ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.
ప్రస్తుతం కేదార్‌నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్‌నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
గిరీష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment