Mohammad Bin Salman
-
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్‌కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్‌గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్‌కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్‌గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్‌తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్‌తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్‌కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్‌కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్‌కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్‌కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్‌లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్‌లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
సౌదీ యువరాజు సల్మాన్ బిన్‌తో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
FIFA WC: సంచలన విజయానికి.. ఊహించని భారీ నజరానా
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనాను 2-1తో మట్టికరిపించి సౌదీ జట్టు సంచలనం సృష్టించింది. ఒక పెద్ద జట్టుపై సాధించిన విజయాన్ని ఆ దేశంలో పెద్ద సంబరంలా జరుపుకోవడమే కాదు ఒకరోజు అధికారిక సెలవుగా ప్రకటించడం విశేషం. అర్జెంటీనా లాంటి పటిష్ట జట్టును ఓడించి రౌండ్ ఆఫ్ 16 అవకాశాలను సులువుగా మార్చుకున్న సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టుకు మరో బంపరాఫర్ తగిలింది. అర్జెంటీనాపై గెలిచినందుకు జట్టులోని ఒక్కో ఆటగాడికి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు రోల్స్ రాయిస్ సంస్థ పేర్కొంది. అర్జెంటీనాపై గెలిస్తే ఆటగాళ్ళకు రోల్స్ రాయిస్ కారును గిప్ట్గా ఇస్తానని సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట ఇచ్చారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటూ ఆటగాళ్లందరికి రోల్స్ రాయిస్ కారును బహుమతిగా అందజేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక రోల్స్ రాయిస్ ఒక్క కారు ఖరీదు 500,000 యూరోలు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 కోట్లకు పై మాటే). అయితే సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి గిఫ్ట్‌లు రావడం ఇదేమి కొత్త కాదు. ఇంతకముందు 1994 వరల్డ్‌కప్‌లో బెల్జియంను 1-0తో ఓడించినప్పుడు.. అప్పటి మ్యాచ్‌లో గోల్‌తో జట్టును గెలిపించిన సయీద్ అల్ ఒవైరన్‌కు లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు. ఇక ఇప్పటి మ్యాచ్‌లో సౌదీ అరేబియా తొలుత 0-1తో వెనుకబడింది. అయితే రెండో అర్థభాగంలో అనూహ్యంగా ఫుంజుకున్న సౌదీ అరేబియా వరుసగా రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతేకాదు 36 మ్యాచ్‌ల్లో ఓటమి అనేదే లేకుండా సాగిన అర్జెంటీనాకు చెక్ పెట్టింది. ఇక శనివారం లెవాండోస్కీ నేతృత్వంలోని పటిష్టమైన పొలాండ్‌ను సౌదీ అరేబియా ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గనుక సౌదీ అరేబియా గెలిస్తే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. చదవండి: కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్ స్టార్ FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి -
10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. -
మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా
రియాద్: తమ తండ్రిని హతమార్చిన వారిని క్షమిస్తున్నామని దివంగత సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు.. ‘‘అమరుడైన జమాల్ ఖషోగ్గీ కుమారులమైన మేము.. మా నాన్నను హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటన చేస్తున్నాం’’ అని ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ ట్వీట్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అతడు స్పష్టతనివ్వలేదు. కాగా అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ ప్రస్తుతం సౌదీలో నివసిస్తున్నాడు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసిన ఖషోగ్గీ.. 2018 అక్టోబరులో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ సమాజం సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.(ఖషోగ్గీ సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!) ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఖషోగ్గీ హత్యోందంతానికి సంబంధించిన నిజాలు వెలికితీసేందుకు తమ గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ)ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో రియాద్ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు ఖషోగ్గీని హతమార్చారని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గీ అనుమానాస్పద మృతి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో.. అతడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసులో సౌదీ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించగా.. ముగ్గురు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.(ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్న సలా.. దోషులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దోషులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. కాగా ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది. -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం
రియాద్ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సౌదీ రాజ కుంటుంబంలో కలకలం రేపింది. సౌదీ రాజ కుటుంబంతో కొన్ని వారాల క్రితం సన్నిహితంగా మెలిగిన ఆ దేశ ప్రతినిధుల్లో 150 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు.రియాద్ గవర్నర్ ఫైసల్ బిన్‌కు కరోనా సోకడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ఫైసల్ బిన్(72) వయసులో పెద్దవాడు కావడంతో అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతో పాటు మిగతావారు ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సౌదీలో ప్రఖ్యాత మక్కా, మదీనాలను ప్రజలెవరు సందర్శించకుండా మార్చి మొదటివారంలోనే మూసివేశారు.(దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు) సౌదీ రాజులు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు క్రమం తప్పకుండా యూరోప్ దేశాలకు వెళ్లివస్తుంటారు. కాగా విదేశాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వారందరిని సౌదీకి తీసుకువచ్చి క్వారంటైన్లో ఉంచారు. కరోనా విజృంభిస్తోన్నసమయం కావడంతో దేశం వెలుపల, అలాగే సౌదీ ప్రావిన్సుల మధ్య ప్రయాణాలు చాలావరకు పరిమితం చేశారు. అలాగే సౌదీలోని నాలుగు గవర్నెన్పెలతో పాటు ఐదు ప్రధాన నగరాలు 24 గంటల లాక్డౌన్లో ఉంచబడినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు సౌదీలో 2932 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 41కి చేరింది. -
సౌదీలో సంక్షోభం
-
'జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేయలేదు'
వాషింగ్టన్ : వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్‌కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు. కాగా 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వాషింగ్టన్ పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని తమ కథనంలో పేర్కొంది. దీంతో పాటు 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయముందని సెంట్రల్ కూడా తమ కథనంలో రాసుకొచ్చింది. (జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ రాజు) -
సౌదీ రాజుతో గినా భేటి అందుకేనా?
రియాద్ : సౌదీ అరేబియా రాజు సల్మాన్ అమెరికా గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ) డైరెక్టర్ గినా హాస్పెల్‌తో సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ భేటిలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడేందుకు చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో సౌదీ రాజుతో పాటు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, ఇంటలెజిన్స్ చీఫ్ ఖలీద్ అల్ హమ్దీన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ముగ్గురు సౌదీ పౌరులపై బుధవారం అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు సౌదీ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి(సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌గా ఆరోపణలు ఉన్నాయి) ట్విటర్ ఖాతాతో అమెరికాలో గూఢచర్యం నెరిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ రాజు గినా హాస్పెల్‌తో అత్యవసరంగా సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ టర్కీలో గతేడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్ అదృశ్యం కావడంతో సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న తమ దేశంలో నివసిస్తున్న సౌదీ పౌరులపై దర్యాప్తునకు ఆదేశించింది. అదే విధంగా ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియా రాజే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖషోగ్గీ హత్య కేసును నీరుగార్చేందుకే సౌదీ రాజు గినాతో చర్చలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ భేటీ అనంతరం సౌదీ అధికారి మాట్లాడుతూ... తమ దేశ పౌరులు ఏ దేశంలో నివసిస్తున్నా సరే అక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ విఙ్ఞప్తి చేయడం గమనార్హం. -
ఇమ్రాన్! నా విమానాన్ని తిరిగిచ్చేయ్
ఇస్లామాబాద్ : ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి న్యూయార్క్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు. అయితే తాజాగా అసలు కారణం విమాన సాంకేతికలోపం కాదని తేలింది. కాగా ఈ వ్యవహారంపై సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ పత్రిక ప్రైడే టైమ్స్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లడానికి ముందు ఇమ్రాన్ రెండు రోజులు సౌదీ అరేబియాలో పర్యటించారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన ఇమ్రాన్‌ను కమర్షియల్ విమానంలో పంపడం ఇష్టం లేక యువరాజు సల్మాన్ తన ప్రైవేట్ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం ప్రైవేట్ జెట్‌లోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. సమవేశాలు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ప్లైట్‌లో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్‌కు చెందిన ప్రైడేటైమ్స్ పత్రిక మాత్రం ఈ వాదనతో పూర్తిగా విభేదించింది.పాక్ ప్రధాని ఇమ్రాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదని పేర్కొంది. పైగా తన అనుమతి లేకుండా ఇరాన్‌తో చర్చలు జరపడంపై సౌదీ యువరాజు గుర్రుగా ఉన్నట్లు ఫ్రైడే టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఇమ్రాన్‌పై అసంతృస్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. -
వాళ్లిద్దరూ ఒకే గదిలో ఉండవచ్చు!
రియాద్ : యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని సౌదీ అరేబియా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్న ముస్లిం రాజ్యం... వారికి మరిన్ని వెసలుబాట్లు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్న సౌదీ... తాజాగా తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చని తెలిపింది. అదే విధంగా వాళ్లు బంధువులు కాకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. అంతేగాకుండా సౌదీ మహిళలు కూడా తమ బంధువులతో కలిసి లేదా ఒంటరిగానైనా బస చేసేందుకు హోటల్ గదులను బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు... ‘ రూంలు బుక్‌చేసుకున్న సౌదీ జాతీయులు తమ కుటుంబ గుర్తింపు కార్డు చూపించి హోటల్లో బస చేయవచ్చు. అయితే విదేశీ పర్యాటకులకు ఈ నిబంధన వర్తించదు. విదేశీ పురుషులు లేదా మహిళలు విడివిడిగా గానీ, సంయుక్తంగా గానీ హోటల్లో దిగవచ్చు’ అని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ శాఖ ప్రకటన విడుదల చేసినట్లు వార్తా సంస్థ ఒకాజ్ వెల్లడించింది. (చదవండి : పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!) కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. అదే విధంగా మహిళల పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇక సౌదీకి చెందిన లేదా విదేశీయులైన పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసేవారన్న సంగతి తెలిసిందే. అయితే బిన్ ఆదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా తాజాగా సౌదీ ప్రభుత్వం ఈ నిబంధనలకు చరమగీతం పాడింది. 2030 నాటికి సుమారు 100 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు సౌదీని సందర్శించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పెళ్లికి ముందు శృంగారాన్ని తీవ్ర నేరంగా పరిగణించే సౌదీ ప్రభుత్వం.. దానిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
నువ్వు మోడలా; నా ఇష్టం వచ్చినట్లు ఉంటా!
ఓ మహిళ ఆధునిక వస్త్రాలు ధరించి ఠీవీగా నడుస్తోంది. హై హీల్స్ వేసుకున్న ఆమె అడుగుల శబ్దం అంతకంతకూ పెరుగుతోంది. ఇంతలో ఆమె పక్కగా నడుస్తున్న ఉన్న మహిళల బృందంలో గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆమెను వింతగా చూడసాగారు. ఇంతలో ఆ గుంపు నుంచి బయటికి వచ్చిన ఓ మహిళ.. ఆతురత పట్టలేక... ఆధునిక వేషధారణలో ఉన్న సదరు మహిళ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. ఏమ్మా నువ్వేమైనా సెలబ్రిటీవా?... ఊహూ..ఆమె నుంచి సమాధానం. మరి మోడల్‌వా మరో ప్రశ్న.. అబ్బే అదేం లేదండీ. మరి అలా అయితే ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు బయటకు వచ్చావు?...అదేంటండీ...ఇది నా జీవితం.. నా ఇష్టం..నాకు నచ్చినట్లుగా ఉంటా..ఇందులో తప్పేముంది ఈసారి ఎదురు ప్రశ్నించింది సదరు ‘ఆధునిక మహిళ’ . ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అక్కడి నుంచి మెల్లగా జారుకుంది తనను ప్రశ్నించిన మరో మహిళ. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఆధునిక వస్త్రాలు ధరించి మహిళ పేరు మాషల్ అల్-జలౌద్(33). సౌదీ అరేబియాకు చెందిన హ్యూమన్ రీసోర్సెస్ ప్రొఫెషనల్ ఆమె. అబయ, హిజాబ్ ధరించకపోతే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నా సరే ఆమె తన వైఖరి మార్చుకోలేదు. తనే కాదు తన లాంటి ఎంతో మంది నవ యుగపు మహిళలు గత కొంతకాలంగా అబయా(ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ ముసుగు) లేకుండానే బయటికి వస్తున్నారు. అనాదిగా వస్తున్న రాచరికపు సంప్రదాయాలు, కట్టుబాట్లకు అలవాటు పడిన మహిళ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూనే..వారిని కూడా చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది. ‘సౌదీ అరేబియా విజన్- 2030’ కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. లింగ వ్యత్యాసాన్ని తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు... సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. కో- పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా పలు సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. అంతేకాదు సాయంకాలపు బులెటిన్ చదివేందుకు కూడా మహిళా జర్నలిస్టులకు సౌదీ కేంద్రంగా పనిచేసే కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇదంతా నిజంగా నిబంధనల సడలింపులో భాగమేనా అని ప్రశ్నిస్తే మాత్రం భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. నాపై దాడి జరగడం ఖాయం.. కేవలం ఆంక్షలు సడలించినంత మాత్రాన పౌరుల్లో మార్పు రావడం లేదని...సంప్రదాయవాదుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినపుడు మాత్రమే తమకు నిజమైన స్వేచ్ఛగా లభిస్తుందంటోంది పాతికేళ్ల యువతి మనహల్ అల్-ఒతైబీ. ‘ నాలుగు నెలలుగా అబయా ధరించకుండానే రియాద్‌లో సంచరిస్తున్నా. ఎటువంటి ఆంక్షలు లేకుండా.. నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరిస్తున్నా. నాకు ఇష్టంలేని పనులు చేయమని ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. అయితే అబయ ధరించకుండా ఉండే విషయమై ఎటువంటి స్పష్టమైన చట్టాలు లేవు. కాబట్టి నేను రిస్క్ చేస్తున్నట్లే. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నాపై దాడి చేయవచ్చు కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జూలైలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. అబయా ధరించని కారణంగా ఓ మాల్ నిర్వాహకులు నన్ను లోపలికి అనుమతించలేదు. నాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అబయ ధరించే విషయంలో నిబంధనలు సులభతరం చేసే అవకాశం ఉందంటూ గతేడాది వ్యాఖ్యలు చేసిన సౌదీ రాజు సల్మాన్....వీడియోను వాళ్లకు చూపించాను. మహిళలు సౌకర్యవంతంగా, హుందాగా ఉండే దుస్తులు ధరిస్తే తనకేమీ ఇబ్బంది లేదని ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా వాళ్లలో ఏ మార్పులేదు’అని చెప్పుకొచ్చారు. అయితే మనహల్ చెప్పేదంతా అబద్ధం.. కేవలం ప్రచారం పొందేందుకే ఆమె ఇలా చేశారని సదరు మాల్ నిర్వాహకులు కొట్టిపడేశారు. అది వేరే విషయం అనుకోండి. కన్సర్ట్ రద్దు చేసుకున్న మినాజ్.. ఇక సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని భావించిన సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్... 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత గతేడాది ఏప్రిల్‌లో మొదటి సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులను థియేటర్లోకి అనుమతించిన నిర్వాహకులు...దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని ప్రకటన చేశారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లు టాప్ మ్యుజిషియన్లు సైతం తమ దేశంలో ప్రదర్శన ఇచ్చేందుకు సౌదీ అనుమతించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాపర్‌గా గుర్తింపు పొందిన బోల్‌్డ లేడీ నిక్కీ మినాజ్‌తో కన్సర్ట్ నిర్వహించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అంతలోనే మినాజ్ తన సౌదీ కన్సర్ట్ను రద్దు చేసుకున్నారని...మానవ హక్కుల ఉల్లంఘనలో సౌదీకి ఉన్న రికార్డు చూసిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జలౌద్, ఒతైబీ వంటి యువతులు అబయా ధరించకుండా పెద్ద రిస్కే తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
హ్యాకైన అమెజాన్ సీఈఓ ఫోన్
సాక్షి, వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్ ఫోన్‌ను సౌదీ హ్యాక్ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్ సెక్యూరిటీ అధికారి గవిన్ బెకర్ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్ బెకర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్ సల్మాన్ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్ సంస్థ సీఐఏ సెనేట్‌కు సమాచారమందించింది. -
