రఫ్ఫాడించిన రాయ్‌.. దంచికొట్టిన డికాక్‌ | Quinton de Kock And Jason Roy Shines In Abu Dhabi T10 League 2023 | Sakshi
Sakshi News home page

రఫ్ఫాడించిన రాయ్‌.. దంచికొట్టిన డికాక్‌

Published Thu, Nov 30 2023 9:24 AM | Last Updated on Thu, Nov 30 2023 9:53 AM

Quinton De Kock And Jason Roy Shines In Abu Dhabi T10 League 2023 - Sakshi

అబుదాబీ టీ10 లీగ్‌ 2023లో భాగంగా నిన్న (నవంబర్‌ 29) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్‌ క్రికెటర్లు చెలరేగిపోయారు. టీమ్‌ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ (39 బంతుల్లో 84 నాటౌట్‌; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్‌ స్ట్రయికర్స్‌ ఆటగాడు కుశాల్‌ పెరీరా (20 బంతుల్లో 50 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. 

వీరితో పాటు ఆండ్రీ రసెల్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్‌ (20 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు), జాన్సన్‌ చార్లెస్‌ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (12 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) లాంటి విండీస్‌ స్టార్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

మ్యాచ్‌ ఫలితాల విషయానికొస్తే.. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌పై ఢిల్లీ బుల్స్‌ (డికాక్‌ జట్టు) 9 వికెట్ల తేడాతో.. టీమ్‌ అబుదాబీపై చెన్నై బ్రేవ్స్‌ (జేసన్‌ రాయ్‌ జట్టు) 4 పరుగుల తేడాతో.. బంగ్లా టైగర్స్‌పై న్యూయార్క్‌ స్ట్రయికర్స్‌ (కుశాల్‌ పెరీరా జట్టు) 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement