
Anrich Nortje Super Delivery.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్‌రిచ్ నోర్ట్జే సూపర్ డెలివరీతో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను నోర్ట్జే వేశాడు. కాగా ఓవర్ ఐదో బంతిని కుషాల్ పెరీరా డిఫెన్స్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. 145 కిమీ వేగంతో విసరడంతో కుషాల్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కుషాల్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రం కుషాల్ దానిని రిపీట్ చేయలేకపోయాడు. కాగా పెరీరా ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోర్ట్జే సూపర్ డెలివరీకి పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Kusal Perera's middle stump uprooted by Anrich Nortje. via @t20worldcup https://t.co/C2Y6j0DD3u
— varun seggari (@SeggariVarun) October 30, 2021
Comments
Please login to add a commentAdd a comment