భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది.
అంతేకాదు, బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి.
ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా..
ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్‌కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది.
ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్‌లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్‌గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్‌తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్.
2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్‌కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు.
ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది.
ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్‌గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్‌తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది.
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది.
ఈ ప్రాంతంలో భారత్‌కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్‌కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి.
సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి.
ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్‌కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు.
చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది.
ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్‌లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్‌లో చేరిపోయాయి.
పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.
- వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్
- మనోజ్ జోషీ
Comments
Please login to add a commentAdd a comment