IPL 2023: DC pacer Anrich Nortje leaves for South Africa due to personal emergency - Sakshi
Sakshi News home page

DC VS RCB: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

Published Sat, May 6 2023 5:09 PM | Last Updated on Sat, May 6 2023 6:20 PM

IPL 2023: Nortje Leaves Delhi Capitals Before Clash With RCB - Sakshi

photo credit: IPL Twitter

ఆర్సీబీతో ఇవాళ (మే 6, రాత్రి 7: 30 గటంలకు) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి (దక్షిణాఫ్రికా) వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.  పర్సనల్‌ ఎమర్జెన్సీ కారణంగా నోర్జే ఇంటికి వెళ్లినట్లు డీసీ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. డీసీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ సమయానికంతా నోర్జే అందబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. 

చదవండి: DC Vs RCB: విరాట్‌ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక

కాగా, నోర్జే లేని లోటు డీసీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.  కచ్చితమైన వేగం, లైన్‌ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసే నోర్జే.. ఈ సీజన్‌లో ఢిల్లీ సాధించిన అతికొద్ది విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీకి నోర్జే లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. 

చదవండి: CSK VS MI: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement