
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో సీఎస్‌కే వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్‌కే పరాజయం పాలైంది. మరోసారి సీఎస్‌కే బ్యాటర్లు తేలిపోయారు. కేకేఆర్ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు.
ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో ధోని ఔట్ చర్చనీయాశంగా మారింది. ధోని ఔట్‌గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.
ధోనిది ఔటా? నాటౌటా?
సీఎస్‌కే ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో మూడో బంతిని ధోని ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ధోని ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు.
దీంతో ఫీల్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో ధోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ తొలుత అల్ట్రా ఎడ్జ్‌ను చెక్ చేశాడు. అయితే బంతి బ్యాట్‌ను దాటినప్పుడు కాస్త కదలిక కన్పించింది. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటిస్తాడని అంతాభావించారు.
కానీ థర్డ్ అంపైర్ మాత్రం క్లియర్‌గా బ్యాట్, బాల్‌కు మధ్య గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకుతోందని స్ఫష్టం కావడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో చెపాక్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
కామెంటేటర్‌లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయిపోయారు. అంపైర్ నిర్ణయాన్ని చాలా మంది తప్పు బడతున్నారు. అది క్లియర్‌గా నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని కేవలం ఒక్క మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: IPL 2025: నరైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్‌కేపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