Kusal Perera
-
శ్రీలంక ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. అయినా పాపం!
లంక ప్రీమియర్-2024లో జఫ్నా కింగ్స్ బోణీ కొట్టింది. బుధవారం పల్లెకెలె వేదికగా దంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జఫ్నా కింగ్స్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని జఫ్నా 6 వికెట్లు కోల్పోయి చేధించింది.జఫ్నా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అసలంక(50) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. దంబుల్లా బౌలర్లలో తుషారా, రెహ్మాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కుశాల్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. దంబుల్లా బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ పెరీరా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 52 బంతులు ఎదుర్కొన్న పెరీరా.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు నువనీడు ఫెర్నాండో(40) పరుగులతో రాణించాడు. ఏదేమైనప్పటికి దంబుల్లా ఓటమి పాలవ్వడంతో కుశాల్ సెంచరీ వృథా అయిపోయింది. కాగా ఎల్పీఎల్-2024లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా కుశాల్ పెరీరా నిలిచాడు. -
రఫ్ఫాడించిన రాయ్.. దంచికొట్టిన డికాక్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 29) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు చెలరేగిపోయారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్ ఆటగాడు జేసన్ రాయ్ (39 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా (20 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరితో పాటు ఆండ్రీ రసెల్ (5 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (20 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) లాంటి విండీస్ స్టార్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మ్యాచ్ ఫలితాల విషయానికొస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్‌పై ఢిల్లీ బుల్స్ (డికాక్ జట్టు) 9 వికెట్ల తేడాతో.. టీమ్ అబుదాబీపై చెన్నై బ్రేవ్స్ (జేసన్ రాయ్ జట్టు) 4 పరుగుల తేడాతో.. బంగ్లా టైగర్స్‌పై న్యూయార్క్ స్ట్రయికర్స్ (కుశాల్ పెరీరా జట్టు) 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించాయి. -
సెమీస్ లక్ష్యంగా! న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్
ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్ పోరాడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిసాంక(2)ను టిమ్ సౌథీ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(6)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ కుశాల్ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్ తీసి లాకీ ఫెర్గూసన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్ మూడో బంతికి ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు. దీంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు, ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్‌రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్ దృష్టి సారించింది. అయితే, ఓవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టి
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌పై శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరెరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై పెరెరా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టి చేసిన ఆటగాడిగా పెరీరా నిలిచాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హెడ్ రికార్డును కుశాల్ బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో కేవలం 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు, సౌథీ, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించాడు. చదవండి: అందుకే కోహ్లిని ప్రతిసారి ‘సెల్ఫిష్’ అంటున్నావా?: పాక్ మాజీ కెప్టెన్‌కు కౌంటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్‌కప్‌లో సూపర్ క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన షోర్ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో.. ఆఖరి బంతికి కుశాల్ పెరీరా ఆఫ్ సైడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న ముష్ఫికర్ రహీమ్ తన ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్క షాక్‌కు గురయ్యాడు. ముష్పికర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: శ్రీలంకతో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ (నవంబర్ 2) భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక ఓ మార్పు చేసింది. ధనంజయ డిసిల్వ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి వచ్చాడు. శ్రీలంక: పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
మిచెల్ స్టార్క్ క్రీడా స్పూర్తి.. రనౌట్ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. బ్యాటర్‌ను మన్కడింగ్(రనౌట్) చేసే అవకాశం ఉన్నప్పటికీ స్టార్క్ కేవలం వార్నింగ్‌తో మాత్రమే సరిపెట్టాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో నాలుగో బంతిని స్టార్క్ వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్టార్క్ బంతి డెలివరీ చేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కుశాల్ పెరీరా క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్టార్క్ బంతిని విసరకుండా ఆగిపోయాడు. అలా అని మన్కడింగ్(రనౌట్) కూడా చేయలేదు. వెంటనే పెరీరా వైపు చూసి మరోసారి అలా చేయవద్దు అంటూ హెచ్చరించాడు. అదే విధంగా ఫీల్డ్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. కాగా క్రీడా స్పూర్తి ప్రదర్శించిన స్టార్క్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొత్త నిబంధనల ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగిణిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే: భారత మాజీ క్రికెటర్ pic.twitter.com/YR8XbloNxc — Ishan Martinez (@IshanMarti66419) October 16, 2023 -
LPL 2023: చెలరేగిన కుశాల్ పెరీరా.. ఫైనల్లో డంబుల్లా
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు. -
పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో
ఆక్లాండ్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా విజయం శ్రీలంకనే వరించింది. 197 విజయ లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌ను వేసే బాధ్యత లంక కెప్టెన్ స్పిన్నర్ తీక్షణకు అప్పజెప్పాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 పరుగుల లక్క్ష్యంతో దిగిన శ్రీలంక.. మూడు బంతుల్లోనే ఛేదించింది. లంక బ్యాటర్ అసలంక సిక్స్, ఫోర్‌తో మ్యాచ్ ఫినిస్ చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అసలంక, పెరీరా సూపర్ ఇన్నింగ్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(45 బంతుల్లో 53), అసలంక(41 బంతుల్లో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 197 పరుగుల లక్క్ష్య చేధనలో కివీస్ కూడా ధీటుగా బదులిచ్చింది. డారిల్ మిచెల్(66), ఆఖరిలో సోధి(4 బంతుల్లో 10 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ మ్యాచ్‌ను టైగా ముగించింది. అయితే సూపర్ ఓవర్లో మాత్రం విజయం లంకవైపే నిలిచింది. ఇక ఈ ఏడాది కివీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి లంక బదులు తీర్చుకున్నట్లైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డునెడిన్ వేదికగా ఏప్రిల్ 5న జరగనుంది. చదవండి: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మృతి -
నోర్జ్టే సూపర్ డెలివరీ.. పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి
Anrich Nortje Super Delivery.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే సూపర్ డెలివరీతో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను నోర్ట్జే వేశాడు. కాగా ఓవర్ ఐదో బంతిని కుషాల్ పెరీరా డిఫెన్స్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. 145 కిమీ వేగంతో విసరడంతో కుషాల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కుషాల్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రం కుషాల్ దానిని రిపీట్ చేయలేకపోయాడు. కాగా పెరీరా ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోర్ట్జే సూపర్ డెలివరీకి పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Kusal Perera's middle stump uprooted by Anrich Nortje. via @t20worldcup https://t.co/C2Y6j0DD3u — varun seggari (@SeggariVarun) October 30, 2021 -
టి20 చరిత్రలో రెండో వేగవంతమైన బంతికి ఔటైన లంక క్రికెటర్‌గా
Mitchell Starc Delivers 2nd Fast Ball Dismiss Kusal Perera.. టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌లో కుషాల్ పెరీరా ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్‌తో మెరిశాడు. కాగా స్టార్క్ యార్కర్ డెలివరీకి కుషాల్ పెరీరా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్ మూడో బంతిని స్టార్క్ యార్కర్ వేయగా.. కుషాల్ పెరీరా ఢిపెన్స్ చేయబోయాడు. చదవండి: IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్స్.. టాస్ గెలువు కోహ్లి కానీ వేగంగా వచ్చిన బంతి పెరీరా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేశాడు. దీంతో క్లీన్‌బౌల్డ్ అయిన కుషాల్ నవ్వుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. కాగా టి20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతికి(గంటకు 144 కిమీ వేగం) ఔటైన లంక క్రికెటర్‌గా కుషాల్ పెరీరా నిలిచాడు. చదవండి: Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన Starc finds the faintest of edges https://t.co/BVCfHrA9v3 via @t20wc — Bhavana.Gunda (@GundaBhavana) October 28, 2021 -
AUS Vs SL: వార్నర్ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం
వార్నర్ మెరుపులు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సమయం: 22:45.. డేవిడ్ వార్నర్(65;42 బంతులు) మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 18 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. పించ్, వార్నర్‌లు కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు పునాది వేశారు. ఫించ్, మ్యాక్స్‌వెల్ ఔటైన తర్వాత వార్నర్ జోరు చూపగా.. స్మిత్ 28 పరగులు నాటౌట్ రాణించాడు. ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ 7 బంతుల్లో 16 పరుగులతో తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా సూపర్ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్(65) ఔట్.. 16 ఓవర్లలో 140/3 సమయం: 22:36.. డేవిడ్ వార్నర్(65) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. షనక బౌలింగ్‌లో రాజపక్సకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉంది. వార్నర్ హాఫ్ సెంచరీ.. 13 ఓవర్లలో ఆస్ట్రేలియా 112/2 సమయం: 22:20.. 13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అర్థసెంచరీ మార్క్‌ను సాధించాడు. కాగా అంతకముందు 5 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ హసరంగ బౌలింగ్‌లో ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్(37) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ వనిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. వార్నర్ 36, మ్యాక్స్‌వెల్ 1 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 5 ఓవర్లలో 56/0 సమయం: 21:48.. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 36 పరుగులతో, వార్నర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక 154/6.. ఆసీస్ టార్గెట్ 155 సమయం 21:13.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్‌లో కుషాల్ పెరీరా, చరిత్ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు. సమయం: 21:02.. 18 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 12 పరుగులు చేసిన దాసున్ షనక కమిన్స్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. లంక జట్టును మిచెల్ స్టార్క్ మరో దెబ్బ కొట్టాడు. 12.2వ ఓవర్లో హసరంగ(2 బంతుల్లో 4; ఫోర్)ను ఔట్ చేశాడు. దీంతో ఆ జట్టు 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ క్యాచ్ పటట్డంతో హసరంగ పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్‌లో రాజపక్స(2), షనక ఉన్నారు. అవిష్క ఫెర్నాండో(4) ఔట్.. లంక నాలుగో వికెట్ డౌన్ 11వ ఓవర్లో మూడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టుకు ఆ మరుసటి ఓవర్లో ఆడమ్ జంపా మరో షాకిచ్చాడు. అవిష్క ఫెర్నాండో(7 బంతుల్లో 4)ను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. 11.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 90/4. క్రీజ్‌లో రాజపక్స(2), హసరంగ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కుశాల్ పెరీరా(35) ఔట్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో సిక్సర్ బాది జోరుమీదున్న కుశాల్ పెరీరా(25 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్)ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో అవిష్క ఫెర్నాండో(2), భానుక రాజపక్స ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. 10 ఓవర్లలో 79/2 సమయం: 20:17.. ఇన్ఫామ్ బ్యాటర్ చరిత్ అసలంక(35) రూపంలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతికి స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. పెరీరా 29, అవిష్క ఫెర్నాండో 1 పరుగుతో ఆడుతున్నారు. సమయం: 19:58.. 6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. చరిత అసలంక(26 పరుగులు) దాటిగా ఆడుతుండగా.. పెరీరా 11 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన లంక.. సమయం: 19:43.. ఓపెనర్ పథుమ్ నిస్సాంక(7) రూపంలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సాంక పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శ్రీలంక 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అసలంక 20, కుషాల్ పెరీరా 7 పరుగులతో ఆడుతున్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 గ్రూఫ్ 1లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఇరుజట్లు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక 2010 టి20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియ, శ్రీలంక తలపడడం మళ్లీ ఇదే. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 16 సార్లు తలపడగా.. 8 సార్లు ఆసీస్.. 8 సార్లు లంక విజయాలు అందుకుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా.. రెండుసార్లు ఆసీస్.. ఒకసారి లంక విజయం అందుకుంది. శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్), కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, భానుక రాజపక్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
లంక జట్టుకు మరో షాక్.. గాయం కారణంగా స్టార్ క్రికెటర్ ఔట్
కొలొంబో: భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా దూరం కానున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కుశాల్ పెరీరా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలతో విభేదించిన విషయం తెలిసిందే. అయితే.. అదే సమయంలో అతని భుజానికి కూడా గాయం కావడంతో అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కుశాల్ పెరీరా గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం ఆరు వారాలు విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. జులై 18 నుంచి 29 వరకు టీమిండియాతో జరుగనున్న సిరీస్‌కు అతను దూరంగా ఉండటం ఖరారైంది. ఇదిలా ఉంటే, ధవన్ సేనతో సిరీస్ కోసం లంక జట్టును ఇంకా ప్రకటించలేదు. కాగా, 2013లో శ్రీలంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కుశాల్ పెరీరా.. ఇప్పటి వరకూ 22 టెస్టులు, 107 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 8 సెంచరీలు నమోదు చేసిన అతను.. నమ్మదగిన ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఎదిగాడు. కుశాల్ పెరీరా స్థానంలో భారత్‌తో సిరీస్‌కు శనక కెప్టెన్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై లంక క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
BAN Vs SL: ఎట్టకేలకు శ్రీలంక గెలిచింది!
