దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో భాగంగా ప్రిటోరియా ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు ఈ లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ పేరిట బరిలోకి దిగనుంది. తాజాగా ఈ లీగ్‌లో తమ ఫ్రాంఛైజీ తరపున ఆడనున్న ఇద్దరి ఆటగాళ్ల పేర్లను ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే, ఆల్ రౌండర్ మెగాన్ ప్రిటోరియస్‌తో ప్రిటోరియా క్యాపిటల్స్ ఒప్పందం కుదర్చుకుంది.
ఈ సందర్భంగా ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాని ప్రాత్ జిందాల్ మాట్లాడుతూ.. గత కొన్ని సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అభివృద్ది, విజయంలో అన్రిచ్ నోర్ట్జే భాగంగా ఉన్నాడు. కాబట్టి మేము అతడిని తన స్వదేశంలో జరగనున్న లీగ్‌లో కూడా భాగం చేయాలని అనుకున్నాము. అతడు ఎల్లప్పడూ మాకు ప్రధాన ఎంపికగా ఉంటాడు. అతడు ఢిల్లీకు ఏ విధంగా అయితే తన సేవలు అందించాడో ప్రిటోరియాకు కూడా అదే చేస్తాడని అశిస్తున్నాము" అని అతడు పేర్కొన్నాడు.
కాగా నోర్ట్జే ప్రోటిస్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ టీ20లు ఆడిన అన్రిచ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లును ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి.
చదవండి: CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా..
Comments
Please login to add a commentAdd a comment