బన్ బౌలర్లలో కీమో పాల్ 2, కెప్టెన్ కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, రిచర్డ్ గ్లీసన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన డర్బన్ను విజేతగా ప్రకటించారు. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 166 పరుగులు చేయాల్సి ఉండగా.. డర్బన్ 177 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌తో పాటు మాథ్యూ బ్రీట్జ్కీ (39) రాణించాడు. కేప్‌టౌన్ బౌలర్లలో రబాడ 2, హెండ్రిక్స్, సామ్ కర్రన్, ఓలీ స్టోన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో డర్బన్ SA20 2024 ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ సీజన్లో నిన్న జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ఉండింది. సన్‌రైజర్స్‌కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్‌లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్‌రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్‌లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
కెప్టెన్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ కేప్‌టౌన్‌కు (SA20 2024) కీరన్ పోలార్డ్, ఎంఐ ఎమిరేట్స్‌కు (ILT20 2024) నికోలస్ పూరన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని ముంబై యాజమాన్యం ఇవాళ వెల్లడించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుండగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఈ నెల 19 నుంచి మొదలవుతుంది. కాగా, కీరన్ పోలార్డ్ అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల తమ కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల తర్వాత మే నెలలో ఐపీఎల్ 2024 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చిన ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త జట్టుతో ఉత్సాహంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా పేస్ గన్ గెరాల్డ్ కోయెట్, లంక పేసర్ దిల్షాన్ మధుశంకను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు.. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ 16 కోట్లు జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్) టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్ 30) 14 మంది సభ్యుల టెస్ట్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నీల్ బ్రాండ్ నాయకత్వం వహించనుండగా.. సభ్యులంతా కొత్తవారు. ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 లీగ్ (SA20) జరుగనుండటంతో న్యూజిలాండ్ సిరీస్ కోసం అనామక జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉంటారు. న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో డేవిడ్ బెడింగ్హమ్, జుబేర్ హంజా, డ్యుయన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, ఖాయా జోండో మాత్రమే కాస్తోకూస్తో సుపరిచిత ఆటగాళ్లు. న్యూజిలాండ్ పర్యటనలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మౌంట్ మాంగనూయ్‌లో తొలి టెస్ట్.. అనంతరం ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు హ్యామిల్టన్‌లో రెండో టెస్ట్ జరుగనుంది. 🟢 SQUAD ANNOUNCEMENT 🟡 CSA has today announced a 14-player squad for the Proteas two-match Test tour of New Zealand next month🇿🇦🇳🇿#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/pLBxCrNvJF — Proteas Men (@ProteasMenCSA) December 30, 2023 ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు పూర్తి కాగా.. టెస్ట్ సిరీస్ నడుస్తుంది. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలుకాగా.. రెండో మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జరుగనుంది. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం.. తుది జట్లు ఇవే..!
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించిన వేలం జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న ముగిసింది. ఈ లీగ్ రెండో ఎడిషన్‌లో పాల్గొనబోయే ఆరు జట్లు తమతమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. పర్స్ వ్యాల్యూ మేరకు అన్ని ఫ్రాంచైజీలు పటిష్టమైన జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ దయ్యన్ గలీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ అతన్ని 1.60 మిలియన్లకు దక్కించుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను వైల్డ్‌కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకోగా.. పార్ల్ రాయల్స్ లోర్కన్ టక్కర్‌ను బేస్ ధరకు వైల్డ్ కార్డ్ పిక్‌గా ఎంపిక చేసుకుంది. ఆయా జట్ల కెప్టెన్ల విషయానికొస్తే.. పార్ల్ రాయల్స్‌కు (రాజస్తాన్ రాయల్స్) జోస్ బట్లర్, డర్బన్ సూపర్ జెయింట్స్‌కు (లక్నో సూపర్ జెయింట్స్) కేశవ్ మహారాజ్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు (ఢిల్లీ క్యాపిటల్స్) వేన్ పార్నెల్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (ముంబై ఇండియన్స్) రషీద ఖాన్, జోబర్గ్ సూపర్‌కింగ్స్‌కు (చెన్నై సూపర్ కింగ్స్) ఫాఫ్ డుప్లెసిస్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నారు. సౌతాఫ్రికన్ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2023) సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఖంగుతినిపించి ఛాంపియన్‌గా అవతరించింది. 2024 సీజన్ జనవరి 10న మొదలై ఫిబ్రవరి 10న ముగుస్తుంది. పూర్తి జట్ల వివరాలు.. ప్రిటోరియా క్యాపిటల్స్: పాల్ స్టెర్లింగ్, కైల్ వెర్రెన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, థీనిస్ డి బ్రుయిన్, విల్ జాక్స్, షేన్ డాడ్స్వెల్, డారిన్ డుపావిల్లోన్, మిగేల్ ప్రిటోరియస్, అన్రిచ్ నోర్ట్జే, ఆదిల్ రషీద్, ఈథన్ బాష్, కార్బిన్ బాష్, మాథ్యూ బోస్ట్, జిమ్మీ నీషమ్, సెనురన్ ముత్తసామి, వేన్ పార్నెల్ (కెప్టెన్), స్టీవ్ స్టోక్ పార్ల్ రాయల్స్: లోర్కన్ టక్కర్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేన్ విలాస్, మిచెల్ వాన్ బ్యూరెన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, జాన్ టర్నర్, క్వేనా మఫాకా, ఒబెద్ మెక్కాయ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి, బ్జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇవాన్ జోన్స్, ఫాబియన్ అలెన్ ఎంఐ కేప్ టౌన్: క్రిస్ బెంజమిన్, డెవాల్డ్ బ్రెవిస్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, గ్రాంట్ రోలోఫ్సెన్, కానర్ ఎస్టర్‌హుజెన్, నీలన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కగిసో రబడ, రషీద్ ఖాన్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డెలానో పాట్గెటర్, జార్జ్ లిండే, డువాన్ జన్సెన్ జోబర్గ్ సూపర్ కింగ్స్: వేన్ మాడ్సెన్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డు ప్లూయ్, రీజా హెండ్రిక్స్, డోనోవన్ ఫెర్రీరా, సిబోనెలో మఖాన్యా, రోనన్ హెర్మన్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జహీర్ ఖాన్, సామ్ కుక్, లిజాడ్ విలియమ్స్, నాండ్రే బర్గ్డర్, ఆరోన్ ఫాంగిసొ, కైల్ సిమ్మండ్స్, దయ్యన్ గలీమ్, మొయిన్ అలీ, డేవిడ్ వీస్ డర్బన్ సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, భానుక రాజపక్స, హెన్రిచ్ క్లాసెన్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నవీన్ ఉల్ హక్, రీస్ టాప్లీ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), కైల్ అబాట్, జూనియర్ డాలా, జాసన్ స్మిత్, కైల్ మేయర్స్, డ్వేన్ ప్రిటోరియస్, కీమో పాల్, వియాన్ ముల్దర్, జోన్ జోన్ స్మట్స్, బ్రైస్ పార్సన్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా, జోర్డాన్ హెర్మాన్, ఆడమ్ రోసింగ్టన్, సరెల్ ఎర్వీ, కాలేబ్ సెలెకా, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, సిసంద మగాలా, బ్రైడన్ కార్స్, సైమన్ హెర్మెర్, క్రెయిగ్ ఒవర్టన్, బేయర్స్ స్వేన్పోల్, మార్కో జన్సెన్, అయా క్వామేన్, టామ్ అబెల్, ఆండిల్ సిమెలన్ -
IPL: ఐపీఎల్ కాదు.. అంతకు మించి! వారికి మాత్రం నో చెప్పలేమన్న బీసీసీఐ!
ప్రపంచంలోని టీ20 లీగ్‌లన్నింటిలో ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇతర లీగ్‌లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్. ఎక్కడా లేని క్రేజ్ పదహారవ ఎడిషన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్డమ్ పెంచడం సహా.. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది. క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్‌లో ఐపీఎల్‌కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్‌లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్‌ను మించేలా ధనిక లీగ్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. సౌదీ సంచలనం? ఫార్ములా వన్ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్ స్టార్లను తమ ఫుట్‌బాల్ లీగ్‌లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్‌పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని మించిన లీగ్‌తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్‌లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి. వారికి మాత్రం నో చెప్పలేము ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్‌లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్‌లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్‌లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. అంతసీన్ లేదు! ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్‌కు క్రేజ్ ముందు ఈ లీగ్‌లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు. చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ.. గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. -
ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ.. తొలి మినీ ఐపీఎల్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. CHAMPIONS‼️‼️‼️@SunrisersEC are the winners of the inaugural #Betway #SA20 🏆 The title is heading to Gqeberha‼️@Betway_India pic.twitter.com/ODHLNdtQke — Betway SA20 (@SA20_League) February 12, 2023 వాన్ డెర్ మెర్వ్ 4, మగాలా, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు, జన్సెన్, మార్క్రమ్ చెరో వికెట్ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. That winning moment 🧡🧡🧡#Betway #SA20 @Betway_India pic.twitter.com/b1uI45aYr0 — Betway SA20 (@SA20_League) February 12, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఆడమ్ రొస్సింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్ (22), కెప్టెన్ మార్క్రమ్ (26), జన్సెస్ (13 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు. -
SA20 2023: రాయల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన క్యాపిటల్స్
SA20, 2023 - Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ సీజన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ రికార్డులకెక్కింది. జోహన్నస్బర్గ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. రాయల్స్ జట్టును 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అదరగొట్టిన రొసో ది వాండరర్స్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా- పర్ల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పర్ల్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(22) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్(7) విఫలమయ్యాడు. కెప్టెన్ థియూనిస్ డి బ్రూయిన్ కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఈథన్ బోష్(22) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఫైనల్‌కు ప్రిటోరియా ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్ల్ రాయల్స్‌ను ప్రిటోరియా బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ జేసన్ రాయ్‌ను బోష్ డకౌట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 19 ఓవర్లకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 124 పరుగులకు ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిలీ రొసో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో సెమీస్ పోరులో.. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ప్రిటోరియా క్యాపిటల్స్. ఇదిలా ఉంటే.. గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ప్రిటోరియాను ఢీకొట్టనుంది. చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత Rilee roared and ROARED LOUD 🐯💙 Watch @Rileerr’s 🔝 knock that powered @PretoriaCapsSA to the #SA20League final 🔥#PCvPR #SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/TLemf48dLW — JioCinema (@JioCinema) February 9, 2023 -
SA20 2023: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్
Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో పర్ల్ రాయల్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. పాయింట్ల పట్టికలో డర్బన్ సూపర్‌జెయింట్స్‌ను వెనక్కి నెట్టి టాప్-4లో చోటు సంపాదించింది. అదరగొట్టిన మెండిస్ సెంచూరియన్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్, పర్ల్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదుకున్న బట్లర్ ఓపెనర్ కుశాల్ మెండిస్ 80(41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇంగ్రామ్ 41 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(10), పాల్ స్టిర్లింగ్(19) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ బ్యాట్ ఝులిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు రాబట్టాడు. ఓటమి పాలైనా అయితే, మిగతా వాళ్లలో ఇయాన్ మోర్గాన్(24), కెప్టెన్ డేవిడ్ మిల్లర్(11) తప్ప ఎవరూ కూడా కనీసం సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. దీంతో 167 పరుగులకే పర్ల్ రాయల్స్ కథ ముగిసింది. 59 పరుగులతో ఓటమిని మూటగట్టుకుంది. కాగా సెమీస్ బెర్తు కోసం పర్ల్, సూపర్‌జెయింట్స్ పోటీ పడ్డాయి. ఒకవేళ ప్రిటోరియాతో మ్యాచ్‌లో గనుక పర్ల్ జట్టు 62 పరుగుల తేడాతో ఓటమిపాలైతే సూపర్‌జెయింట్స్ సెమీస్‌కు అర్హత సాధించేది. అయితే, బట్లర్ 19వ ఓవర్ వరకు పట్టుదలగా నిలబడి ఈ ప్రమాదం నుంచి జట్టును తప్పించాడు. And he keeps hearts too 💗 pic.twitter.com/Vm3dUGxP0c — Paarl Royals (@paarlroyals) February 7, 2023 The Paarl Royals will have another chance to impress in their #Betway #SA20 semi-final 👍@Betway_India pic.twitter.com/jddWrrRa2P — Betway SA20 (@SA20_League) February 7, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సెమీస్ చేరిన జట్లు ఇవే 1. ప్రిటోరియా క్యాపిటల్స్ 2. జోబర్గ్ సూపర్‌కింగ్స్ 3. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 4. పర్ల్ రాయల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఇలా.. 1. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ పర్ల్ రాయల్స్(ఫిబ్రవరి 8) 2. జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(ఫిబ్రవరి 9) చదవండి: Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో.. BGT 2023: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' -
SA20 2023: ముగిసిన ‘ముంబై’ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి?
SA20, 2023 - Joburg Super Kings vs MI Cape Town: సౌతాఫ్రికా టీ20- 2023 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఏడో పరాజయం నమోదు చేసిన ఎంఐ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో చెన్నై ఫ్రాంఛైజీకి చెందిన జోబర్గ్ ప్లే ఆఫ్స్‌నకు చేరుకుంది. కాగా జోహన్నస్బర్గ్ వేదికగా ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షాక్ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జోబర్గ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్ డుప్లెసిస్, హెండ్రిక్స్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఎంఐ జట్టు సంబరాలు చేసుకుంది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన అన్క్యాప్డ్ ఇంగ్లిష్ బ్యాటర్ లూయీస్ డు ప్లూయీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఆదుకున్న అన్‌క్యాప్ట్ బ్యాటర్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ 48 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిలిగిన వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రషీద్ విఫలం ఎంఐ బౌలర్లలో లిండే ఒకటి, సామ్ కరన్ రెండు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. డెవాల్డ్ బ్రెవిస్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా ఎంఐ బౌలర్లతో పోలిస్తే.. 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చేతులెత్తేశారు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌ను జోబర్గ్ బౌలర్లు ఆది నుంచే దెబ్బకొట్టారు. ఓపెనర్ రాసీ వాన్ డసెన్ 20, వన్‌డౌన్‌లో వచ్చిన గ్రాంట్ రోల్ఫోసన్ 21 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన బేబీ ఏబీడీ 27 పరగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయిన ఎంఐ భారీ ఓటమిని మూటగట్టుకుంది. హృదయం ముక్కలైంది ఈ పరాజయంతో టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎంఐ కేప్‌టౌన్ .. ‘‘మేము ఆరంభ సీజన్‌ను ఇలా ముగించాలనుకోలేదు. అయినా మేమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం’’ అంటూ హృదయం ముక్కలైందంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. మనకేంటీ దుస్థితి? మరోవైపు.. జోబర్గ్ ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లి టైటిల్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ‘‘గత కొన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఏ లీగ్‌లో కూడా ప్లే ఆఫ్స్ చేరుకోలేమా? మనకేంటీ దుస్థితి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన రషీద్ ఖాన్.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పదింట ఎంఐ కేవలం మూడు విజయాలే నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ Not the way we’d have wanted to end our inaugural #SA20 campaign 💔 But a family sticks together and so will we. 🤗💙#OneFamily — MI Cape Town (@MICapeTown) February 6, 2023 .@JSKSA20 solidify the 2️⃣nd spot in the #SA20 points table 💛 Watch the #JSKvMICT match highlights and stay tuned to #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲 for #SA20League action 🏏#SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/hmmpfGLSy2 — JioCinema (@JioCinema) February 6, 2023 Leus du Plooy's innings brought @JSKSA20 fans a lot of joy 🫶 Keep watching #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲#JSKvMICT #SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/BsBbqr1QvX — JioCinema (@JioCinema) February 6, 2023 -
SA20 2023: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఆఖరి ఓవర్లో..
Durban Super Giants vs MI Cape Town: ఎంఐ కేప్‌టౌన్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌దే పైచేయి అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్వింటన్ డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి ఓ బంతి మిగిలి ఉండగానే విజయం అందుకుంది. సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్టన్ వేదికగా ఎంఐ కేప్‌టౌన్- డర్బన్ సూపర్‌జెయింట్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన సూపర్‌జెయింట్స్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. నిరాశపరిచిన బేబీ ఏబీడీ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు డెవాల్డ్ బ్రెవిస్(13), రొలోఫ్సెన్(10) శుభారంభం అందించలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 32 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన టిమ్ డేవిడ్ 33 రన్స్ చేశాడు. ఆఖర్లో ఓడియన్ స్మిత్ 10 బంతుల్లో 2 ఫక్షర్లు, ఒక సిక్సర్ సాయంతో 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డెలానో 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేప్‌టౌన్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చెలరేగిన డికాక్ లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్ డికాక్ ఆది నుంచే దూకుడు చూపడం కలిసి వచ్చింది. కెప్టెన్ డికాక్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కె 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. గెలిచినా.. మిగిలిన వాళ్లలో కీమో పాల్ 18 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సమిష్టి విజయంతో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. అయితే, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మాత్రం మెరుగుపరచుకోలేకపోయింది. సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట 5 విజయాలతో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ ఎనిమిదింట 4 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాయల్స్ మూడు, సూపర్‌కింగ్స్ నాలుగు స్థానాల్లో ఉండగా.. ఎంఐ, డర్బన్ ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా మూడు విజయాలు సాధించాయి. అయితే, పాయింట్ల పరంగా ఎంఐ(13 పాయింట్లు) కంటే వెనుకబడ్డ డర్బన్ (12)చివరి స్థానంలో నిలిచింది. చదవండి: ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ IND vs SA Womens T20 Tri Series 2023: తుది పోరులో పేలవంగా... Destructive @timdavid8 💪 Quintessential @QuinnyDeKock69 🔥#DSGvMICT was indeed a blockbuster encounter 🍿👌 🎥 the highlights and more of #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺 📲#SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/296WIhXFmm — JioCinema (@JioCinema) February 2, 2023 #DSG captain Quinton de Kock is all smiles after an important win over #MICT#Betway #SA20 | @Betway_India pic.twitter.com/3fjmPUDPxY — Betway SA20 (@SA20_League) February 2, 2023 #MICT captain Rashid Khan knows his side will come back stronger after their defeat at the hands of #DSG#Betway #SA20 | @Betway_India pic.twitter.com/pKCFETAYgp — Betway SA20 (@SA20_League) February 2, 2023 -
SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్‌లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ జట్టును గెలిపించారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్టన్(4), జోర్డాన్ హెర్మాన్(4) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ స్మట్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బట్లర్ హాఫ్ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ జేసన్ రాయ్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. మిల్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 4 సిక్స్‌ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. రాయల్స్ సారథి డేవిడ్ మిల్లర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఏ స్థానంలో ఉన్నాయంటే కాగా ఈ ఓటమితో సన్‌రైజర్స్ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో రైజర్స్ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్(0.508) కంటే రన్‌రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు' 𝙈𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 𝙈𝙞𝙡𝙡𝙚𝙧 👀the super hits of the Royal's skipper More action from the #SA20League 👉 LIVE on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📲#SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/VsJiM9uyKS — JioCinema (@JioCinema) January 24, 2023 -
ఫీల్డర్ దెబ్బ.. యాంకర్‌కు ఊహించని అనుభవం
ఈ ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి ఎడిషన్ విజయవంతంగా సాగుతుంది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్ట్రర్న్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే మ్యాచ్ మధ్యలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్ సామ్ కర్రన్ వేసిన 13వ ఓవర్ లో చివరి బంతిని జాన్సెన్ డీప్ మిడ్ వికెట్ కార్నర్ మీదుగా షాట్ ఆడాడు. ఆ బాల్ ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీకి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు. అయితే ఆ ఫీల్డర్ సరాసరి అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ను ఢీ కొన్నాడు. దీంతో యాంకర్ పట్టుతప్పి కిందపడిపోయింది. కాగా అనుకోని ఘటనలో యాంకర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఆ తర్వాత పైకి లేచిన యాంకర్ తనకు ఏమీ కాలేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జట్టులో గ్రాంట్ రోలోఫ్సెన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 15 ఓవర్లలో 101 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మార్కో జాన్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు . కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. "This is coming straight for us.." 🫣@ZAbbasOfficial, you good? 🤣@CapeTownCityFC your manager somehow avoided the contact! pic.twitter.com/32YPcfLCMf — SuperSport 🏆 (@SuperSportTV) January 18, 2023 చదవండి: మణికొండలో సందడి చేసిన విరాట్ కోహ్లి.. సెంచరీలు వద్దు.. డబుల్ సెంచరీలే ముద్దు -
SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో నడిచే జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ సూపర్ కింగ్స్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డొనావాన్ ఫెరియెరా (40 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌ను వీరి జోడీ (85 పరుగులు జోడించి) ఆదుకుంది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, అఖిల ధనంజయ, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులకు మాత్రమే పరిమితై ఓటమిపాలైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 78; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసిన్ (20), ప్రిటోరియస్ (6 బంతుల్లో 14; 2 సిక్సర్లు) తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2, మలుసి సిబోటో, డొనావాన్ ఫెరియెరా, ఆరోన్ ఫాంగిసో తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (82 నాటౌట్, ఒక వికెట్) అదరగొట్టిన డొనావాన్ ఫెరియెరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్ ఈస్ట్ర్న్ కేప్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. -
డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా క్వింటన్ డికాక్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 10న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించిన వేలంను కూడా క్రికెట్ సౌతాఫ్రికా పూర్తి చేసింది. అదే విధంగా ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను ఎంపిక చేసింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటించింది. కాగా డర్బన్ ఫ్రాంచైజీనీ ఐపీఎల్‌కు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు డికాక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా డికాక్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో జాసన్ హోల్డర్, డ్వైన్ ప్రిటోరియస్ వంటి స్టార్ ఆటగాళ్లను డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Durban's Super Giants (@durbanssupergiants) డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ, డ్వైన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహరాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షన్ మధుశంక, జాన్సన్ చార్లెస్, మాథ్యూ బ్రీట్జ్కేర్, క్రిస్టియన్ జోంకర్ వియాన్ ముల్డర్, సైమన్ హార్మర్ చదవండి: FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్ 'డ్రా' -
గౌతమ్ గంభీర్‌కు మరిన్ని కీలక బాధ్యతలు
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యాజమాన్యం మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా యజమానిగా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ ఆధీనంలో ఉన్న అన్ని సూపర్ జెయింట్స్ జట్లకు గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీతో (ఐపీఎల్) పాటు డర్బన్ ఫ్రాంచైజీ (సౌతాఫ్రికా టీ20 లీగ్) కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్పీఎస్జీ గ్రూప్ తాజా నిర్ణయంతో గంభీర్‌కు ఎల్ఎస్జీ మెంటార్షిప్తో పాటు డర్బన్ ఫ్రాంచైజీ మెంటార్షిప్ కూడా దక్కనుంది. గడిచిన ఐపీఎల్ సీజన్లో గంభీర్ పనితనాన్ని మెచ్చి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించినట్లు ఆర్పీఎస్జీ గ్రూప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుత తరంలో చురుకైన క్రికెటింగ్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్లో గంభీర్ ముఖ్యుడని ఆర్పీఎస్జీ పేర్కొంది. కాగా, గంభీర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గడిచిన ఐపీఎల్లో అంచనాలకు మించి రాణించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఏ మాత్రం అంచనాలు లేని ఎల్ఎస్జీని గంభీర్ అన్నీ తానై ముందుండి నడిపించాడు. యువ ఆటగాళ్లను సానబెట్టడంలో గంభీర్ సక్సెస్ కావడంతో ఎల్ఎస్జీ గత సీజన్లో టాప్-4లో నిలిచింది. ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలోని డర్బన్ ఫ్రాంచైజీ వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్ఏ20 లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక్కడ పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ యాజమాన్యలే చేజిక్కించుకోవడంతో ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గంభీర్ ఇండియా క్యాపిటల్స్ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. -
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్
CSA T20 League- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ప్రొటిస్ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు (9.2 మిలియన్ సౌతాఫ్రికన్ ర్యాండ్స్) చేసి 22 ఏళ్ల ఈ వపర్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ వేలంలో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమాకు చేదు అనుభవం ఎదురైంది. అతడి పేరు రెండుసార్లు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీస ధర( 850,000 సౌతాఫ్రికన్ ర్యాండ్స్)కు కూడా కొనుగోలు చేయలేదు. బవుమాకు ఘోర అవమానం! ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, డర్బన్ సూపర్‌జెయింట్స్ కోచ్ లాన్స్ క్లూస్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి టీ20 లీగ్‌లలో ఆడాలంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ ట్యాగ్ సరిపోదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు ఉంటేనే ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ఐఓఎల్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లీగ్‌లలో ఆడాలంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం తరఫున కీలక ఆటగాడు అయినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. అప్పుడే ఫ్రాంఛైజీలు సదరు ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని క్లూస్నర్ చెప్పుకొచ్చాడు. మరేం పర్లేదు! ఇక మరో మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాంఛైజీ ఓనర్లు ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయో మనకు తెలియదు కదా! అయినా.. ఇప్పుడే అంతా ముగిసిపోలేదు. టోర్నీ ఆరంభమయ్యే లోపు కొంతమంది గాయాల బారిన పడొచ్చు. లేదంటే మరో రూపంలో కూడా అవకాశం రావచ్చు’’ అంటూ బవుమాలా చేదు అనుభవం ఎదుర్కొన్న వారు నిరాశలో కూరుకుపోకూడదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన బవుమా 120.6 స్ట్రైక్‌రేటుతో 562 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్ -
SA 2022: ఆ వేలంలోనూ హైలెట్‌గా కావ్య మారన్! ఎంఐతో పోటీపడి.. అత్యధిక ధర పెట్టి!
SA20 auction- Tristan Stubbs Most Expensive Player: టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా దక్షిణాఫ్రికాలోనూ సౌతాఫ్రికా టీ20 లీగ్ పేరిట వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఆటగాళ్ల వేలం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ యజమాని కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసిన యాజమాన్యం.. నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఇద్దరు ప్రొటిస్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన సోమవారం నాటి వేలంలో దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్‌రైజర్స్.. ఎంఐ కేప్‌టౌన్(ముంబై ఇండియన్స్) యాజమాన్యంతో తీవ్రంగా పోటీ పడింది. అత్యధిక ధర! ఎట్టకేలకు సొంతం ఎట్టకేలకు 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్లు(భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు) వెచ్చించి ట్రిస్టన్ను సొంతం చేసుకుంది. ఇక ఈ యువ వికెట్ కీపర్ తమ జట్టు సొంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించగానే కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె మురిసిపోయిన తీరు అభిమానులకు ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ పేసర్ టైమల్ మిల్స్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, సౌతాఫ్రికా లీగ్‌లో భాగంగా అతడు సన్‌రైజర్స్ ఈస్టర్న్కేప్నకు ప్రాతినిథ్యం వహించనుండటం విశేషం. ఈ విషయంపై ట్రిస్టన్ స్టబ్స్ స్పందిస్తూ.. ‘క్రేజీగా అనిపిస్తోంది. పోర్ట్ ఎలిజబెత్లోనే నా కెరీర్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇప్పుడు ఆ జట్టుకు ఆడనుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?! టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం.. Teams battle in auction to get the services of 22 year old Tristan Stubbs.#TristanStubbs#SA20Auction#SA20 #INDvAUS pic.twitter.com/NAF4dTxd5N — Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022 The 22-year old Tristan Stubbs expresses his joy after being picked up by #SEC in the #SA20Auction! 🧡 #SunrisersEasternCape #OrangeArmy #TristanStubbs pic.twitter.com/9Ij4rDiPe0 — Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022 -
SA T20 League: పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా జేపీ డుమిని
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా పార్ల్ రాయల్స్‌ను ఐపీఎల్ ఫ్రాంజైజీ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ జట్టు కోచింగ్ స్టాప్ సభ్యల పేర్లను పెర్ల్ రాయల్స్ ప్రకటించింది. పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని ఎంపికయ్యాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రాటజీ కోచ్‌గా ప్రోటిస్ మజీ ఆటగాడు రిచర్డ్ దాస్ నెవ్స్.. మార్క్ చార్ల్టన్ (బ్యాటింగ్ కోచ్), ఏటీ రాజమణి ప్రభు( మెంటల్ కండిషనింగ్ కోచ్), మాండ్లా మాషింబీ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), లిసా కీట్లీ( టాక్టికల్ కోచ్) రస్సెల్ ఆస్పెలింగ్(జట్టు కేటాలిస్ట్)గా నియమితులయ్యారు. ఇక 2020 జనవరిలో డుమిని అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. The team behind the team for our first ever #SA20 campaign. 🙌💗#RoyalsFamily pic.twitter.com/L25o4ZqUbT — Paarl Royals (@paarlroyals) September 15, 2022 ప్రోటిస్ తరపున 46 టెస్టులు..199 వన్డేలు, 81 టీ20ల్లో ఆడాడు. డుమిని ప్రస్తుతం బోలాండ్ దేశీవాళీ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా పార్ల్ రాయల్స్ ఇప్పటికే డేవిడ్ మిల్లర్, మెకాయ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఒప్పంతం కుదుర్చుకుంది. ఈ సరికొత్త దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
టీమిండియా క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లకు కారణం అదేనా..?
ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే భారత ఆటగాళ్లు రాహుల్ శర్మ, సురేశ్ రైనా, ఈశ్వర్ పాండే, తాజాగా రాబిన్ ఉతప్ప భారత క్రికెట్‌తో బంధం తెంచుకున్న విషయం విధితమే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ క్రికెటర్లు, వయసు ఏమంత పైబడనప్పటికీ వరుసగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలు విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వీరందరి అభిమతంగా తెలుస్తోంది. క్రికెట్ ఆడేందుకు శరీరం సహకరిస్తున్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో అనుబంధమున్న ఏ ఆటగాడూ ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో కానీ మరే ఇతర క్రికెట్ బోర్డుల ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో కానీ పాల్గొనే వీలు లేదు. ఈ నిబంధనే వయసు, టాలెంట్ ఉన్న చాలా మంది భారత క్రికెటర్లకు ప్రాణసంకటంలా మారింది. యువ క్రికెటర్లైతే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడే అవకాశం రాకపోదా అన్న ఆశతో భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకునే సాహసం చేయలేకపోతుంటే.. వయసు పైబడిన ఆటగాళ్లు మాత్రం బీసీసీఐని నమ్ముకుంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా తమ బతుకులు మారతాయని ఇష్టం లేకపోయినా భారత క్రికెట్‌తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. ఇలా బీసీసీఐతో బంధం తెంచుకున్న వారికి దేశవాళీ క్రికెట్లో కానీ, జాతీయ జట్టుకు కానీ, బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్లో కానీ ఆడే అవకాశాలు రాకపోయినా భారీ ధన ప్రవాహం నడిచే ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వారంతా ఈ కారణంగానే బీసీసీఐతో బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్స్ పుట్టుకొచ్చాయి. వీటికి ప్రస్తుతం భారీ గిరాకీ ఉంది. ఐపీఎల్ అంత కాకపోయినా ఆ రేంజ్లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు పర్సులు రెడీ చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఈసీబీ ఆధ్వర్యంలో నడిచే హండ్రెడ్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్ లీగ్, శ్రీలంక క్రికెట్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఇలా ప్రతి ఐసీసీ అనుబంధ దేశంలో ఓ లీగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో రెండు లీగ్‌లు (యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్) ప్రారంభంకానున్నాయి. ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఏదో ఒక లీగ్‌లో సక్సెస్ అయితే డబ్బుతో పాటు ఏడాదంతా ఖాళీ లేకుండా క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రారంభంకాబోయే యూఏఈ, సౌతాఫ్రికా లీగ్ల్లోని ఫ్రాంచైజీలను దాదాపుగా ఐపీఎల్ యాజమాన్యాలే కొనుగోలు చేయడంతో భారత వెటరన్ క్రికెటర్ల ఫోకస్ అంతా వీటిపైనే ఉంది.