ఢాకా: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి బంగ్లాదేశ్ జట్టుకు సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక చివరిదైన మూడో వన్డేలో 97 పరుగుల తేడాతో నెగ్గి ఊరట చెందింది. కెప్టెన్ కుశాల్ పెరీరా (122 బంతుల్లో 120; 11 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించడంతో... తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిరీ్ణత 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. గుణతిలక (33 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్), ధనంజయ డిసిల్వా (55 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 42.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. మొసద్దీక్ హుస్సేన్ (51; 3 ఫోర్లు, సిక్స్), మహ్ముదుల్లా (53; 2 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. శ్రీలంక బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దుష్మంత చమీరా 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. హసరంగ, రమేశ్ మెండిస్ రెండేసి వికెట్లు తీశారు. చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని! -
ఆ ముగ్గురికీ షాక్: శ్రీలంక కొత్త కెప్టెన్ అతడే!
కొలంబో: ఈ నెలాఖరులో బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న శ్రీలంక జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వికెట్ కీపర్ కుశాల్ పెరీరాను కొత్త కెప్టెన్‌గా నియమించారు. పెరీరా ఇప్పటివరకు 101 వన్డేలు, 22 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న కరుణరత్నేతోపాటు సీనియర్ ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్, మాజీ కెప్టెన్ దినేశ్ చండీమల్లపై సెలెక్టర్లు వేటు వేశారు. మరోవైపు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో జూలై లో భారత్... శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హంబన్‌టోట, దంబుల్లాలను వేదికలుగా పరిశీలిస్తున్నారు. 2018 నిదాహస్ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో ఆడలేదు. చదవండి: మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా... -
తొలి ఆసియా దేశంగా
ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి మహామహుల సారథ్యాలలోని జట్లు ఈ మైదానంలో విజయాన్ని సాధించలేకపోయాయి. టెస్ట్ ప్రారంభానికి ముందు ట్యాంపరింగ్ ఉదంతం.. కెప్టెన్ చండిమాల్‌పై వేటు.. ఒత్తిడిలో లంక యువ జట్టు.. సురంగ లక్మల్‌కు సారథ్య బాధ్యతలు.. సిరీస్‌లో వెనుకంజ.. టెస్టులో పలుమార్లు వర్షం అంతరాయం. ఇవన్నీ శ్రీలంక విజయానికి అడ్డంకి కాలేదు. ఆసియా జట్లకు కలగా ఉండే కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచి శ్రీలంక చరిత్ర సృష్టించింది. బ్రిడ్జిటౌన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. పేస్‌కు స్వర్గధామమైన కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. చివరి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో విశేషంగా రాణించిన విండీస్ కీపర్ షేన్ డౌరిచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డేనైట్ టెస్టులో చివరకు విజయం లంకనే వరించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను హోల్డర్ దెబ్బతీశాడు, వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో డి పెరీరా (23 నాటౌట్), కుశాల్ పెరీరా (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు. రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్ ఐదు వికెట్లు సాధించగా, కీమర్ రోచ్‌కు ఒక్క వికెట్ దక్కింది. చివరి టెస్టులో ఇరజట్ల స్కోర్ వివరాలు వెస్టిండీస్ : 204 & 93 శ్రీలంక : 154 & 144/6 -
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రీలంక క్రికెటర్
-
ఆసుపత్రి నుంచి పెరీరా డిశ్చార్జ్
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సోమవారం ఆటలో భాగంగా బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో కుశాల్ పెరీరా నియంత్రణ కోల్పోయి వెళ్లి ప్రకటనల బోర్డుని ఢీకొన్నాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కనీసం నడవలేకపోవడంతో స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడిందని.. ఒకవేళ జట్టుకి అవసరమైతే మంగళవారం బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధికారి ఒకరు తెలిపారు. -
ఐపీఎల్ ఆఫర్‌కు నో చెప్పాడు..!
హైదరాబాద్: అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)దే అగ్రస్థానం. ఇందులో కనీసం కొన్ని మ్యాచ్‌లైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. లీగ్‌లో ఒక్కసారి అద్భుతంగా రాణిస్తే తమ జీవితమే మారిపోతుందని భావిస్తుంటారు. ఇక్కడ ఆటగాళ్లకున్న క్రేజ్ ఆధారంగా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. ఇక లీగ్‌కు అభిమానుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను తీసుకోవాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావించింది. దీనిలో భాగంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పెరీరాను సంప్రదించగా ఐపీఎల్లో ఆడేందుకు తాను సిద్ధంగాలేనని సన్‌రైజర్స్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిసింది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్లో రాణించి తిరిగి లంక టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని కుశాల్ ఆశిస్తున్నాడట. దాంతో వచ్చిన ఐపీఎల్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు లంక జర్నలిస్టు డానియల్ అలెగ్జాండర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరోవైపు నిషేధాన్ని ఎదుర్కొన్న స్టీవ్‌స్మిత్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బీసీసీఐకి లేఖ రాసింది. -
శ్రీలంక ‘రికార్డు’ స్కోరు
కొలంబో:ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆది నుంచి దూకుడుగా ఆడారు. శ్రీలంక ఓపెనర్లలో దనుషా గుణతిలకా (26;19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) దాటిగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, కుశాల్ మెండిస్(57;30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. ఇక ఫస్ట్ డౌన్ ఆటగాడు కుశాల్ పెరీరా (74; 48 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగి ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కుశాల్ ద్వయం 85 పరుగులు జోడించింది. అయితే ఓ దశలో 8 పరుగుల వ్యవధిలో షనకా(0), చండిమాల్(2)లు పెవిలియన్ చేరడంతో శ్రీలంక తడబాటకు గురైంది. అటు తర్వాత పెరీరాకు జత కలిసిన ఉపుల్ తరంగా సమయోచితంగా ఆడాడు. మరొకవైపు పెరీరా బౌండరీలతో ఎదురుదాడి చేస్తూ లంక బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత పెరీరా ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. ఇక ఉపుల్ తరంగా(32 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 ఫోర్) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఫలితంగా అంతర్జాతీయ టీ 20ల్లో శ్రీలంక నాల్గో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై అత్యధిక టీ 20 స్కోరును సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లు సాధించగా, మహ్మదుల్లా రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్‌కు వికెట్ దక్కింది. -
ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం.!
ఇండోర్ : కొండంత లక్ష్యానికి అదరక.. బెదరక.. వరుస సిక్సర్లతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్న శ్రీలంక బ్యాట్స్‌మన్ కుషాల్ పెరీరా తమ ఓటమికి మణికట్టు బౌలర్లు కుల్దీప్, చహల్లే కారణమని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి బౌలింగ్ ఎదుర్కోవడానికి మా బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. బ్యాటింగ్ అనుకూలించే మైదానంలో మేమింకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది. మా బలాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఫీల్డింగ్ తీసుకున్నాం. కానీ రోహిత్, రాహుల్‌ల విరోచిత భాగస్వామ్యానికి అడ్డుకట్ట వేయలేకపోయాం. ఆటలో గెలుపు, ఓటములు సహజమే. మా తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకున్నాం. ఓ జట్టుగా మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ ఓటమి నుంచి కోలుకొని చివరి మ్యాచ్‌పై దృష్టి పెడ్తామని’ కుశాల్ వ్యాఖ్యానించాడు. కుల్దీప్, చహల్‌ల బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డ కుషాల్ పెరీరా 77 (37 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులతో గెలిపించేంత పనిచేశాడు. చివరికి కుల్దీప్ బౌలింగ్‌లో పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకకు ఎదురుదెబ్బ
కొలంబో(శ్రీలంక): ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి జోరుమీదున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా గాయం కారణంగా టోర్నికి దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా తన వ్యక్తిగత స్కోరు 47 పరుగుల వద్ద తొడకండరం పట్టేయడంతో అర్ధంతరంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెల్సిందే. పెరీరా స్థానంలో శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వాకు పిలుపువచ్చింది. డిసిల్వా శ్రీలంక తరపున 16 వన్డేలు ఆడి 334 పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన రెండో శ్రీలంక ఆటగాడు పెరీరా. ఇంతకుముందు చమర కపుగెదెరా మోకాలి గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో దనుష్క గుణతిలకను తీసుకున్నారు. క్రిస్ వోక్స్(ఇంగ్లండ్), వహబ్ రియాజ్(పాకిస్తాన్) కూడా గాయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, సోమవారం జరగనున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్‌కు వెళుతుంది. -
రెండు క్యాచ్‌లు నేలపాలు..ఆపై శతకం
హరారే:జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా శతకం నమోదు చేశాడు. తన టెస్టు కెరీర్లో మొదటి శతకం సాధించిన పెరీరాకు జింబాబ్వే ఆటగాళ్లు రెండు లైఫ్‌లు ఇచ్చారు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా పెరీరా 15, 30 పరుగుల వద్ద రెండు క్యాచ్‌లు ఇచ్చాడు. అయితే వాటిని అందుకోవడంలో జింబాబ్వే ఫీల్డర్లు విఫలం కావడంతో ఆ తరువాత పెరీరా ఎదురుదాడికి దిగి శతకం బాదేశాడు. 121 బంతులను ఎదుర్కొన్న పెరీరా (110;15 ఫోర్లు, 2 సిక్సర్లు ) సెంచరీ సాధించాడు. మిగతా శ్రీలంక ఆటగాళ్లలో కౌశల్వ సిల్వా(94), కరుణరత్నే(56)లు రాణించారు. వీరిద్దరి ఇచ్చిన క్యాచ్‌లను కూడా జింబాబ్వే వదిలేయడంతో శ్రీలంక తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. -
క్రికెటర్ పెరీరాకు నష్ట పరిహారం!
కొలంబో: శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తప్పుడు నివేదిక ఇవ్వడంతో అందుకు ప్రతిఫలంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే ఐసీసీకి అందజేసినట్లు శ్రీలంక చైర్మన్ తిలంగా సుమతిపాలా స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ పై వచ్చిన ఆరోపణల కారణంగా అతను ఖర్చుపెట్టిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా వాడాను ఐసీసీ కోరినట్లు సుమతి పాలా తెలిపారు. కుశాల్ విషయంలో తప్పు జరగడంపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరిహారం చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కాగా, ఆ పరిహారం అందిన వెంటనే కుశాల్ కు అందజేయనున్నట్లు తెలిపారు. డోపింగ్ చేశాడన్న ఆరోపణలతో నిషేధానికి గురైన పెరీరాకు గత రెండు నెలల క్రితం ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో న్యూజీలాండ్ తో పర్యటనకు వెళ్లిన కుశాల్, గత జూలైలో చేసిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడన్న కారణంగా స్వదేశానికి పంపించారు. యూఏఈలో పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా నిషేధిత పదార్థాలను తీసుకున్నాడని వాడా నిర్వహించిన టెస్టుల్లో తేలడంతో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే ఖతార్ కు చెందిన ల్యాబొరేటరీలో చేసిన డోపింగ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో కుశాల్ పై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. -
శ్రీలంక క్రికెటర్ పై నాలుగేళ్ల నిషేధం
కొలొంబో: అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఎక్కువగా డోపింగ్ ఉదంతాలు కుదిపేసిన వార్తలను తరుచు వింటుంటాం. అయితే అంతర్జ్తాతీయ స్థాయి క్రికెటర్ డోపింగ్ లో పట్టుబడి నాలుగేళ్ల పాటు నిషేధానికి గురైన ఘటన తాజాగా శ్రీలంక క్రికెట్ లో కలకలం సృష్టించింది. శ్రీలంక జాతీయ క్రికెటర్ కుశాల్ పెరీరా డోపింగ్ కు పాల్పడినట్లు తాజాగా రుజువు కావడంతో అతనిపై నాలుగేళ్ల నిషేధం పడింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖతర్ లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతని యూరిన్ శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చాయి. ఈ విషయాన్ని ఐసీసీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు శ్రీలంక క్రీడాశాఖా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. కుశల్ పెరీరా నిషేధిత ద్రవ పదార్థాన్ని తీసుకున్నట్లు అతనికి నిర్వహించిన డోపింగ్ టెస్టు శాంపిల్స్ లో బహిర్గతమైనట్లు పేర్కొన్నారు. కాగా, దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని దయసిరి జయశేఖర్ పేర్కొన్నారు. ఇలా శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ టెస్టులో పట్టుబడిన రెండో క్రికెటర్ పెరీరా. అంతకుముందు 2011లో ఉపల్ తరంగా ఈ తరహాలోనే పట్టుబడి మూడు నెలలు బహిష్కరణకు గురయ్యాడు.