Buried
-
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్‌లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
Kedarnath: ఒక రోజంతా బండరాళ్లలో.. చివరికి వచ్చాడిలా
ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.ప్రస్తుతం కేదార్నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.గిరీష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. -
దారుణం.. అప్పుడే పుట్టిన ట్విన్స్‌ను చంపి.. పాతిపెట్టిన తండ్రి
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుడే పుట్టిన కూతుళ్లను గుండెల మీద కుంపటిలా భావించిన ఓ తండ్రి దారుణానికి ఒడిగాట్టాడు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన కవలల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాల్ని పాతిపెట్టి పరారయ్యాడు. ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి,పూజా సోలంకి భార్యభర్తలు. గర్బవతిగా ఉన్న పూజా సోలంకి మే 30న హర్యానాలోని రోహ్తక్లోని ఓ ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొడుకే కావాలని కోరుకునే నీరజ్.. ఆడపిల్లలు పుట్టడంతో కలత చెందాడు. జూన 3వ తేదీన ఆ కవలల్ని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన బావ నీరజ్ పసికందుల్ని హత్య చేశాడంటూ బావమరిది ఢిల్లీ సుల్తాన్‌పురి పీఎస్ పోలీసులకు సమాచారం అందించాడు. బావమరిది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పట్టించిన కాల్ డేటాఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నీరజ్ సోలంకి ఫోన్ కాల్ డేటాపై క్రైం బ్రాంచ్ పోలీసులు దృష్టిసారించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా తన మొబైల్ హ్యాండ్సెట్, సిమ్‌లు, ప్రదేశాలను తరచుగా మారుస్తున్నట్లు గమనించారు. ఢిల్లీ, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిందదితుణ్ని రోహ్తక్లోని సంప్లాలో అరెస్ట్ చేశారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!
బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
అక్కడ అదే ఆచారం.. చిన్న పిల్లల మృతదేహాలను తీసుకెళ్లి
భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. చనిపోయిన వాళ్లు గురించి తలుచుకుని కొందరు బాధపడుతుంటారు. మరొకొందరు వారి గుర్తుగా దానధర్మాలు వంటివి చేస్తుంటారు. ఏదేమైన మనకిష్టమైన వాళ్లని పోగొట్టుకుంటే అది బాధ అని చెప్పడం కంటే నరకమనే చెప్పాలి. అందుకే దీని నుంచి కాస్తైన ఉపశమనం పొందేందుకు ఇండోనేసియా ప్రజలు ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా ఎవరైన చనిపోతే.. వాళ్లుని శాస్త్ర ప్రకారం దహనం చేసి అంత్యక్రియలను పూర్తి చేస్తారు. కానీ ఇండోనేసియాలో చనిపోయిన పిల్లలను చెట్ల వేరు కింద పాతిపెడతారంట. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారట. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తానా తరోజాలో గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా చిన్న పిల్లలు చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించరు. దహన సంస్కారాలు చేపట్టరు. ఎందుకంటే పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రులకు ఎంతగానో బాధను మిగిలుస్తుంది. అది వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ చిన్నారుల మృతదేహాల్ని చెట్టు కింద మొదలు వేరు బాగంలో పాతిపెడతారు. చనిపోయిన పిల్లవాడు క్రమంగా ఈ చెట్టులోనే భాగమైపోతాడు. ఇలా చేయడం వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టిన చిన్న పిల్లవాడు చెట్టు రూపంలో శాశ్వతంగా జీవిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇది ఇక్కడి విచిత్రమైన సంప్రదాయం. అయితే పెద్దలు చనిపోయినప్పుడు సాధారణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. చదవండి దుబాయ్‌లో భారత ఆర్కిటెక్ట్ జాక్‌పాట్.. 25 ఏళ్లపాటు, నెలకు రూ.5.59 లక్షలు.. -
కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రతతో అంతిమయాత్ర
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి. Uttar Pradesh | Bodies of mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed brought to Kasari Masari burial ground in Prayagraj where they will be buried. They were shot dead yesterday, in Prayagraj, by three shooters while they were surrounded by bevy of police… pic.twitter.com/kqtaWfy9ir — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023 శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అసద్ అంత్యక్రియలు .. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియుల ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని కూడా ఈ ఎన్కౌంటర్లో హతమార్చారు. అనంతరం అసద్ భౌతికకాయాన్ని పోలీసులే ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. అంత్యక్రియల్లో అతికొద్ది మంది బంధువులే పాల్గొన్నారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేధనకు గురైనట్లు తెలుస్తోంది. ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
మాస్కో: ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. -
జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడు ఉపఎన్నికల వేళ కలకలం
సాక్షి, చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనాకేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది. బుధవారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మట్టితో సమాధిని కట్టి, పూలదండలు వేసి, జేపీ నడ్డా ఫొటో పెట్టి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. గురువారం ఉదయం పోలీసులు దీనిని తొలగించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనాస్థలానికి వెళ్లి ఇది అధికార పార్టీ పనేనని మండిపడ్డారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఫ్లోరైడ్ బాధితులే ఈ పనిచేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, ప్రత్యర్థి పార్టీలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడ మండలంలో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తదనంతర పరిణామాల్లో ఈ కేంద్రం పశ్చిమబెంగాల్‌కు తరలిపోయింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నడ్డా పేరిట సమాధి కట్టడం గమనార్హం. -
చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే.. తిరిగొచ్చాడు
Tamil Nadu man returns home alive: కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేనా? లేక కల అనిపిస్తుంది. కళ్లతో చూస్తున్నప్పటకీ ఇది నిజమేనా అని సందేహంగా ఉండిపోతాం. పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో బనగలద్‌పూర్‌లో చోటుచేసుకుంది. మూర్తి దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్‌కి.. మూర్తి ఓ బస్టాప్‌లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్ తిన్నారు.ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్‌కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు. (చదవండి: హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ రైటర్ అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..) -
సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్సూ్యల్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో శుక్రవారం ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్ క్యాప్సూ్యల్(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. నోబెల్ అవార్డు గ్రహీతలు డంకన్ హాల్డెన్, అవ్ రామ్ హెర్‡్ష కోవ్, థామస్ సుడాఫ్ ఒక మీట నొక్కగానేప్రత్యేకంగా తయారైన ఉక్కు అల్మారా భూమికి పది అడుగుల లోతైన గుంతలోకి వెళ్లింది. ఎల్పీయూలోని యునిపోలిస్ ఆడిటోరియంలో నిక్షిప్తమైన క్యాప్సూ్యల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్, డ్రోన్, వీఆర్ గ్లాస్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను అందులో దాచినట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. మెచ్చినట్లుగా ముత్యాల తయారీ! ముత్యపు చిప్పలోకి ప్రత్యేక పద్ధతిలో ముత్యపు కేంద్రకాన్ని చొప్పించడం ద్వారా మనకు నచ్చిన ఆకారంలో ముత్యాలను తయారు చేసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జెన్నా తెలిపారు. వినాయకుడి విగ్రహం మొదలుకొని వేర్వేరు ఆకారాల్లో వీటిని తయారు చేయవచ్చని తెలిపారు. పరిజ్ఞానం 15 ఏళ్లుగా ఉన్నా మానవవనరుల కొరత కారణంగా ప్రాచుర్యం పొందలేదన్నారు. -
భారతీయుడి పుర్రెను భారత్‌లోనే ఖననం చేయాలి!
లండన్: ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా విధులు నిర్వర్తించిన ఓ భారతీయుడి పుర్రెను.. అతని మాతృభూమిలోనే ఖననం చేయాలంటూ ఓ బ్రిటన్ చరిత్రకారుడు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13తో 99 ఏళ్లు గడిచిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరణించిన సైనికుడి పుర్రెకు ఇండియాలో దహన సంస్కారాలు జరిపించాలని కోరుతున్నాడు డాక్టర్ కిమ్ వాగ్నర్. కిమ్ లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014లో జలియవాలా బాగ్ గురించి ఓ బుక్ రాయడానికి పరిశోధన మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఉన్న ఆయనకు ఒక స్టోర్‌రూమ్‌లో ఒక పుర్రె దొరికింది. దాని కళ్ల భాగంలో ఆ పుర్రెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ కాగితం కనిపించింది. అది తెరిచి చూడగా దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన భారతీయ సైనికుడు ఆలం బాగ్ పుర్రె అని, ఇతను 32 సంవత్సరాల వయసువాడని, 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు కలిగి ఉన్నాడు. అంతేగాక అతని కుటుంబం మొత్తాన్ని స్కాటిష్ మిషనరీలు చంపేశాయని రాసి ఉంది. ఇది చదివిన కిమ్ మరింత అధ్యయనం జరిపి వాగ్నర్ ద స్కల్ ఆఫ్ ఆలం బాగ్( ద లైఫ్ ఆండ్ డెత్ ఆఫ్ ఏ రెబల్ ఆఫ్ 1857) పేరిట పుస్తకాన్ని రాసి విడుదలచేశారు. అంతటితో ఆగకుండా ఆలం బాగ్‌ను మాతృభూమి మట్టిలోనే పూడ్చిపెట్టాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ద్వారా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. -
సమాధి తవ్వి.. పోస్టుమార్టం
అశ్వారావుపేట : మృతురాలి బంధువుల ఏమరుపాటు పోలీసులకు పెద్ద పనే పెట్టింది. అశ్వారావుపేట బీసీ కాలనీలోని జంగాల బజారుకు చెందిన కళ్యాణపు నాగమ్మ(75), జనవరి 31న చలి కాగుతుండగా ఫిట్స్ రావడంతో చలి మంటలో పడి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మనుమడు సిరిగిరి తిరుపతిరావు చేర్పించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి, ఖమ్మం ఆస్పత్రులకు కుటుంబీకులు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నాగమ్మ మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలపకుండా ఖననం చేశారు. పెండింగులోగల ఈ కేసు వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని సీఐ ఎం.అబ్బయ్య ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సీఐ దగ్గరుండి ఆ సమాధిని తవ్వించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రత్యూష, మంగీలాల్ పోస్టుమార్టం నిర్వహించారు. -
చైనాలో కొండచరియల బీభత్సం
- సిచువాన్ ప్రావిన్సులో 15 మంది మృతి - శిథిలాల కింద 120 మంది బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడి 15 మృతి చెందగా, మరో 120 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా మౌగ్జియాన్ కౌంటీలోని జిన్మో గ్రామంపై శనివారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొత్తం 62 ఇళ్లు కూలిపోయాయి. 1.6 కి.మీ పొడవునా రోడ్డు ధ్వంసం అయ్యింది. ఆ ప్రాంతంలోని నదిలో దాదాపు రెండు కి.మీ పొడవునా రాళ్లు చేరాయి. ఏకంగా అక్కడి పర్వతంలోని కొంత భాగం కూలిపోయింది. జిన్మో గ్రామం పర్వతాల నడుమ లోయలో ఉంటుంది. శనివారం మొత్తం రెండుసార్లు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డట్టు సమాచారం. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడటానికి సర్వశక్తులూ ఒడ్డాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి పూర్తి కారణాలను అన్వేషించాలని చైనా ప్రధాని లీ కెఖియాంగ్ ఆదేశించారు. రెండు వేల మంది సిబ్బంది, భూగర్భ, జల శాస్త్రవేత్తలు, సర్వే నిపుణులు డ్రోన్లు, లేజర్ స్కానర్లు తదితర పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. కొండ చరియలకు సంబంధించి రెండో ప్రమాద హెచ్చరికను చైనా జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండచరియలు విరిగి పడటానికి స్వల్ప భూకంపం, భారీ వర్షాలే కారణమైనప్పటికీ.. ఆ ప్రాంతంలో చెట్లు లేకపోవడం పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారులు వెల్లడించారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు!
అది హుండూరస్‌లోని లా ఎంట్రాడా అనే ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. అందరూ రోజువారీ కార్యకలాపాలు అయిపోయాక ఎప్పటిలాగే విశ్రమించారు. నైసీ పరేజ్ అనే 16 ఏళ్ల యువతి కూడా నిద్రకు ఉపక్రమించింది. మధ్యరాత్రి బాత్రూంకి వెళ్లి ఒక్కసారిగా అరుస్తూ కుప్పకూలిపోయింది. భయబ్రాంతులకు గురైన తల్లిదండ్రులు స్థానిక మంత్రగాడిని పిలిపించారు. పరేజ్ తల్లిదండ్రులకు మూడవిశ్వాసాలు అధికం. పరేజ్ పరిస్థితిని గమనించిన ఆ మంత్రగాడు ఈమెను ఆత్మ వశం చేసుకుందని బతకడం చాలా కష్టమని తేల్చాడు. పరేజ్ బంధువులు మూడు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. మరుసటి రోజు అరుపులు భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న గోంజాల్స్ పరేజ్ మరణించిందన్న వార్తను జీర్ణించుకోలేక పోయాడు. ఆమె సమాధిపై పడి చిన్నపిల్లాడిలా ఏడుస్తుండగానే గోంజాల్స్‌కు కాపాడండి! అన్న అరుపులు వినిపించాయి. అరుపులు భార్య సమాధి నుంచే వస్తున్నాయని ఆశ్చర్యపోయాడు. పరుగున వచ్చిన గోంజాల్స్ జరిగిన విషయాన్ని ఇంట్లోవారికి తెలియజేశాడు. పెద్దలు వారిస్తున్నా... స్మశానం వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు పరేజ్ సమాధిని పగులగొట్టి పరేజ్ శవాన్ని బయటకు తీయించాడు. పరేజ్ ముఖంపై రక్తపుగాట్లు ఉన్నాయి. అంతేకాదు ఆమె చేతివేళ్లు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. శవపేటిక మూత కూడా లోపలి భాగంలో ధ్వంసమై ఉంది. వెంటనే పరేజ్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు మరణించి కేవలం కొద్ది సమయం మాత్రమే అవుతుందని చెప్పారు. అయితే మెదట తాత్కలికంగా ఆమె గుండె ఆగిపోవడంతో చనిపోయినట్లు మొదటగా భావించినట్లుందని డాక్టర్లు ఊహించారు. ఏదీ ఏమైనప్పటికీ పరేజ్ చనిపోయిన తీరు చాలా దురదృష్టకరం. పిచ్చివాడైన భర్త... పరేజ్ మరణంతో భర్త రూడీ గోంజాల్స్ పిచ్చిపట్టనవాడిగా మారిపోయాడు. త్వరలో తమకు ఒక బిడ్డ పుట్టబోతుందన్న ఆశలతో ఉన్న గోంజాల్స్‌కు పరేజ్ మరణంతో జీవచ్చవంలా మారాడు. ఆసుపత్రి నుంచి పరేజ్ శవాన్ని స్థానిక స్మశానవాటిలోఖననం చేశారు. సాక్షి స్కూల్ ఎడిషన్ -
పాతిపెట్టిన మృతదేహం వెలికితీత
పరిగి(పెనుకొండ రూరల్): పరిగి మండలం కొడిగేపల్లికి చెందిన శ్యామల(28) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. మూడు నెలల కిందట జరిగిన స్టౌ ప్రమాదంలో ఆమె గాయపడగా 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అప్పట్లో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. హిందూపురం ఆస్పత్రి వైద్యులు ఆందించిన రిపోర్టు ఆధారంగా పోలీసులు గురువారం గ్రామానికి వెళ్లి విచారించారు.శ్యామల మృతి చెందినట్లు తెలుసుకున్న పోలీసులు తహశీల్దార్ సుబ్బారెడ్డికి సమాచారం అందించారు. ఆయన సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆ తరువాత పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. -
జయలలితను ఎందుకు ఖననం చేశారు?
న్యూఢిల్లీ: లక్షలాది అభిమానులను శోకసంద్రంలో వదిలేసి దిగంతాలకు నిష్ర్కమించిన జయలలితకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగినప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఐయ్యంగార్ బ్రాహ్మణ హిందూ కుటుంబానికి చెందిన ఆమెకు దహన సంస్కరణలను నిర్వహించకుండా ఎందుకు ఖననం చేశారన్నదే ఆ ప్రశ్న. అందుకు పలు కారణాలు ఉన్నాయి. 1. పెరియార్ రామస్వామి, అన్నా దురై, ఎంజీ రామచంద్రన్ లాంటి ప్రముఖ నాయకులందరిని మెరీనా బీచ్ ఒడ్డునే గంధపుచెక్కలు, పవిత్ర జలాలతో ఖననం చేశారు. కనుక జయలలిత విషయంలోనూ అదే చేశారు. 2. ఖననం చేసిన చోట వారి పేరిట స్మారక భవనాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అందులో సమాధిని సందర్శించుకొని అభిమానులు తమ ప్రియతమ నాయకురాలిని గుర్తుచేసుకునే అవకాశం కలుగుతుంది. 3. దహన సంస్కారం చేయాలంటే సమీప బంధువులు ఉండాలి. వారే చితికి నిప్పంటించాల్సి ఉంటుంది. జయలలిత అన్న జయ కుమార్ కూతురు దీపా జయకుమార్ గత సెప్టెంబర్ నెల నుంచి పలుసార్లు ఆపోలో ఆస్పత్రికి వచ్చి చికిత్సపొందుతున్న జయలలితను కలసుకునేందుకు ప్రయత్నించారు. ఓసారి భర్తతో వచ్చిన ఆమెను తమిళనాడు పోలీసులు అపోలో ఆస్పత్రి గేట్ నుంచి బలవంతంగా బయటకు పంపించారు. 4. జయలలితకు వారసురాలిగా దీపా జయకుమార్ ఎక్కడ ముందుకు వస్తారన్న ముందుచూపుతో ఆమెను శశికళనే బయటకు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అంత్యక్రియలకు కూడా వారిని అనుమతించలేదు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులే భౌతిక దేహం వద్ద నిరంతరం ఉండడమే కాకుండా ఆమె ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు ముగిశాయి. -
జయ అంతిమ యాత్ర ప్రారంభం
-
తల్లి మృతదేహం గుట్టుగా ఖననం
సోదరులు, బంధువులకూ సమాచారమివ్వని ప్రబుద్ధుడు భూపాలపల్లి: కన్నతల్లి మరణిస్తే ఆ విషయాన్ని కనీసం తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు కూడా చెప్పకుండా గుట్టుగా ఖననం చేశాడో ప్రబుద్ధుడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎల్బీనగర్లో శుక్రవారం ఈ ఉదంతం జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. కట్కూరి మల్లమ్మ(80)కి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భూపాలపల్లి ఎల్బీనగర్లో ఉండే ఆమె రెండో కుమారుడు శ్రీనివాస్ మల్లమ్మను నాలుగు నెలల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం ఉదయం మల్లమ్మ పెద్దకుమార్తె బల్ల సరస్వతి తల్లిని చూసేం దుకు వచ్చింది. పళ్లరసం తాగించిన తర్వాత సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికి మల్లమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు, బంధువులకు ఎవరికీ చెప్పలేదు. భార్య సహాయంతో తల్లి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశాడు. సాయంత్రం సరస్వతి తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి మరణించిందని తెలియడంతో భోరున విలపిస్తూ సోదరులకు,బంధువులకు సమాచారం అందించింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణిలపై ఫిర్యాదు చేసింది. శనివారం ఎస్సై గణపతి, తహసీల్దార్ సత్యనారాయణలు శ్మశానవాటికకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియ ఖర్చులు భరించాల్సి వస్తుందనే భయంతోనే ఇలా చేసినట్లు భావిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ తండ్రి నుంచి వారసత్వంగా ఉద్యోగం పొందాడు. -
మహిళా కానిస్టేబుల్ ఘాతుకం..
కాన్పూర్: ఓ మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న కారు ఓ యువకున్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 35 ఏళ్ల మదన్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆమె, ఆ కారులో ప్రయాణిస్తున్న మరొకరు వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఎక్కడ ఈ కేసు వాళ్ల మెడకు చుట్టుకుంటుదో అని పోస్టుమార్టం పూర్తి కాకముందే అతని మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న బాధితుడి బంధువులు రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండానే, పోస్టుమార్టం కూడా జరగకముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారని ఆరోపించారు. దీంతో వారం రోజుల కింద చోటు చేసుకున్న ఈ సంఘటనలో ప్రమేయమున్న ఆనంద్ పురి మహిళా హెడ్ కానిస్టేబుల్ వర్షా శ్రీవాస్తవ్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు బుధవారం కాన్పూర్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మంగళవారం మదన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు తెలిపారు. -
ఆ ఆరడుగుల జాగా కోసం..!
శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపించాలని ధర్నా హుజూర్నగర్: శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపాలంటూ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైనం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన చింతల నాగేశ్వరరావు (35) హమాలీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డెర కులానికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలను ఇతర కులాల వాటికలో నిర్వహించడం నిషిద్ధం. అయితే స్థానికంగా ఆ కులస్తులకు సంబంధించి ఎటువంటి శ్మశానవాటిక లేదు. ఇటీవల అదే కులానికి చెందిన ఆర్థికంగా వెసులుబాటు కలిగిన కొన్ని కుటుంబాల వారు కొంత స్థలాన్ని కొనుగోలు చేసి శ్మశానవాటికను ఏర్పాటు చేసుకున్నారు. నాగేశ్వరరావును ఆ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేసేందుకు అనుమతి కోరగా వారు నిరాకరించారు. స్థానిక హిందూశ్మశాన వాటికలోనైనా ఖననం చేద్దామని బంధువులు అక్కడకు వెళ్లగా దహనమే తప్ప ఖననం ఈ స్మశానవాటికలో లేదని వారు సైతం నిరాకరించారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచక బంధువులు ఆ మృతదేహాంతో స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు పట్టణంలోని అదే కులానికి చెందిన శ్మశానవాటికలో ఖననం చేసే విధంగా మాట్లాడి ఒప్పించి అంత్యక్రియలను పూర్తి చేయించారు. -
కేశవరెడ్డికి కన్నీటి వీడ్కోలు
డిచ్పల్లి/నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి అంత్యక్రియలు శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో జరిగాయి. ఈ ఆస్పత్రిలో డాక్టర్ కేశవరెడ్డి సుమారు 30 ఏళ్లపాటు కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించారు. తన భౌతికదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలన్న ఆయన కోరిక మేరకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలోని సీఎంసీ చర్చి ప్రాంగణంలో కేశవరెడ్డి పార్థివదేహాన్ని సందర్శనార్ధం ఉంచారు. రెవరెండ్ ఎం.చరణ్ నేతృత్వంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ భౌతికదేహాన్ని సమాధుల స్థలం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు. కేశవరెడ్డి అంత్యక్రియలకు ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న, నాళేశ్వర శంకర్, బైస రామదాసు, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్, సైదాచారి, ఉష, అరవి, ఎనిశెట్టి శంకర్, సూర్యప్రకాశ్, చందన్రావు, మేక రామస్వామి, సిద్దార్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆశ నారాయణ, మానవ హక్కుల సంఘం సభ్యుడు గొర్రెపాటి మాధవరావు, న్యాయవాదులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని కేవశరెడ్డి భౌతికదేహం వద్ద నివాళులు అర్పించారు. డాక్టర్ కేశవరెడ్డితో తన అను బంధాన్ని గుర్తు చేసుకుంటూ గోరెటి వెంకన్న ‘బతుకు మర్మమెరిగిన నవలా శిల్పి, మర్మయోగి గొంతు మూగబోయేనా’ అంటూ పాడిన పాట అంద రి హృదయాలను బరువెక్కించింది. -
బతికున్న పసికందు ఖననానికి యత్నం
హైదరాబాద్ సిటీ : కన్నబిడ్డ మరణించిందని నమ్మించి... ఖననం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించి తమ కఠినత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు పసిగుడ్డు ప్రాణాలతో ఉందని గుర్తించిన ఓ వ్యక్తి చివరి క్షణాల్లో చిన్నారిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్మశాన వాటిక నుంచి బిడ్డను వెనక్కి తీసుకెళ్లి అమ్మ ఒడికి చేర్చే ప్రయత్నం చేశాడు. హృదయాలు కదిలించే ఈ సంఘటన గురువారం హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.రవీంద్ర కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలంలోని రంగారెడ్డిపల్లికి చెందిన వెంకటేష్, మల్లిక దంపతులు. మల్లిక మూడు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ బరువు తక్కువగా ఉండడం.. అనారోగ్యం కారణంగా మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు ఆ దంపతులకు సూచించారు. దీంతో వారు ఈ నెల 11న నీలోఫర్‌కు శిశువును తీసుకువెళ్లారు. అదే సమయంలో సీతాఫల్ మండికి చెందిన ఓ దంపతుల మగబిడ్డ మృతిచెందాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయడానికి హబీబ్ అనే ఆటో డ్రైవర్‌కు ఆస్పత్రి సిబ్బంది అప్పగించారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న వెంకటేష్, మల్లిక దంపతులు తమ బిడ్డ చనిపోతుందనుకున్నారో... భారమవుతుందనుకున్నారో... వెంటనే పాప చనిపోయిందంటూ ఆటో డ్రైవర్‌కు అప్పగించారు. వారిని తీసుకొని హబీబ్ సమీపంలోని దేవుని కుంట శ్మశాన వాటికకు వెళ్లాడు. తొలుత మృతి చెందిన బిడ్డను ఖననం చేసి... పాపను కూడా ఖననం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పసికందు కదలడంతో అతను ఉలిక్కిపడ్డాడు. పాప బతికే ఉందని గుర్తించి హుమాయూన్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు శిశువుతో పాటు ఆటోడ్రైవర్ ను తీసుకొని నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లారు. బిడ్డకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. శిశువు వివరాలు ఆరా తీయగా తల్లిదండ్రులు వెంకటేష్, మల్లికగా తేలింది. వారి కోసం ప్రయత్నిస్తున్నామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని ఇన్స్పెక్టర్ తెలిపారు -
ఏటా 3,72,000 మంది జలసమాధి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఏటా నీళ్లలో మునిగి 3,72,000 మంది చనిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. ‘ప్రివెంటింగ్ ఎ కిల్లర్’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను ఐరాస సోమవారం విడుదల చేసింది. గంటకు 40 మందికిపైగా జలసమాధి అవుతున్నారని పేర్కొంది. వాతావరణ మార్పువల్ల ఎక్కువగా సంభవిస్తున్న వరదలు, ఎక్కువమంది శరణార్థులు పడవల్లో ప్రయాణించడం, గ్రామీణాభివృద్ధి, శానిటేషన్ లేకపోవడం వల్ల జల ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఐరాస ఆ నివేదికలో తెలిపింది. -
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
చిలకలూరిపేట : తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖననం చేసిన 10 రోజుల అనంతరం సమాధి నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాకు చెందిన బాబర్ సిద్ధునాథ్ దేవినాథ్ తన భార్య బాబర్ పంచెపుల(30)తో కలసి సాయిబాబా చిత్రపటం బండిపై ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాల్లో బిక్షాటన చేస్తుంటారు. వీరికి గణేష్, రమేష్ అనే ఇరువురు సంతానం. ఈ నెల ఎనిమిదో తేదీ చెన్నై నుంచి చిలకలూరిపేట పట్టణానికి భార్యాపిల్లలతో వచ్చాడు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డు పక్కన సామగ్రి ఉంచాడు. భార్య పంచెపుల అనారోగ్యానికి గురయ్యిందంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించాడు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలసి ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపక్కన నిద్రపోయారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటల సమయంలో పంచెపుల మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పట్టణంలోని శ్మశానవాటికలో ఖననం చేసి వెళ్లిపోయాడు. అయితే మృతిరాలి తల్లి చంద్రాబాయి తన అల్లుడే కుమార్తెను కొట్టి చంపి ఉంటాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహింపచేశారు. కుమార్తె మృతి చెందిన విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం! కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఇంటూరి రామచంద్రబాబు, తహశీల్దార్ జీవీఎస్ ఫణింద్రబాబు, అర్బన్ సీఐ జి చెంచుబాబు, ఎస్ఐ అసన్, ఆర్ఐ యలమంద, వీర్వోలు అప్పారావు, సైదా, దీప్తి తదితరులు పాల్గొన్నారు.