కుసాల్‌ పెరీరా ఊచకోత | Kusal Perera Explosive Innings Steals The Show In Abu Dhabi T10 | Sakshi
Sakshi News home page

కుసాల్‌ పెరీరా ఊచకోత

Published Fri, Nov 29 2024 8:16 AM | Last Updated on Fri, Nov 29 2024 10:09 AM

Kusal Perera Explosive Innings Steals The Show In Abu Dhabi T10

అబుదాబీ టీ10లో శ్రీలంక ఆటగాడు కుసాల్‌ పెరీరా రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో న్యూయార్క్‌ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పెరీరా.. నార్త్రన్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో పెరీరా 27 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా న్యూయార్క్‌ స్ట్రయికర్స్‌ 9 వికెట్ల తేడాతో నార్త్రన్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌ 15 బంతుల్లో 30, కొలిన్‌ మున్రో 15 బంతుల్లో 10, జాన్సన్‌ ఛార్లెస్‌ 11 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్‌ కాగా.. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (17 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), అజ్మతుల్లా (2 బంతుల్లో 2) అజేయంగా నిలిచారు. స్ట్రయికర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌కు రెండు వికెట్లు లభించాయి.

అనంతరం 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్‌.. కుసాల్‌ పెరీరా ఊచకోత ధాటికి కేవలం 8 ఓవర్లలోనే (వికెట్‌ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసిఫ్‌ అలీ (12 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు) పెరీరాకు అండగా నిలిచాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ 10 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. వారియర్స్‌ బౌలర్లలో అజ్మతుల్లాకు ఓ వికెట్‌ దక్కింది. ఈ గెలుపుతో స్ట్రయికర్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement