twin
-
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం
-
దారుణం.. అప్పుడే పుట్టిన ట్విన్స్‌ను చంపి.. పాతిపెట్టిన తండ్రి
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన కూతుళ్లను గుండెల మీద కుంపటిలా భావించిన ఓ తండ్రి దారుణానికి ఒడిగాట్టాడు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన కవలల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాల్ని పాతిపెట్టి పరారయ్యాడు. ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి,పూజా సోలంకి భార్యభర్తలు. గర్బవతిగా ఉన్న పూజా సోలంకి మే 30న హర్యానాలోని రోహ్తక్లోని ఓ ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొడుకే కావాలని కోరుకునే నీరజ్.. ఆడపిల్లలు పుట్టడంతో కలత చెందాడు. జూన 3వ తేదీన ఆ కవలల్ని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన బావ నీరజ్ పసికందుల్ని హత్య చేశాడంటూ బావమరిది ఢిల్లీ సుల్తాన్‌పురి పీఎస్ పోలీసులకు సమాచారం అందించాడు. బావమరిది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పట్టించిన కాల్ డేటాఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నీరజ్ సోలంకి ఫోన్ కాల్ డేటాపై క్రైం బ్రాంచ్ పోలీసులు దృష్టిసారించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా తన మొబైల్ హ్యాండ్సెట్, సిమ్‌లు, ప్రదేశాలను తరచుగా మారుస్తున్నట్లు గమనించారు. ఢిల్లీ, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిందదితుణ్ని రోహ్తక్లోని సంప్లాలో అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈ ట్విన్స్ చిరుహాసానికి దక్కిన పదం.. 'షాయరీ ఆన్ స్నో'
చిన్నారుల వచ్చిరాని మాటలు భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. వారితో గడుపుతుంటే రోజులే తెలియవు. అలాంటిది చిన్నారులకు సంబంధించిన వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాయి. అమాయకత్వంతో కూడిన ఆ మాటలు వింటే ఎంతటి పెద్దవాళ్లైన చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. అంతలా ఆకట్టుకుంటాయి వారి మాటలు చేష్టలు. అందులోనూ ట్వీన్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాంటి ట్విన్ సిస్టర్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో.. ఆరు సంవత్సరాల వయసు ఉన్న కశ్మీరి ట్విన్ స్విస్టర్స్ జైబా బింటీ తలిబ్, జైనబ్ బింటీ తలిబ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కశ్మీర్లో ఫస్ట్ స్నోఫాల్‌ను సెలబ్రెట్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో ఇది. ఒకేరకం దుస్తులు ధరించి, మంచుతో నిండిన వీధిలో నిలబడి 'హమ్ యహా పే బహుత్ జాదా ఎంజాయ్ కర్ రహే హై. మస్తీ కర్ రహే హై' అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర 'షాయరీ ఆన్ స్నో' కాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో పదకొండు మిలియన్లను దక్కించుకుంది. ఇవి చదవండి: Pillala Katha: పాపన్న కొలువు! -
ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..
పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్ టిక్‌టాక్ వీడియో, టీవీ షోలు వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది. అసలేం జరిగిందంటే..యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్‌టాక్ వీడియో ఆమెకు చేరింది. వీడియోలో ఉన్న అమ్మాయి తన కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్‌కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు. ఎందుకు వేరయ్యారంటే.. అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది. ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేర్వేరు ఏడాదుల్లో పుట్టిన కవలలు.. ఇదెలా సాధ్యం?
సాధారణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతోనే, లేక గంటల వ్యవధిలోనే పుడుతుంటారు. కానీ న్యూజెర్సీలో మాత్రం గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివింది నిజమే. వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన బిల్లి హంఫ్రీ, అతని భార్య ఈవ్ ఈ ఏడాది నూతన సంవత్సరంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. నిండు గర్భిణీ అయిన ఈవ్‌కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.48 నిమిషాలకు ఓ బాబు జన్మించగా, మరుసటి రోజు 12:28 నిమిషాలకు మరో బాబు జన్మించారు. దీంతో కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది. ఇది తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఈవ్ దంపతులు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు పిల్లలు పేరుకు మాత్రమే కవలలని, వారి ముఖ కవలికల్లో, దినచర్యలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తుందని, ఇదో విచిత్ర అనుభవం అని తెలిపారు. మొదటి బాబు ఎజ్రా 6 పౌండ్ల బరువుతో ఉంటే, అతని తమ్ముడు ఎజెకియల్ 4 పౌండ్ల బరువుతో ఉన్నాడని వివరించారు. కాగా అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్’ అని వైద్యులు అంటున్నారు. -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్
"విద్వేష రాజకీయాల్లో టిడిపి ఎటు పోతే జనసేన అటు వైపే. ప్రభుత్వంపై విషం చిమ్మడంలో చంద్రబాబు ఎటు ఉంటే పవన్ కళ్యాణ్ అటు వైపే.కులాలు, మతాల మధ్య చిచ్చు రేపడంలో టిడిపి అడుగుజాడల్లోనే జనసేన నడక. అసత్య ప్రచారం చేయడంలో..కట్టకథలు వ్యాప్తి చేయడంలో బాబెలాగంటే పవన్ అలాగే. రాజకీయాల్లో అన్ని రకాల విలువలకూ తిలోదకాలివ్వడంలో బాబు రూటులోనే పవన్. చివరకు ప్రజలను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన విజన్ ప్రకటనల్లోనూ దొందూ దొందే. 2047కల్లా ఏపీనీ నంబర్ వన్ చేసేస్తామని చంద్రబాబు అనగానే పవన్ కళ్యాణ్ కూడా మీ మాటే మాట అంటూ అదే విజన్ వెలువరించారు. ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు." నారా డైరెక్షన్.. దత్త పుత్రుడి ఓవరాక్షన్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వంపై బురద జల్లడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ ఆరోపణలు చేస్తారో.. సరిగ్గా అవే ఆరోపణలను జనసేన అధినేవ పవన్ కళ్యాణ్ కూడా చేసేస్తూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించడమే ఆలస్యం..పవన్ కళ్యాన్ ఆ నినాదాన్ని అంది పుచ్చుకున్నారు. హిందువులంటే మీకింత లోకువా? అంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. చిత్రం ఏంటంటే రామతీర్ధంతో సహా కొన్ని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంస ఘటనల్లో టిడిపి కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉండడమే. అంటే విధ్వంస రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎలా అడుగులు వేస్తే పవన్ కళ్యాణ్ అటే నడుస్తున్నారని స్పష్టమైంది. అక్కడ స్లోగన్.. ఇక్కడ రీ సౌండ్ చంద్రబాబు నాయుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని అక్కడే తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం వర్ధిల్లాలని నినదించడం ఆలస్యం పవన్ కళ్యాణ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ కర్నూలులో రాజధాని ఉండాలని అన్నారు. అమరావతి ఒక సామాజిక వర్గం రాజధానిగా ఉందని ఆరోపించింది కూడాపవనే. కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు టోన్ బట్టి పవన్ స్టోన్ కూడా మారిపోయింది. ఉప్పందితే చాలు.. దత్త పుత్రుడు చెలరేగి పోతాడు ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పాలైపోయిందంటూ చంద్రబాబు నాయుడు అండ్ కో అబద్ధపు ప్రచారాన్ని భుజాలకెత్తుకోగానే పవన్ కళ్యాణ్ కూడా ఏపీని అప్పుల్లో ముంచేశారంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదీ తీరాన నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేస్తే చంద్రబాబు అన్యాయం జరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విధ్వంస రాజకీయం అన్నారు చంద్రబాబు. కొద్ది రోజుల తర్వాత పవన్ కూడా సరిగ్గా అదే మాట అందుకున్నారు. విధ్వంసాలతో పాలన మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ప్యాకేజీకి ఇంత మహిమ ఉందా? వాలంటీర్ వ్యవస్థతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న దుగ్ధతో చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేస్తే.. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వాలంటీర్లు రాష్ట్రంలో 35 వేల మంది మహిళలను అక్రమంగా రవాణా చేసేశారని వారు దండు పాళ్యం బ్యాచ్ అని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబే దిగజారుడు రాజకీయం చేస్తే పవన్ మరింత లోతుకు దిగజారి ఇలాంటి వ్యాఖ్య చేశారు. విశాఖలో రుషికొండపై ప్రభుత్వం భవనాలు నిర్మిస్తోంటే చంద్రబాబు నాయుడు పర్యావరణానికి తూట్లు పొడిచేశారని గగ్గోలు పెట్టారు. చంద్రబాబు అన్న కొద్ది రోజులకే ఆ స్క్రిప్ట్ సహజంగానే పవన్ కళ్యాణ్ జేబులోకి వచ్చేసింది. రుషికొండను నాశనం చేసేశారని.. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని చంద్రబాబు లాగే పవన్ కూడా అడ్డగోలు ఆరోపణలు చేసేశారు. తాము చేసిన ఆరోపణలు విని నలుగురూ నవ్విపోతారేమోనన్న జంకు కూడా లేకుండా బాబును అలా ఇమిటేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇద్దరికీ ఒకే సారి కలలోకి వచ్చిన 2047 తాజాగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో చంద్రబాబు ఓ షో ఏర్పాటు చేసి తనది విజన్ 2047 అన్నారు. 2047 కల్లా ఏపీని నంబర్ వన్ గా చేస్తానన్నారు. గతంలో విజన్ 2020 అన్న చంద్రబాబు ఏం చేశారో జనం చూసిన తర్వాతనే ఆయన్ను ఇంటికి పంపారు. ఇపుడు మరో 24 దూరానికి ఓ విజన్ పెట్టారు చంద్రబాబు. అప్పటికి చంద్రబాబు నాయుడికి 97 ఏళ్లు వస్తాయి. మరి అప్పటి వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారా? అసలు ఆయన ముఖ్యమంత్రి కావడమే గగనం అయితే 2047లో ఏపీని ఏం చేస్తారో ఆయనెలా చెబుతారని విశ్లేషకులు నిలదీస్తున్నారు. సయామీ ట్విన్స్ కూడా సిగ్గుపడేలా.. చంద్రబాబు విజన్ 2047 అనగానే పవన్ కళ్యాణ్ కూడా సయామీ ట్విన్స్ లో సెకండ్ పార్ట్ లా తనది కూడా విజన్ 2047 అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్విచ్ వేస్తే పవన్ కళ్యాణ్ ఇంట్లో లైట్ వెలుగుతోంది. చంద్రబాబు నాయుడి ఇంట్లో స్క్రిప్ట్ తయారైతే అది క్షణాల్లో పవన్ కళ్యాణ్ చేతికి వచ్చేస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ ఏం చేసినా ఏం మాట్లాడినా ఒక్కలాగే ఉంటోంది. దశ దిశ లేకుండా దిక్కుమాలిన అజెండాలతో రాజకీయాలు చేయడంలో ఇపుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ షేమ్ టూ షేమ్ అంటున్నారు రాజకీయ పండితులు. CNS యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?
అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా! కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు. ఇలా ఫిలిప్పీన్స్ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది. దేవతలకు పెట్టొచ్చా అంటే.. దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు. అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు. పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని సాగనంపుతాం. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది. (చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!) -
36 ఏళ్లు పురుషుడు ప్రెగ్నెంట్? 36 ఏళ్లుగా కవలలు కడుపులోనే..!
నాగ్‌పూర్: మహారాష్ట్రకు చెందిన ఓ పురుషుడు ప్రెగ్నెంట్ అయ్యాడు. అతని కడుపులో ఏకంగా కవలలు ఉన్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఓ అరుదైన వ్యాధి కారణంగా నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి గత 36 ఏళ్లుగా ఇద్దరు కవలలను కడుపులో మోస్తున్నాడు. అతని పేరు భగత్(60). నాగ్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. జీవన పోషణకు ఏదో పని చేసుకుంటూ ఉండే మధ్యతరగతి వ్యక్తి. కొన్నేళ్ల క్రితం నుంచి అతని కడుపు పెరగడం ప్రారంభించింది. ఎంతగా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంతలా పెరిగిపోయింది. కడుపు లావుగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు హేళన చేసేవారు. అందరూ అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్ అంటుండేవారు. భగత్ చివరికి 1999లో ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. డా. అజయ్ మెహతా ఆ కండీషన్ ట్యూమర్ అనుకున్నారు. కానీ ఆపరేషన్‌లో ఓ పెద్ద క్యాన్సర్ కణితి అని భావించారు. పూర్తిగా చూస్తే అతని కడుపులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉండే సరికి షాక్‌కు గురయ్యారు. అయితే.. ఈ కేసులో తాను అనుకోని దృశ్యాలను చూశానని డాక్టర్ మెహతా చెప్పారు. కడుపులో ఎముకలు, వెంట్రుకలు, దవడ వంటి శరీర భాగాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ వ్యాధిని ఫోయిటస్ ఇన్ ఫోయిటస్(పిండంలో పిండం) అంటారని తెలిపారు. ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనగా పిండంలో మళ్లీ ఓ పిండం పెరగడం అంటారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు. కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్‌లో కవలలకు స్వాగతం పలికారు. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి
కవల పిండంతో ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ ఘటన ఇజ్రాయెల్‌లో అష్టోడ్లోని అసుతా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి గర్భంలో ఉండగానే నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్తో శిశువు ఏదో సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ శిశువు జన్మించాక నిర్వహించిన పరీక్షల్లో కడుపులో ట్విన్పిండం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వివరాల్లోకెళ్తే...నవజాత శిశువు కడుపులో కవల పిండం ఉంది. దీన్ని ఫీటస్ ఇన్ ఫీటూ(ఎఫ్ఐఎఫ్) అంటారు. గతేడాది బిడ్డ పుట్టిన తర్వాత వైద్యులు అల్ట్రాసౌండ్ ఎక్స్‌రేలతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో శిశువు పొత్తికడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందిన పిండాన్ని కనుగొన్నారు. వైద్యులు శిశువు కడుపులో కవల పిండం ఉన్నట్లు చెప్పగానే ఆ చిన్నారి తల్లి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత ఆ శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. ఈ మేరకు మెడికల్ సెంటర్లోని నియోనాటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఒమెర్ గ్లోబస్ మాట్లాడుతూ... ఆ శిశువు పొత్తి కడుపులో ఉన్నది పిండం అని తెలుసుకుని మేము ఆశ్యర్యపోయాం. కానీ పరీక్షల్లో అది పిండంలా కనిపించలేదు. ఐతే అది పొత్తి కడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందుతుంది కానీ జీవించదని అక్కడే అలా ఉండిపోతుందని చెబుతున్నారు. సదరు తల్లి ఆలస్యంగా గర్భం దాల్చిందని కూడా చెప్పారు అందువల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కానీ ఇలాంటి అరుదైన పరిస్థితి ప్రతి అరమిలియన్ జననాలకు ఒకరికి మాత్రమే సంభవిస్తుంది. (చదవండి: వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!) -
వైరల్ వీడియో: 68 మంది కవలలతో ఫ్యాషన్ షో
-
68 మంది కవలలతో ఫ్యాషన్ షో: వీడియో వైరల్
ఇప్పటి వరకు పలు రకాల ఫ్యాషన్ షోలు చూసి ఉంటాం. వాటిల్లో వారు ధరించిన బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సాగేవి. ఇక్కడోక ఫ్యాషన్ షో మాత్రం అత్యంత విభిన్నంగా రూపొందించారు. మాగ్జిమమ్ ఎవరి ఇంట్లోనైనా ఇద్దరు అక్కచెల్లెళ్లు, లేదా అన్నాదమ్ములు లేదా కవలలు ఉంటే ఒకేలాంటి డ్రస్‌లు వేస్తారు. దీన్నే థీమ్‌గా తీసుకుని కవలలతో ఫ్యాషన్ షో నిర్వహించింది ఓ ప్రముఖ కంపెనీ వివరాల్లెకెళ్తే... ఈ షోలో ఇద్దరో లేదా ఐదోగురో కవలలు కాదు. ఏకంగా 68 మంది కవలలతో ఫ్యాషన్ షోని ప్రదర్శించారు. ఈ షోని ఇటాలియన్ దుస్తుల, జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్ గుస్సీ 'గుస్సీ ట్విన్బర్గ్' పేరుతో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించింది. అలెశాండ్రో మిచెల్ అనే ప్రముఖ డిజైనర్ 2022-23 స్ప్రింగ్ సమ్మర్ సీజన్ పేరిట మిలాన్ ఫ్యాషన్ షోలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ షోకి సంబంధించిన వీడియోలను గుస్సీ బ్రాండ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట చేసింది. ఆ వీడియోలో ఒకే రకమైన దుస్తులు, జువైలరీని ధరించిన కవలల మోడళ్లు నడుస్తూ వస్తుంటారు. మిచెలల్ తన ఫ్యాషన్ షోలో పురాతన కాలం నాటి దుస్తులు, సింబల్స్‌ను ఉపయోగించి అప్పటి నాగరికతను ప్రతిబింబించేలా రూపొందించారు. పాతకాలం నాటి సినిమాల్లో ఉపయోగించిన దుస్తులను కూడా కవలల మోడళ్లు ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ వీడియోకి ఏడు వేలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం...గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్) -
అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్!
సాధారణంగా కవల పిల్లలు అనగానే.. దాదాపు ఒకే పోలికలతో ఉంటారనే మనకు తెలుసు. కలిసి పుట్టినా ఒకే పోలికలతో లేనివారూ ఉంటారు. కానీ ఒకే పోలికలతో పుట్టినా.. పూర్తి భిన్నంగా కనిపించే కవలలు మీకు తెలుసా? ఇటీవలే ఇంగ్లండ్‌లోని నాటింగ్హమ్ నగరంలో ఇలాంటి అరుదైన కవలలు పుట్టారు. నాటింగ్హమ్కు చెందిన చంటెలీ బ్రాటన్ అనే మహిళ ఏప్రిల్ నెలలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. అబ్బాయికి అయాన్ అని, అమ్మాయికి అజిరా అని పేర్లు పెట్టుకుంది. పుట్టినప్పుడు ఇద్దరూ దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు. కానీ కొన్ని నెలలు గడిచేసరికి తేడా కనిపించడం మొదలైంది. అయాన్ ఆకుపచ్చ రంగు కళ్లతో, తల్లిని పోలినట్టు తెల్లని చర్మంతో ఉండిపోగా.. అజిరా మాత్రం గోధుమ రంగు కళ్లతో, చర్మం నలుపు రంగులోకి మారిపోవడం మొదలైంది. చాంటెలీ భర్త ఆస్టన్ తల్లిదండ్రుల్లో ఒకరు నల్లజాతికి చెందిన జమైకన్కాగా, మరొకరు స్కాట్లాండ్కు చెందినవారు. ఇక చాంటెలీ తాత కూడా నైజీరియాకు చెందిన వ్యక్తేనట. పిండం ఏర్పడినప్పుడు ముందటి తరాల జన్యువులు యాక్టివేట్ అయి ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ఎంత అరుదైన ఘటన అంటే.. అసలు కవలల జననాలే తక్కువైతే, అందులోనూ ప్రతి పది లక్షల కవలల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. -
ఉమ్మనీటి సంచితో కవలల జననం
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది. -
ఇద్దరూ కవలలే.. కానీ బర్త్‌డే ఎవరిది వారిదే.. అదేంటి!
మామూలుగా కవలలు అంటే తల్లి కడుపులో కలిసి పెరిగి, కలిసి పుట్టేవారే. అలాంటివారు కొద్ది నిమిషాల తేడాలో జన్మిస్తుంటారు. అరుదుగా గంటా రెండు గంటలు కూడా తేడా ఉంటుంది. ఒకే పోలికలతో పుట్టేవారి (ఏకరూప కవలల) మధ్య అయితే మాత్రం తేడా నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్ మార్టినెక్స్ అనే మహిళకు తొలి పాప పుట్టిన తర్వాత మూడు రోజులకు రెండో పాప జన్మించింది. నిజానికి మార్చి తొలివారంలో ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళితే మార్చి 7న ఒక పాపకు జన్మనిచ్చింది. రెండో పాప గర్భంలో అలాగే ఉండిపోయింది. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. మూడు రోజుల తర్వాత మార్చి 10న మార్టినెక్స్ రెండో పాపకు జన్మనిచ్చింది. మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్ అని పేరుపెట్టారు. ‘‘ఇద్దరికీ ఒకే రోజు ఏంటి? నా స్పెషల్‌డే పార్టీ నాకు ఉండాల్సిందే అనుకుంటూ ఇసబెల్లా లేటుగా పుట్టేసింది. ఏమైనా నా పిల్లలు సమ్‌థింగ్ స్పెషల్’’ అంటూ మార్టినెక్స్ మురిసిపోతోంది. అత్యంత అరుదుగా.. ఇద్దరూ పూర్తిగా ఎదగకముందే కేవలం 24–25 వారాల్లోనే, కేవలం 700 గ్రాముల బరువుతోనే పుట్టడంతో.. మూడు నెలలుగా పిల్లల ఐసీయూ (ఎన్ఐసీ యూ)లో ఉంచారు. అసలు బతుకుతారో లేదో అనే పరిస్థితి నుంచి ఇక ప్రమాదం లేనట్టేననే దశకు చేరాక.. వైద్యులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇలా కవలలు మూడు రోజుల తేడాతో జన్మించడం అత్యంత అరుదైన విషయమని ప్రకటించారు. చదవండి: బార్లో బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు -
అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు!
కొలంబో: శ్రీలంకలో 80 ఏళ్ళ తర్వాత ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 25 యేళ్ళ సురంజి అనే ఆడ ఏనుగు మగ కవలలకు జన్మనిచ్చింది. ఏనుగుల అనాథ ఆశ్రమంలో మంగళవారం రెండు మగ ఏనుగు పిల్లలు పుట్టాయని.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాయని పిన్నవాలా ఏనుగుల అనాథ ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. 1941లో తొలిసారిగా ఒక ఏనుగు కవలపిల్లలను ఈనిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాఆ మరొక సారి ఈ అద్భుతం చోటుచేసుకుందని ఏనుగుల నిపుణుడు జయంత జయవర్దనే తెలిపారు. సురంజి 2009లో ఒక మగ ఏనుగు పిల్లకు జన్మనిచ్చిందని, ఇప్పుడు రెండో సారి రెండు మగ ఏనుగు పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు. అయితే శ్రీలంక స్థానికుల్లో కొందరు తమ గొప్పదనాన్ని ప్రదర్శించుకోడానికి ఏనుగులను పెంచుకుంటారు. వాటి సంరక్షణలో నిర్లక్క్ష్యం వహించేవారి నుంచి గాయపడిన, ఆరోగ్యం క్షీణించిన ఏనుగులను చేరదీసి ఈ అనాథ ఆశ్రమంలో రక్షణ కల్పిస్తారు. ఇక ఏనుగులను హింసించే వారికి వారికి 3 యేళ్ల జైలు శిక్ష విధించే విధంగా అక్కడ చట్టాలు అమల్లో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ అధికారిక రికార్డుల ప్రకారం శ్రీలంకలో 200 పెంపుడు ఏనుగులు, 7 వేల అడవి ఏనుగులు ఉన్నట్టు వెల్లడించారు. చదవండి: గోల్డ్ వడపావ్‌ను చూశారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! An elephant gave birth to twins for the first time in nearly 80 years in Sri Lanka, wildlife authorities said pic.twitter.com/p75mG5VkL7 — Reuters (@Reuters) September 1, 2021 -
Dubai Crown Prince: వారసులొచ్చారు
దుబాయ్: ఇద్దరు కొత్త సభ్యుల రాకతో దుబాయ్ రాచకుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకరు బాబు కాగా మరొకరు పాప. ఇద్దరు కవలలను చూసుకుని కాబోయే రాజదంపతులు మురిసిపోతున్నారు. రాజప్రసాదంలోకి అడుగు పెట్టిన బాబుకి రషీద్ అని పేరు పెట్టగా పాపకి షైఖా అని నామకరం చేశారు. పాలబుగ్గలతో ఉన్న పసిపిల్లల ఆలనపాలనలో రాజదంపతులు బిజీగా ఉన్నారు. యువరాజు ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడంటూ దుబాయ్ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే... శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తన ఇద్దరు పిల్లలను తనివితీరా చూస్తున్న ఫోటోను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వైరల్ అయ్యింది. -
కవలలు కన్నుతెరవకముందే తల్లి కన్నుమూత
వైఎస్ఆర్ జిల్లా, చాపాడు: కవలలకు జన్మనిచ్చి ఓ తల్లి కన్నుమూసిన దయనీయ వైనమిది. మృతురాలి స్వగ్రామం చాపాడు మండలం ఖాదర్‌పల్లెలోవిషాదం నెలకొంది. దిగువ మధ్య తరగతికి చెందిన మృతురాలి(22) భర్త ..సోదరుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. లాక్డౌన్ నిబంధనల వల్ల వారెవరూ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఈమె తల్లిదండ్రులు..అత్తమామలు ఖాదర్‌పల్లెలోనే ఉంటున్నారు. గర్భిణీగా ఉన్న ఈమెను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని..రక్తస్రావం అధికంగా ఉందంటూ అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఈనెల 4న కడపలోని రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి ఇబ్బందిగా ఉందని..వివిధ అనారోగ్య సమస్యలున్నట్లు రిమ్స్ వైద్యులు గుర్తించారు. ఈనెల 6న ఆమెకు శస్త్రచికిత్స చేశారు. కవలలు(ఇద్దరు మగబిడ్డలు)కు జన్మనిచ్చింది.అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా తయారైంది. ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించినట్లువైద్యవర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. కన్ను తెరవని పసికందులను చూడకుండానే ఆ తల్లి విగత జీవి అయ్యింది. ఈ విషాద సంఘటన ఖాదర్పల్లెవాసుల హృదయాలను కదిలించింది. కవలల్ని ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అనుమతి లేకపోవటంతో ఆర్డీఓ నాగన్న, తహసీల్దారు శ్రీహరి ఆధ్వర్యంంలో బంధువుల సమక్షంలో కడపలోనే అంత్యక్రియులు నిర్వహించారు. ఇదిలా ఉండగా సాధారణంగా గర్భిణికి కరోనా పరీక్ష చేస్తారు. అదే విధంగా ఆమెకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మృతురాలికి చెందిన 17మందిని కూడా అత్యవసరంగా క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. బాలింత మృతిపై అధికారుల విచారణ కడప అర్బన్: బాలింత మృతి విషయం తెలిశాక ఆర్డీఓ మలోలా, కడప నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న, డీఎస్పీ సూర్యనారాయణ, తహశీల్దార్ శివరామిరెడ్డిలు తమ సిబ్బంది బుధవారం ఐపీ విభాగానికి చేరుకున్నారు. ఆమె ఏ కారణం చేత మృతి చెందిందో డాక్టర్లను అడిగితెలుసుకున్నారు. మూడు సార్లు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. మృతురాలి తండ్రి, బంధువుల స్టేట్మెంట్లను డాక్టర్లు తీసుకున్నారు. ప్రసవ సమయంలో శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యం బలహీనమై ఉంటుందని కూడా వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం కవలలు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఏడాది తిరక్కమునుపే.. కుమార్తెకు, పొరుగున ఉండే ఫకృద్దీన్‌కు గత ఏడాది ఆగస్టు 15న(స్వాతంత్య్ర దినోత్సవం రోజు) కావాలనే వివాహం జరిపించాను. నాలుగునెలల తర్వాత అల్లుడు గల్ఫ్‌కు జీవనోపాధి నిమిత్తం వెళ్లాడు. గర్భం దాల్చిన కుమార్తెను మా దగ్గరే పెట్టుకుని బాగోగులు చూసుకునేవాళ్లం. ఈనెల 1,2 తేదీల్లో ప్రొద్దుటూరుకు వెళ్లాం. కవలపిల్లలు, కాన్పు కష్టమని చెప్పారు. తరువాత రిమ్స్‌కు తీసుకుని వచ్చాం. ఈనెల 6న కవలపిల్లలకు జన్మనిచ్చింది. రక్తం తక్కువగా ఉందని..త్వరలో కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు. ఇంతలోనే మృతి చెందింది. ఈ ఏడాది ఆగస్టు 15 రాకముందే మా అమ్మాయి అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. –మృతురాలి తండ్రి కమాల్‌బాషా -
దానికి మార్గాలున్నాయా?
నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈమధ్య ‘ప్రెగ్నెన్సీ గ్లో’ అనే మాట విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. నాకు కవలపిల్లలు అంటే చాలా ఇష్టం. కవలపిల్లలను కనడానికి మార్గాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయగలరు. – కె.మనస్వి, నాయుడుపేట ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగా చర్మంలోని గ్రంథులు ఎక్కువగా ఆయిల్‌ను స్రవించడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో రక్త ప్రసరణ పెరగడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, చర్మానికి రక్తనాళాలు విస్తరించడం వల్ల వ్యాకోచించి చర్మం మెరిసినట్లుగా ఉంటుంది. దీనినే ప్రెగ్నెన్సీ గ్లో అంటారు. సాధారణంగా గర్భం దాల్చాలంటే ఒక శుక్రకణం ఒక అండంతో కలవడం వల్ల ఏర్పడాలి. కవల పిల్లలు కనడానికి గర్భాశయం నుంచి రెండు అండాలు విడుదలై, అవి ఫలదీకరణ చెందాలి లేదా పిండం ఆరంభ దశలోనే రెండుగా విభజన చెంది కవలలుగా పెరగడం జరుగుతుంది. కొందరిలో పిల్లల కోసం చికిత్స తీసుకోవడం వల్ల అండాలు ఎక్కువగా తయారై కవల పిల్లలు ఏర్పడతారు. కొందరిలో వారి ఫ్యామిలీలో కవలలు ఉన్నప్పుడు జన్యుపరంగా కవలలు పుట్టవచ్చు. కొందరిలో సాధారణంగానే అవవచ్చు. కవల పిల్లలు కావాలనుకుని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమీ లేదు. అండాలు ఎక్కువగా తయారై, విడుదలవడానికి నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడవలసి ఉంటుంది. అలాగని కచ్చితంగా కవలలు పుడతారనేమీ లేదు. ఒక్కోసారి ట్రిప్లెట్స్ కూడా పుట్టవచ్చు. కవలలు ఏర్పడినా, అందులో ఉండే సమస్యలు ఒక శిశువు పుట్టేదాని కంటే ఎక్కువగా ఉంటాయి. నాకు ఈమధ్య వైట్ డిశ్చార్జి ఎక్కువ అవుతోంది. దుర్వాసన వస్తోంది. దీనికి కారణం మరియు నివారణ గురించి వివరంగా తెలియజేయగలరు. – సీఆర్, కదిరి మీ వయసు రాయలేదు. వివాహం అయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అనేది రాయలేదు. ఆడవారిలో వైట్ డిశ్చార్జి అంటే తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి: ఏ సమస్యా లేకుండా గర్భాశయ ముఖద్వారం, యోనిలో ఉండే గ్రంథుల నుంచి స్రవించే మ్యూకస్ ద్రవాల వల్ల వచ్చే వైట్ డిశ్చార్జిని ల్యూకేరియా అంటారు. ఇందులో వాసన, దురద ఉండవు. నీరులాగ జిగటగా వస్తుంది. ఇది పీరియడ్ వచ్చే ముందు, పీరియడ్‌లో, అండం విడుదలయ్యే సమయంలో, కలయికలో ప్రేరణకు గురైనప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండవది: బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జి. వీటిలో తెల్లబట్ట కొద్దిగా పచ్చగా, పెరుగులాగ దురద, మంట, వాసనతో కూడుకుని ఉంటుంది. కొందరిలో గర్భాశయ ముఖద్వారం వద్ద పుండ్లు, గడ్డల వల్ల కూడా తెల్లబట్ట రావచ్చు. ఇలాంటి వాటిని అశ్రద్ధ చేయకూడదు. నీకు వచ్చే తెల్లబట్టతో పాటు దురద కూడా ఉంది కాబట్టి గైనకాలజిస్టును సంప్రదించి లోకల్ ఎగ్జామినేషన్, వివాహిత అయితే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అవసరమైతే వెజైనల్ స్వాబ్ కల్చర్ పరీక్ష, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. యోని ఇన్ఫెక్షన్లు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, మలద్వారం నుంచి క్రిముల వల్ల, కలయిక వల్ల, లైంగిక సంబంధాల వల్ల, ఇంకా ఇతర కారణాల వల్ల రావచ్చు. నివారణ చర్యల్లో భాగంగా శారీరక శుభ్రతను, జననేంద్రియాల శుభ్రతను పాటించాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, రోజుకు కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు శుభ్రపరచుకోవడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నాకు మెనోపాజ్ గురించి అవగాహన ఉంది. ‘పెరీ మెనోపాజ్’ అంటే ఏమిటి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేగలరు. – రమ్య, వినుకొండ పెరీ మెనోపాజ్ అంటే మెనోపాజ్ దశకు చేరే ముందు ఉండే దశ. దీనిలో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరే ముందు అండాశయాల నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మన్ మూడు నుంచి ఐదేళ్ల ముందు నుంచే కొద్ది కొద్దిగా తగ్గుతూ విడుదలవడం జరుగుతుంది. ఈ సమయంలో జరిగే శారీరక, మానసిక మార్పులకు చెందిన దశను పెరీ మెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు చేరువలో ఉండే దశ అన్నమాట. ఇది సాధారణంగా నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాతి నుంచి మొదలవుతుంది. ఇందులోని లక్షణాల్లో భాగంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఒంట్లో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లషెస్), చెమటలు పట్టడం, పీరియడ్స్‌లో మార్పులు, మూత్ర సమస్యలు, కలయికలో ఇబ్బంది, నొప్పి, మంట, లైంగిక కోరికలు తగ్గడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ లక్షణాలు మెనోపాజ్‌కు ముందు మూడు–ఐదేళ్ల నుంచి మూడు నెలల లోపల ఎప్పుడైనా ఉండవచ్చు. కొందరిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నట్లుండి పీరియడ్స్ ఆగిపోయి (పన్నెండు నెలలు పీరియడ్స్ రాకుండా ఉండటం) మెనోపాజ్ దశకు చేరవచ్చు. పెరీ మెనోపాజ్లోని ఈస్ట్రోజన్ మార్పులను మనం మార్చలేం. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండటం, ఫ్యాను లేదా ఏసీ కింద ఉండటం, మెడిటేషన్, యోగా, వ్యాయామాలు చేయడం, వదులుగా పలచగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరీ అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, ఈస్ట్రోజన్లా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే సోయాబీన్స్, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆహారంలో తీసుకుంటూ, ఐసోఫ్లావోన్ సప్లిమెంట్లు మాత్రల రూపంలో తీసుకోవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆ డైరెక్టర్ పిల్లలను చూసేందుకు నటి నో!
ఒకప్పుడు దర్శకుడు కరణ్ జోహర్, నటి కాజోల్ మంచి స్నేహితులు. కానీ, చాలా రంగాల్లో మాదిరిగానే బాలీవుడ్‌లోనూ స్నేహం కూడా తాత్కాలికమే. కరణ్, కాజోల్ ఇప్పుడు స్నేహితులు కాదు. కనీసం ఎదురెదురుపడితే ముఖం తిప్పుకొనిపోయే బద్ధవైరం కూడా వారి మధ్యలో ఉంది. ఇటీవలే కరణ్ జోహర్ సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చాడు. మరీ ఆ శిశువులను చూసేందుకు మీరు వెళుతారా? అంటే కాజోల్ ఏమన్నదో తెలుసా.. ఈ మధ్య విడుదలైన తన ఆత్మకథ 'అన్‌సూటబుల్ బోయ్'లో కరణ్ కాజోల్ గురించి రాస్తూ.. 'ఏది ఏమైనా ఆమె నా జీవితంలోంచి వెళ్లిపోయింది' అంటూ పరుషంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఓ అవార్డుల వేడుకలో కరణ్, కాజోల్-అజయ్ దేవ్గన్ దంపతులు ఎదురుపడ్డా.. కనీసం పలుకరించుకోకుండా ముఖాలు తిప్పుకొని వెళ్లిపోయారు. ఇక గత ఏడాది ఒకే సమయంలో కరణ్ యే దిల్ హై ముష్కిల్, అజయ్ దేవ్‌గణ్ 'శివాయ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటంతో.. బాహాటంగానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో కరణ్-కాజోల్ మధ్య స్నేహసంబంధాలు ఎడమొఖం పెడమొఖంలా మారిపోయాయి. ఇటీవలే ఆస్పత్రి నుంచి ఇంటికి తెచుకున్న కరణ్ కవలలను చూసేందుకు బాలీవుడ్ జనాలు ఆయన ఇంటికి పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజోల్‌ను మీరు కూడా కరణ్ కవల పిల్లలను చూసేందుకు వెళుతారా? అని ప్రశ్నించగా.. 'ఆ విషయం అడగకండి. అలాంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను' అంటూ కాజోల్ సూటిగా చెప్పేసిందట. మొత్తంమీద వీరి మధ్య స్నేహం దారుణంగా చెడిపోయిందని సినీ జనాలు అంటున్నారు. -
నగరంలో 'మిస్ ట్విన్ సిటీస్' పోటీలు