Abu Dhabi
-
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు. అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్‌కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి. (చదవండి: జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!) -
బాస్కెట్ బాల్ గేమ్ కోసం అబుదాబి వెళ్లిన 'మట్కా' బ్యూటీ నోరా ఫతేహి (ఫోటోలు)
-
#IIFAAwards2024 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక (ఫొటోలు)
-
#IIFAUtsavam2024 : అబుదాబిలో ఘనంగా ఐఫా.. మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
-
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్‌కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్‌గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్‌కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్‌గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్‌తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్‌తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్‌కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్‌కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్‌కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్‌కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్‌లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్‌లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
అబుదాబిలో కలిసి డీల్!.. పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు
-
బంధం బలపడుతోంది!
ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్‌లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్‌లోని వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్‌సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్‌లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్‌దేశాన్ని సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్‌సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట. అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్ ప్రపంచానికీ, ఇజ్రాయెల్‌కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. ఖతార్ సైతం భారత్‌లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్ – ఖతార్‌ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి. ఇంధనం, డిజిటల్ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్ – అరబ్ ఎమిరేట్స్ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి. -
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం!
యూఏఈలోని అబుదాబిలో నిర్మితమైన మొదటి హిందూ దేవాలయం బుధవారం (ఫిబ్రవరి 14)నాడు ప్రారంభమయ్యింది. బీఏపీఎస్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు అబుదాబి తర్వాత మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మితం కాబోతోంది. ఇందుకోసం ఆ దేశ రాజు నుంచి భూమిని విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని బోచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో బీఏపీఎస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. దీనికి ముందు స్వామి అక్షరతి దాస్, డాక్టర్ ప్రఫుల్ల వైద్య, రమేష్ పాటిదార్, మహేష్ దేవ్‌జీ తదితరులు ఆలయ నిర్మాణం విషయమై చర్చించేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌ను కలిశారు. అన్ని మతాల ప్రజలను స్వాగతించడం, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని బీఏపీఎస్ పేర్కొంది. బహ్రెయిన్‌లోని హిందూ ఆలయ నిర్మాణానికి భూమిని ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీ.. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. -
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్‌తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం..సామరస్యానికి ప్రతీక..
-
భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్
అబుదాబి: యూఏఈ, భారత్ మైత్రి ప్రపంచానికే ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. మంగళవారం అబూదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘అహ్లాన్ (హలో) మోదీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న కార్యక్రమం ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’, ‘వుయ్ లవ్ మోదీ’, ‘ భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిపోయింది. స్టేడియం బయట మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ సాదర స్వాగతం పలికారు. ప్రేక్షకులనుద్దేశించి మోదీ ఏమన్నారంటే... ‘‘యూఏఈ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చి మీరంతా చరిత్ర సృష్టించారు. భారత్‌లోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. అందరి హృదయాలను యూఏఈ కలిపింది. ఇక్కడి ప్రతి ఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం, ప్రతి గళం ‘భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తోంది. ఇరు దేశాల మైత్రి ప్రపంచానికే ఒక మోడల్‌గా మారింది. 21వ శతాబ్ది మూడో దశకంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేరుతోంది. రోజు రోజుకూ ఈ బంధం మరింత బలపడాలని భారత్ మనసారా కోరుకుంటోంది. ప్రతిభ, సృజన, సంస్కృతిలో మన అనుబంధం దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. భారతీయ భాషల్లో అంతర్భాగంగా కలిసిపోయిన అరబిక్ పదాలను ప్రస్తావించారు. ఆ పదాలను మోదీ ఉచ్ఛరించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది ‘140 మంది భారతీయుల సందేశాన్నిమోసుకొచ్చా. అదేంటంటే.. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది. ఈ పదేళ్లలో ఏడు సార్లు ఇక్కడికొచ్చా. ఈరోజు కార్యక్రమం నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇది నాకు మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సుఖమయ జీవనం, సులభతర వాణిజ్యానికి ఇరు దేశాలు కృషిచేస్తున్నాయి. 2047 కల్లా ‘అభివృద్ధి చెందిన భారత్’ ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే. ప్రధానిగా మూడోదఫా పాలనలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుస్తానని గ్యారెంటీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తర్వాత స్టేడియంలో ఓపెన్‌టాప్ బ్యాటరీ వాహనంలో స్టేడియంలో అంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు అభివాదం చేశారు. జాతీయ జెండాలతో, సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో విచ్చేసిన జనంతో స్టేడియం భారతీయతను సంతరించుకుంది. మోదీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కొన్ని వాక్యాలు మాట్లాడారు. -
అరబ్బుల రాజధానిలో...అబ్బురాల ఆలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిందూ ఆలయం. కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది. అదే బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) మందిరం. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్‌తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది... విశేషాలెన్నో... బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్‌లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ► ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. ► దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. ► 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ► దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ► ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ► ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్‌లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. ► మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ► వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్‌లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం! ► ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. ► మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా... ► ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. ► రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ► ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. ► భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం. ఇలా పురుడు పోసుకుంది... ► 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. ► 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ► ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. ► 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. -
భారత్ ను వీడనున్న ఇంగ్లాండ్ జట్టు
-
Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్ కమ్యూనిటీస్. ఈ క్రమంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్న ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది. ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు. -
అబుదాబిలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
-
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్‌స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్‌ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్‌స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
క్యూబ్ హైవేస్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, అబుధాబి సావరిన్ సంస్థ ముబడాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తదితరాల నుంచి క్యూబ్ హైవేస్ ట్రస్ట్ 63 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,226 కోట్లు) సమీకరించింది. ఇన్విట్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అయిన క్యూబ్ హైవేస్ ఫండ్ అడ్వయిజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నిధుల సమీకరణ అంశాన్ని వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ కింద జారీ చేసిన ఇన్విట్ సాధారణ యూనిట్లను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. దేశీయంగా లిస్టయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్).. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో కెనడియన్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బీసీఐ, ముబడాలతోపాటు మరికొన్ని దేశీ సంస్థలు కొత్త యాంకర్ ఇన్వెస్టర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. 18 ఆస్తులు క్యూబ్ హైవేస్ ఇన్విట్ దాదాపు 1,424 కిలోమీటర్ల పొడవైన 18 టోల్, యాన్యుటీ రోడ్ ఆస్తులను కలిగి ఉంది. వీటిలో 17 ఎన్హెచ్ఏఐ టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒకటి ఎన్హెచ్ఏఐ యాన్యుటీ రోడ్ ప్రాజెక్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, హర్యానా తదితర 11 రాష్టాలలో రోడ్ ప్రాజెక్టులు విస్తరించినట్లు తెలియజేసింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ. 10,000 కోట్ల రుణ సౌకర్యాలను పొందేందుకు సంతకాలు జరిగినట్లు క్యూబ్ హైవేస్ ఇన్విట్ పేర్కొంది. ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్‌కు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. -
రిటైర్మెంట్కు ముందు సానియా మీర్జాకు పరాభవం
రిటైర్మెంట్కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్ టెన్నిస్ టోర్నీ-2023లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)–లౌరా సిగెముండ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
గగనతలంలో ఉన్న విమానంలో మంటలు.. 184 మంది ప్రయాణికులు..
గగనతలంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్ ఇంజన్లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. #BREAKING | Massive scare on an #AirIndia Express plane from Abu Dhabi to Calicut. The flight's engine caught fire during climb, forcing it to make landing. @Aruneel_S reports pic.twitter.com/IY8zYYZaV1 — Mirror Now (@MirrorNow) February 3, 2023 కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. -
అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...
నోయిడా: నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారవేత్తను అబుదాబి పోలీసులు నేరస్తుడిగా భావించి నిర్బంధించారు. ఆ వ్యాపారస్తుడిని తాము గాలిస్తున్న నేరస్తుడిగా పొరబడి ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. పైగా అతనిని నేరస్తుడిగా అంగీకరించమంటూ బలవంతం చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ కుటుంబం అతనను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడమే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. దీంతో ప్రవీణ్ కుమార్‌ని అబుదాబి పోలీసులు వెంటనే వదిలేశారు. తాము పొరపడి బంధించినట్లు అబుదాబీ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా హబీబ్‌పూర్‌కు చెందిన సదరు వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విమానాశ్రయంలో అబుదాబి సీఐడీ తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించిందని, తర్వాత వదిలిపెట్టినట్లు వదిలి మళ్లీ తాను బయలుదేరుతున్న సమయంలో రెండోసారి నిర్బంధించారని తెలిపారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని తనను విడుదలయ్యేలా చేసినందుకు ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కి ధన్యావాదాలు తెలిపారు. తనను శనివారం అబుదాబి పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామన భారత్‌కి తిరిగి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఐతే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడంతోనే త్వరితగతిన చర్యలు తీసుకోగలిగనట్లు అధికారులు తెలిపారు. (చదవండి: విజయపురలో పరువు హత్య?)