రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు.
ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు.
మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు.
చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
Comments
Please login to add a commentAdd a comment