మోదీ ఎందుకు ప్రొటోకాల్ ఉల్లంఘించారు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను సాదరంగా స్వాగతించారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఎందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారు ? సౌదీ యువరాజు అంత శక్తివంతుడా ? మనకు అంత ముఖ్యుడా? ఆయన్ని అంతలా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందా ? ఉంటే ఎందుకు ? మన దేశ ఆర్థిక వ్యవహారాలను, రాజకీయాలను ప్రభావితం చేసే ప్రతిభావంతులైన విదేశీ నాయకులను స్వాగతించేందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెడితే తప్పులేదు. సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తర్వాత అంతటి శక్తిమంతుడు సౌదీ యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనడంలో సందేహం లేదు. ఐక్యరాజ్య సమితిలో కుదుర్చుకున్న అంతర్జాతీయ అవగాహన ప్రకారం మానవ హక్కులను కాలరాస్తున్న దేశాధిపతులకు స్వాగతం చెప్పడంలో ఏ దేశమైనా ప్రత్యేక ఆదరాభిమానాలను ప్రదర్శించకూడదు. అంటే, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. వృత్తికి అంకితమైన ధీరోదాత్తమైన జర్నలిస్టుగా ప్రశంసలు అందుకున్న జమాల్ ఖషోగ్గిని హత్య చేసి, ఆయన శరీర భాగాల ఆనవాళ్లు కూడా దొరక్కుండా యాసిడ్‌లో కరగించి మురికి కాల్వలో పారబోసారని, సౌదీ యువరాజు కుట్ర వల్లనే ఇది జరిగిందని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం సౌదీని బహిష్కరించాలంటూ పలు దేశాలు పిలుపునిచ్చాయి. ఖషోగ్గి గతంలో ఆల్ వతన్ అనే సౌదీ పత్రికకు ఎడిటర్‌గా, ఆల్ అరబ్ న్యూస్ ఛానల్‌కు జనరల్ మేనేజర్‌గా, ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. సౌదీ యువరాజు అణచివేత చర్యలను భరించలేక అమెరికా వచ్చి స్థిరపడిన ఖషోగ్గి ‘ది వాషింఘ్టన్ పోస్ట్’లో కాలమిస్ట్‌గా స్థిర పడ్డారు. ఆయన తన మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గత అక్టోబర్ రెండో తేదీన ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆయన్ని హత్య చేశారు. ‘ఇస్తాంబుల్‌లో కషోగ్గి హత్యకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారని సీఐఏ ధ్రువీకరణకు వచ్చింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సీఐఏ సేకరించింది’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ నవంబర్ 18వ తేదీన ఓ వార్తను ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాసిన సుదీర్ఘ లేఖను కూడా ఆ పత్రిక నవంబర్ 20వ తేదీన ప్రచురించింది. అందులో ‘ నేను గతేడాది సౌదీ పర్యటనకు వెళ్లి విస్తతంగా చర్చలు జరపడం వల్ల ఆ దేశం అమెరికాలో 45 000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దాని వల్ల మా దేశంలో ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. చమురు ఉత్పత్తులో కూడా ప్రపంచంలో మా రెండు దేశాలు ముందున్నాయి. మా సూచనల మేరకు ప్రపంచ దేశాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించింది కూడా. కానీ జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య గురించి మా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారాన్ని రాబట్టాయి. అందులో పూర్తి నిజాలు మాకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. మేము విన్న వార్తలు కూడా అబద్ధం కావచ్చు. మాకు అంతర్జాతీయ సంబంధాలకన్నా అమెరికా అంతర్గత సంబంధాలు మాకు ముఖ్యం. మా దేశ ప్రయోజనాలు ముఖ్యం. దేశాధినేతగా దేశ ప్రయోజనాలను పరిరక్షించడం నా బాధ్యత. కషోగ్గి హత్య విషయంలో సౌదీని దూరం పెట్టక తప్పడం లేదు’ అన్నది ట్రంప్ సుదీర్ఘ లేఖలోని సారాంశం. మరి అలాంటి సౌదీ యువరాజును మనం ఎందుకు దగ్గర తీసుకున్నట్లు ? పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్‌ను ఏకాకిని చేయడంలో సౌదీ రాజు పనికి వస్తారన్నది మోదీ వ్యూహమా? పుల్వామా సంఘటనపై ఐక్యరాజ్య సమితిలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ పాక్ ప్రధానితో కలిసి సంయుక్త ప్రకటన చేసిన సౌదీ యువరాజు మనతో కలిసి వస్తారా ? అంత ఘనంగా స్వాగతించి పిలిచినప్పుడు పాక్‌లో చేసిన సంయుక్త ప్రకటనను ఉపసంహరించుకునేలా మోదీ ఒప్పించి ఉండాల్సింది. ఆర్థికంగా, రాజకీయంగా ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తున్నా పాకిస్థాన్‌ను సౌదీ దూరంగా పెట్టడమనేది కలలోని మాట. -
సౌదీ మహిళల మరో ముందడుగు
రియాద్ : కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియా చరిత్రలో సాయంకాలపు బులెటిన్ చదివిన మొట్టమొదటి మహిళా జర్నలిస్టుగా వయీం-ఐ-దాఖీల్ చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ చానల్ సౌదీ టీవీ1 లో యాంకర్ ఒమర్-ఐ- నశ్వాన్‌తో కలిసి ఆమె బులెటిన్ చదివారు. ఉదయపు బులెటిన్ చదివిన మొట్టమొదటి మహిళగా జుమానా-ఐ-షామీ 2016లో చరిత్రకెక్కగా.. ఇపుడు వయీం సాయంకాలపు బులెటిన్ చదివిన మహిళగా రికార్డు సృష్టించారని సౌదీ టీవీ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. కాగా ‘సౌదీ అరేబియా విజన్- 2030’ కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ లింగ వ్యత్యాసాన్ని తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అదే విధంగా సెప్టెంబరు మొదటి వారంలో కో- పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా రియాద్ కేంద్రంగా పనిచేసే ఫ్లైయాన్స్ విమానయాన సంస్థ ప్రకటించింది. -
సౌదీ మహిళలు కారు ఎందుకు నడపాలంటే..!
రియాద్: అత్యంత మత ఛాందసవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళల కారు డ్రైవింగ్‌పై ఇంతకాలం ఉన్న నిషేధాన్ని అక్కడి రాచరిక ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? నిన్నటి వరకు ఈ నిషేధాన్ని ఉల్లంఘించి కారు నడిపిన మహిళలను కఠినంగా శిక్షించిన ప్రభుత్వమే ఇప్పుడు వారిని కనికరించింది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటీ ? సౌదీ అరేబియా గత 60 ఏళ్లుగా చమురు అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ధనిక దేశంగా విరాజిల్లుతూ వచ్చిన విషయం తెల్సిందే. ధనవంతమైన దేశం అవడం వల్ల సౌదీ ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల సౌకర్యం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువ వేతనాలు ఇస్తూ వచ్చింది. దీర్ఘకాల సెలవుల సౌకర్యంతోపాటు త్వరగా పదవి విరమణ చేసి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. మత సంప్రదాయాలు, సంస్కతి కారణంగా అన్ని రంగాల్లోకి మహిళలను అనుమతించలేదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగాల్లో నలుగురు మగాళ్లకుగాను ఒక్క మహిళనే ఉద్యోగంలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వరంగంలో 1.20 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 50 లక్షల మంది మాత్రమే సౌదీలు ఉన్నారు. మిగతా వారంతా వలసవచ్చిన వారే. వారిలో సౌదీ మహిళలు 15 లక్షల మందే ఉన్నారు. 2014 సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోవడం, దేశంలో జనాభా పెరగడంతో సౌదీ ఆర్థిక పరిస్థితి బాగానే దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో దేశాభివద్ధికి ‘2030 సౌదీ విజన్’ అంటూ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చారు. అందులో మగవాళ్ల కన్న కాస్త ఎక్కువ తెలివితేటలు, అక్షరాస్యత కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సౌదీ మహిళలు నర్సు ఉద్యోగాల లాంటివి చేయడానికి ఎందుకో ఎక్కువగా ఇష్టపడరు. సంప్రదాయపరంగా, ఉద్యోగాల పరంగా మహిళా డ్రైవర్లు అవసరం అవడం వల్ల వారి డ్రైవింగ్‌పై సౌదీ రాజు నిషేధం ఎత్తేశారు. సౌదీ ప్రభుత్వ రవాణా వ్యవస్థగానీ, టాక్సీ వ్యవస్థగాని బలంగా లేదు. మగవారి తోడు లేకుండా మహిళలు మార్కెట్‌కు వెళ్లాలన్నా, ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇప్పటి వరకు కష్టంగా ఉంటూ వచ్చింది. టాక్సీ డ్రైవర్ మగవాడైతే అందులో ఒక మహిళ వెళ్లరాదు. ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్లాల్సి ఉంటుంది. సొంతకారులో మహిళలు వెళ్లాలంటే ఆ కారును భర్తనో అతి సమీప బంధువో నడపాలి. వారు డ్రైవర్‌ను పెట్టుకున్నా మొగతోడు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే, పిల్లలను తీసుకొని బడికో, బయటకో వెళ్లాలంటే తానే కారు నడపాల్సిన అవసరం ఏర్పడింది. ఇక అమెరికాలో లాగానే సౌదీలో కూడా ఇంటికి, పనిచేసే చోటుకు చాలా దూరం ఉంటుంది. ప్రభుత్వ రవాణా అంతంత మాత్రమే కనుక మహిళలు కారులోనే వెళ్లాల్సిన çపరిస్థితి ఏర్పడింది. మగ డ్రైవర్ వెంట ఒంటరిగా వెళ్లడానికి సంప్రదాయం ఒప్పుకోదు కనుక మహిళలు సొంతంగా కారును నడపాల్సిన అవసరం వచ్చింది. మహిళలు కూడా టాక్సీలు నడిపితే మహిళలు వాటిల్లో ఒంటరిగా ప్రయాణించవచ్చు. ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మహిళలు డ్రైవింగ్ చేయరాదంటూ ఉన్న నిషేధాన్ని సౌదీ రాజు ఎత్తివేశారు. -
సౌదీ మహిళల డ్రైవింగ్‌పై ముగిసిన నిషేధం
-
సౌదీ మహిళకు స్టీరింగ్
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు ఆదివారం వాహనాలతో రోడ్లెక్కారు. కార్లతో రోడ్లపై సందడి చేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని అప్పట్లో పేర్కొన్నారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది మహిళలు తమ తొలి కారు డ్రైవింగ్ మధుర క్షణాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము కుటుంబ సభ్యులను కారులో కాఫీ షాప్‌కు, ఐస్‌క్రీమ్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. తండ్రి, సోదరులు, ప్రైవేటు పురుష డ్రైవర్ల అవసరం లేకుండా తొలిసారి కారును నడపడంపై మహిళా యాంకర్, రచయిత సమర్ అల్మోగ్రెన్ స్పందిస్తూ.. ‘నాకు పక్షి అంత స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. సౌదీ యువరాజు, కోటీశ్వరుడు అల్వలీద్ బిన్ తలాల్ ‘మహిళలకు ఇది గొప్ప విజయం. ఎట్టకేలకు మహిళలకు స్వేచ్ఛ లభించింది’ అని అన్నారు. తన కుమార్తె ఎస్యూవీ కారును డ్రైవింగ్ చేస్తుండగా, అదే కారులో ఆయన మనుమరాళ్లతో కలసి సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ హలా మాట్లాడుతూ..‘డ్రైవింగ్ అనుమతి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే మహిళలకు చాలా కష్టసాధ్యంగా ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు మహిళలందరూ స్వేచ్ఛగా వాహనాలు నడుపుకుంటూ విధులకు హాజరయ్యే వెసులుబాటు ఏర్పడింది. త్వరలోనే మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఏళ్లలో రూ.6.1 లక్షల కోట్లు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా సౌదీ అరేబియా ఆర్థికంగా పురోగమించనుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరగడంతో పాటు మహిళల జీవనప్రమాణాలు మెరుగు కానున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. డ్రైవింగ్‌కు మహిళల్ని అనుమతించడంపై గల్ఫ్ టాలెంట్ అనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి తర్వాత డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది మహిళలు తెలిపారు. తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తాము దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్ నిర్ణయంతో మరో 12 ఏళ్లలో సౌదీ ఆర్థిక వ్యవస్థకు రూ.6.1 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యం మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 22 నుంచి 30 శాతం మహిళలు ఉండాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చేపట్టిన సంస్కరణలో భాగంగా తొలుత మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని తొలగించింది. దీనిద్వారా వాళ్లు మంచి ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం పొందేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయంతో మహిళలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వెలుసుబాటు లభించింది. మహిళల డ్రైవింగ్‌పై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో మరింత మంది మహిళా ఉద్యోగుల్ని తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆకర్షణీయమైన వేతనాలకు అందుకోనున్నారు. కార్ల మార్కెట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందనుంది. 2020కి 30 లక్షల మహిళలు డ్రైవింగ్ చేస్తారని అంచనా. -
35 ఏళ్ల తర్వాత తొలి సినిమా థియేటర్..
రియాద్ : కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను బుధవారం ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఈ థియేటర్లో మొదటగా ‘బ్లాక్ పాంథర్’ సినిమాను ప్రదర్శించారు. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను వీక్షించారు. మతపరమైన కారణాల వల్ల ఇన్నేళ్ల పాటు సౌదీలో ఒక్క థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఈ సందర్భంగా సౌదీ సాంస్కృతిక సమాచార శాఖా మంత్రి అవద్ అల్వాద్తో పాటు పలువురు సెలబ్రిటీలు, ఫిల్మ్ మేకర్స్ థియేటర్‌కి విచ్చేశారు. అల్వాద్ మాట్లాడుతూ దేశంలోకి తిరిగి సినిమాను ఆహ్వానించడం ద్వారా దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామన్నారు. ఇకపై వినోద పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో సౌదీ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భావించారని.. అందుకే విజన్ 2030 పేరిట పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని సాంస్కృతిక సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2030 నాటికి 350 సినిమాలను, 2500 స్క్రీన్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. -
భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది
-
‘నిరాశ-నిస్పృహలకు చోటే లేకుండా పోయింది’
అబుదాబి : భారత్‌లో నిరాశ, నిస్పృహలకు చోటు లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల్లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నార్థకం పోయి.. పని ఎప్పుడు పూర్తవుతుందనే విశ్వాసం ఏర్పడిందని ఆయన తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం దుబాయ్ ఓపెరా హౌజ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఉన్నారు. ఇండియా నుంచి వచ్చిన సుమారు 30 లక్షల మందికి యూఏఈ సొంత దేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషంగా ఉంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచస్థాయిలో భారత్ గౌరవం పరిఢవిల్లుతోంది. యూఏఈ ప్రగతి పథంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషం. భారత అభివృద్ధిలోనూ మీరూ(ప్రవాస భారతీయులను ఉద్దేశించి) భాగస్వాములు కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇక ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ సల్మాన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఇది భారత సంస్కృతికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగానికి ముందు ఆయన అబుదాబిలో తొలి హిందూ దేవాలయానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి 2వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఇక ఉదయం అబుదాబి లోని అమరవీరుల యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యూఏఈ పర్యటనలో భాగంగా దేశ పాలకుడు, ప్రధానిలతోపాటు, అక్కడి భారతీయ వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. ఇప్పటికే భారత్ - యూఏఈ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగం, రైల్వేలు, మానవ వనరులు, ఆర్థిక సేవలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఇంధన భద్రత, మౌలికరంగాల్లో యూఏఈ సుమారు 11 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
11 మంది యువరాజులు అరెస్టు
రియాద్ : పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. కమిషన్ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే అరెస్టులు జరగడం గమనార్హం. అంతకుముందు సౌదీ నేషనల్ గార్డ్ హెడ్, నేవీ చీఫ్, ఆర్థిక శాఖ మంత్రులను సల్మాన్ పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిషన్ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ ‘అల్ అరేబియా’ పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.