
Photo Courtesy: BCCI
కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్‌లోనే క్వింటన్ డికాక్ ఓ భారీ రికార్డు సాధించాడు. నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 97 పరుగులు చేసిన అతడు.. కేకేఆర్ తరఫున విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్ 2014 సీజన్ ఫైనల్లో పంజాబ్‌పై 94 పరుగులు చేశాడు.
విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
97* - క్వింటన్ డికాక్ vs RR, గౌహతి, 2025
94 - మనీశ్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్
93* - క్రిస్ లిన్ vs GL, రాజ్‌కోట్, 2017
92 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 2013
90* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016
కాగా, రాయల్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో డికాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో డికాక్ బాధ్యతాయుతంగా ఆడి కేకేఆర్‌ను గెలిపించాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో డికాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
గత సీజన్‌లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపనప్పటికీ.. రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీలకు (ఢిల్లీ, ముంబై, లక్నో, ఢిల్లీ) ఆడిన డికాక్.. నాలుగింటి తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు ఫ్రాంచైజీల తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ డికాకే.