Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral - Sakshi
Sakshi News home page

Wanindu Hasaranga: వారెవ్వా హసరంగ.. పాదరసంలా కదిలి.. ఎగిరి.. అందుకే కదా నువ్వు బెస్ట్‌!

Published Sat, Nov 27 2021 2:43 PM | Last Updated on Sat, Nov 27 2021 3:31 PM

Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral - Sakshi

PC: Twitter

Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో దక్కన్‌ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హసరంగ.. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై బ్రేవ్స్‌తో మ్యాచ్‌లో పాదరసంలా కదిలి.. జట్టుకు ఐదు పరుగులు సేవ్‌ చేశాడు. సిక్సర్‌ ఖాయమనుకున్న తరుణంలో హసరంగ బంతిని ఆపడంతో కంగుతినడం బ్యాటర్‌ వంతైంది. 

అబుదాబిలో షేక్‌ జాయేద్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్కన్‌ గ్లాడియేటర్స్‌ చెన్నై బ్రేవ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డేవిడ్‌ వీజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ మహ్మద్‌ షెహజాద్‌ భారీ షాట్‌ ఆడాడు. సిక్స్‌ ఖాయం అనుకున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న హసరంగ మెరుపులా కదిలి బంతిని లోపలికి విసిరాడు.

ఎలాగో ఆరు పరుగులు వస్తాయి కదా అనుకున్న చెన్నై బ్రేవ్స్‌ హసరంగా షాక్‌తో ఒక పరుగు మాత్రమే సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హసరంగ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్కన్‌ గ్లాడియేటర్స్‌ 5 వికెట్ల తేడాతో బ్రేవ్స్‌పై గెలుపొందింది. 

చదవండి: Ind Vs Nz 1st Test Highlights: సూపర్‌ భరత్‌... సాహా స్థానంలో వచ్చీరాగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement