
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్దానంలో లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని(MS DHONI)కి మరోసారి తమ జట్టు పగ్గాలను సీఎస్‌కే మేనెజ్‌మెంట్ అప్పగించింది.
"రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఎముక విరిగింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి రుతురాజ్ తప్పుకున్నాడు. అతడి స్ధానంలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు" అని కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు గురువారం విలేకరుల సమావేశంలో ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
కాగా గైక్వాడ్ మార్చి 30న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. ఆ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ షార్ట్ బాల్ గైక్వాడ్ మోచేయికి బలంగా తాకింది. వెంటనే రుతు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడాడు. ఆ తర్వాత ఫిజియో సాయం తీసుకుని తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఆ తర్వాతి మ్యాచ్‌లకు రుతురాజ్ దూరంగా ఉంటాడని వార్తలు వినిపించాయి. కానీ ఫిట్‌నెస్ సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లు గైక్వాడ్ అందుబాటులో ఉన్నాడు. అయితే నొప్పితోనే ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా అతడు ఆడినట్లు తెలుస్తోంది. తాజా స్కాన్ రిపోర్ట్‌లో మోచేయి ఎముక విరిగినట్లు తేలింది. ఈ క్రమంలో ఈ ఏడాది సీజన్‌లో మిగిలన మ్యాచ్‌ల మొత్తానికి రుతు దూరమయ్యాడు.
ధోని.. శుక్రవారం(ఏప్రిల్ 11) చెపాక్ వేదికగా కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తిరిగి సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కెప్టెన్‌గా ధోనికి అపారమైన అనుభవం ఉంది. అతడి సారథ్యంలోనే సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచింది. మిస్టర్ కూల్ 235 మ్యాచ్‌ల్లో సీఎస్‌కేకు నాయకత్వం వహించాడు. మరోసారి తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించేందుకు ఈ జార్ఢండ్ డైనమేట్ సిద్దమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది.

🚨 OFFICIAL STATEMENT 🚨
Ruturaj Gaikwad ruled out of the season due to a hairline fracture of the elbow.
MS DHONI TO LEAD. 🦁
GET WELL SOON, RUTU ! ✨ 💛#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/U0NsVhKlny— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025