నేను ఎప్ప‌టికీ ధోనీ ఫ్యాన్‌నే.. ఎవ‌రేమ‌నుకున్నా ఫ‌ర్వాలేదు: రాయుడు | Ambati Rayudu Hits Back At Trolls Over MS Dhoni Remarks | Sakshi
Sakshi News home page

నేను ఎప్ప‌టికీ ధోనీ ఫ్యాన్‌నే.. ఎవ‌రేమ‌నుకున్నా ఫ‌ర్వాలేదు: రాయుడు

Apr 10 2025 5:22 PM | Updated on Apr 10 2025 5:49 PM

Ambati Rayudu Hits Back At Trolls Over MS Dhoni Remarks

టీమిండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు త‌న వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఇటీవ‌ల త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌-2025లో కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రాయుడు.. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ దిగ్గ‌జం  ఎంఎస్ ధోనిని అతిగా ప్ర‌శంసిస్తున్నందుకు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు గుర‌వ‌తున్నాడు.

గ‌తంలో సీఎస్‌కే ఆడిన రాయుడు.. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ధోని క్రీజులోకి వ‌స్తే చాలు పోగ‌డ్త‌ల‌తో ముంచెత్తున్నాడు. జట్టుతో, మ్యాచ్‌తో సంబంధం లేకుండా ధోనీ నామస్మరణలోనే అత‌డు మునిగిపోతున్నాడు. అత‌డి అతి కామెంట్రీ చాలా మందికి విసుగు తెప్పిస్తుంది. 

ఏప్రిల్ 8న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 18 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని క్రీజులోకి వ‌స్తున్న‌ప్పుడు అత‌డిని కత్తి పట్టుకున్న యోధుడితో రాయుడు పోల్చాడు. ధోనీ ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్నట్లు ఉంది. ఆ ఖడ్గం కచ్చితంగా ఫలితం సాధిస్తుంది అని రాయుడు వ్యాఖ్య‌నించాడు. 

ఆ త‌ర్వాత అత‌డి వ్యాఖ్య‌ల‌కు స‌హ‌చ‌ర హిందీ కామెంటేట‌ర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌంట‌రిచ్చాడు. ధోనీ క్రికెట్‌ ఆడటానికి వచ్చాడు. యుద్ధంలో పాల్గొనడానికి కాదు సిద్దూ త‌న ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అదేవిధంగా అభిమానులు కూడా రాయుడు టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు.

నేనెప్పటికీ త‌లా ఫ్యాన్‌నే
త‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న ట్రోల్స్‌పై రాయుడు స్పందించాడు. ట్రోల్స్ చేస్తున్న వారికి రాయుడు ఎక్స్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. త‌ను ఎప్పుడూ ధోని ఫ్యాన్‌నే అని, ఎవ‌రేమ‌నుకున్నా ప‌ర్వాలేదు అని అంబ‌టి అన్నాడు

"నేనెప్ప‌టికీ త‌లా అభిమానినే. ఎవ్వరేం అనుకున్నా, ఎవ్వరేం చేసినా సరే ఈ విషయంలో ఒక్క శాతం కూడా మార్పు రాదు.  కాబ‌ట్టి పెయిడ్ పీఆర్ కోసం డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం ఆపేయండి. ఆ డ‌బ్బుల‌ను ఏదైనా ఛారిటీకి ఇవ్వండి. అలా చేస్తే ఎంతోమంది పేద‌ల‌కు సాయం చేసిన వారు అవుతార‌ని" ఎక్స్‌లో రాయుడు రాసుకొచ్చాడు.

కాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధోని.. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.  అత‌డి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. అయితే ఈమ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement