Crown Prince
-
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
మిస్ యూనివర్స్ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
రియాద్: ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంలచన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు దేశం తరపున 27 ఏళ్ల సుందరి రుమీ అల్కతానీని నామినేట్ చేశారు. ఈ విషయాన్ని రుమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం ఇది తొలిసారని ఆమె తన పోస్టులో పేర్కొంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రుమీ ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకోవడం విశేషం. దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హాయంలో ఈ తరహా చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవల ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇస్లామిక్ దేశం తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి.. అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. ప్రమాదమా.. ఉగ్రవాదమా..? -
10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. -
షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు
ఓ దేశానికి, రాజ్యానికి రాజు అంటే ఎన్ని రాజభోగాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్యాలెస్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. అడుగు బయటపెట్టినా భద్రత దృష్ట్యా వారు ప్రత్యేకంగా కార్లు, విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతుంటారు. అయితే వీటికి భిన్నంగా దుబాయి క్రౌన్ ప్రిన్స్ మెట్రోలో ప్రయాణించారు. అంతేగాక తోటి ప్రయాణికులు అతన్ని యువరాజుగా గుర్తు పట్టకపోవడం మరో పెద్ద విశేషం. దుబాయి యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తన కుటుంబం, స్నేహితులతో కలిసి లండన్ వెకేషన్లో ఉన్నారు. హాలిడే ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను 14 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో యువరాజు లండన్‌లోని అండర్ గ్రౌండ్ మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించారు. షేక్ హమ్దాన్ తన స్నేహితుడు బద్ర్ అతీజ్‌తో కలిసి నిత్యం రద్దీగా ఉండే లండన్ మెట్రో కంపార్ట్మెంట్ మధ్యలో నిల్చొని సెల్ఫీ దిగారు. ‘మేము చాలా దూరం వెళ్ళవలసి ఉంది. బద్ర్(సౌదీ అరేబియాలోని ఓ ప్రాంతం) ఇప్పటికే విసుగొచ్చింది’ అని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దాదాపు వారం క్రితం షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే రైలులోని మిగతా ప్రయాణికులు వీరిద్దరినీ గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ విలాసవంత ప్రయాణాన్ని వదిలేసి ఇలా మెట్రోలో సామాన్య పౌరుడిగా ప్రయాణించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదవండి: అక్కడ లాక్డౌన్ అంటే చాలు జనాలు జంప్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Fazza (@faz3) -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్‌పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
అమెరికా అడిగినా పట్టించుకోలేదు! పుతిన్ అడగ్గానే..
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా మాటల్ని, అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికల్ని మొదటి నుంచి పెడచెవిన పెడుతున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా ఆయిల్ మార్కెట్ వ్యవహారాలపై చర్చలు నడిపింది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ను స్థిరపరిచేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఓపెక్ప్లస్ ఉత్పత్తి గ్రూపుతో సమన్వయం కొనసాగించనున్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యలు మొదలయ్యాక.. పుతిన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేరుగా ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో.. సౌదీ అరేబియా , ఇతర ప్రధాన పర్షియన్ గల్ఫ్ దేశాలను చమురు ఉత్పత్తులు పెంచాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును అవి ప్రతిఘటించాయి.ఇందుకు అమెరికా, రష్యాపై విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమే!. అయితే పుతిన్‌తో శనివారం, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌తో శుక్రవారం వరుస చర్చలు జరిపిన సౌదీ క్రౌన్ ప్రిన్స్.. ఆయిల్ మార్కెట్ నియంత్రణకు ప్రయత్నిస్తామన్న హామీ ఇవ్వడం విశేషం. చమురు ధరల నియంత్రణతో పాటు అమెరికాకు చిర్రెత్తిపోయేలా ద్వైపాక్షిక ఒప్పందాలకు గురించి కూడా.. సౌదీ-రష్యాల మధ్య చర్చలు జరిగినట్లు సౌదీ అధికారిక వర్గాలే ఒక ప్రకటనలో ప్రస్తావించడం గమనార్హం. -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్‌లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్‌లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్‌లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్‌లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్‌గా నిలవడానికి దుబాయ్‌కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్‌లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్‌తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
Dubai Crown Prince: వారసులొచ్చారు
దుబాయ్: ఇద్దరు కొత్త సభ్యుల రాకతో దుబాయ్ రాచకుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకరు బాబు కాగా మరొకరు పాప. ఇద్దరు కవలలను చూసుకుని కాబోయే రాజదంపతులు మురిసిపోతున్నారు. రాజప్రసాదంలోకి అడుగు పెట్టిన బాబుకి రషీద్ అని పేరు పెట్టగా పాపకి షైఖా అని నామకరం చేశారు. పాలబుగ్గలతో ఉన్న పసిపిల్లల ఆలనపాలనలో రాజదంపతులు బిజీగా ఉన్నారు. యువరాజు ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడంటూ దుబాయ్ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే... శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తన ఇద్దరు పిల్లలను తనివితీరా చూస్తున్న ఫోటోను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వైరల్ అయ్యింది. -
పావురానికో గూడు.. భళా ప్రిన్స్!
బాల్కనీలోకి పక్షులు రాకుండా నెట్లు వేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఒక ఆసక్తికరమైన సంగతి నెట్లో చక్కర్లు కొడుతోంది. పావురం గూడు కోసం ఖరీదైన కారును కూడా పక్కన పెట్టిన వైనం నెటిజనుల ప్రశంసలందుకుంటోంది. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!) వివరాలను పరిశిలిస్తే.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు చెందిన మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీ విండ్షీల్డ్పై ఒక పావురం జంట గూడు చేసుకొని, గుడ్లు కూడా పొదగడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్స్ ఆ గూడుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా కారును వాడకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కారు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన టైమ్ ల్యాప్ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు జీవితంలో చాలా చిన్న విషయాలు సరిపోతాయంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 10లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. View this post on Instagram A post shared by Fazza (@faz3) on Aug 12, 2020 at 5:57am PDT -
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు కట్ట్ఘుబడి ఉన్నాం
-
సౌదీ వారసుడు మారాడు
క్రౌన్ ప్రిన్స్‌గా బిన్ సల్మాన్ రియాద్: సౌదీ అరేబియా రాచరిక వారసత్వ పరంపరలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. రాజు సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికైన మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. బిన్ సల్మాన్ పదవీచ్యుతుడైన సోదరుడు నయేఫ్ చేతిని ముద్దాడుతూ ఆయన ముందు మోకారిల్లడం టీవీ చానెళ్లలో కనిపించింది. బదులుగా నయేఫ్, యువరాజు భుజం తడుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని నయేఫ్ అన్నారు. దీనికి బిన్ సల్మాన్ స్పందిస్తూ... ఆయన సలహాల్లేకుండా తానేం చేయలేనన్నారు. కాగా, బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించడం ట్రంప్ సౌదీలో తన తొలి విదేశీ పర్యటన జరపడానికి మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు. -
మేనల్లుడిని పీకేసి.. కొడుకుకు పట్టం!
సౌదీ రాజు సల్మాన్ అనూహ్య నిర్ణయం రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు మహమ్మద్ బిన్ నయెఫ్ (57)ను అకస్మాత్తుగా యువరాజు పదవి నుంచి తొలగించి.. ఆ పదవిలో తన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రతిష్టించారు. సంప్రదాయ ఇస్లామిక్ రాజ్యమైన సౌదీలో యువ వారసులకు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ఈ నియామకంతో నయెఫ్‌ను అధికారాలన్నీ తొలగించినట్టు అయింది. అదేవిధంగా 31 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్‌కు డిప్యూటీ ప్రధానమంత్రి పదవిని కూడా కేటాయిస్తున్నట్టు రాజు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహమ్మద్ బిన్ సల్మాన్ వద్ద ఉన్న రక్షణమంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని వెల్లడించారు. 81 ఏళ్ల సల్మాన్ సౌదీ రాజుగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అంతర్గతంగా అధికారం కోసం కుటుంబవర్గపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని పక్కనబెట్టి.. తన కొడుకుకు పట్టాభిషిక్త యువరాజుగా సల్మాన్ అధికారికంగా పట్టం గట్టడం గమనార్హం. తద్వారా తన తర్వాత రాజు పదవిని చేపట్టేందుకు తన కొడుకుకు మార్గం సుగమం చేశారు.