Anrich Nortje
-
సౌతాఫ్రికాకు బిగ్ షాక్
సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ జరుగుతుండగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 సిరీస్‌తో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా నోర్జే దూరంగా ఉన్నాడు. నోర్జే ఎడమకాలి బొటనవేలు ప్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది. పాక్‌తో టీ20 సిరీస్‌కు నోర్జే ప్రత్యామ్నాయంగా అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ డయ్యాన్ గేలిమ్ ఎంపికయ్యాడు. గేలిమ్ తన 60 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో 46 వికెట్లు పడగొట్టాడు.కాగా, నోర్జే ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరిసారి సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో నోర్జే సౌతాఫ్రికా తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా (15 వికెట్లు) ఉన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా నోర్జే జాతీయ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు.సౌతాఫ్రికాను పట్టి పీడిస్తున్న గాయాలుప్రస్తుతం సౌతాఫ్రికా జట్టును గాయాల సమస్య వేధిస్తుంది. నోర్జే గాయపడిన అనంతరం సౌతాఫ్రికా క్యాజ్యువల్స్ (బౌలర్లు) సంఖ్య ఐదుకు చేరింది. నోర్జేకు ముందు గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, వియాన్ ముల్దర్ గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతానికి వీరంతా జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ మొదలైంది. డిసెంబర్ 10న జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌పై సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. కిల్లర్ మిల్లర్ ఊచకోత (82), జార్జ్ లిండే ఆల్‌రౌండ్ షో (48, 4/21) కారణంగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. -
SA vs BAN: దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు దూరం
బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాదిన్నర స్పిన్నర్ సెనూరన్ ముత్తుసామికి ప్రోటీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది.అయితే ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. జాన్సెన్, కోయిట్జేలకు విశ్రాంతి ఇవ్వగా.. ఎంగిడీ, నోర్జేలను సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టారో తెలియలేదు.బంగ్లా సిరీస్‌లో సఫారీల పేస్ దళానికి కగిసో రబాడ నాయకత్వం వహించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో రబాడతో పాటు బర్గర్, డేన్ ప్యాటర్సన్,ముల్డర్‌లకు చోటు లభించింది.గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్..కాగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టెస్టు సిరీస్‌పై సందిగ్ధం నెలకొంది. అయితే తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ తమ జట్టు పర్యటనకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఆక్టోబర్ 21 నుంచి ఢాకా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్) -
చాలా సంతోషంగా ఉంది.. కానీ పిచ్ మాత్రం: మార్క్రమ్
టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. న్యూయర్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రోటీస్ తీవ్రంగా శ్రమించింది.బౌన్స్‌కు సహకరిస్తున్న డ్రాప్ ఇన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చుతూ 78 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), డికాక్(20) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో కెప్టెన్ హసరంగా రెండు, తుషారా, షనక తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లంక.. ప్రోటీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 19.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. దక్షిఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహారాజ్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. న్యూయర్క్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉందని మార్క్రమ్ తెలిపాడు."టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డాం. న్యూయర్క్ వికెట్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. అదృష్టవశాత్తూ మా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గతంలో కూడా మాకు ఇటువంటి పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్ధితుల్లో ఆడుతూ వస్తున్నాం. అయితే న్యూయర్క్ వికెట్ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మా తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వికెట్‌కు అలవాటు పడాలి.ఇక నోర్జే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఫామ్ గురించి ఏ రోజు మేము ఆందోళన చెందలేదు. అతడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడని నేను అశిస్తున్నాను. నోర్జే ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రమ్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన నోర్జే.. 77 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-డిలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జూన్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయారు. ప్రొటీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని తప్పులో కాలేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో లంక కెప్టెన్ హసరంగ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ విషయంలో అతని అంచనాలు తారుమారయ్యాయి.సౌతాఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా పేసర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అన్రిచ్ నోర్జే (4-0-7-4), ఓట్నీల్ బార్ట్‌మన్ (4-1-9-1),కగిసో రబాడ (4-1-21-2) కేశవ్ మహారాజ్ (4-0-22-2) లంకేయులకు దారుణంగా దెబ్బ తీశారు. లంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు.నిస్సంక (3), కుశాల్ మెండిస్ (19), కమిందు మెండిస్ (11), హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6), ఏంజెలో మాథ్యూస్ (16), దసున్ షనక (9), పతిరణ (0), తుషార (0) దారుణంగా విఫలమయ్యారు. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో శ్రీలంక తమ అత్యల్ప పవర్ ప్లే స్కోర్‌ను (24) ఈ మ్యాచ్‌లో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. టీ20ల్లో తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోర్‌ను శ్రీలంక ఇదే మ్యాచ్‌లో నమోదు చేసింది. తొలి 10 ఓవర్లలో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నోర్జే (4/7) నమోదు చేసిన గణాంకాలు టీ20 వరల్డ్‌కప్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యుత్తమ గణాంకాలుగా నమోదయ్యాయి. -
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్‌లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్‌ప్రెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్ పరాగ్.. కాళరాత్రిలా మార్చేశాడు..!
ఓవరాక్షన్ స్టార్ అని పేరున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్.. గత కొంతకాలంగా ఓవరాక్షన్ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్ ఏదైనా రియాన్ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులతో అలరించిన పరాగ్.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 45 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Riyan Parag at one point 26(26) and he smashed 24*(8) and he completed his fifty in 34 balls. - RIYAN PARAG, THE STAR. ⭐ pic.twitter.com/X1uHZRpQ7F — CricketMAN2 (@ImTanujSingh) March 28, 2024 పరాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో రాజస్థాన్ ఢిల్లీని మట్టికరిపించింది. మ్యాచ్ మొత్తానికి రియాన్ మెరుపు ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. మరి ముఖ్యంగా రియాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నోర్జే చుక్కలు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ ఓవర్లో రియాన్ వరుసగా 4, 4, 6, 4, 6, 1 పరుగులు చేసి 25 పరుగులు పిండుకున్నాడు. రియాన్ దెబ్బకు నోర్జేకు నిన్నటి రాత్రి కాళరాత్రిలా మారింది. RIYAN PARAG SMASHED 25 RUNS IN THE FINAL OVER AGAINST NORTJE. 🔥🤯 - The Madman of Rajasthan Royals.pic.twitter.com/5bg7riHxY2 — Johns. (@CricCrazyJohns) March 28, 2024 నోర్జేను బహుశా ఏ బ్యాటర్ రియాన్లా చితబాది ఉండడు. రియాన్ ధాటికి నోర్జే 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. రియాన్ నోర్జేకు చుక్కలు చూపిస్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. He was trolled badly in previous seasons for having self confidence and today he converted his words into action, Riyan Parag is here to rule. Missed his dance though @ParagRiyan ❤️pic.twitter.com/higJiikEQ7 — Yashvi (@BreatheKohli) March 28, 2024 ఒకనాడు ఓవరాక్షన్ స్టార్ అన్న నోళ్లే ఇప్పుడు రియాన్‌ను పొగుడుతున్నాయి. రాజస్థాన్ అభిమానులు రియాన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రియాన్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. రాయల్స్ మున్ముందు పరాగ్ నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంది. కాగా, డీసీతో మ్యాచ్‌లో రియాన్ రెచ్చిపోవడంతో రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో రియాన్‌తో పాటు అశ్విన్ (29; 3 సిక్సర్లు), జురెల్ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్ వార్నర్ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా
2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే పేరు కనిపించలేదు. గతేడాది కాలంలో నోర్జే జాతీయ జట్టుకు అడపాదడపా ప్రాతినిథ్యం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సౌతాఫ్రికా గతేడాదికాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 37 మ్యాచ్‌లు ఆడగా.. నోర్జే కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. సీఎస్ఏ సెంట్రల్ కాంట్రాక్ లిస్ట్‌లో నోర్జే పేరుతో పాటు సిసండ మగాల, వేన్ పార్నెల్, కీగన్ పీటర్సన్ పేర్లు కూడా కనిపించలేదు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్, టీ20లకు మాత్రమే పరిమతమైన క్వింటన్ డికాక్ పేర్లను సైతం సీఎస్ఏ అధికారులు తొలగించారు. కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆశించిన కైల్ వెర్రిన్, డేవిడ్ బెడింగ్హమ్లకు మొండిచెయ్యి ఎదురైంది. పేస్ బౌలర్ నండ్రే బర్గర్, ఓపెనింగ్ బ్యాటర్ టోనీ డి జోర్జీ కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకోగా.. అండీల్ ఫెహ్లుక్వాయో ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కాంట్రాక్ట్‌ను పొందాడు. గతేడాది మొత్తం 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 18కే కుదించారు. మహిళల విషయానికొస్తే.. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్ సంఖ్య 15 నుంచి 16కు పెరిగింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన షబ్నిమ్ ఇస్మాయిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోగా.. కొత్తగా అయండ హ్లుబి, ఎలిజ్-మారి మార్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన సౌతాఫ్రికా పురుష క్రికెటర్లు.. టెంబా బవుమా, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండీల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన మహిళా క్రికెటర్లు.. అన్నేకే బోష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, లారా గుడాల్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజన్ కప్, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సున్ లూస్, ఎలిజ్-మారీ మార్క్స్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే, క్లో ట్రైయాన్, డెల్మి టక్కర్, లారా వోల్వార్డ్ట్ -
IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త
జైపూర్ వేదికగా ఈనెల 28న రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ తొలి మ్యాచ్‌కు (పంజాబ్) దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్జే జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. నోర్జేకు స్వాగతం ఓ వీడియోను కూడా షేర్ చేసింది. Everything moved a little 𝘕𝘖𝘙𝘛𝘑𝘌 today 😉🤯 Welcome 🔙, 𝟏𝟓𝟔.𝟐 𝐤𝐩𝐡 🔥#YehHaiNayiDilli pic.twitter.com/me5uirhY30 — Delhi Capitals (@DelhiCapitals) March 25, 2024 ఇదిలా ఉంటే, ఈ నెల 23న పంజాబ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసి దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గగా రాణించలేకపోయారు. వార్నర్ (29), మార్ష్ (20), షాయ్ హోప్ (33), అక్షర్‌లకు (21) శుభారంభాలు అందినప్పటికీ వారు వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-20-2), అక్షర్ పటేల్ (4-0-25-0), ఇషాంత్ శర్మ (2-0-16-1) పర్వాలేదనిపించగా.. ఖలీల్ అహ్మద్ (4-0-43-2), మిచెల్ మార్ష్ (4-0-52-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
అయ్యో దక్షిణాఫ్రికా.. ఊహించిందే జరిగింది! ఇక కష్టమే మరి
వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్, సిసిందా ఇద్దరూ వరల్డ్‌కప్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్ ఎల్లప్పడూ ఉంటుంది. వీరి స్ధానంలో ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లలో ప్రోటీస్‌కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్‌ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: ODI World Cup: పిచ్ క్యూరేటర్లకు ఐసీసీ కీలక ఆదేశాలు.. -
వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న నోర్జే కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా నోర్జే గాయపడ్డాడు. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను వెంటనే జొహన్నస్‌బర్గ్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ పంపింది. ఈ క్రమంలో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. కాగా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటిస్ జట్టులో నోర్జే కూడా భాగంగా ఉన్నాడు. నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ మెగా టోర్నీకి ఎంపికైన ప్రోటీస్ పేసర్ సిసంద మగల సైతం మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే అతడు వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక మెగా ఈవెంట్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పాపా’ అంటూ! -
వరల్డ్‌కప్ 2023లో ఆ ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం..!
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపగలరని సౌతాఫ్రికన్ లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కల్లిస్ అంచనా వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా పేస్ గన్ ఎన్రిచ్ నోర్జే, ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణిస్తారని కల్లిస్ జోస్యం చెప్పాడు. కల్లిస్ ఈ ఐదుగురిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించాడు. ఆయా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌తో పాటు భారత్‌లో ఆడిన అనుభవం వారి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇండియాలో ఆడనప్పటికీ, అతను ప్రపంచకప్‌లో తప్పక చెలరేగుతాడని తెలిపాడు. రషీద్ ఖాన్, నోర్జే, బట్లర్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం, భారత పిచ్‌లపై వారికున్న రికార్డు, అలాగే ఇండియన్ ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ వారిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ ప్రపంచకప్‌లో అతన్ని ఆపడం కష్టమని తెలిపాడు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం విరాట్ ఫామ్ చాలా భీకరంగా ఉందని, అతను మెగా టోర్నీలో అద్భుతాలు చేయడం ఖాయమని జోస్యం చెప్పాడు. విరాట్‌తో పాటు రషీద్ ఖాన్‌పై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్‌కప్‌లో అతను రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను నమోదు చేయడం ఖాయమని అన్నాడు. కల్లిస్.. ఐసీసీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అక్టోబర్ 14న భారత్.. పాక్‌ను ఢీకొంటుంది. -
సౌతాఫ్రికాకు భారీ షాక్! వెన్నునొప్పితో స్టార్ పేసర్ ‘అవుట్’..
Australia tour of South Africa, 2023 ODI Series: ఆస్ట్రేలియాతో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటిస్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. వెన్ను నొప్పి తీవ్రతరమైన కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసింది. టీ20 సిరీస్‌లో ఘోర పరాభవం కాగా మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్ కోసం కంగారూ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 30న మొదలైన టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఆసీస్.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది. ముఖ్యంగా శనివారం నాటి రెండో వన్డేలో ఏకంగా 123 పరుగుల తేడాతో గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత మైదానాన్ని వీడిన ఈ రైట్ఆర్మ్ పేసర్.. తర్వాత తిరిగొచ్చి ఫీల్డింగ్ చేశాడు. వెన్నునొప్పి తీవ్రతరం అయితే.. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను సోమవారం జొహన్నస్‌బర్గ్‌కు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యపరీక్షలు జరుగుతున్న సమయంలో.. అతడు సెప్టెంబరు 12 నాటి మూడో వన్డేకు దూరం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక వన్డే సిరీస్‌లో ఇప్పటికే వెనుబడ్డ సౌతాఫ్రికాకు.. వన్డే వరల్డ్‌కప్-2023 సమీపిస్తున్న తరుణంలో నోర్జే గాయం అశనిపాతంలా మారింది. శ్రీలంకతో తొలి మ్యాచ్.. వరల్డ్‌కప్‌నకు ముందు ఎదురుదెబ్బ ప్రొటిస్ కీలక పేసర్లలో ఒకడైన అన్రిచ్ నోర్జే గనుక మెగా ఈవెంట్ నాటికి అందుబాటులోకి రాకుంటే జట్టుకు కష్టాలు తప్పవు. ఇక భారత్ వేదికగా మొదలు కానున్న ప్రపంచకప్ టోర్నీలో అక్టోబరు 7న ఢిల్లీలో శ్రీలంకతో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆసీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే మూడో వన్డే తప్పక గెలవాల్సి ఉంది. వన్డే వరల్డ్‌కప్‌నకు సౌతాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్. చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే? -
DC VS RCB: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఆర్సీబీతో ఇవాళ (మే 6, రాత్రి 7: 30 గటంలకు) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి (దక్షిణాఫ్రికా) వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా నోర్జే ఇంటికి వెళ్లినట్లు డీసీ మేనేజ్మెంట్ పేర్కొంది. డీసీ ఆడబోయే తదుపరి మ్యాచ్ సమయానికంతా నోర్జే అందబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐒𝐭𝐚𝐭𝐞𝐦𝐞𝐧𝐭 Owing to a personal emergency, Delhi Capitals fast bowler Anrich Nortje had to leave for South Africa late on Friday night. He will be unavailable for this evening’s game against Royal Challengers Bangalore. pic.twitter.com/lig7mfgLan — Delhi Capitals (@DelhiCapitals) May 6, 2023 కాగా, నోర్జే లేని లోటు డీసీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కచ్చితమైన వేగం, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసే నోర్జే.. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన అతికొద్ది విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీకి నోర్జే లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ -
IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..!
ఐపీఎల్-2023 సీజన్లో గత నాలుగు రోజులుగా రసవత్తరమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ నాలుగు మ్యాచ్‌లు చూడకపోయి ఉంటే అది పెద్ద నేరమని సోషల్‌మీడియాలో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ఆ స్థాయి ఈ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు కావాల్సిన అసలుసిసలు టీ20 మజాను అందించాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ చివరి బంతి వరకు సాగిన ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పైచేయి సాధిస్తే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. ఆ తర్వాత డీసీతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకొచ్చాడు. ముంబై గెలుపును అడ్డుకునేందుకు నోర్జే చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. నోర్జే పోరాటం వృధా అయిన ఫ్యాన్స్‌కు అతని బౌలింగ్ పట్ల గౌరవం పెరిగింది. దాదాపుగా ఇలాంటి పోరాటమే నిన్న (ఏప్రిల్ 12) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ కూడా చేశాడు. క్రితం మ్యాచ్‌లో నోర్జే లాగా సందీప్ తక్కువ స్కోర్‌ను కాకుండా ఓ మోస్తరు స్కోర్‌ను ఆఖరి ఓవర్లో డిఫెండ్ చేసుకుని తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆఖరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్ తొలి రెండు బంతులను వైడ్లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని రాజస్థాన్ ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు. అయితే ఈ బ్రిలియంట్ బౌలర్ చివరి 3 బంతులు అద్భుతంగా బౌల్ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేసి (3 బంతుల్లో 3 సింగల్స్), తన జట్టును గెలిపించుకున్నాడు. సందీప్ లాగే దీనికి ముందు మ్యాచ్‌లో నోర్జే కూడా హార్ఢ్ హిట్టర్లు టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్‌లను చివరి బంతి వరకు కట్టడి చేశాడు. అయితే చివరి బంతికి డేవిడ్ 2 పరుగులు సాధించడంతో ముంబై విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ప్రస్తుత సీజన్లో గత 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో బ్యాటర్ల హవా, ఆఖరి 2 మ్యాచ్‌ల్లో బౌలర్ల డామినేషన్ నడిచింది. -
ముంబై గెలిచింది, రోహిత్ హాఫ్‌సెంచరీ చేశాడు.. సరే, ఇతని మాట ఏమిటి..?
ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో గత రెండు మ్యాచ్‌ల్లాగే ఈ మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి ప్రేక్షకులకు కావాల్సి అసలు సిసలు టీ20 మజా అందించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. నిన్న డీసీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, తిలక్ వర్మ మెరుపుల సాయంతో ముంబై కూడా చివరాఖరి బంతికే విజయం సాధించింది. కాగా, గత రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ వేసిన బౌలర్లు మంచికో చెడుకో ఏదో ఓ కారణంగా వార్తల్లో నిలిచారు. రింకూ సింగ్ ఊచకోత ధాటికి బలైన యశ్ దయాల్, ఆఖరి బంతికి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేసి విఫలమైన హర్షల్ పటేల్ వేర్వేరు కారణాల చేత ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ రెండు సందర్భాల్లో బౌలర్లు శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటకీ, బ్యాటర్ల ఆధిపత్యం కారణంగా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన, ప్రత్యర్ధిని దాదాపు ఓడించినంత పని చేసిన డీసీ పేసర్ అన్రిచ్ నోర్జేకు మాత్రం దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఈ సీజన్లో ముంబై తొలి గెలుపు, సుదీర్ఘకాలం తర్వాత హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా నోర్జే ప్రదర్శన మరుగున పడింది. చివరి ఓవర్లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకొచ్చాడు. తొలి బంతికి సింగిల్ ఇచ్చిన నోర్జే.. ఆతర్వాత 2, 3 బంతులు డాట్‌బాల్స్ వేసి 4,5 బంతులకు రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చి ముంబై శిబిరానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ 2 పరుగులు తీయడంతో, బతుకు జీవుడా అని ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
నోర్ట్జే దెబ్బకు గిల్ విలవిల.. కొత్త లుక్ అదిరిందయ్యా!
సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్జే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ 16వ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన నోర్ట్జే గుజరాత్‌తో మ్యాచ్‌లో వస్తూనే తన పవర్ ఏంటో చూపించాడు. తన తొలి ఓవర్లోనే సాహాను బౌల్డ్ చేసిన నోర్ట్జే.. తర్వాతి ఓవర్లో శుబ్‌మన్ గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 148 కిమీ వేగంతో నోర్ట్జే వేసిన బంతికి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఎలా ఆడాలో తెలియక గిల్ తికమక పడగా బంతి వేగానికి లెగ్‌స్టంప్ ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నోర్ట్జే సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. కోరమీసంతో నోర్ట్జే కాస్త కొత్తగా కనిపించాడు. దీంతో నోర్ట్జేపై ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్ చేశారు.'' నీ కొత్త లుక్ అదిరింది పో.. కోర మీసంతో హీరోలా కనిపిస్తున్నావు'' అంటూ పేర్కొన్నారు. Nortje - Pace is Pace 🔥pic.twitter.com/iutrKpDtng — Johns. (@CricCrazyJohns) April 4, 2023 -
తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'
సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌లు తీసుకోవడం చూస్తుంటాం. కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, తెలివిగా ఆలోచించాడు. బ్యాటర్ బంతిని బారీ షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్జ్టే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్‌గా నోర్ట్జే తీసుకున్న క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నోర్ట్జే ఆలోచన కాస్త కొత్తగా ఉండడంతో ''క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'' అన్న క్యాప్షన్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. @AnrichNortje02 Become The Superman What a catch 🔥 @DelhiCapitals #SAvsWIt20 📹 by FanCode pic.twitter.com/S3JntWA8qd — Mr Perfect 🤟🏻 (@starmanjeet007) March 25, 2023 చదవండి: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్!
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గజ్జ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గజ్జ నొప్పితో అతడు బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని పరిశీలించిన ప్రొటీస్ వైద్య బృందం కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో అతడిని రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఇక విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 87 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రోటీస్ విజయంలో నోర్జే కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన అన్రిచ్ .. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక వికెట్ సాధించాడు. ఇక గాయపడిన నోర్జే స్థానంలో ఆల్‌రౌండర్ విలియమ్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు వాండరర్స్ వేదికగా మార్చి8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా తుది జట్టు(అంచనా): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, విలియ్ ముల్డర్, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ చదవండి: Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా
సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి గ్రీన్ చేతి వేలికి బలంగా తగిలింది. వేగంతో దూసుకొచ్చిన బంతి గ్రీన్ చేతివేలిని చీల్చడంతో రక్తం కూడా కారింది.దీంతో గ్రీన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.రిటైర్డ్‌హర్ట్ అయ్యేటప్పటికి గ్రీన్ 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా గ్రీన్‌కు తీసిన ఎక్స్‌రే రిపోర్ట్ బయటకు రావడంతో ఆసక్తికర విషయం బయటపడింది. వాస్తవానికి నోర్ట్జే వేసిన బంతి వేగానికి గ్రీన్ వేలు విరిగినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే అయితే లంచ్‌కు ముందు 363/3తో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నాథన్ లియోన్ ఏడో వికెట్‌గా వెనుదిరగ్గానే కామెరున్ గ్రీన్ మరోసారి క్రీజులోకి వచ్చాడు. వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా నాలుగు గంటల పాటు క్రీజులో నిలబడ్డాడు. దాదాపు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గ్రీన్.. 177 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన గ్రీన్ బ్యాగీ గ్రీన్స్‌తో కలిసి జట్టును స్కోరును 575 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత స్టార్క్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అయితే వేలు విరిగి నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కామెరున్ గ్రీన్ బ్యాటింగ్ కొనసాగించడం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్లను మరింత పెంచుకొని అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఓటములతో సౌతాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య మూడోటెస్టు జనవరి 4 నుంచి 8 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. Cameron Green retired hurt after being hit on finger by a ball from Anrich Nortje!! 😳#AUSvsSA #BoxingDayTest pic.twitter.com/1X7PuYobCs — FaceTheFact! (@FaceTheFact7) December 27, 2022 -
వార్నర్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే! చెలరేగిన నోర్జే
Australia vs South Africa, 2nd Test- మెల్బోర్న్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 197 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 479 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోవడం గమనార్హం. టెస్టుల్లో 11వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌ను 93.2 ఓవర్లో బౌల్డ్ చేసిన నోర్జే.. ఆ మరుసటి బంతికే వార్నర్‌ను కూడా బౌల్డ్ చేశాడు. దీంతో అతడి ఖాతాలో మూడో వికెట్ చేరింది. అంతకుముందు స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాతి ఓవర్లో రబడ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వెయిర్నే పట్టుకోవడంతో ఆరో వికెట్ పడింది. కాగా నాథన్ లియాన్ ఎంగిడి బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రవిస్ హెడ్ (51), అలెక్స్ క్యారీ (62 నాటౌట్), కామెరాన్ గ్రీన్ (14 పరుగులతో) క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట విశేషాలు- భారీ భాగస్వామ్యం... ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆటలో భాగంగా మెల్బోర్న్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరడంతో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి స్థితిలో వార్నర్ పట్టుదలగా నిలబడగా, స్మిత్ అతనికి సహకరించడం విశేషం. ఈ క్రమంలో 144 బంతుల్లో వార్నర్ కెరీర్లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై సఫారీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వీరిద్దరు మూడో వికెట్‌కు 239 పరుగులు జోడించారు. స్మిత్ వెనుదిరిగిన కొద్ది సేపటికే వార్నర్ డబుల్ సెంచరీ పూర్తయింది. అయితే తీవ్ర ఎండలో 63 సింగిల్స్ తీసిన వార్నర్ 14 సార్లు రెండేసి, 7 సార్లు మూడేసి పరుగులు తీయడంతో పాటు 3 సార్లు నాలుగు పరుగులు కూడా తీశాడు. దాంతో అతను తీవ్రంగా అలసిపోయాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక వార్నర్‌ను ఇరు వైపుల సహచరులు పట్టుకొని బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. స్పైడర్ క్యామ్ దెబ్బ... మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆట మధ్యలో దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జే ఫీల్డింగ్‌లో మరో వైపుకు వెళుతున్న సమయంలో పైన వేలాడుతున్న స్పైడర్ క్యామ్ ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చి అతని ఎడమ భుజాన్ని, మోచేతిని బలంగా తాకింది. దాంతో నోర్జే మైదానంలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ పెద్ద దెబ్బ తగలకపోవడంతో బతికిపోయిన నోర్జే...స్పైడర్ క్యామ్ ఇంత కిందకు ఉండటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం ఫాక్స్ స్పోర్ట్స్ దీనిపై క్షమాపణలు చెప్పింది. విమర్శలను దాటి... కేప్‌టౌన్‌లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా అవే సూటిపోటి వ్యాఖ్యలు...కెప్టెన్సీ కావాలంటే కుటుంబంతో సహా విచారణకు రమ్మంటూ సొంత బోర్డునుంచే షరతులు... జనవరి 2020నుంచి టెస్టుల్లోనే సెంచరీ లేకపోగా, గత 10 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు! వార్నర్ టెస్టు కెరీర్ ముగిసినట్లే అంటూ విమర్శలు వస్తున్న సమయంలో అతను చెలరేగాడు. తన కెరీర్లో 100వ టెస్టును అందుకు సరైన వేదికగా ఎంచుకొని ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టి20, వన్డే స్పెషలిస్ట్‌గానే క్రికెట్ ప్రపంచం గుర్తించిన వార్నర్ టెస్టుల్లో సాధించిన ఘనతలు తక్కువేమీ కాదు. తాజా వివాదాల నేపథ్యంలో మెల్బోర్న్ టెస్టు ఆరంభానికి ముందు ‘అన్నీ మరచి ఒకప్పటి దూకుడైన వార్నర్‌లా ఆడతాను’ అంటూ వ్యాఖ్యానించిన అతను దానిని నిజం చేసి చూపించాడు. మంగళవారం అన్ని రకాల మేళవింపుతో అతని బ్యాటింగ్ సాగింది. వికెట్ల మధ్య పరుగెత్తడం మొదలు చూడచక్కటి షాట్లు ఆడటం వరకు వార్నర్ అలరించాడు. ముఖ్యంగా ప్రమాదకరంగా కనిపించిన నోర్జే, రబడ ఫాస్టెస్ట్ బంతులను కూడా సమర్థంగా ఎదుర్కొంటూ పుల్, హుక్ షాట్లతో తానేంటో అతను చూపించాడు. మైదానంలో ఫిట్నెస్పరంగా ప్రతికూల పరిస్థితి కనిపించినా అతను ఎక్కడా తగ్గలేదు. సెంచరీ పూర్తయ్యాక తనదైన శైలిలో గాల్లోకి ఎగిరి సంబరం జరుపుకున్న వార్నర్... డబుల్ సెంచరీ తర్వాత భావోద్వేగాలు ప్రదర్శించడం ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చూపించింది. 110 బంతుల్లోనే వార్నర్ తర్వాతి వంద పరుగులు రాబట్టడం విశేషం. కేవలం 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవంతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఈ ఫార్మాట్లలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వార్నర్ రికార్డుల మోత ►తన రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 123 నాటౌట్, పెర్త్‌లో భారత్‌పై 180, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా పై 134, 145, పాకిస్తాన్‌పై దుబాయ్‌లో 133, మిర్పూర్లో బంగ్లాదేశ్‌పై 112, అడిలైడ్‌లో పాకిస్తాన్‌పై చేసిన 335 నాటౌట్ అతని కెరీర్లో కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలుగా నిలిచాయి. ►100వ టెస్టులో సెంచరీ చేసిన 10వ ఆటగాడిగా (కౌడ్రీ, మియాందాద్, గ్రీనిడ్జ్, స్టివార్ట్, ఇంజమామ్,పాంటింగ్, గ్రేమ్ స్మిత్, ఆమ్లా, రూట్ తర్వాత) వార్నర్ నిలిచాడు. ►పాంటింగ్ ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయగా... రూట్, వార్నర్ మాత్రమే వాటిని డబుల్ సెంచరీలుగా మలిచారు. ఓవరాల్‌గా వార్నర్ 100 టెస్టుల్లో 46.67 సగటుతో 8122 పరుగులు చేశాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు -
వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే!
క్రికెట్ మ్యాచ్‌లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి మన ప్రాణం మీదకు వచ్చే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్టేడియాల్లో స్పైడర్ కెమెరాలు ఉండడం సహజం. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ప్రతీవైపును కవర్ చేయడమే స్పైడర్ కెమెరాల పని. అయితే గ్రౌండ్లో మినిమం ఎత్తులో ఉండే ఈ కెమెరాలు ఒక్కోసారి ఆటగాళ్ల కదలికలను గమనించేందుకు నిర్దేశించిన ఎత్తుకంటే కిందకు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఆటగాళ్లకు ఈ స్పైడర్ కెమెరాలు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక స్పైడర్ కెమెరా ప్రొటీస్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే ప్రాణం మీదకు తెచ్చింది. మెల్బోర్న్ వేదికగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. రెండో సెషన్లో ఓవర్ ముగిశాక బ్రేక్ సమయంలో ఒక స్పైడర్ కెమెరా నోర్ట్జే వైపు దూసుకొచ్చింది. అయితే వెనుకవైపు నిలబడిన నోర్ట్జే ఇది గమనించలేదు. అంతే వేగంగా వచ్చిన కెమెరా అతన్ని తలను బలంగా ఢీకొట్టింది. కెమెరా దెబ్బకు గ్రౌండ్‌పై పడిపోయిన నోర్ట్జే తిరిగి పైకి లేచాడు. అయితే ఇది గమనించిన స్మిత్ నోర్ట్జే దగ్గరకు వెళ్లి ఎలా ఉందని అడిగాడు.. దానికి ప్రొటీస్ బౌలర్ పర్లేదు.. బాగానే ఉన్నా అని చెప్పడంతో సహచరులతో పాటు అంపైర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ స్పైడర్ కెమెరా గట్టిగా తాకి జరగరానిది ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని క్రికెట్ అభిమానులు కామెంట్ చేశారు. నోర్ట్జేకు లక్కీగా పెద్ద గాయం కాలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోయుంటే ఇది ఎక్కడికి దారి తీసేదో అని తలుచుకుంటేనే భయమేస్తుంది. అంటూ మరొకరు పేర్కొన్నారు. మొత్తానికి మైదానాన్ని కనిపెట్టుకొని ఉండాల్సిన స్పైడర్ కెమెరా నోర్ట్జే ప్రాణం మీదకు తెచ్చింది. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 48 బ్యాటింగ్, అలెక్స్ కేరీ 9 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. సీనియర్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సూపర్ డబుల్ సెంచరీతో మెరిశాడు. కొంతకాలంగా ఆటకంటే కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియాతో వివాదంతో వార్తల్లో నిలిచిన వార్నర్ ఎట్టకేలకు డబుల సెంచరీ సాధించి విమర్శకుల నోర్లు మూయించాడు. ఇక స్టీవ్ స్మిత్ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. Ok, that’s really bad #spidercam #AUSvsSA pic.twitter.com/lqBLt5q52f — Josh Rowe (@joshrowe) December 27, 2022 Here’s the @FoxCricket Flying Fox / Spider Cam doing its bit to help the Aussie cricketers build a healthy lead against South Africa... 😬🎥 Hope the player it collided with (Nortje?) is okay! #AUSvSA pic.twitter.com/9cIcPS2AAq — Ari (@arimansfield) December 27, 2022 చదవండి: ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్ రాజా -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. -
WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. తద్వారా నెట్ రన్‌రేటు భారీగా పెంచుకుని గ్రూప్-2లో గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా వర్షం కారణంగా హోబర్ట్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫలితం తేలకుండా పోవడంతో ప్రొటిస్‌కు ఒకే ఒక్క పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్‌లో వరుణుడి రూపంలో ఇలా దురదృష్టం వెక్కిరించడంతో ఉసూరుమంది. అయితే, ఆ బెంగ తీరేలా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలీ రోసో అద్భుత సెంచరీ(109)తో మెరవగా.. 205 పరుగుల భారీ స్కోరు చేసింది సౌతాఫ్రికా. అద్భుతం చేసిన బౌలర్లు ఇక బౌలర్లు కగిసో రబడ ఒకటి, కేశవ్ మహరాజ్ ఒకటి, తబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీశారు. ఇక అన్రిచ్ నోర్జే 3.3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారీ తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి మూడు పాయింట్లు, నెట్రన్ రేటు 5.200తో గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా తర్వాతి స్థానం(2)లో నిలిచింది. ఈసారి విజేతగా సౌతాఫ్రికా ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ పేసర్, కామెంటేటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై తమ బౌలర్లు అద్భుతం చేయగలరని.. ప్రొటిస్ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌తో స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌కు కగిసో రబడ నాయకుడు. అతడికి తోడుగా అన్రిచ్ నోర్జే కూడా ఉన్నాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ల జోడీ అద్భుతంగా రాణించగలదు. వీళ్లిద్దరూ కలిసి ఈసారి సౌతాఫ్రికాకు వరల్డ్‌కప్ అందించగలరని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. నా టాప్-5 బౌలర్లు వీరే ‘‘వాళ్ల పేస్‌లో వైవిధ్యం ఉంది. మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్న బౌలర్లు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రబడ రెచ్చిపోవడం ఖాయం. నోర్జే కూడా తక్కువేమీ కాదు’’ అంటూ ప్రొటిస్‌ను గెలిపించగల సత్తా వీరికి ఉందని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఇక గ్రూప్-1లోని ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ తన ఫేవరెట్ అన్న ఈ స్పీడ్‌స్టర్.. యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతడు దిట్ట అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఈ టోర్నీలో గనుక ముందుకు వెళ్తే అందులో మార్క్‌దే కీలక పాత్ర అని చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత వరల్డ్‌కప్ టోర్నీలో తన టాప్-5 బౌలర్ల పేర్లను స్టెయిన్ వెల్లడించాడు. కగిసో రబడ, అన్రిచ్ నోర్జే, మార్క్ వుడ్, మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిదిలకు ఈ లిస్టులో స్థానమిచ్చాడు. ఇక స్టెయిన్ ఈ జాబితాలో ఒక్క టీమిండియా పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవని జట్టుగా సౌతాఫ్రికాకు అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టెయిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘కనీసం ఈసారైనా టైటిల్ గెలిచి చోకర్స్ ట్యాగ్‌ను తొలగించుకోండి’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్‌స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Anrich Arno Nortje