దారుణం.. అప్పుడే పుట్టిన ట్విన్స్‌ను చంపి.. పాతిపెట్టిన తండ్రి | Delhi Man Who Killed 3 Day Old Twin Daughters | Sakshi
Sakshi News home page

దారుణం.. అప్పుడే పుట్టిన ట్విన్స్‌ను చంపి.. పాతిపెట్టిన తండ్రి

Published Wed, Jul 10 2024 1:50 PM | Last Updated on Wed, Jul 10 2024 6:54 PM

Delhi Man Who Killed 3 Day Old Twin Daughters

సాక్షి,న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన కూతుళ్లను గుండెల మీద కుంపటిలా భావించిన ఓ తండ్రి దారుణానికి ఒడిగాట్టాడు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన కవలల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాల్ని పాతిపెట్టి పరారయ్యాడు.  

ఢిల్లీకి చెందిన నీరజ్‌ సోలంకి,పూజా సోలంకి భార్యభర్తలు. గర్బవతిగా ఉన్న పూజా సోలంకి మే 30న హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఓ ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొడుకే కావాలని కోరుకునే నీరజ్‌.. ఆడపిల్లలు పుట్టడంతో కలత చెందాడు.  జూన 3వ తేదీన ఆ కవలల్ని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన బావ నీరజ్‌ పసికందుల్ని హత్య చేశాడంటూ   బావమరిది ఢిల్లీ సుల్తాన్‌పురి పీఎస్‌ పోలీసులకు సమాచారం అందించాడు.  

బావమరిది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పట్టించిన కాల్ డేటా
ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నీరజ్ సోలంకి ఫోన్‌ కాల్‌ డేటాపై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దృష్టిసారించారు. ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా తన మొబైల్ హ్యాండ్‌సెట్, సిమ్‌లు, ప్రదేశాలను తరచుగా మారుస్తున్నట్లు గమనించారు. ఢిల్లీ, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిందదితుణ్ని రోహ్‌తక్‌లోని సంప్లాలో అరెస్ట్‌ చేశారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement