
దుబాయ్: ఇద్దరు కొత్త సభ్యుల రాకతో దుబాయ్ రాచకుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. దుబాయ్ యువరాజు షేక్ హమ్‌దాన్ బిన్ మహ్మద్ భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకరు బాబు కాగా మరొకరు పాప. ఇద్దరు కవలలను చూసుకుని కాబోయే రాజదంపతులు మురిసిపోతున్నారు. రాజప్రసాదంలోకి అడుగు పెట్టిన బాబుకి రషీద్ అని పేరు పెట్టగా పాపకి షైఖా అని నామకరం చేశారు.
పాలబుగ్గలతో ఉన్న పసిపిల్లల ఆలనపాలనలో రాజదంపతులు బిజీగా ఉన్నారు. యువరాజు ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడంటూ దుబాయ్ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వెంటనే... శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తన ఇద్దరు పిల్లలను తనివితీరా చూస్తున్న ఫోటోను దుబాయ్ యువరాజు షేక్ హమ్‌దాన్ బిన్ మహ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment