
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్‌వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment