shop
-
కడపలో కూటమి నేతల ‘కూల్చివేత’ రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.నిన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
ఒంగోలు కూరగాయల మార్కెట్లో బీభత్సం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్‌ను చుట్టుముట్టారు. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్‌ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్లో దాదాపు 200కు పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితుల నిరసన కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్ లింక్‌పై క్లిక్ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్ బుక్ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్‌ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్ ఓపెన్ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రిటర్న్ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్ కనిపించలేదు. మెయిల్ చేసినా స్పందన కరవైంది. హెల్ప్‌లైన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాటించాల్సిన జాగ్రత్తలుఆన్లైన్ షాపింగ్ కోసం ప్రముఖ వెబ్సైట్లనే వినియోగించాలి.అధికారిక పోర్టల్స్, యాప్‌లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు.ప్రతి వెబ్సైట్లో ‘కాంటాక్ట్ అజ్’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్సైట్లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్‌ను నెట్లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్ బుక్ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ అందించి దాన్ని ఓపెన్ చేసేలా చూసుకోవాలి.పార్శిల్ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.మోసం జరిగితే consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్ చేయవచ్చు. -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
నైంటీస్ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు..
ముయ్యేళ్ల కిందట– అంటే..నైంటీస్ జమానాలో ఇప్పుడున్నస్మార్ట్ఫోన్లు లేవు, ఆన్లైన్ గేమ్స్ లేవు. అప్పటి పిల్లలకు గోలీలు, బొంగరాలువంటి ఆరుబయటి ఆటలే కాలక్షేపం. అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేవు. నారింజ మిఠాయిలు, అంకెలు, అక్షరాల ఆకారంలో ఉండే బిస్కట్లు వంటివే పిల్లల జిహ్వచాపల్యాన్ని తీర్చే చిరుతిళ్లు. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైపోయారు. పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. తమ పిల్లలకు తమచిన్ననాటి కాలక్షేపాలను, చిరుతిళ్లను పరిచయం చేయాలని ఉన్నా, బజారులో అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఆ లోటును తీర్చడానికే చెన్నైలోని తెలుగు సంతతికి చెందిన ఆర్.జయంతన్ చెన్నై క్రోంపేటలో ‘నైంటీస్ మిఠాయి కడై’ పేరుతో ఆనాటి జ్ఞాపకాలను కొలువుతీర్చి దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులోని వస్తువులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి కూడా అందుబాటులోకి తెచ్చేఉద్దేశంతో జయంతన్ ప్రారంభించిన ఈ దుకాణం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి కడత్తూరు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఆర్.జయంతన్ చెన్నైలోని ఓ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ పట్టభద్రురాలైన తన భార్య విద్య ఇచ్చిన సలహాతో విలక్షణంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఉద్యోగం చూసుకునే బదులు వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టి, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నై క్రోంపేటలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఎనభై, తొంభై దశకాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, బిస్కట్లు, చాక్లెట్లు వంటివి సేకరించి, తన దుకాణంలో కొలువుదీర్చారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలను సాగించేందుకు'www.90smittaikadai.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ దుకాణంలోకి అడుగుపెడితే చాలు, నైంటీస్ నాటివారు తమ బాల్యజ్ఞాపకాల్లో తేలిపోతారు.వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నా: ఆర్.జయంతన్మా దుకాణానికి వచ్చే నైంటీస్ తరంవారు తమ పిల్లలకు ఇక్కడి వస్తువులను ఒక్కొక్కటే చూపిస్తూ, వాటిని తాము ఎలా ఉపయోగించేవారో, ఎలా ఆటలాడే వారో వివరిస్తుంటే ఎనలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడికొచ్చే కస్టమర్ల కళ్లలో బాల్య స్మృతుల ఆనందాన్ని చూస్తున్నా. అప్పట్లో ఇలాంటివి కొనేందుకు డబ్బులు లేకున్నా, చూసి ఆనందంతో గంతులేసే వాళ్లం. ఇప్పుడుచేతిలో డబ్బులు ఉన్నా, ఈ వస్తువులు దొరకడం అరుదైపోయింది. అందుకే ఈ అరుదైన వస్తువులను వెతికి, ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మా దుకాణంలో విక్రయాలకు పెట్టాం. ఈ వస్తువులను నైంటీస్ తరంవారు తమ పిల్లలకు కొనివ్వడమే కాకుండా, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండటం సంతోషం కలిగిస్తోంది. ఇవి మరింత విస్తృతం కావాలన్న కాంక్షతోనే ఆన్‌లైన్‌లోనూ విక్రయాలను ప్రారంభించా. ఇందులో లాభాపేక్ష కన్నా, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి చేరవేయాలనేదే మా లక్ష్యం. దేశంలో ఏ మూలకైనా సరే ఈ వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు నేను ఆడుకున్న వస్తువులు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొందరు కస్టమర్లు తమకు కావాల్సిన కొన్ని వస్తువులను సూచిస్తుంటారు. వారి ఆర్డర్‌కు తగినట్లుగా, వాటిని కొంత సమయం పట్టినా సరే సేకరించి లేదా తయారు చేయించి కొరియర్ ద్వారాపంపిస్తున్నాం. కనుమరుగైన వస్తువులు కూడా ఈ నైంటీస్ జమానా దుకాణంలో కనుమరుగైపోయిన పాతకాలం వస్తువులను కూడా కొలువుదీర్చారు. గ్రామఫోన్, కిరోసిన్ లాంతరు వంటి వస్తువులతో పాటు ఆనాటి గేమ్ కిట్స్, బొంగరాలు, కర్రా బిళ్ల, గోలీలు, నారింజ మిఠాయి, ఐస్ట్యూబ్, పాపిన్స్, ఫాంటమ్ స్వీట్ సిగరెట్లు, బొంబాయి మిఠాయి, టిట్ బిట్స్, అక్షరాలు, అంకెలతో కూడిన బిస్కట్లు, కిస్మీ బార్, చాక్లెట్లు, ట్రంప్ కార్డులు, కొయ్య బొమ్మలు, ఫ్రిజ్ మేగ్నెట్లు, రెండు నిబ్బుల ఫౌంటెన్ పెన్నులు, కాప్సూ్యల్పెన్నులు, కొయ్య పెన్నులు, హీరో పెన్నులు, కామ్లిన్ పెన్నులు, ఇన్విజిబుల్ పెన్నులు, ఇంక్ ఇరేజర్లు వంటి వస్తువులు, బొమ్మ కార్లు, బొమ్మ బైకులు, సైకిల్ హారన్లు, విసనకర్రలు, మౌతార్గాన్ వంటి సంగీత పరికరాలు, ఆనాటి సినిమా పాటల పుస్తకాలు వంటి ఎన్నోవస్తువులు ఈ దుకాణంలో ఐదు రూపాయలు మొదలుకొని పదిహేనువందల రూపాయలవరకు వివిధ ధరల్లో అందుబాటులోఉంటాయి. అస్మతీన్ మైదిన్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
Kedarnath: ఒక రోజంతా బండరాళ్లలో.. చివరికి వచ్చాడిలా
ప్రకృతి విపత్తులో చిక్కుకున్న అతను బండరాళ్ల కింద ఇరుక్కుపోయాడు. సహాయం కోసం రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆపన్నహస్తాల కోసం కొన్ని గంటపాటు ఎదురు చూశాడు. చివరికి అతని నిరీక్షణ ఫలించింది.ప్రస్తుతం కేదార్నాథ్ ధామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం సాయంత్రం చీకటిపడ్డాక కేదార్నాథ్ నడకమార్గంలో వెళుతున్న చమోలీ జిల్లాకు చెందిన గిరీష్ చమోలీ ఊహించని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటి నుంచి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఏడీఆర్‌ఎఫ్ సైనికులు గిరీష్ ఆర్తనాదాలను విన్నారు. అతనిని రక్షించేందుకు ఆ బండరాళ్లను పగలగొట్టే పని మొదలు పెట్టారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి వారు గిరీష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.గిరీష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు చెబుతూ ‘బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బయటకట్టి ఉన్న మా గుర్రాన్ని కాపాడుకునేందుకు నేను నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్లాను. ఇంతలో బండరాళ్ల కింద చిక్కుకుపోయాను. అయితే ఊపిరి పీల్చుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా శరీరమంతా బండరాళ్ల కింద చిక్కుకుపోయింది. సహాయం కోసం రాత్రంతా అరుసూనే ఉన్నాను. నా గొంతు విని రెస్క్యూ సిబ్బంది నన్ను కాపాడారు’ అని తెలిపాడు. కాగా గిరీష్‌కు చికిత్స అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ అతనిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
Delhi: భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం
దేశరాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇక్కడి యూనిఫాం తయారీ దుకాణం, కేఫ్‌లలో చోటుచేసుకుంది. చూస్తున్నంతలోనే మంటలు చుట్టుపక్కల దుకాణాలను చుట్టుముట్టాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ టెండర్ వాహనాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. వెంటిలేషన్ సరిగా లేకపోవడం కారణంగానే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో 30 దుకాణాలు ఉండగా, వాటిలో 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. #WATCH दिल्ली: मयूर विहार फेज 2 में नीलम माता मंदिर के पास यूनिफॉर्म बनाने वाली दुकान और कैफे में आग लग गई। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी का इंतजार है। pic.twitter.com/XGSNcdYJO0— ANI_HindiNews (@AHindinews) July 14, 2024 -
అడగకుండా నీళ్లు తాగాడని..
మియాపూర్: తమను అడగకుండా నీళ్లు తీసుకున్నాడని టీ స్టాల్లో పనిచేసే ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన చాకలి సాయిలు (35)కు భార్య మీనా ఇద్దరు కుమారులు మహి, కిరణ్ ఉన్నారు. బీరంగూడలో ఉంటూ మియాపూర్‌లోని లారీలలో ఇసుకను ఖాళీ చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిలు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు మియాపూర్ వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేసి ఉదయం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటలకు పనికి వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున దాహం వేస్తోందని మియాపూర్‌లోని రాజారామ్ కాలనీ సమీపంలో ఉన్న సురక్ష టీ స్టాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా టీ స్టాల్లో పని చేస్తున్న సతీష్ అనే యువకుడు సాయిలుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సాయిలు అక్కడి నుంచి సమీపంలో ఉన్న కూలీల అడ్డా వద్దకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత టీ స్టాల్లో పనిచేసే సతీష్ పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. స్నేహితులకు ఫోన్ చేసి.. రప్పించి.. సతీష్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న స్నేహితులు భాను, లక్ష్మణ్ అలియాస్ లక్కీలకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురూ కలిసి సాయిలుపై దాడికి దిగారు. సమీపంలోని కూలీలు విడిపిస్తున్నా వినకుండా తీవ్రంగా కొట్టి సాయిలును స్కూటీపై తీసుకుని టీ స్టాల్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్థానికులు, కూలీలు చూసేసరికి సాయిలు మృతిచెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువు నాగారం సాయిలు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాయిలు హత్యకు గురయ్యారడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కూలీలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కైసే హే ఆప్..
కుమారి ఆంటీ.. కైసే హే ఆప్ అంటూ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సర్ప్రైజ్ చేశారు. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్‌కు పేరుగాంచిన కుమారీ ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. కుమారి ఆంటీ హోటల్‌ను సోనూ సూద్ శుక్రవారం సందర్శించి, ఆమెతో ముచ్చటించారు. అంతేకాకుండా స్వయం కృషితో ఎదిగి, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారన్నారు. కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు ఆదర్శనీయమని అన్నారు. హోటల్లో ఎలాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. రూ.80కి వెజ్, రూ.120కి నాన్ వెజ్ లభిస్తాయని తెలిపారు. తను శాకాహారినని, తనకైతే వెజ్మీల్ ఎంతకు అమ్ముతావని సోనూ అడిగారు. దీనికి సమాధానంగా...ఎంతో మందికి సహాయం చేసిన మీకు ఏదైనా ఉచితంగానే ఇస్తానని తన అభిమానాన్ని చాటుకున్నారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు సోనూ సూద్ స్వయంగా ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తోడా, తోడా హిందీ మాత్రమే వస్తుందని కుమారి ఆంటీ తెలుపగా.. ‘మీ హిందీ చాలా బాగుంది’ అని సరదాగా కితాబిచ్చారు. అనంతరం ఆమె పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ కాసేపు సందడి చేశారు. సోనూ సూద్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చారు. ఏదేమైనా..పట్టుదల, కృషితో ముందుకొచ్చే వారిని గుర్తించడం, ప్రోత్సాహమందించడంలో సోనూ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే కుమారి ఆంటీని కలిసిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. -
మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఔషధాల ధరలు ఎక్కువ చేసి విక్రయించడం, తప్పుడు లేబుళ్లుతో చేస్తున్న ఉల్లంఘనలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేన్ (డీసీఏ) కొరడా ఝుళిపించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో యాంటీ ఫంగల్ మెడిసిన్ ‘టెస్ట్రా–200 క్యాప్సూల్స్’ను ఓ మందులషాపులో కేంద్రం నిర్దేశించిన ఎమ్మార్పీపై చాలా అధిక ధరకు విక్రయిస్తుండడంతో మందులు స్వాదీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ మందు పది క్యాప్యూల్స్‌ను రూ.50.30 అధిక ధరకు విక్రయించినట్టు వివరించారు. అత్యవసర మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి మందులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కళ్ల మందును జ్వరం మందు అంటూ... కళ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందును.. జ్వరానికి మందు అంటూ తప్పుడు లేబుల్స్‌తో మార్కెట్లో ప్రచారం చేస్తున్న వారిని డీసీఏ గుర్తించిందని కమలాసన్‌రెడ్డి తెలిపారు. పీ–మైసిటిన్ అనే ఆయింట్మెంట్ అల్లోపతి మందును కళ్లవ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుగా, మహసుదర్శన కఢ అనే ఆయుర్వేదిక్ మందును జ్వరాన్ని తగ్గించేదిగా తప్పుడు ప్రచారం చేయడంపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని ఓ మెడికల్ హాలుపై, ఖమ్మంలో మందుల దుకాణంపై దాడులు చేసి ఆయా మందులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో నకిలీ క్లినిక్‌పై దాడి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చి»ౌలిలో ఓ నకిలీవైద్యురాలు కె. స్వరూప తగిన అర్హతలు లేకుండా ‘స్వరూప ఫస్ట్ ఎయిడ్ సెంటర్’పేరిట నిర్వహిస్తున్న క్లినిక్‌పై డీసీఏ అధికారులు దాడిచేసి డ్రగ్ లైసెన్స్‌లు లేకుండా ఉన్న 17 రకాల మందులు (యాంటీ బయోటిక్స్‌తో సహా) స్వాదీనం చేసుకున్నారు. -
చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్‌లో పురుగుల కలకలం! వెంటనే తిరిగిచ్చేయండి!
ఇటీవల ఓ హైదరాబాదీ వ్యక్తి మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు కనిపించిన సంగతి తెలిసిందే. అది మరువక మునుపే కెల్లాగ్స్ చాకోస్ పురుగులు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా అంతకుమునపు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. అయితే ఇలా నాసిరకం వస్తువు కొనుగోలు చేస్తే మొహమాటంతోనే లేక మోసం చేశాడనే ఫీల్‌తోనే సదరు షాపుకి వెళ్లడం మానేస్తాం. కానీ ఇక్కడ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్షణమే ఆ వస్తువుని సదరు షాపు వాడికి ఇచ్చేసి దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. అలా ఇవ్వనని అంటే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చెయ్యాలి. వస్తువు నాసిరకం అని తేలితే జరిమానా విధించడం లేదా షాప్‌ని సీజ్ చేయడం జరుగుతుంది . ఇంతకీ ఏంటా నంబర్? ఇలాంటి మోసానికి గురికాకుండా విజిలన్స్ అధికారులకు ఎలా ఫిర్యాదు చెయ్యాలి? అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరూ నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. నిజానికి షాపులో కొన్ని వస్తువులు సేల్స్ కాకుండా అలా మిగిలిపోతాయి. వీటిని ఎలాగైన వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేందుకు యత్నిస్తుంటారు. ఇక్కడ కస్టమర్ కూడా తక్కువ ధరకే దొరకుతుందన్న ఆశతో ఆ వస్తువు నాణ్యమైనదా? కాదా? అనేది ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తాడు. అసలు అలా తక్కువ దరకు అమ్ముతున్నారంటే.. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ చూడాలి. ఎప్పుడూ తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించొచ్చు అనే వివరాలను చెక్ చేయాలి. అందులోనూ నిత్యావసర వస్తువులు పరిమిత కాలం వరకే ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు పైకి నాణ్యమైనవిగా కనిపించినా..ఇంటికెళ్లాక నాసిరకంగా కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడూ వెంటనే ఆ వస్తవును కొనుగోలు చేసిన షాపుకే వచ్చి.. తక్షణమే తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా తీసుకునేందుకు ఎవ్వరైనా వెనుకాడితే వెంటనే.. 1800114000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. దెబ్బకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఆ వస్తువు నాసిరకం అని తేలితే మాత్రం ఆ షాపుని సీజ్ చేయడం లేదా జరిమానా విధించడం వంటి చర్యలు తప్పక తీసుకుంటారు. అందువల్ల ఇలా నకిలీ వస్తువులు కొని మోసపోయానని బాధపడొద్దు, వెంటనే తిరిగి ఇచ్చేయండి. దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోండి.! (చదవండి: 'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!) -
రూ. 129కే అన్లిమిటెడ్ మూమూస్.. కండీషన్స్ అప్లై!
‘మూమూస్’... ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఇష్టమైన చిరుతిండి. ఈ స్నాక్స్‌ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. పైగా మూమూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఆహార ప్రియులు మూమూస్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి.. రూ. 125కే అన్లిమిటెడ్ మూమూస్ ఎక్కడైనా దొరికితే.. ఎవరైనా ఈ ఆఫర్ వదులుకుంటారా? దేశ రాజధాని ఢిల్లీలో లెక్కకు మించిన మూమూస్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల మూమూస్ అందుబాటులో ఉంటాయి. పలువురు దుకాణదారులు కొత్త ప్రయోగాలు చేస్తూ రకరకాల మూమూస్ను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక మూమూస్ దుకాణంలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. కేవలం రూ. 129కే ఎవరికి నచ్చినన్ని మూమూస్ వారు తినవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిన దుకాణం ఢిల్లీలోని తిలక్ నగర్ జైలు రోడ్డులో ‘ఎస్జీఎఫ్’ పేరుతో ఉంది. ఈ షాప్ మేనేజర్ దీప్ సింగ్ తాము అపరిమిత మూమూస్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. తాము రకరకాల మూమూస్ తయారు చేస్తున్నామని, వారంలోని అన్ని రోజుల్లోనూ ఈ బంపర్ ఆఫర్‌తో మూమూస్ అందిస్తున్నామని తెలిపారు. అయితే ఈ అపరిమిత మూమూస్ ఆఫర్ అందుకోవాలంటే ఒక కండీషన్ ఉన్నదన్నారు. రూ. 129కు ఒక ప్లేట్ మూమూస్ కొనుగోలు చేసి, దానిని తినేశాక నచ్చినన్నిసార్లు ప్లేటును రీఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్‌ను మరొకరితో షేర్ చేసుకోకూడదని, ఒక్క మూమూస్ కూడా వృథా చేయకూడదన్నారు. ఒకవేళ ప్లేట్ మూమూస్ను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అందుకు విడిగా నగదు చెల్లించాలన్నారు. -
Video: బట్టల షోరూంలో భారీ పైథాన్
లక్నో: మీరట్‌లోని ఓ బట్టల షోరూమ్‌లో భారీ పైథాన్ కలకలం సృష్టించింది. షాప్‌లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్‌ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు. #उत्तर_प्रदेश #मेरठ: दुकान में विशालकाय अजगर निकला..!! अजगर देख बाजार में मची अफरा-तफरी..!! वन विभाग की टीम ने अजगर को पकड़ा..!! मेरठ के लालकुर्ती पैठ बाजार का मामला..!! #ViralVideo pic.twitter.com/SwSLAwSpOt — MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) December 5, 2023 షోరూమ్‌లో దూరిన పైథాన్‌ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు. మొదట యజమాని దాన్ని ఎలుకగా భ్రమించాడు. కానీ వినియోగదారుడు పట్టువీడకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ పైథాన్‌ను చూసిన సిబ్బంది, వినియోగదారులు షోరూం నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని సురక్షితంగా సంరక్షించారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని వెల్లడించారు. ఇదీ చదవండి: కర్ణిసేన చీఫ్ గోగామేడి హత్య కేసులో నిందితులు వీరే..! -
Himaja Reddy: అల్వాల్‌లో షాప్ ఓపెనింగ్ చేసిన హిమజ (ఫోటోలు)
-
తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!
పురావస్తు శాఖ తవ్వకాల్లో ఎన్నో విచిత్ర వస్తువులు బయటపడ్డాయి. నాటి కాలంలోని మద్యం షాపుల ఆనవాళ్లు, ఆనాడే ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్ల తీరు చూసి ఆశ్చర్యపోయాం. అంతేగాదు ఆ కాలంలో వైద్య చికిత్స విధానాలకు సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పురాతన కాలం నాటి బ్యూటీపార్లర్ (మేకప్ షాప్) బయటపడింది. ఆ రోజుల్లో కూడా సౌందర్యాన్నికి ప్రాముఖ్యత ఇచ్చేవారని విన్నాం కానీ ఆధునికి కాలంలో ఉపయోగించే మేకప్ సామాగ్రి మాదిరిగా ఆకాలంలోను ఉందంటే నమ్మగలరా! వివరాల్లోకెళ్తే..ఈ పురాత మేకప్ షాప్‌ని టర్కీలోని ఐజోనోయ్ నగరంలో వెలుగుచూసింది. ఈ నగరం రోమన్ యుగంలో ఒకప్పుడూ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో పెర్ఫ్యూమ్ కంటైనర్లు, మేకప్ అవశేషాలు తదితరాలు బయటపడ్డాయి. వీటిని రెండు వేల ఏళ్ల క్రితం రోమన్ మహిళలు ఉపయోగించేవారని భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. అందులో పూసపూసలుగా ఉండే నగలు, సౌందర్య ఉత్పత్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ షాప్‌లో మేకప్ కిట్‌కి సంబంధించిన ఓస్టెర్ షెల్లు, మేకప్ పెట్టుకునే కంటైనర్లు, ఐషాడోలు, బుగ్గలకు వేసుకునే ఎరుపు రంగులు తదితరాలు ఉన్నాయి. కేవలం బుగ్గలకు వేసే ఎరుపు, గులాబీ రంగుల్లోనే పది రకాల విభిన్నమైన షేడ్స్ ఉండటం విశేషం. (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
ఉద్యోగం నుంచి పొమ్మన్న బాస్.. ప్రైవేట్ వీడియోతో ప్రతీకారం తీర్చుకున్న యువతి!
పంజాబ్‌లోని జలంధర్‌లో అశ్లీల వీడియో వైరల్ అయిన ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. స్థానికంగా పిజ్జాషాప్ నిర్వహిస్తున్న ఒక జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో ఫేక్ అని, దానిని ఎడిట్ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ యువతి గతంలో ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. ఆ యువతి యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇటువంటి పనిచేసిందని పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం జలంధర్‌కు చెందిన ఒక జంట పిజ్జా షాప్ ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుకాణదారు తమ ప్రైవేట్ వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ము ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాలుగు వీడియోలు వైరల్ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితురాలిని తనీషాగా గుర్తించామని, ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఆమె గతంలో ఒక పిజ్జా షాపులో పనిచేసేదని, ఆమె పనితీరు నచ్చకపోవడంతో యజమాని ఆమెను పనిలో నుంచి తీసేశారని, దీంతో ఆమె యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తెలిపారు. అలాగే రూ. 20 వేలు కావాలంటూ డిమాండ్ చేసిందన్నారు. కేసు దర్యాప్లు చేస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా? -
కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!
ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్దేవ్సింగ్ రైతు. అతని తల్లి హర్జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్‌సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్‌లోని ఒక కాఫీషాప్‌లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్లోని బిల్లింగ్ సెషన్లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్‌లో వివాహం చేసుకున్నారు. సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే.. -
గుర్‌గ్రామ్‌కు పాకిన అల్లర్లు.. రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన అల్లరిమూకలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆందోళనలు ప్రారంభమై 18 గంటలు గుడుస్తున్నా ఏమాత్రం చల్లారడం లేదు. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లా నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్షాపూర్ ప్రాంతంలో తాజాగా నిరసనకారులు రెచ్చిపోయారు. దుకాణాలను ఆందోళనకారులు కూల్చేస్తున్నారు. ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దాదాపు 200 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. షాపులను, మాంసం దుకాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లలో దాదాపు నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 44 కేసులు నమోదు కాగా.. 70 మందిని అరెస్టు చేశారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శోభాయాత్రపై ఓ వర్గం ప్రజలు రాళ్లదాడి జరిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన అల్లర్లు నుహ్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లరిమూకలు ఇప్పటికే వందల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణలను అదుపు చేయడానకిి కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్‌ని కూడా నిలిపివేసింది. సంయమనం పాటించాలని ప్రజలను సీఎం కోరారు. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
చందానగర్ నగల దుకాణంలో భారీ చోరీ..
హైదరాబాద్: చందానగర్‌లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్.. ఎక్కడో తెలుసా!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్ డోంగువాన్ నగరంలో ఉన్న ఈ మాల్ పేరు ‘న్యూ సౌత్ చైనా మాల్’. దీనిని 2005లో ప్రారంభించారు. మొత్తం 96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిలోని దుకాణాల విస్తీర్ణమే 71 లక్షల చదరపు అడుగులు. తొలి పదేళ్లు ఈ మాల్ దాదాపు 99 శాతం ఖాళీగానే ఉండేది. నిర్మాణంలో మార్పులు చేపట్టాక 2018 నుంచి దీని పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇందులో ఐమాక్స్ థియేటర్లు, విశాలమైన పిల్లల ఆటస్థలం చూడటానికే ఎక్కువమంది వస్తుంటారు. ఈ మాల్లోని ఏడు జోన్లను ప్రపంచంలోని ఏడు అంతర్జాతీయ ప్రాంతాల శైలిలో నిర్మించడం విశేషం. చదవండి: ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే! -
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
-
24 గంటలు షాపులు తెరిచే ఉంటాయోచ్
-
తెలంగాణలో ఇక 24 గంటలు అన్ని షాపులు ఓపెన్
-
డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత..
ఏదో మిరాకిల్ లేక ఏదైనా దెయ్యమా! తెలియదుగానీ ఒక్కసారిగా ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయ్యింది. అదీకూడా పట్టపగలే అలా జరగడంతో.. ఒక్కసారిగా అక్కడున్న వారికెవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ భయానక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..బిజ్నోర్‌లోని చెప్పులకు సంబంధించిన చైనా షాపు ఉంది దానికి సమీపంలో ఓ టాక్టర్ పార్క్ చేసి ఉంది. ఏమైందో ఏమో! హఠాత్తుగా ఆ ట్రాక్టర్ దానికదే స్టార్ట్్ అయ్యి ఆ చెప్పుల షాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన ఆ షాప్‌లోని ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ..బయటకు వచ్చేశారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ ట్రాక్టర్ ఇంజన్ని ఆపి పెద్ద మొత్తంలో షాప్‌కి డ్యామేజ్ జరగకుండా కాపాడాడు. ఈ ఘటనలో ఆ షాపు అద్ధం మొత్తం పగిలిపోయి కొద్ది మొత్తంలో ఆ షాపు ఓనర్‌కి మాత్రం నష్టం వాటిల్లింది. దీంతో ఆ షాపు ఓనర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ ట్రాక్టర్ యజమానిపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఐతే స్థానికుల సమాచారం ప్రకారం..రాబోయే హోలీ పండుగ కోసం పోలీసులు బిజ్నోర్ పోలీస్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆ ట్రాక్టర్ యజమాని కిషన్ కుమార్ కూడా పాల్గొన్నారు. అతను తన ట్రాక్టర్ని ఈ చైనా చెప్పుల దుకాణం వద్ద పార్క్ చేశాడు. సుమారు గంట తర్వాత ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతటే అదే స్టార్ట్ అయ్యి చెప్పుల దుకాణంలోకి వచ్చేయడంతో..ఆషాపు అద్దం మొత్త పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో.. ఈ వింత ఘటన అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. #Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE — Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023 (చదవండి: ఆమె నాకు వద్దు.. వధువు చిన్న తప్పు కారణంగా షాకిచ్చిన వరుడు!) -
నిజామాబాద్‌లో నభా నటేశ్ సందడి (ఫొటోలు )
-
హైదరాబాద్: చాదర్ ఘాట్ లోని ఓ టైర్ల దుకాణంలో అగ్ని ప్రమాదం
-
షాపుల కేటాయింపులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, అమరావతి: శ్రీశైలంలోని వ్యాపారులకు లలితాంబిక వ్యాపార సముదాయంలో షాపులు కేటాయించే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మంగళవారం హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు ఎనలేని గౌరవం అని లవన్న తరఫు న్యాయవాది అశోక్ రామ్ కోర్టుకు విన్నవించారు. షాపుల కేటాయింపుపై రాద్ధాంతం చేస్తున్న పిటిషనర్లు, అసలు షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనలేదని, అందువల్ల వారు షాపులు పొందలేకపోయారని తెలిపారు. షాపుల కేటాయింపు కోసం వారు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిగణనలోకి తీసుకుని మరోచోట షాపులు కేటాయిస్తామన్నారు. 8 నెలల కాలంలో 24 పిటిషన్లు దాఖలు చేసి, షాపుల కేటాయింపు విషయంలో ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన వేలంలో గరిష్ట ధర రూ.24 లక్షలకు చేరిందని తెలిపారు. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించే నాటికే షాపుల కూల్చివేత పూర్తయిందన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా ఈవో ఆదేశాల మేరకు పిటిషనర్ల షాపులను అధికారులు కూల్చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్.. షాపుల కేటాయింపు కోసం ఈవోకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతి ఆధారంగా షాపుల కేటాయింపులో నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని ఈవోకు స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
అదిరిందయ్యా.. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణం
నిజాయితీగా బతకాలన్న ఆకాంక్ష ఉంటే చాలు.. కోటి ఉపాయాలు తన్నుకొస్తాయి. అందులో ఏదో ఒకదానిని ఆచరణలో పెడితే బతుకు సాఫీగా సాగిపోతుంది. ఇందుకు నిదర్శనమే ఖాదర్. అనంతపురంలోని నందమూరి నగర్‌కు చెందిన ఖాదర్ చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అద్దె గది కోసం వెదికాడు. రూ. వేలల్లో అడ్వాన్స్, అదే స్థాయిలో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా భావించిన అతను తనకొచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టాడు. తన వద్ద ఉన్న పాత మోపెడ్‌కు వెనుక తోపుడుబండిని అమర్చుకుని, అందులో గుండుసూది మొదలు.. వివిధ రకాల గృహోపకరణాలు, వంట సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, జ్యువెలరీ, గొడుగులు, లేడీస్ బ్యాగ్‌లు... ఇలా ప్రతి ఒక్క వస్తువునూ తీసుకెళ్లి వీధుల్లో విక్రయించడం మొదలు పెట్టాడు. రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళ్లే దుకాణాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అదిరిందయ్యా ఖాదరూ అంటూ అభినందిస్తున్నారు. చూసేందుకు చిత్రంగా ఉన్న ఈ దుకాణంలో వస్తు, సామగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ఆ అమ్మకు ఎంత కష్టం.. బీఏ చదివి బజ్జీలు అమ్ముతూ..
సాక్షి, అమరావతి: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్ నాజిమ్మ. ఈమె బీఏ వరకు చదువుకుంది. తొలుత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెప్పింది. ఆదాయం సరిపోక జీవనం కష్టంగా ఉండటంతో కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం ప్రారంభించింది. ఇంటి వద్ద పూర్ణాలు, బజ్జీలు, పునుగులు, వడలు తయారు చేయడం నేర్చుకుంది. ఆ తర్వాత వాటన్నింటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి వన్‌టౌన్ రాజీవ్ గాంధీ పూలమార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు నడుస్తూనే సరుకు విక్రయిస్తుంది. ఈ విధంగా ఆమె 17 సంవత్సరాలుగా చేస్తుంది. సరుకు తయారీ రూ.2 వేలు ఖర్చు అవుతుందని లాభాం మాత్రం రూ.500 నుంచి 700 వరకు ఉంటుందని చెప్పింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒకరికి పెళ్లి చేయగా మరొకరిని ప్రభుత్వ కాళాశాలలో డిగ్రీ చదివిస్తున్నానని తెలిపింది. వయసు పెరిగి ఆరోగ్యం సహకరించడం లేదని, అయినా కుటుంబ పోషణ కోసం వీధి వీధి తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా దాతలు ఒక తోపుడు బండి అందిస్తే దాన్ని ఒకే ప్రదేశంలో పెట్టుకుని తాను తయారు చేసిన పదార్థాలు అమ్ముకుంటానని తెలిపింది. చదవండి: ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది -
చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..
విజయవాడ లెనిన్ సెంటర్.. కాలువ ఒడ్డున వరుసకట్టిన పాత పుస్తకాల దుకాణాలు. అందులో 29వ నంబరు దుకాణం ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’. ప్రాచీన సాహిత్యం, విజ్ఞానదాయక పుస్తకాలను గాలించేవాళ్లకు ఎడారిలో ఒయాసిస్సు ఆ దుకాణం. అరుదైన, అపురూపమైన పుస్తకాలకు చిరునామా అది. పుస్తక ప్రేమికులు కోరిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకుని మరీ అప్పగించే నేస్తం ఆ దుకాణ యజమాని. దశాబ్దాలుగా పుస్తకంతో ముడిపడిన ఆయన జీవితంపై సాహిత్యాభిమానులు పనిగట్టుకుని పుస్తకం తీసుకొచ్చేందుకు పూనుకోవటం తాజా విశేషం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి: లెక్చరర్ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ.. తెనాలి/గాంధీనగర్ (విజయవాడ): పుస్తకానికి సిసలైన నేస్తం ఆయన. పేరు నర్రా జగన్మోహనరావు. వయసు 69. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక దుకాణంలోనే. పుస్తకాలపై పరచుకునే దుమ్మును దులుపుతూ, కొత్తగా వచ్చిన పాత పుస్తకాలను విభాగాలుగా సర్దుతూ, పాడైన వాటికి అట్టలు వేసి, పేర్లు రాస్తూ కనిపిస్తారాయన. ఏ పుస్తకం అడిగినా తీసివ్వడమే కాదు.. అందులో విశేషాలను ఏకరువు పెడతారు. మరేదైనా పుస్తకం లేదని చెప్పాల్సి వస్తే, ఆ బాధ ఆయన ముఖంలో కనిపిస్తుంది. అడిగిన అభిమాని ఫోన్ నంబరు తీసుకుని, ఆ పుస్తకం రాగానే పిలిచి మరీ అప్పగిస్తారు. కిరాణా దుకాణాల్లో పొట్లాలుగా, చెత్త యార్డుల్లో గుట్టల్లోనే అంతరించిపోయే పాత పుస్తకాలను పనిగట్టుకుని సేకరిస్తూ, వాటిని అపురూపంగా చూసుకునే వ్యక్తులకు అందిస్తున్నారు. ప్రచురణకర్తలకు అందజేసి పునర్ ముద్రణకూ దోహదపడుతున్నారు. అలవాటు ఇష్టమై.. ఆపై ప్రాణమై.. పాత పుస్తకాన్ని ఇంత ప్రాణంగా చూసుకునే జగన్మోహనరావుకు గల పఠనాసక్తి ఈ వ్యాపారానికి పురిగొల్పింది. స్వగ్రామం గన్నవరం దగ్గరి ఆత్కూరు. జీవనోపాధికని విజయవాడలో స్థిరపడ్డారు. సినిమాలు, నాటకాలంటే వల్లమాలిన ప్రేమతో చదువు ప్రాథమిక పాఠశాలతోనే ముగిసింది. సినిమా చూట్టమే కాదు.. ఈ సినిమా పాటల పుస్తకాన్ని కొని, అందులోని పాటల మాధుర్యాన్ని ఆస్వాదించటం చిన్ననాటి అలవాటు. ఓ స్నేహితుడిచ్చిన నవలను చదివాక, పుస్తకాలు చదవటం అలవాటైంది. రకరకాల పుస్తకాలను చదివేయటం, పాత పుస్తకాలను సేకరించటం వ్యసనమైంది. ఉపాధి కోసమని పెట్టిన హోటల్ వ్యాపారం దెబ్బతింది. అప్పటికి తన దగ్గర విలువైన పుస్తక సంపద పోగుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ పుస్తకాలను అమ్మేందుకని లెనిన్ సెంటరుకు వెళ్లిన జగన్మోహనరావుకు రెండు దశాబ్దాలకు పైగా అదే జీవితమైంది. చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. 1998లో అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఓ పాత పుస్తకాల దుకాణానికి యజమాని అయ్యారు. సొంత పుస్తకాలు ఎటూ ఉన్నాయి. మరిన్ని పుస్తకాల సేకరణకు ప్రణాళిక వేసుకున్నాడు. చిత్తుకాగితాలు ఏరేవారు, పాతపేపర్లు, పుస్తకాలు తూకానికి కొనేవారితోనే సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారు తెచ్చిన పాత పుస్తకాలకు తగిన ధరకు కొనేవాడు. సరిచేసి, చిరిగిపోతే బైండింగ్ చేసి అమ్మకానికి సిద్ధం చేయటం దినచర్యగా మారింది. పరిచయస్తుల్నుంచీ సేకరిస్తారు. ఆ విధంగా దుకాణంలో ఎప్పుడూ రూ.10 లక్షలకు పైగా విలువైన పుస్తకాలుంటాయి. అమ్మేవి అమ్ముతుంటే కొత్తగా పాత పుస్తకాలు వస్తుంటాయి. జీవితం.. అక్షరబద్ధం.. అరుదైన ముద్రణలను ఊరికే వదిలేయకుండా ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో పదిలం చేయాలని కేంద్ర ప్రభుత్వానికో లేఖ రాశారు జగన్మోహనరావు. పుస్తకానికి ఆయన చేస్తున్న సేవకు గుర్తింపుగా 2010లో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య పురస్కారంతో సత్కారం అందుకున్నారు. వీరి విశిష్ట కృషికి రికార్డు చేయాలనే భావనతో సాహితీ ప్రేమికుడు అనిల్ బత్తుల (హైదరాబాద్), జర్నలిస్ట్ అనిల్ డ్యానీ (విజయవాడ)లు జగన్మోహనరావుపై తీసుకొస్తున్న ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది సకలం లభ్యం.. ప్రాచీనాంధ్ర గ్రంథమాలలో పురాతన పుస్తకాలూ లభిస్తాయి. జాతక చింతామణి (1882), చంపూ భాగవతం (1874), మైత్రి సాత్వ, బ్రిటిష్ చరిత్ర, గోపాల్ మిత్తల్, మన తెలుగు భద్రాచల రామదాసు చరిత్రంబు (1879), తర్కశాస్త్రం (1883), మాఘమహాత్మ్యం (1889), సులక్షణసారము (1898), రఘువంశ మహాకావ్యమ్ వంటి పుస్తకాలు వీటిలో కొన్ని. విజయవాడకు వచ్చే సాహిత్యాభిమానుల్లో పలువురు ఈ దుకాణాన్ని తప్పక సందర్శిస్తారు. వీరిలో ఎన్నారైలూ ఉన్నారు. తమ రచనల కాపీలు అయిపోయిన రచయితలకు, వారి పుస్తకాన్ని ఇదే దుకాణంలో అందజేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికైన పుస్తకాన్ని విక్రయిస్తే, వారి చిరునామా, ఫోను నంబరు, ఎలాంటి పుస్తకాలను వారు సేకరిస్తున్నారు.. ఎన్ని కొనుగోలు చేశారు.. అనే వివరాలను రాయిస్తున్నారు. వీటన్నిటికీ కలిపి ‘పుస్తక ప్రియులు–సేకరణానుభూతి’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారాయన. ఎప్పటి పుస్తకమైనా దొరుకుతుంది.. నగరంలో ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ‘సనాతన హైందవ ధర్మ జ్ఞానవాహిని’, కలియుగ దైవం కార్తికేయుడు’ ఈ రెండు పుస్తకాలను వారం రోజుల కిందటే అక్కడ కొనుగోలు చేశా. ఇక్కడ ఏ పుస్తకమైనా దొరుకుతుంది. ఒకవేళ పుస్తకం అందుబాటులో లేకపోయిన టైం తీసుకుని తెప్పించి ఇస్తారు. ఇక వాస్తుకు సంబంధించి 20, 30 ఏళ్ల కిందటి పుస్తకాలు కావాలంటే ఈ షాపునకు రావాల్సిందే. – సుధాస్వామి, కృష్ణలంక, విజయవాడ -
చాలీచాలని జీతం, ఇదేనా జీవితం.. ఉద్యోగం వద్దని బిర్యానీ బిజినెస్ పెట్టిన టెకీలు!
చండీఘఢ్: రోజూ ఉదయాన్నే లేవడం, ఉద్యోగానికి వెళ్లడం, 9 నుంచి 5 వరకు పని చేయడం. నెల చివర్లో చాలీచాలని జీతం. ఈ రొటీన్ జీవితం విసుగుచెందిన ఇద్దరు టెకీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని పుడ్ బిజినెస్ పెట్టారు. కొత్త రకం వెజ్ బిర్యానీ అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. గతంలో తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు కంటే ప్రస్తుతమే సంతృప్తికరంగా ఉన్నారని చెప్తున్నారు. హర్యానాలోని సోనిపట్‌లో వెజిటబుల్ బిర్యానీ స్టాల్ నడుపుతున్న వారిద్దరూ ఏం చెబుతున్నారంటే.. తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో అది పెద్దగా నచ్చేది కాదని అప్పుడు కూడా వ్యాపారం వైపే తమ చూపు ఉండేదని వారు తెలిపారు. అందుకే వారిద్దరు కలిసి ఇంజనీర్ వెజ్ బిర్యానీ పేరుతో ఫుడ్ బిజినెస్‌లోకి దిగినట్లు టెకీలు రోహిత్, సచిన్ చెబుతున్నారు. సోనిపట్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వీరి స్టాల్ మనకు కనిపిస్తుంది. వాళ్లకి జాబ్‌లో వచ్చే జీతం కంటే వ్యాపారంలో అధికంగా సంపాదిస్తున్నామని అంటున్నారు. నూనె లేకుండా వారు వడ్డించే వెజ్ బిర్యానీ ప్లేట్ రూ 70, హాఫ్ ప్లేట్ రూ 50గా ధర నిర్ణయించారు. ధర తక్కువ, పైగా వారి వెజ్ బిర్యానీ రెసిపీ అందరికీ నచ్చడం, లాభాలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకేముంది వారు ఆ వ్యాపారాన్ని విస్తరించాలని కూడా ఆలోచిస్తున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్.. మొబైల్ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క షాక్!
Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉన్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్ రూమ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్ రూమ్‌లో మొబైల్ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్‌తోపాటు దాని రైడర్ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
మరోదారి లేదు.. ఊరి చివరకు ‘కొట్టు’కెళ్లారు..
సాక్షి, అమరావతి: గతంలో జాతీయ, ఇతర ప్రధాన రహదారుల వెంబడి అక్కడక్కడా దాబాలు కనిపించేవి. ప్రయాణికులు నులక మంచాలపై కూర్చుని.. చెక్క బల్లలపై పెట్టిన ఆహారాన్ని ఆరగించే దృశ్యాలు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర.. రోడ్లపక్కన వెలిసిన దుకాణాలు కన్పిస్తున్నాయి. ఇది కోవిడ్ తెచ్చిన మార్పు. 2020 మార్చి తర్వాత కోవిడ్ మహమ్మారి కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు కనుగొన్న ఉపాధి మార్గమిది. లాక్‌డౌన్‌తో మొదలై.. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూరగాయల షాపులు సైతం మూతపడ్డాయి. ఆ తరువాత లాక్డౌన్ సడలించినప్పటికీ వైరస్ భయంతో మార్కెట్‌కు వెళ్లేందుకు జనం కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అలా అని ఇంటింటికీ వెళ్లి విక్రయాలు చేద్దామంటే.. వైరస్ మోసుకొస్తారనే భయం వెంటాడేది. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారులు బాగా చితికిపోయారు. గత్యంతరం లేని స్థితిలో వారు రోడ్డు బాట పట్టారు. జాతీయ రహదారులే కాకుండా.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర రోడ్ల పక్కన చిన్నపాటి షాపులు పెట్టుకుని అమ్మకాలు సాగించారు. అటుగా పోయే ప్రయాణికులు ఆగి అవసరమైన వాటిని అప్పటికప్పుడు కొనుగోలు చేసుకుని వెళ్లడంతో ఈ ట్రెండ్‌కు ఆదరణ లభించింది. ఫలితంగా జాతీయ రహదారుల పక్కన కూరగాయలు, పండ్లు, ఎండు చేపలు, పచ్చి చేపలు, రొయ్యలు, తినుబండారాలు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఏ రోజు వ్యాపారం ఆ రోజే కావడంతో అక్కడ తాజా పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయని, అవసరమైనప్పుడు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులు పాటిస్తున్న ఈ ఐడియా వారి కుటుంబాలను నిలబెడుతోంది. బతుకుదెరువు కోసమే ఈ ‘మార్గం’ నేను 16 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాను. గతంలో భీమవరం మార్కెట్లో షాపు అద్దెకు తీసుకుని కూరగాయలు అమ్మేవాడిని. కరోనా ఫస్ట్‌వేవ్ నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. కరోనా ఉధృతి పెరగడంతో మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇబ్బందులు పడ్డాం. చివరకు నిత్యం వాహనాలు తిరిగే రోడ్డు పక్కన కూరగాయల షాపు పెట్టాను. దారిన పోయేవారు వచ్చి కావాల్సిన కూరగాయలు కొనుక్కుని వెళ్తారు కాబట్టి అంతగా రద్దీ ఉండదు. ఊరి చివర ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి కార్లు, బైక్‌లు పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బంది లేదు. గతంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం రావడం లేదు. కానీ.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. కరోనా దెబ్బకు కొత్త మార్గాన్ని ఎంచుకుని ఉపాధి చూసుకుంటున్నాం. – జవ్వాది దుర్గాప్రసాద్, కూరగాయల వ్యాపారి, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు పైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తాం రెండేళ్లుగా కరోనా వైరస్ కలవరపెడుతూనే ఉంది. షాపులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా వైరస్ భయం వెంటాడుతోంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు పక్కన పెట్టిన కూరగాయలు, పండ్లు, ఇతర సరుకుల్ని అప్పటికప్పుడు కొనుక్కు తెచ్చుకుంటున్నాం. రోడ్డుపైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తున్నాం. ఇబ్బందులకు తావు లేకుండా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటోంది. – శనివారపు శ్రీనివాస్, ఉండి అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా -
సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా..
సెల్ఫోన్ల దొంగలు రూట్ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్ పార్ట్స్‌గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగాయి. గల్లీ దుకాణాల కేంద్రంగానే.. అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి ఫోన్లను స్పేర్‌పార్ట్స్‌గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. – నగర పోలీసు ఉన్నతాధికారి గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి... ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోన్కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్(ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. సదరు సెల్‌ఫోన్‌ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్‌పార్ట్స్‌గా మార్చేసి అమ్ముతున్నారు. ఐఎంఈఐ నెంబర్ అనేది ఫోన్ మదర్ బోర్డ్‌కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్‌ఫోన్ దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్‌ఫోన్ రిపేరింగ్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ► కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి. ► ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం. ► ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు. ► నగరంలో జగదీష్ మార్కెట్ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్ మాల్ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం. -
నిజాయితీకి లభించిన బహుమానం
రామాపురం అనే గ్రామంలో కిరాణా వ్యాపారస్తుడైన సుబ్బయ్యకు నిజాయితీపరుడు అనే పేరుంది. వయసు మీదపడటంతో సుబ్బయ్య తప్పుకుని తన కొడుకు రాజేశ్‌కి వ్యాపారాన్ని అప్పగించాడు. సుబ్బయ్య కిరాణా వ్యాపారం చేసేటప్పటి నుండి ఆ దుకాణంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వీరయ్య.. రాజేశ్‌కి కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే రాజేశ్ హాయంలో కూడా కిరాణా వ్యాపారం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది. అయితే వీరయ్యకి కూడా వయసు మీద పడటంతో కొంతకాలానికి పని మానివేశాడు. దాంతో రాజేశ్‌కి తన కిరాణా దుకాణంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైన పనివాడి అవసరం పడింది. పనివాని ఎంపికలో రాజేశ్, తన తండ్రి సలహా కోరాడు. ఆ విషయాన్ని సుబ్బయ్య తన స్నేహితులకి చెప్పటంతో వాళ్ళు తమకు తెలిసిన పనివాళ్ళని సుబ్బయ్య దగ్గరకి పంపారు. అనేక రకాల వడపోతల తర్వాత తమ కిరాణా వ్యాపారంలోకి ఉపయోగపడతారు అనుకునే ఇద్దరిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు సుబ్బయ్య. వారిద్దరి పేర్లు వినయ్, సతీశ్. ‘ఆ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేసుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి అప్పగించిన పని వాళ్లు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నిశితంగా పరిశీలించ’మనీ రాజేశ్‌కి వివరించాడు సుబ్బయ్య. ముందుగా వినయ్‌ని పిలిచి ‘నెలకు ఎంత జీతం కావాలి?’ అని అడిగాడు సుబ్బయ్య. ‘తమరు ఎంత ఇస్తే అంతే చాలు బాబయ్యా!’ సమాధానమిచ్చాడు వినయ్. ‘సరే..ఓ రెండు రోజులు కిరాణా దుకాణంలో ఉండి చెప్పిన పనులు చేయి, దాన్ని బట్టే నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు. ‘అయితే రేపే వచ్చి పనిలో చేరతాను’ అని వినయ్ సెలవు తీసుకున్నాడు. ‘రేపు వినయ్ దుకాణానికి వచ్చాక ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో చూపించి అప్పుడప్పుడు గల్లా పెట్టెకి తాళం వేసి ఇంట్లోకి వెళ్లొస్తూ ఎవరైనా సరుకులకు వస్తే ఆ ప్యాకెట్స్ పై ఉన్న ధర తీసుకుని, ఆ డబ్బుని నీకు ఇమ్మని చెప్పు. అలాగే చిల్లర ఒక పదిరూపాయలు పైన ఉంచు’ అంటూ రాజేశ్‌కి సలహా ఇచ్చాడు సుబ్బయ్య. మరుసటి రోజు వినయ్ వచ్చాక తండ్రి చెప్పినట్లే చేశాడు రాజేశ్. మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్లొచ్చినప్పుడల్లా తను ఏఏ వస్తువులను అమ్మాడో, ఎంత డబ్బు వచ్చిందో రాజేశ్ చేతికిచ్చేవాడు వినయ్. ఆ విషయాన్నే రాత్రి తండ్రికి చెప్పాడు రాజేశ్. ‘రేపు వినయ్ వచ్చాక నా దగ్గరకు పంపించు’ అని చెప్పాడు సుబ్బయ్య. అతను చెప్పినట్టే మరుసటి రోజు వినయ్ రాగానే అతనిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజేశ్. వినయ్‌ని ఉద్దేశించి సుబ్బయ్య ‘ఈ రోజు మన ఎలక్ట్రానిక్ కాటాని ఉపయోగించి సరుకులు అరకేజీ, కేజీల చొప్పున ఆ కవర్లలో ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేసేటపుడు అరకేజీ ప్యాకెట్లలోంచి ఓ పది గ్రాముల చొప్పున, కేజీ ప్యాకెట్లలోంచి ఇరవై గ్రాముల చొప్పున ఆ సరుకులు తీసేసి ప్యాక్ చేయాలి. తెలిసిందా? ఈవాళ్టికి అరకేజీ ప్యాకెట్లు ఒక అయిదు, కేజీ ప్యాకెట్లు ఒక అయిదు ప్యాక్ చేసి తరువాత కొట్లో పనిచూసుకో’ అని పురమాయించాడు. ‘అలాగేనండి’ అంటూ సుబ్బయ్య చెప్పినట్లుగానే ప్యాక్ చేసి వాటిని సుబ్బయ్యకి అప్పజెప్పి కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయాడు వినయ్. ఈ వ్యవహారాన్నంతా రాజేశ్ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ రోజు పని పూర్తి అయిన తరువాత వినయ్‌ని పిలిచి ఆ రెండురోజులకు ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి, తరువాత రెండు రోజులు సతీశ్ పనితీరును కూడా పరిశీలించి , ఇద్దరి పనితీరును బేరీజు వేసుకుని కబురు చేస్తానని పంపించివేశాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సతీశ్‌కి కబురుపెట్టాడు. వినయ్‌ని అడిగినట్టే సతీశ్నీ అడిగాడు సుబ్బయ్య ‘ నెలకు ఎంత జీతం కావాలి?’ అని. ‘మూడువేలు ఇవ్వగలిగితే చేయగలను’ బదులిచ్చాడు సతీశ్. వినయ్‌కి చెప్పినట్లుగానే ‘సరే, ఒక రెండు రోజులు కిరాణా దుకాణంలో చెప్పిన పనులు చేశాక దానిని బట్టి నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు సుబ్బయ్య. ‘సరేనండి, రేపే వచ్చి పనిలో చేరతాను’ అంటూ సెలవు తీసుకున్నాడు సతీశ్. అప్పుడు రాజేశ్‌తో ‘వినయ్ విషయంలో మొదటి రోజు ఏం చెప్పి చేయమన్నానో,అలాగే సతీశ్‌కీ చెప్పి చేయించు’ అన్నాడు సుబ్బయ్య. మరుసటి రోజు సతీశ్ రాగానే సుబ్బయ్య చెప్పినట్టే చేసి.. జరిగినదంతా ఆ రోజు రాత్రి తండ్రికి వివరించాడు రాజేశ్. ‘రేపు సతీశ్ రాగానే నా దగ్గరకు తీసుకురా’ అని రాజేశ్‌కి పురమాయించాడు సుబ్బయ్య. తండ్రి అడిగినట్టుగానే తెల్లవారి సతీశ్ రాగానే అతణ్ణి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు రాజేశ్. తూకం, ప్యాకింగ్ విషయంలో వినయ్‌కి పురమాయించినట్టే సతీశ్‌కీ పురమాయించాడు సుబ్బయ్య. విన్నవెంటనే సతీశ్ ‘ఇటువంటి పనులు నేనెంత మాత్రం చేయను, చేయలేను. నిన్న పనిచేసినందుకు గానూ వందరూపాయలు ఇప్పించండి వెళ్ళిపోతాను’అన్నాడు. ‘సరే, ఈ పని చేయవద్దులే. నువ్వు అడిగినట్లే మూడువేల రూపాయలు ఇస్తాను. నిన్నటి నుంచి నువ్వు పనిలో చేరినట్లే. పో.. పోయి కొట్లో పనులు చూసుకో’ అన్నాడు సుబ్బయ్య. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజేశ్‌తో ‘రానవసరంలేదని వినయ్‌కి కబురు పెట్టు’ అని సుబ్బయ్య అనడంతో కొడుకు విస్తుపోయాడు. ‘అదేంటి జీతం ఎంతిస్తే అంతకు ఒప్పుకొని, చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసిన వినయ్‌ని వద్దని కరాఖండిగా ఇంత జీతం ఇవ్వమని అడగటమే కాకుండా, చెప్పిన పని చేయనని తృణీకరించిన సతీశ్‌ని పనిలో పెట్టుకున్నారేంటి ’ అని తండ్రిని అడిగాడు రాజేశ్. ‘వినయ్ పనిచేసిన రెండురోజుల్లో మొదటిరోజు కొట్లో నువ్వు లేనప్పుడు సరుకులు కొనమని నా స్నేహితున్ని పంపి ‘మా కొట్లో పనిచేసే వాడిని ముప్పై రూపాయల పంచదార ప్యాకెట్ ఇవ్వమని అడిగి నలభైరూపాయలు ఇచ్చి ‘ఇవిగో ముప్పై రూపాయలు..సరిగా చూసుకో’ అని చెప్పమన్నాను. ‘పొరపాటున పది రూపాయలు ఎక్కువిచ్చేశారు’ అని వెనక్కి ఇచ్చేసినా లేదూ చూసుకుని కూడా తిరిగి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా వచ్చి నాకు చెప్పమన్నాను. వినయ్ అతనితో ‘సరిపోయింది’ అని చెప్పి నీకు డబ్బు అప్పచెప్పేటప్పుడు ఆ పదిరూపాయలను తన దగ్గరే ఉంచేసుకున్నాడు. అలాగే రెండో రోజు నేను చెప్పినట్లుగా అది తప్పు పనైనా ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు వినయ్. జీతం ఎంతిస్తే అంతే చాలనుకునే దాని వెనుక.. ఇదుగో ఇటువంటి మోసాలు చేస్తూ సంపాదించుకోవచ్చన్న ధీమా అన్నమాట. అదే సతీశ్ విషయానికొచ్చేసరికి మొదటిరోజు నా స్నేహితుడు పదిరూపాయలు ఎక్కువ ఇస్తే పదిరూపాయలు ఎక్కువ ఇచ్చారని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, రెండో రోజు నేను చెప్పిన అవినీతి పనిని చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడక తన ఒక రోజు కష్టానికి మాత్రమే ప్రతిఫలం ఇమ్మని అడిగాడు. ఇక నిక్కచ్చిగా ఇంతే జీతం ఇవ్వమని అడగడానికి కారణం అతని నిజాయితీయే. అటువంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడే మనకు కావలసినవాడు. అందుకే అతనిని పనిలోకి తీసుకున్నది’ అని చెప్పిన తండ్రి వివరణకు అబ్బురపడ్డాడు రాజేశ్. -
బీరు బాటిల్లో సిరంజి
సాక్షి, కుషాయిగూడ(హైదరాబాద్): కాప్రాలోని ఓ బార్ కు వెళ్లి ఓ వ్యక్తి బీరు ఆర్డర్ చేశాడు. బేరర్ బీరు తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆ వ్యక్తి ముందు పెట్టారు. బీరు తాగుతున్న వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే తేరుకొని చూడగా బీరు బాటిల్లో సిరంజిని చూసి కంగు తిన్నా డు. ఇదేమిటని బార్ నిర్వాహకులను నిలదీసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి మహాంకాళి బార్లో చోటు చేసుకున్న ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?
మీరు జీవితంలో ఏదైనా విభిన్నమైన పనిని చేయాలని నిశ్చయించుకున్నట్లయితే, అప్పుడు సాధ్యం కానిది అంటూ ఏది లేదు. మీ కలను నిజం చేసుకోవాలంటే మీరు చేసే ప్రతి పనిని ఇష్టపడాలి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. కోల్‌కతాకు చెందిన తుక్తుకి దాస్ దీనిని రుజువు చేశారు. తుక్తుకి దాస్ తన మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడానికి చాలా ప్రయత్నించింది, అయితే, ఆమె ఉద్యోగం సాధించలేకపోయింది. అయితే, అక్కడితో జీవిత ప్రయాణాన్ని ఆపకుండా.. ఏదైనా తనకు తెలిసిన పని చేయలని నిశ్చయించుకుంది. హబ్రా రైల్వే స్టేషన్లో టీ దుకాణాన్ని ప్రారంభించాలని అనుకుంది. కొద్ది రోజులకే తుక్తుకి దాస్ టీ దుకాణం 'ఎమ్ఏ ఇంగ్లీష్ చాయ్ వాలాయ్' పేరుతో ఆ నగరం అంతటా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం. ఉద్యోగ వేట తుక్తుకి దాస్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. తుక్తుకి తండ్రి వ్యాన్ డ్రైవర్, ఆమె తల్లికి ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది. తుక్తుకి తల్లిదండ్రులు ఆమె ఉపాధ్యాయురాలిగా మారాలని ఆశించారు. వాళ్ల తల్లి, తండ్రుల కోరిక మేరకు ఆమె కష్టపడి చదివి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అనుకుంది. తుక్తుకి దాస్ రవీంద్రభారతి ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఆ తర్వాత కోల్‌కతా నగరంలో హాస్టల్లో నివసిస్తూ ఉద్యోగ వేట ప్రారంభించింది. తుక్తుకి దాస్ ఎంఎ డిగ్రీ చేసినప్పటికీ ఉద్యోగం పొందలేకపోయింది. ఆమెకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ ఏ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె తన ప్రయాణాన్ని అక్కడితో అపలేదు. ఉద్యోగం పొందడంలో విఫలమైన తుక్తుకి దాస్ టీ స్టాల్ తెరవాలని నిశ్చయించుకుంది. యూట్యూబ్‌లో ప్రఫుల్ బిల్లోర్ అకా 'ఎంబిఎ చాయ్‌వాలా' వీడియో చూసి ప్రేరణ పొందింది. ఆ తర్వాత తుక్తుకి దాస్ హబ్రా స్టేషన్ సమీపంలో ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకొని నవంబర్ 1, 2021న 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి' బ్యానర్ కింద తన సొంత టీ స్టాల్ ప్రారంభించింది. ఆమె టీ దుకాణం ఓపెన్ చేసిన మొదటి రోజున సంతోషానికి చిహ్నంగా కస్టమర్లలో చాలా మందికి ఉచితంగా టీని పంపిణీ చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలా టీ దుకాణాన్ని ప్రారంభించే ముందు అందరికీ ఎదురైనట్లే ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు టీ దుకాణాన్ని ప్రారంభించేందుకు ఒప్పుకోలేదు. మన బందువులు, స్నేహితులు నిన్ను చూసి ఏమి అనుకుంటారు. నువ్వు చదివిన చదువు ఏంటి, చేయబోయే పని ఏంటి అని ఆమెను అడిగారు. మిగతా వారి విషయం నాకు తెలీదు మీరు ఒప్పుకుంటే చాలు అని తన తల్లిదండ్రులతో అంది. ఒక మీడియాతో తుక్తుకి దాస్ తండ్రి మాట్లాడుతూ.. "మొదట్లో ఆమె నిర్ణయంతో నేను సంతోషంగా లేను, ఎందుకంటే ఆమె టీచర్ కావాలనే ఆశతో మేము ఆమెను చదివించాము. కానీ, ఆమె టీ అమ్మాలని కోరుకుంది. నేను పునరాలోచించి తర్వాత ఒకే చెప్పినట్లు" పేర్కొన్నాడు. ఉన్నత విద్యావంతులు ఇలాంటి టీ అమ్మే వ్యాపారం చేయడం. ఇదే మొదటిసారి కాదు. మధ్యప్రదేశ్ రైతు ప్రఫుల్ బిల్లోర్ ఈ రోజు 'ఎంబిఎ చాయ్‌వాలా'గా ప్రసిద్ధి చెందారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతను సీఏటిలో మంచి స్కోరు చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను టీ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు, అతనికి దేశవ్యాప్తంగా 22 అవుట్ లెట్లు ఉన్నాయి. త్వరలో అంతర్జాతీయ అవుట్ లెట్ కూడా ప్రారంభించనున్నాడు. ఇలా చాలా మంది కరోనా లాక్డౌన్ సమయంలో తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వారు తమకు తెలిసిన, వచ్చిన పనిలో భాగ పేరు పొందారు. అందుకే, పెద్దలు చెబుతుంటారు ఒక చోట దారి మూసుకొని పోతే.. మన కోసం మరో చోట దారి తెరిచి ఉంటుంది అని. అంతేగానీ, ర్యాంక్ రాలేదని, ఉద్యోగం రాలేదని నిరాశ చెందుకుండా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. -
టీ కొట్టు నడుపుతూ.. రోజూ రూ.300 దాచిపెట్టి.. ఏకంగా 25 దేశాలు..
కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు. యాత్ర ఇలా ప్రారంభమైంది కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్‌తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
ఎస్కలేటర్‌లో చిక్కుకున్న బాలిక
విశాఖ పట్నం: విశాఖ పట్నంలోని ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటన ఎదురైంది. పై అంతస్థులో షాపింగ్ చేయడానికి.. ఎస్కలేటర్‌పై వెళ్తున్న ఒక పాప డ్రెస్సు ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఎస్కలేటర్‌లో ఇరుక్కుంది. దీంతో బాలిక ఎటు కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో వెంటనే ఆ బాలిక తండ్రి షాపింగ్‌మాల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలిక డ్రెస్సును బైటకు తీసి ఎస్కలేటర్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో.. బాలిక క్షేమంగా బయటపడటంతో షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ -
తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం
-
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్‌లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్‌లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్‌లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్‌లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్‌గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
కూల్ డ్రింక్ తాగిన మైనర్ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..
చెన్నై: కూల్‌డ్రింక్ తాగిన ఒక మైనర్ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్‌నగర్ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత.. తరణి కూల్ డ్రింక్ తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్‌కు గురయ్యింది. కాగా, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాస్క్ చాటున మోసం.. తాగేందుకు మంచి నీళ్లు అడిగి..
సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం): ఈ కరోనా కాలంలో అందరూ మాస్క్‌లు ధరించడం సహజమవడంతో.. ఓ మోసగాడు దొంగ తెలివి ప్రదర్శించాడు. సిద్ధారం గ్రామానికి చెందిన గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన చికెన్ సెంటర్ వద్దకు మాస్క్ ధరించిన గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తనకు రూ.7వేలకు రూ.100, రూ.50 నోట్ల చిల్లర కావాలని అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ వెనుకనే ఆయన ఇంటి గుమ్మం వద్దకు వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపి అనుమానం రాకుండా చేశాడు. చిల్లర తీసుకున్నాక.. తాగేందుకు మంచినీళ్లు కావాలని అడగటంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా ఈ మోసగాడు తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే పరారయ్యాడు. కాసేపటికే నీళ్ల గ్లాసుతో బయటికొచ్చిన లక్ష్మీనారాయణ మోసపోయినట్లు గ్రహించి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాడు. అతను ద్విచక్రవాహనంపై వచ్చినట్లు పుటేజీ లభ్యమైంది. అయితే.. వేసుకొచ్చిన ఫ్యాషన్‌ప్రో బండికి ముందు, వెనుక నంబర్ ప్లేట్లు లేవు. దీంతో తనలా మరొకరు మోసపోకూడదని ఆ దృశ్యాలను, మోసపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడు గుళ్లపల్లి లక్ష్మీనారాయణ కుమారుడు వెంకట్రామయ్య మాస్క్ మాటున జరిగిన మోసాన్ని పోస్టు చేసిన వెంటనే మరి కొందరు బయట పడ్డారు. తమకు కూడా ఇదే తరహాలో మోసం చేశాడని బాధితులు వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. నిందితుడు సత్తుపల్లి, కాకర్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. మాస్క్ పెట్టుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. -
సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు..
కాలిఫోర్నియా: అరవై నాలుగు కళలలో ‘చోరకళ’ కూడా ఒకటి. అయితే, చోరీకి పాల్పడే క్రమంలో కొంత మంది ఎక్కడ దొరికి పోతామో అని టెన్షన్ పడితే.. మరికొంతమంది మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చిన పనిని తేలికగా ముగించుకుని కూల్‌గా వెళ్లిపోతుంటారు. ఇప్పటికే దొంగతనానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి షాపులో ప్రవేశించి కూల్‌గా దొంగతనం ముగించుకుని స్టైల్‌గా జారుకున్నాడు. నల్లని జాకెట్, ముఖానికి నలుపు రంగుబట్ట చుట్టుకుని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్గ్రీన్స్లోని ఒక షాపులో సైకిల్ మీద ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఒక నల్లని కవర్‌ను తీశాడు. వెంటనే అక్కడ ఉన్న వస్తువులన్నీ తన కవర్లో వేసుకున్నాడు. ఆ షాపులో ఉన్న కస్టమర్లు అతడిని అనుమానంగా చూశారు. కానీ ఎవరు కూడా అతగాడి దగ్గరకు వెళ్లి ఆపే సాహసం చేయలేదు. ఇక్కడ విడ్డూరమేంటంటే ఆ షాపు సెక్యూరిటీ కూడా దూరం నుంచి ఈ తతంగాన్ని వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఆ దొంగ పని ముగించుకొని సైకిల్‌పై వెళ్లిపోయే క్రమంలో.. సెక్యూరిటీ అతడిని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ, దొంగ ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని దర్జాగా వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఈ దొంగతనం జరిగే సమయంలో లియాన్నే మెలెండెజ్ అనే జర్నలిస్టు అక్కడే ఉంది. 'నేను ఆ చోరీని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. మా నగరంలో ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఈ షాపులోనే కాదూ... ఇళ్లలోని వస్తువులను, కార్లను కూడా దొంగతనం చేస్తారు' అని ఆమె చెప్పుకొచ్చింది.. అయితే, శాన్ఫ్రాన్సిస్కోలో కొన్ని వివాదస్పద చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం, తక్కువ ధర ఉన్న వస్తువులను చోరీ చేస్తే విధించే శిక్షలను, జరిమానాలను తగ్గించారు. దీంతో కొంత మంది చిల్లర దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీ చోరకళ భలే ఉంది బాసు..’, ‘ఏమైనా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ఇంత జరుగుతున్న కొంత మంది కస్టమర్లున్నారే.. వారిని..’, ‘పాపం.. ఒక్కటే కష్టపడుతున్నాడు.. కాస్త సహాయం చేయొచ్చుగా..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. This just happened at the @Walgreens on Gough & Fell Streets in San Francisco. #NoConsequences @chesaboudin pic.twitter.com/uSbnTQQk4J — Lyanne Melendez (@LyanneMelendez) June 14, 2021 చదవండి: నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో.. -
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
-
భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య!
లక్నో: తన భర్త తనను కాదని వేరే మహిళతో షాపింగ్‌కి వచ్చాడు. ఇది చూసిన ఆ వ్యక్తి భార్య ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే అతడిని తిడుతూ, పిడిగుద్దులతో దాడిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకొంది. అయితే వీరి గొడవ పెద్దదిగా మారడంతో షాప్‌యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ,పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వీరిద్దరికి ఇది వరకు వివాహంజరిగిందని తెలిపారు. దీనిలో బాధితురాలు అయేషా, తన భర్త అద్నాన్కు 2020లోనే వివాహం జరిగిందని చెప్పింది. వివాహం అయిన కొద్దిరోజులకే తనను పుట్టింట్లో వదిలేశాడని వాపోయింది. కాగా, విడాకులు ఇమ్మని బలవంతం చేశాడని చెప్పింది. అయితే, నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది. మాకు విడాకులు మంజురు కాలేదు.. కాబట్టి తన భర్త వేరే మహిళతో తిరగటాన్ని తప్పుబట్టింది. అయితే దీనిపై ఆమె భర్త.. అయేషా అంటే నాకు ఇష్టంలేదు. ఇప్పటికే విడాకులు ఇచ్చాను. నేను వేరే మహిళతో షాపింగ్‌చేస్తే అనవసరంగా రాధ్దాతం చేస్తొందని అన్నాడు. కాగా, దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్‌లోనే! -
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త
హైదరాబాద్: మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అందిస్తున్న వాట్సాప్ తాజాగా బిజినెస్ అకౌంట్లకు షాపింగ్ బటన్‌ను జోడించింది. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్‌తో చూసేందుకు కస్టమర్లకు వీలవుతుంది. కొంత కాలంగా ప్రయోగాత్మకంగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మంగళవారం నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల మంది యూజర్లు బిజినెస్ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నారని వాట్సాప్ వెల్లడించింది. ఇందులో ప్రతి నెల 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్‌ను వీక్షిస్తున్నారట. వీరిలో భారత్ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇటీవల భారత్‌లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది వెల్లడించారని వాట్సాప్ తెలిపింది. ఇటువంటి కస్టమర్లు సులువుగా కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్ బటన్‌ను జోడించినట్టు వివరించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకు క్యాటలాగ్‌ను జోడిస్తేనే సాధారణ కస్టమర్లు ఈ బటన్‌ను వీక్షించే వీలుంటుంది. (వాట్సాప్ సందేశాలు వారంలో మాయం!) -
ప్రియురాలి కుటుంబంపై కోపంతో..
ముంబై : ప్రియురాలి కుటుంబంపై కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మానిక్‌పుర్‌కు చెందిన రాహుల్ పాశ్వాన్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబం రాహుల్‌ను హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు సెప్టెంబర్ 10వ తేదీన ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ( హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..) అయితే షాపునకు నిప్పంటుకోవటానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని భావించారంతా. సెప్టెంబర్ 21వ తేదీన యువతి తండ్రి తన షాపునకు దగ్గరలోని ఓ షాపునకు సంబంధించిన సీసీ టీవీ కెమెరా ఫొటేజీలను పరిశీలించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. రాహుల్ షాపులోకి నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్ కోసం గాలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ తెరుచుకున్న ప్రధాన మార్కెట్లు
-
లాక్‌డౌన్‌తో పాములకు నివాసంగా దుకాణాలు
సాక్షి, చిత్తూరు: లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇవ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్ యజమాని షాక్‌కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్డౌన్ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ) -
ఐసీయూ తరహాలో..
సాక్షి, సిటీ నెట్వర్క్: కోవిడ్ సరికొత్త పాఠాలు నేర్పించింది. అన్ని రంగాలు, సేవల్లోనూ కరోనా నిబంధనలకుఅనుగుణమైన మార్పులు వచ్చేశాయి.కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత సేవలనిర్వచనాలు మారాయి. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లోనూ కోవిడ్ కట్టడి చర్యలు తప్పనిసరిగా మారాయి.మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిచోట్లా దర్శనమిస్తున్నాయి.పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లను తలపించే డ్రెస్సులతో సెలూన్లు సేవలందజేస్తున్నాయి. ఒకసారి వినియోగించి పారేసే సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్ కిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరోవైపు జనం సైతం ఎక్కడికెళ్లినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛందంగానే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, మొబైల్ ఫోన్ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలు భారీగా సడలించి అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో నగరంలో సందడి పెరిగింది. రహదారులపై వాహనాల రాకపోకలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల అవసరాల కోసం బయటకి వచ్చే నగరవాసులు కోవిడ్ నిబంధనలను పాటించేందుకే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వ్యాపార సంస్థలు సైతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ షోరూమ్‌లలో థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే అనుమతిస్తున్నారు. షోరూమ్ బయటే కాలుతో నొక్కి వినియోగించేందుకు అనువైన శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చినప్పుడు భౌతిక దూరానికి విఘాతం కలగకుండా చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు పలు దుకాణాల్లో సిబ్బంది సంఖ్యను సైతం బాగా తగ్గించి సేవలు అందజేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘమైన లాక్డౌన్ కారణంగా షాపులు మూసి ఉంచడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా పలు వస్తువులు, సేవల ధరలు సైతం పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉన్న ధరలపై 20 నుంచి 26 శాతం వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఐసీయూ తరహాలో.. 'మై సర్వీస్ వెరీ సేఫ్’. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు కొత్త తరహా నినాదాన్ని అందుకున్నాయి. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సెలూన్లు వినియోగదారులకు సురక్షితమైన సేవలనందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను తలపిస్తున్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లలో పనిచేసే హెయిర్‌స్టైలిస్ట్‌లు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లతో పాటు మాస్కులు, గ్లౌస్లు విధిగా ధరిస్తున్నారు. చాలా చోట్ల సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్లనే వినియోగిస్తున్నారు. కత్తెర, దువ్వెన వంటివి వినియోగదారులు సొంతంగా తెచ్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. వేడి డెట్టాల్ నీటిలో శుభ్రం చేస్తున్నారు. కస్టమర్ల రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు కస్టమర్లకు మించి వెయిటింగ్లో ఉండనీయడం లేదు. అన్నిచోట్ల ఫోన్ బుకింగ్‌లు తప్పనిసరయ్యాయి. కేటాయించిన స్లాట్ ప్రకారం సేవలందజేస్తున్నారు. వరుసగా 4 సీట్లు ఉంటే ఒకటి విడిచి మరో సీటులో సేవలు అందిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు. హ్యాండ్‌వాష్ చేసుకున్న తర్వాతే వినియోగదారులను అనుమతిస్తున్నారు. రెస్టారెంట్లలో టేక్ అవే సర్వీసులు.. రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే సర్వీసులను అందజేస్తున్నాయి.రెండు రోజులుగా అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో పార్శిళ్లు తీసికెళ్లే వారి సంఖ్య తగ్గింది. మాస్క్, భౌతికదూరం పాటించాలని, వచ్చిన వారు శానిటర్తో చేతులు శుభ్రపరుచుకోవాలని వినియోగదార్లకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓన్లీ టేక్ అవే (పార్శిల్)కి మాత్రమే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్శిల్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిలో లోపలి లాంజ్‌లో నాలుగు అడుగుల దూరంలో చైర్స్‌ను అమర్చారు. వచ్చిన వారికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చి పార్శిల్ వచ్చే వరకు అక్కడ సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్‌లో ఉంచిన థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ రహిత క్యాబ్ సేవలు.. క్యాబ్‌లు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు కోవిడ్ వైరస్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నాయి. బుకింగ్ బుకింగ్‌కూ మధ్య కారును శానిటైజ్ చేయడం తప్పనిసరి చేశారు. క్యాబ్ డ్రైవర్లకు మాస్క్‌లు, గ్లౌజ్‌లతో పాటు శానిటైజేషన్‌ను ఆయా సంస్థలే అందించేలా చర్యలు చేపట్టాయి. గ్రేటర్లో సుమారు 2 లక్షల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్ పడ్డా ఈ రెండు రోజుల్లో 10 శాతం మాత్రమే రోడ్డెక్కాయి. పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలతో కూడిన పరికరాలను సమకూర్చుకుని రోడ్డెక్కాలనే వ్యూహంలో ఉన్నారు. ఉబెర్‌లో ఇద్దరికే అనుమతి.. క్యాబ్ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు మాస్క్‌లు, శానిటైజేషన్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. ప్రతి బుకింగ్ తర్వాత కారు లోపల భాగాన్ని శానిటైజ్ చేయాలని నిర్ణయించాం. అది ఏ మేర సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నాం. క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి ఉండగా.. ఊబెర్ క్యాబ్ మాత్రం డ్రైవర్‌తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. – ప్రవీణ్, ఉబెర్ క్యాబ్ చందానగర్ బ్రాంచ్ లీడ్ ఆస్పత్రి తరహా సేవలు.. ఆస్పత్రి తరహాలో సెలూన్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో కస్టమర్ బయటికి వెళ్లి మరో కస్టమర్‌ను లోపలికి పిలిచే ముందే షాపును పూర్తిగా శుభ్రపరుస్తున్నాం. పరికరాలు, టవల్స్, సీట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. – శ్రీనివాస్, సెలూన్ నిర్వాహకుడు ఈ పద్ధతులు ఎప్పటికీ పాటించాలి హెయిర్ కటింగ్ దుకాణాల్లో అమలు చేస్తున్న శానిటరీ పద్ధతులు బాగున్నాయి. కరోనా మాత్రమే కాదు ఎటువంటి అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ పద్ధతులు ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఇటువంటివి అమలు చేయడం అందరికీ మంచిది. – వెంకటేశ్, వినియోగదారుడు శానిటైజేషన్ తప్పనిసరి.. కోవిడ్– 19 నేపథ్యంలో అటు క్యాబ్ డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు సురక్షితమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. క్యాబ్‌లపై విశ్వాసం కలిగేలా కారు లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలనే ఆలోచనలోనే యాజమాన్యం కూడా భావిస్తోంది. ఆ దిశగా క్యాబ్ డ్రైవర్లను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది.– గోపీ, ఓలా క్యాబ్ ప్రతినిధి -
14 దుకాణాలు, సంస్థలకు సీల్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం సోమవారం నుంచి బుధవారం వరకు 14 దుకాణాలు, సంస్థలకు సీల్ వేసిననట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించి తెరిచిన సంస్థలు, దుకాణాలకు సీల్ వేసినట్లు తెలిపారు. ఐకాన్ ఎయిర్‌కండిషన్ సర్వీసెస్(ఎస్పీ రోడ్), సిరి వాచ్ అండ్ మొబైల్ స్టోర్(అల్కాపురి), పద్మావతి బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్(అల్కాపురి), ది మార్బుల్ క్రాఫ్ట్(స్నేహపురి కాలనీ), న్యూ జయా స్టీల్ప్యాలెస్(అల్కాపురి), రవీందర్ స్టీల్ప్యాలెస్(దిల్సుఖ్నగర్), అలీ స్టడీ సెంటర్(సైదాబాద్), శ్రీయ ఫ్లెక్సీ ప్రింటర్(అమీర్‌పేట్), మొబైల్ ప్లానెట్(బంజారాహిల్స్), ఫ్యాషన్ ప్లానెట్(బంజారాహిల్స్), ప్రెస్టీజ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్(అల్కాపురి), పియోని కిడ్స్స్టోర్(బంజారాహిల్స్), జియో డిజిటల్స్(బంజారాహిల్స్), సువాస, రెడీమేడ్ వస్త్ర దుకాణం(బంజారాహిల్స్). -
ఆన్లైన్ షాపింగ్‌కే సై..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోన వ్యాప్తి, లాక్డౌన్ తదనంతరం కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుందని ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని నివేదిక చెబుతోంది. ఆన్‌లైన్‌కే మొగ్గు చూపనున్నట్టు సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో చేసిన ఈ సర్వే ప్రకారం.. రానున్న 9 నెలల్లో ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్న వారి సంఖ్య 46 నుంచి 64 శాతానికి చేరనుంది. కరోనాకు ముందు దుకాణాల్లో కొనుగోలు చేసిన వారి సంఖ్య 59 శాతం ఉంటే.. లాక్డౌన్ తర్వాత ఈ సంఖ్య 46 శాతం ఉండనుంది. డెలివరీ హామీ ఇచ్చే రిటైలర్ల వద్ద నుంచి కొనుగోళ్లకు 72% మంది మొగ్గు చూపారు. స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు 89 శాతం మంది తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌కు 78% మంది ఆసక్తి కనబరిచారు -
ఇళ్లొద్దు.. షాపులే ముద్దు
చెన్నై, తిరువళ్లూరు: జనం సంచారం తక్కువగా వున్న సమయంలో షాపు తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించిన యువకుడికి దేహశుద్ధి చేసిన ప్రజలు పోలీసులకు అప్పగించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలోని పలు షాపుల్లో ఇటీవలే చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారుల్లో అభద్రతా భావం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు శ్రీపెరంబదూరు–తిరువళ్లూరు రోడ్డులోని పూజాసామగ్రి విక్రయించే షాపునకు వెళ్లిన ఇద్దరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చోరీకి యత్నించారు. ఈ సమయంలో అటువైపు వెళ్లిన కొందరు షాపులను తెరిచి వుండడంతో పాటు లోపల యువకులు వున్నట్టు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమికూడి లోపల వున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. మరో యువకుడు పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి పట్టుకున్న యువకుడిని అప్పగించారు. యువకుడి వద్ద పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు పులియంతోపు ప్రాంతానికి చెందిన మదన్‌కుమార్‌గా గుర్తించారు. పరారైన యువకుడు మనవాలనగర్ ఎస్టీ కాలనీకి చెందిన మురుగేషన్‌గా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అరెస్టయిన మదన్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన మదన్‌కుమార్ పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో, సార్ నేను ఇళ్లలో ఎప్పుడూ చోరీలకు పాల్పడలేదు. ఇళ్లలో చోరీలు చేస్తే వారిలో కొంత మంది నిరుపేదలు కూడా వుండొచ్చు, వారి శాపం నాకు వద్దు. వాళ్లు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును చోరీ చేయాలంటే మనస్సు ఒప్పుకోదు. బహుశా ఇప్పటి వరకు 70 చోరీలు చేసి వుంటా. అందులో ఒక్క ఇళ్లు కూడా లేదు. అన్నీ షాపుల దొంగతనాలే. షాపులు నిర్వహించే వారు ధనికులే వుంటారు. అందుకే చోరీలు చేయడానికి షాపులనే ఎంచుకున్నట్టు చెప్పడంతో పోలీసులే షాక్‌కు గురైయ్యారు. -
మెడికల్ షాప్ వైద్యం, చిన్నారి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: సొంతవైద్యం, మెడికల్ షాపులో ఏవో తెలిసిన మందులు కొనుక్కొని వాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించిన ఘటన ఇది. మందుల దుకాణంలో ఇచ్చిన తప్పుడు మందుతో రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయిన వైనం ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం షాహదారాలోని జీటీబీ ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసించే బాలిక (2) జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి దగ్గరలోని ఉన్న షాపుకెళ్లి ఏవో మందులు తెచ్చి వాడింది. అయినా ఉపశమనం లభించకపోవడంతో మరోసారి అదే షాపునకు వెళ్లింది. వైద్యుడిని సంప్రదించమని చెప్పడానికి బదులు ఆ షాపు యజమాని పాపకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతే ఇంటికి వచ్చీ రావడంతోనే రక్తపు వాంతులు మొదలయ్యాయి. కంగారు పడినబంధువులు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు.అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
మందుల దుకాణాల్లో మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మందుల దుకాణాల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. ఒకే లైసెన్సుపై రెండు మూడు షాపులునిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధికధరలకు మందులు విక్రయిస్తున్నారు.మరోవైపు అనర్హులను ఫార్మాసిస్టులుగా నియమిస్తుండడంతో... వారు వైద్యుడొకటి రాస్తే బాధితులకు మరొకటి అంటగడుతున్నారు. ఎంఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు లేని వారికి స్వల్పకాలిక శిక్షణనిచ్చి మందులవిక్రయాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఒకే ఆస్పత్రి భవనంలో రెండు మూడు ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మందులకు బదులు జనరిక్ మెడిసిన్అమ్ముతున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లోనే కాదు... నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతను పరిశీలించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ పరోక్షంగా వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.తాజాగా బోయిన్‌పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకురాలు ఏసీబీని ఆశ్రయించడానికి ఇదే కారణమని తెలిసింది. తనిఖీలు... మామూళ్లు గ్రేటర్లో 8,500లకు పైగా మందుల దుకాణాలు ఉండగా... 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు (డీఐ) ఉన్నారు. తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పరీక్షలు, కొత్త దుకాణాలకు లైసెన్సుల జారీ, పాత వాటికి రెన్యూవల్ తదితర పనుల కోసం ఒక్కో డీఐకి 400–500 దుకాణాలు కేటాయించారు. వీరు ఎప్పటికప్పుడు ఆయా దుకాణాలను తనిఖీ చేసి, మందుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీల పేరుతో అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం డీఐలకు పరిపాటిగా మారింది. గతంతో పోలిస్తే శివారు ప్రాంతాలు విస్తరించాయి. బోడుప్పల్, బీఎన్‌రెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, కర్మన్‌ఘాట్, నందనవనం, మీర్పేట్, చర్లపల్లి, నారపల్లి, జీడిమెట్ల, సూరారం, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ తదితర బస్తీల్లో ఇప్పటికీ ఆర్ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సేవలతో పోలిస్తే మందుల విక్రయాల్లోనే భారీగా లాభాలు వస్తుండటంతో.. ఎలాంటి అనుమతులు పొందకుండానే వారు ఆయా క్లినిక్స్‌లోనే మందులు విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్‌తో పాటు గర్భవిచ్ఛిత్తి మందులనూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బేగంపేట సమీపంలోని ఓ యువతి గర్భ విచ్ఛిత్తి మందులు వాడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. స్వదేశీయే విదేశీ... గ్రేటర్ పరిధిలో 20 కార్పొరేట్ ఆస్పత్రులు, 85 పాలీక్లినిక్స్, 228 డయాగ్నోస్టిక్స్, 234 దంత ఆస్పత్రులు, 372 ఇరవై పడకల ఆస్పత్రులు ఉన్నాయి. 21–50 పడకల ఆస్పత్రులు 88 ఉండగా.. 101–200 పడకల ఆస్పత్రులు 94, 200కు పైగా పడకల ఆస్పత్రులు 13 ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లోకి ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లున్న రోగులు వస్తే చాలు అందినకాడికి దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఆయా పేషెంట్లకు తక్కువ ఖరీదుతో కూడిన జనరిక్ మందులిచ్చి ఎక్కువ ధరున్న బ్రాండెడ్ మందులు ఇచ్చినట్లు బిల్లులు సమర్పిస్తున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్స్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టంట్లను అమర్చుతున్నాయి. గుండె రక్తనాళాలల లోపల వీటిని అమర్చుతుండడంతో రోగులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు? దాని ఖరీదు ఎంత? రోగి ఎంత చెల్లించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా యథేచ్ఛగా ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డీసీఏలో వసూల్ రాజాలు ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఆ కంపెనీ తయారు చేసిన మందులను మార్కెట్లోకి విడుదల చేయాలన్నా, చివరకు స్వచ్ఛందంగా ఓ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ఓ మెడికల్ షాపు పెట్టుకోవాలన్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లైసెన్సు తప్పనిసరి. ఇదే అదనుగా డీసీఏలోని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సి వస్తోంది. మెడికల్ షాపునకు (హోల్‌సేల్, రిటైల్) రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను ఇన్‌వార్డులో సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి టేబుల్‌కు చేరుకోవాలంటే వారికి ముందే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. తనిఖీకి వచ్చే ఇన్స్పెక్టర్కు అడిగినంత అందించాల్సిందే. లేదంటే వివిధ రకాల లోపాల పేరుతో సవాలక్ష కొర్రీలు పెట్టి లైసెన్స్ జారీ కాకుండా అడ్డుకుంటారు. పాతవాటిని పునరుద్ధరించరు. నేరుగా దరఖాస్తు చేయడం కంటే కన్సల్టెంట్‌ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇందుకు డీసీఏ అధికారులే ఓ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడితో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 8,500 గ్రేటర్‌లోని మందుల దుకాణాలు డీఐ టార్గెట్స్:దిల్సుఖ్నగర్, మలక్‌పేటకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) మందుల దుకాణాలు, రక్తనిధి కేంద్రాలకుప్రత్యేకంగా టార్గెట్లు విధించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితేనే ఆయా ప్రాంతాల్లోనినిర్వాహకులంతా హడలిపోతున్నారు. -
పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులు పార్లమెం టు ఎన్నికల్లో వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా గురువారం (నేడు) ‘పెయిడ్ హాలిడే’ (వేతనాలతో కూడిన సెలవుదినం)గా ప్రకటిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి విభాగం ఈనెల 1వ తేదీన జీవో జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని నిబంధనలకు అనుగుణంగా కార్మిక కమిషనర్ కూడా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. దుకాణాలతో పాటూ, ఐటీ, ఐటీఈ ఎస్ (ఔట్ సోర్సింగ్) కంపెనీలు కూడా ఏప్రిల్ 11ను పెయిడ్ హాలిడేగా ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటించకుండా లేదా సంస్థలను మూసివేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారికి, లేబర్ కమిషనర్‌కు లేదా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు ఫిర్యాదులు అందిన పక్షంలో వాటిని తీవ్రంగా పరిగణిస్తారు. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఈవో రజత్ కుమార్ హెచ్చరించారు. -
ఆ ‘కలం’.. చిరకాలం!
సాక్షి, సిటీబ్యూరో: ‘దక్కన్ పెన్’.. దశాబ్దాలుగా ఆదరణ పొందుతూనే ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ పెన్నుల దుకాణం ఇప్పటికీ విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ రోజుల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏడో నిజాం ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్టుగానే ఉన్నత విద్యా బోధన జరిగేది. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు వారు రాసేందుకు పెన్నుల డిమాండ్ కూడా చాలా పెరిగింది. అప్పటి వరకు సాధారణంగా స్థానికంగా వినియోగించే సిరా పెన్నులే వాడేవారు. అప్పట్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు ఇంగ్లండ్, జర్మన్‌తో పాటు ఫ్రాన్స్ దేశాల్లో తయారు చేసే పెన్నులపై ఎక్కువగా మొగ్గు చూపేవారు. వీరి అభిరుచికి అనుగుణంగానే ‘దక్కన్ పెన్ స్టోర్స్’ నిర్వాహకులు అరుదైన కలాలను అందుబాటులో ఉంచేవారు. ఇప్పటికీ ఈ దుకాణం మనుగడలోనే ఉండటం గమనార్హం. నిజాం కాలంలోనే.. ‘నిజాం కాలంలోనే నగరంలో పెన్నుల దుకాణం మొదలైంది. బాల్‌పాయింట్ పెన్ లేని సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘దక్కన్ పెన్ స్టోర్’ మొదలైంది. ఆ సమయంలో ధనవంతులు పౌంటెన్ పెన్ కొనాలంటే కోల్‌కతా, ముంబై వెళ్లాల్సిందే. నగరంలో ఆ పెన్నులను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎస్.ఎ.సిద్ధిఖీ నగరంలో ఈ పెన్నుల దుకాణం ప్రారంభించారు’ అని సిద్ధిఖీ వారసుడు ప్రస్తుత దక్కన్ స్టోర్ యజమాని హలీం చెప్పారు. అత్యాధునిక కలాలు.. దేశంలోనే అత్యాధునిక రకాల కలాలను దక్కన్ పెన్ స్టోర్‌లో చూడవచ్చు. ప్రాచీన కాలం నాటి పెన్నుల నుంచి అరుదైన రకాలూ కొలువయ్యాయి ఇక్కడ. బాల్‌పెన్, రోలర్, ఫౌంటెన్, జెల్, డిస్పోజబుల్ పెన్ అంటూ చాలా రకాల వైవిధ్యతలతో కూడినవి ఇక్కడ ఉన్నాయి. వాటర్ మ్యాన్ పెన్, పార్కర్, షెఫర్, క్రాస్, పెలికన్ తదితర రకాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వైవిధ్యమైనవెన్నో... వాడి పారేసే మూడు రూపాయల పెన్నుల నుంచి రూ.లక్ష.. ఆ పైచిలుకు ధర ఉన్న పెన్నులు ఇక్కడ ఉన్నాయి. రూపాయలు, వందలు, వేల రూపాయల ఖరీదైన వాటిని ఇక్కడ సందర్శనకు పెట్టారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాలను గమనించవచ్చు. ఐరోపా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవి చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా నటీనటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. దుకాణాన్ని సందర్శించి పెన్నులను కొనుగోలు చేస్తారు. నిజాం వారసుడు మఫకంజా.. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ పెన్స్టోర్ను దర్శిస్తారని దీని నిర్వాహకుడు హలీం చెప్పారు. దేశంలోనే ఖరీదైనవి.. ఇక్కడ ఉన్న కొన్ని పెన్నులు రూ.లక్షపైనే ధరల్లో ఉన్నాయి. వాటి వాటి ప్రత్యేకతల ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కాన్వే స్టెవార్ట్ పెన్ దక్కన్ పెన్‌స్టోర్‌లో అత్యధికంగా రూ.1,39,750 ధర పలుకుతోంది. పూర్తిగా వెండితో తయారు చేయడమే ఇందుకు కారణం. పెన్ను ముందు భాగంలో బంగారంతో తయారు చేసిన టిప్ ప్రత్యేక ఆకర్షణ. సాధారణ పెన్నులతో పోలిస్తే దీని బరువు ఎక్కువ. దేశంలో ఎక్కడా లభించని పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు దేశంలో అత్యధిక ధర ఉన్న పెన్నులు కూడా హైదరాబాద్‌లోని ఈ షాప్‌లోనే ఉన్నాయి. దేశ విదేశాల పెన్నులకు రిపేరింగ్ కొనుగోలు చేసిన వేల రూపాయల విలువైన పెన్నులు పాడైతే వాటిని వృథాగా పడేయకుండా ఈ దుకాణంలో బాగు చేస్తారు. కొనుగోలుదారులకు పెన్నుల గురించి సందేహాలను నివృత్తి చేస్తారు. దేశ విదేశాల్లో తయారైన హ్యాండ్‌మేడ్ పెన్నులను దక్కన్ పెన్ షాప్‌లో రిపేరింగ్ కూడా చేస్తారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి కూడా పెన్నులు రిపేరింగ్‌కు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. తొలినాళ్ల నుంచే విదేశీ బ్రాండ్లు.. విశ్వవిద్యాయలం ఏర్పాటైన మూడేళ్లకే అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగర్)లో నివసించే సబీ అక్తర్ సిద్ధీఖీ ఇంగ్లండ్‌లో తయారయ్యే కన్‌వెస్టివర్డ్ పెన్, ఫ్రాన్స్‌లో తయారు అయ్యే డ్యూరో పెన్ కంపెనీల ఏజెన్సీలను తీసుకొని 1922లో నగరానికి వచ్చారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు విద్యార్థులను కలిసి పెన్నుల విశిష్టతను తెలిపి విక్రయించే వారు. ఇలా ఆరేళ్ల పాటు పెన్నులు విక్రయించి 1928లో అబిడ్స్‌లో ‘ది దక్కన్ పెన్ స్టోర్’ను ప్రారంభించారు. 90 ఏళ్లుగా దేశ విదేశాల్లో తయారయ్యే పెన్నులు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు. మూడు తరాలుగా కొనసాగిస్తున్నాం.. ఏడో నిజాం కాలంలో మా నాన్న ఎస్.ఎ.సిద్ధిఖీ ఫ్రెంచ్ పెన్నును నగరానికి పరిచయం చేశారు. డ్యూరో పెన్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటింటికీ వెళ్లి పెన్నుల గురించి ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగించేవారు. అరుదైన రకాల పెన్నులేవైనా పాడైతే.. మా దగ్గరకు తెస్తే అబిడ్స్ శాఖలో రిపేరింగ్ చేస్తాం. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వాటర్‌మ్యాన్ పెన్నును తీసుకొచ్చి రిపేరింగ్ చేయాల్సిందిగా కోరారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఆ పెన్ను బహుమతిగా పొందినట్లు చెప్పారు. మా దగ్గరున్న యంత్రం సహాయంతో విడిభాగాలు తయారు చేసి, ఆ తర్వాత రిపేరింగ్ చేసి ఇచ్చాం. – హలీం అక్తర్ సిద్ధిఖీ, దక్కన్ పెన్‌స్టోర్ యజమాని -
జ్ఞానమా? శీలమా? ఏది మిన్న?
కాశీరాజు ఆస్థానంలో అనేకమంది పండితులుండేవారు. వారిలో ధర్మధరుడు మహాపండితుడే కాదు, శీలవంతుడు కూడా. రాజు పండితుల్ని వారి వారి పాండిత్యానికి తగిన రీతిలో ఘనంగా సత్కరించేవాడు. వారిలో పాండిత్యంతోపాటు శీలసంపన్నులూ ఉండేవారు. శీలగుణం లేని పండితులూ ఉండేవారు. రాజు మాత్రం వారి బుద్ధుల్ని లెక్కించకుండా కేవలం పాండిత్యానికే గౌరవ సత్కారాలు అందించడం ధర్మధరునికి నచ్చలేదు. రాజు మాత్రం అందరికంటే ధర్మధరుణ్ణే మిన్నగా గౌరవించేవాడు. ధర్మధరుడు రాజుకి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు. ఒకరోజున నగరంలోని ఒక వజ్రాల దుకాణానికి వెళ్లాడు. దుకాణం యజమాని లేచి ధర్మధరునికి నమస్కరించాడు. యజమానితో మాట్లాడుతూ ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లిపోయాడు ధర్మధరుడు. ‘మాటల మధ్య మరపుగా తీసుకుని ఉంటారు’ అనుకుని ఊరుకున్నాడు వ్యాపారి. రెండోరోజు అలానే చేశాడు ధర్మధరుడు. రెండోసారీ ఏమీ అనలేదు వ్యాపారి. మూడోరోజూ అలానే చేశాడు. వ్యాపారికి కోపం వచ్చి– ‘‘ఓరీ! దొంగవెధవా! నీ పాండిత్యం తగలబడ. నిన్ను గౌరవించడం నా తప్పు’’ అని గట్టిగా అరచి ధర్మధరుణ్ణి నాలుగు తన్ని, రాజు దగ్గరకు ఈడ్చుకుపోయాడు వ్యాపారి. దొంగగా తన ఎదుట నిలిచిన ధర్మధరుని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘రాజా! ఇప్పుడు నన్ను సత్కరించగలరా?’’అని అడిగాడు ధర్మధరుడు. ‘‘సత్కరించడం కాదు. శిక్షిస్తాను. అదే నీకు సత్కారం’’ అన్నాడు రాజు.‘‘ఔను కదా! మహారాజా! నేను మీకు చెప్పదలచుకుంది ఇదే! పాండిత్యమే కాదు, శీలం కూడా ఉండాలి. అలాంటివారినే గౌరవించాలి. కానీ, మీరు శీలం లేని పండితుల్ని కూడా అందరితోపాటే ఘనంగా సత్కరిస్తున్నారు’’ అన్నాడు ధర్మధరుడు. తను చేస్తున్న తప్పు తెలియజెప్పడానికే ధర్మధరుడు ఇలా చేశాడని రాజుకు అర్థమైంది.జ్ఞానం కంటే పాండిత్యం కంటే శీలమే గొప్పది అని బుద్ధుడు చెప్పిన కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
దొంగలు కావలెను!
ప్రముఖ బట్టల దుకాణంలో పనిచేసేందుకు దొంగలు కావలెను. మా స్టోర్‌లో దొంగతనం చేసేందుకు అనుభవం, ఆసక్తికల వారు దరఖాస్తు చేసుకోగలరు. జీతం గంటకు రూ.5 వేలు.అంతా బాగానే ఉంది కానీ సేల్స్‌మెన్ అని ఉండాల్సిన చోట దొంగలు అని తప్పుగా రాశారే.. అనుకుంటున్నారా...? తప్పుగా ఏమీ రాయలేదు. ఆ దుకాణంలో నిజంగా దొంగలే కావాలట. అది కూడా ప్రొఫెషనల్ దొంగలు. అదేంటి ఏరి కోరి దొంగలను నియమించుకోవడం ఏంటి.. పైగా వారి షాప్‌లోనే దొంగతనం చేయాలా.. ఇదెక్కడి చోద్యం బాబోయ్ అని ఆశ్చర్యపోతున్నారా..? దీని వెనుక కూడా అర్థం, పరమార్థం ఉందండోయ్! అసలు విషయంలోకి వస్తే.. బ్రిటన్‌లోని ఓ మహిళ బార్క్.కామ్ అనే జాబ్ వెబ్సైట్లో ఈ ప్రకటన పెట్టారు. తన దుకాణంలో దొంగతనం చేసి, ఎలా దొంగతనం చేశారో తనకు వివరించాలని అందులో పేర్కొన్నారు. దీంతో తన దుకాణంలో దొంగతనాలను అరికట్టొచ్చని ఆమె భావిస్తున్నారు. దొంగతనం చేసిన వారికి గంటకు రూ.5 వేలతో పాటు దొంగిలించిన మూడు వస్తువులు తమ వెంటే ఉంచుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు కూడా. 2013లో ప్రారంభించిన తన దుకాణంలో ప్రతి క్రిస్మస్కు భారీగా దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని ఆపేందుకు ఇలా భిన్నంగా ఆలోచించినట్లు తెలిపారు. ఇలా చేస్తే తన దుకాణంలో సెక్యూరిటీ లోపాలను తెలుసుకోవచ్చని వివరించారు. దీంతో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయొచ్చని ఆమె చెబుతున్నారు. అయితే కాస్త భిన్నంగా ఉన్నా.. ఆమె ఐడియాలో లాజిక్ పాయింట్ ఉంది కదా..! మంచి పనితనం ఉన్న దొంగ దొరకాలని మనమూ ఆశిద్దాం. -
మదినిండా పెద్దాయనే..
సాక్షి, చంద్రశేఖర్‌కాలనీ: ఆయన మదినిండా వైఎస్సారే కొలువయ్యారు.. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం తో తన స్కూటర్ రిపేరింగ్ దుకాణానికి వైస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ అని పెట్టుకున్నారు. ఆయనే నగరంలోని బడాబజార్‌కు చెందిన భిక్షపతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన చేసిన సేవలను ముగ్ధుడైన భిక్షపతి ఆయననే దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానం.. ఆయన చేసిన సేవలను నలుగురికీ చెబుతూ అందరినోటా ‘వైఎస్సార్ భిక్షపతి’గా నిలిచిపోయారు. నగరరంలోని బడాబజార్‌లో వైఎస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ పేరుతో షాప్ నిర్వహిస్తున్న నూరి భిక్షపతికి వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులక ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు ఇలా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించగా వాటిని ముగ్ధుడైన భిక్షపతి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పదిమందికీ వివరిస్తూ ఉంటారు. వైఎస్ పేరునే స్కూటర్ రిపేరింగ్ షాప్‌ను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 25ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్న భిక్షపతి తన షాప్‌లో ప్రతిఏటా వైఎస్ జయంతి, వర్ధంతులను సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ జయంతి, రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాడు. స్థోమత లేకున్నప్పటికీ తనకు ఉన్నదాంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌పై తన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పులివెందుల, హైదరాబాద్‌లో వైఎస్ కుటుంబసభ్యులతో, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన కలిశారు. -
టీడీపీ జెండా కట్టలేదని పాక తగలబెట్టారు
‘అయ్యా... నేను రోడ్డు పక్కన చిరు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఆ దుకాణంపై టీడీపీ జెండా కట్టలేదనే కోపంతో అధికార పార్టీ నాయకులు నా పాకను ఆరు నెలల క్రితం తగులబెట్టారు’. అని పెడనకు చెందిన అబ్దుల్ రజా బేగం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి వచ్చిన జననేత జగన్మోహన్ రెడ్డి వద్ద వాపోయింది. కొన్నేళ్లుగా రోడ్డు పక్కన తినుబండారం దుకాణం పెట్టుకొని జీవిస్తున్నానని, అధికార పార్టీ నాయకులు జెండా కట్టలేదని రాత్రి వేళలో తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో రోడ్డు మీదనే తినుబండారాలు అమ్ముకొంటున్నానని వాపోయారు. స్థలం కోసం దరఖాస్తు చేసుకొంటే ఇవ్వలేదని నా భర్త కూడా మృతి చెందాడని, స్థలం కావాలంటే పార్టీ జెండా కట్టమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వృత్తికి గులాం
గులాం అలీ ఖాన్ సూదీదారం పట్టుకుని యాభై ఏళ్లవుతోంది. ఇరవై మూడేళ్ల వయసులో మెడలో వేసుకున్న టేప్ ఇప్పటికీ ఉంది. చేతిలో కత్తెర మెత్తగా పని చేసుకుపోతూనే ఉంది. మెషీన్ చక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. అది బతుకు చక్రం. జీవితాన్ని మలిచిన చక్రం. వృత్తిలో చక్రం తిప్పాడు గులాం. దుకాణం అంటే అన్నం పెట్టిన అమ్మ అంటాడు. దుకాణం తెరవని రోజు అమ్మను చూడని రోజేనంటాడు. అమ్మకు సలాం... వృత్తికి గులాం అంటున్నాడు హైదరాబాద్, హెచ్ఎఫ్ నగర్‌కు చెందిన ఈ సీనియర్ టైలర్. గులాం అలీ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదేంటి అని అమ్మను అడుగుతున్నాడు. మాటల్లోనే వచ్చాడు నాన్న. అమ్మ చాయ్ ఇచ్చే వరకు ఉగ్గబట్టుకున్నాడు. ఆయన చాయ్ కప్పు కింద పెట్టగానే...‘‘నాన్నా నేను టైలరింగ్ నేర్చుకుంటా’’ ఉపోద్ఘాతం ఏమీ లేదు. విషయం చెప్పేశాడు గులాం అలీ.‘‘మనోళ్లలో ఎవరికీ రాదు బేటా, ఎక్కడ నేర్చుకుంటావ్’’‘‘దర్జీ దుకాన్కెళ్లి నేర్చుకుంటా అప్పా’’ ‘‘..........’’‘‘సరేనంటే రేపే వెళ్తా’’కొడుకు ఆరాటం అర్థమవుతోంది. ‘అలాగే’ అన్నాడు ముక్తసరిగా. గులాం అలీకి మెషీన్ మీద కూర్చున్నట్లే ఉంది. చక్రం గిర్రున తిరగడం, మెషీన్ టకటకలాడడం వింటుంటే తానే మెషీన్ కుడుతున్నట్లు ఉంది. షర్ట్ కుడుతున్న సీనియర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. హెమ్మింగ్ చేసే నీడిల్ ఎడమ చేతి చూపుడు వేలిలో గుచ్చుకున్నది. ‘అబ్బా...’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘ఏంట్రా! ఏ లోకంలో ఉన్నావ్’’ గద్దించాడు మాస్టర్.మాస్టర్ చేతిలోని కత్తెర వంపు తిరుగుతూ క్లాత్‌ను కట్ చేస్తుంటే ఆకాశంలో వంగిన ఇంద్రధనుస్సును చూసినంత సంబరంగా ఉంది గులాంకి. తానెప్పుడు అలా కట్ చేసేది. మెడలో టేప్ వేసుకుని కత్తెరతో సర్రున మెత్తగా కట్ చేసి, చెవిలో ఉన్న పెన్సిల్ తీసి మార్క్ చేసి వాటిని చుట్ట చుట్టి మెషీన్ మీదున్న టైలర్ వైపు విసిరేస్తున్నాడు మాస్టర్. యాక్షన్ సీన్ చూస్తున్నట్లే ఉంది గులాంకి. ‘‘నాన్నా! పదిహేను రూపాయలు. నెల జీతం. రోజుకు యాభై పైసలు. నే పనికి ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టలే. అందుకే మొత్తం జీతం వచ్చింది. అమ్మకిస్తున్నా’’ అంటూ తల్లి చేతిలో పెట్టాడు. గులాం తెచ్చిన డబ్బుకంటే... అతడి కళ్లలోని ఆనందాన్ని చూసి మురిసి పోయారు అతడి తల్లిదండ్రులు.‘‘నాన్నా! నేను సొంతంగా దర్జీ దుకాన్ పెడతా’’ అన్నాడోరోజు.‘‘ఎక్కడ పెడతావు, ఆబిడ్స్లోనేనా’’‘‘దర్జీలంతా ఆబిడ్స్లోనే ఉన్నట్లున్నారు. నేను ఎర్రగడ్డలో పెడతా, అఫ్జల్ కాకా స్టీల్ దుకాణం పక్కనే అద్దెకు గది ఉంది’’‘‘అన్నీ చూసుకున్నావ్. నేను చెప్పేదేంటి కానివ్వు’’ అలా... 1969లో మొదలైంది గులాం అలీ ఖాన్ సొంత దర్జీ దుకాణం. నెలకు పాతికరూపాయల అద్దె. ఒక బ్లవుజ్ కుడితే నాలుగు నుంచి ఐదు రూపాయలు నడుస్తున్న రోజులవి. ఐదు లేదా ఆరు బ్లవుజ్‌లు కుడితే రెంట్ వచ్చేస్తుంది. మిగిలిన డబ్బుతో జామ్‌జామ్‌గా బతికేయవచ్చు. ఇక ప్యాంట్ షర్టులకు లెక్కేలేదు. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే పెద్ద రాబడి. ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఎవరికీ తల వంచని దర్జీలా దర్జాగా జీవించవచ్చు. గులాం ముందున్న చిత్రం ఇది. కుర్రాడు మంచి పని వాడేననే పేరుతో పాటు పిల్లనిచ్చే వాళ్ల క్యూ రెడీ అయింది. షహనాజ్బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. తొమ్మిది మందినీ చదివించాడు. ఏడుగురికి పెళ్లిళ్లు చేశాడు గులాం అలీ ఖాన్. ఇక ఇద్దరికి పెళ్లి చేయాలి. ఇప్పుడతడి వయసు 71. 23 ఏళ్ల వయసులో సొంత దుకాణం తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ మడత నలగకుండా చక్కగా ఐరన్ చేసిన ఖరీదైన షర్టు, ప్యాంట్‌తో గెజిటెడ్ ఆఫీసర్లాగా ఉంటాడు. డ్రస్ అలాగే మెయింటెయిన్ చేస్తాడని చెప్తారు బాగా తెలిసిన వాళ్లు. పిల్లలు టేప్ పట్టుకోలేదు! గులాం ఆరుగురు కొడుకులనూ చదివించాడు. ఒక కొడుకు ఓలా క్యాబ్ నడుపుతున్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్‌లో ప్రైవేట్ వర్క్, డీఎల్ఎఫ్లో ఉద్యోగం, టైలరింగ్ మెటీరియల్ షాప్, మొబైల్ షాప్, చిన్న కొడుకు డీజె. కొడుకులలో ఒక్కరినైనా దర్జీని చేయాలనుకున్నాడు గులాం. ‘‘ఈ దుకాణం మీదనే అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను. అప్పట్లో చేతి నిండా పని. ఇప్పుడు నెలలో పదిహేను రోజులు పని ఉంటే చాలా బాగున్నట్లు. మిగిలిన రోజులు షాపు తెరిచి కూర్చోవాల్సిందే. అద్దెలు కట్టుకుంటూ, కరెంట్ బిల్లు కట్టుకుంటూ గిరాకీల కోసం ఎదురు చూస్తున్నాను. ‘మేమంతా పని చేస్తున్నాం, ఇంక దుకాణం బంద్ చేయ’మంటారు పిల్లలు. దుకాణం బంద్ చేయాలంటే అమ్మను చూడకుండా ఆమె ముఖాన తలుపేసినట్లే, అట్లా మనసు రాదు. పాణం సుస్తీ చేసినా సరే, సాయంత్రం ఓ గంటయినా వచ్చి కూర్చుంటాను. అప్పుడు పాతిక... ఇప్పుడు తొమ్మిది వేలు! అప్పట్లో ఐదారు బ్లవుజ్‌ల డబ్బు అద్దెకెళ్లేది. ఇప్పుడు బ్లవుజ్కు 175 రూపాయలు తీసుకుంటున్నాను. షాపు అద్దె తొమ్మిది వేలు, కరెంటు బిల్లు ఆరొందలు. ఎన్ని బ్లవుజ్‌లు కుడితే షాపు రెంటు గడవాలి. నేను లేడీస్, జెంట్స్ ఇద్దరికీ కుడతాను కాబట్టి ఈ మాత్రమైనా బండిని నడిపిస్తున్నాను. మగవాళ్ల దుస్తులు మాత్రమే కుట్టే వాళ్లు దుకాణాలు బంద్ చేసేశారు. మగవాళ్లంతా రెడీమేడ్ ప్యాంట్, షర్ట్ కొనుక్కుంటారు. వాళ్లకు దర్జీతో పనే ఉండటం లేదు. లేడీస్‌కి అలా కాదు. కరెక్ట్ ఫిట్టింగ్ రెడీమేడ్లో దొరకక టైలర్‌తో కుట్టించుకునే వాళ్లుంటారు. రెడీమేడ్ కొని ఆల్టరేషన్కి వచ్చేవాళ్లుంటారు. ఇప్పుడు టైలర్లను బతికిస్తున్నది ఆడవాళ్లే. రెడీమేడ్ దుస్తులు కుట్టడం ఈజీ! మూడు వందలకు రెడీమేడ్ కుర్తా వస్తుంది. మేము కుట్టడానికే 225 తీసుకుంటాం. మరి మా దగ్గరకు ఎందుకు వస్తారు? అలా చార్జ్ చేయకపోతే మేము బతకలేం. రెడీమేడ్లో లాగ మేము కుర్తాను బారుగా కుట్టేస్తే సరిపోదు. కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కుట్టాలి. దానికి టైమ్ పడుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్లు కూడా పెద్ద పెద్ద దుస్తుల తయారీ కంపెనీలలో ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. అక్కడ ఐదు వేలిస్తారు. సైజ్‌ల వారీగా కామన్‌గా కుట్టేస్తారు. దాంతో దర్జీ దుకాన్ తెరమరుగు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది’’ అన్నారు గులాం అలీ ఖాన్ ఆవేదనగా.దర్జీలు తెరమరుగవడానికి రెడీమేడ్ దుస్తులు మార్కెట్‌ని వెల్లువలా ముంచేయడం ఒక కారణమైతే, ఫ్యాషన్ డిజైనింగ్ మరో కారణం. పెద్దగా నైపుణ్యం లేని వాళ్లు తక్కువ జీతాలతో రెడీమేడ్ దుకాణాల కార్ఖానాల్లో చేరిపోతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వేళ్లూనుకోవడంతో స్కిల్ ఉన్న టైలర్లు డిజైనర్‌తో కలిసి పని చేస్తున్నారు. సొంతంగా పనిచేసుకుంటూ నేను దర్జీని అని చెప్పుకునే వాళ్లు కనిపించడం లేదు. నా దగ్గరకు క్లాత్ తెచ్చి కుట్టించుకునే వాళ్లకు నేనెలా కుడతానో చెప్పేది నా డ్రస్సే. నేను రెడీమేడ్ డ్రస్ వేసుకుని టేప్ మెడలో వేసుకుని కొలతలు తీసుకుంటుంటే, కొలతలిచ్చే వాళ్లకు నా పని మీద నమ్మకం కలగదు. ఇతర కంపెనీలను ప్రమోట్ చేయడం కాదు, నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకోవాలి. నేను శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తే నా దగ్గర కుట్టించుకోవడానికి వస్తారు. ఇది వృత్తి సూత్రం – వాకా మంజులారెడ్డి -
సిటీ సూపర్ మార్కెట్ అబిడ్స్ షాప్
సాక్షి, సిటీబ్యూరో : నేడు మనం చూస్తున్న సూపర్ మార్కెట్లకు నగరంలో 125 ఏళ్ల క్రితమే పునాది పడింది. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన భాగ్యనగరం... ఆనాడే అన్ని వస్తువులకు కేంద్రంగా నిలిచింది. సూది నుంచి వాకీటాకీ వరకు ఇక్కడ లభించేవి. ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్ అబిడ్స్ 1893 ఫిబ్రవరి 20న ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో దీనిని నెలకొల్పాడు. అల్బర్ట్ అబిడ్స్ 1848 జులై 23న ఆర్మేనియాలో జన్మించాడు. వృత్తిరీత్యా వజ్రాల వ్యాపారి అయిన అల్బర్ట్... ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు విదేశీ దుస్తులు, ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో నిజాం రాజుకు స్టైలిస్ట్‌గా మారాడు. ఇక్కడి ప్రజల జీవనశైలిపై అధ్యయనం చేశాడు. దీంతో నగరంలో దేశవిదేశీ వస్తువులతో షాప్ నెలకొల్పేందుకు నిజాం అనుమతి తీసుకున్నాడు. అప్పటికి నగరం నడుమ జనరల్ పోస్టాఫీస్ ప్రాంతంలో ముస్తఫా బజార్ కొనసాగుతుంది. అక్కడే ‘అల్బర్ట్ అబిడ్స్ అండ్ కో’ పేరుతో షాప్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు నగరంలో ఆభరణాలు, గడియారాలు, మోటార్‌సైకిళ్లు, స్టేషనరీకి సంబంధించి వేర్వేరు షాపులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చిందీ షాప్. లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, జ్యువెలరీ, స్టేషనరీ... ఇలా అన్ని రకాల దేశవిదేశీ వస్తువులు ఇందులో లభించేవి. ఇప్పుడున్న సూపర్ మార్కెట్లలో మాదిరి ఒక్క పండ్లు, కూరగాయలు మినహా అన్ని ఉండేవి. ఈ షాప్ ఏర్పాటుతోనే ఆ ప్రాంతానికి అబిడ్స్ అనే పేరొచ్చింది. 1942 వరకు కొనసాగింపు... 1911లో మహబూబ్ అలీఖాన్ మరణించాడు. దీంతో ఆవేదనకు గురైన అల్బర్ట్ షాప్‌ను విక్రయించి స్వదేశానికి వెళ్లిపోయాడు. 1914లో ‘స్టేట్ టాకీస్’ రూ.5లక్షలకు ఈ వ్యాపార సముదాయాన్ని కొనుగోలు చేసింది. స్టేట్ టాకీస్ రెండేళ్లు కొనసాగించిన అనంతరం... ఇందుభాయ్ పటేల్ రూ.7 లక్షలకు దీనిని తీసుకున్నారు. 1942 వరకు ఈ షాప్‌ను నడిపించారు. వ్యాపార సముదాయ నిర్మాణం... 1942 తర్వాత ఇందుభాయ్ పటేల్ దీనిని ప్యాలెస్ టాకీస్‌గా మార్చారు. 1974 వరకు ఇది కొనసాగింది. అనంతరం అదే స్థలంలో కొత్తగా రెండు మినీ ప్యాలెస్‌లు నిర్మించి సినిమా హాళ్లను ఏర్పాటు చేశారు. 1996 వరకు ఇవి కొనసాగాయి. తర్వాత వీటిని కూలగొట్టి 2001లో వ్యాపార సముదాయం నిర్మించారు. ఇక్కడే బిగ్ బజార్, ఇతర షాపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇందుభాయ్ కుమారుల అధీనంలో ఉంది. -
మంచు బిందువులు
అనగనగా ఒక ఊరిలో ‘గుగుడ్సె’ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని జేబులో ఏడు రూపాయి బిళ్లలున్నాయి. వాటిని లెక్కపెట్టాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఏడు రూపాయలే వస్తున్నాయి. మూడు రోజుల తరువాత లెక్కపెట్టాడు. కానీ జేబులో డబ్బులు ఏమాత్రం పెరగలేదు. వాళ్ల ఊరిలో ఓ రోజు ‘బహుమతుల పండుగ’ వచ్చింది. ఆ రోజు ఒకరికి మరొకరు ప్రేమతో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.వాళ్ల అమ్మకి, గుగుడ్సె కారు బహుమతిగా ఇద్దామనుకున్నాడు.దుకాణంలోని కారు చాలా చిన్నగా ఉంది.దాంట్లో గుగుడ్సెనే సరిపోడు, ఇక వాళ్లమ్మ ఏం సరిపోతుంది?నాలుగు రూపాయలు ఇచ్చి ‘అందమైన గుండీ’ కొన్నాడు. ఆ గుండీ కోసం నీలం గౌను కొందామనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ దుకాణంలో నీలం గౌను లేదు.ఇంకో దుకాణంలో మంచి చెప్పులు చూశాడు.వాటి ధర ఎంతో అడుగుదామనుకున్నాడు.కానీ వాళ్ల అమ్మ పాదం కొలత గుగుడ్సెకు తెలియదు. ఇంటికి వెళ్లాడు. రాత్రి అయ్యేవరకు ఎదురుచూశాడు. వాళ్ల అమ్మకు అద్భుతమైన జానపద కథ చెప్పాడు. ఆమె నిద్రలోకి జారుకుంది. మెల్లగా ఓ దారంతో వాళ్ల అమ్మ పాదాన్ని కొలిచాడు. ఆ దారాన్ని దిండు కింద దాచిపెట్టి నిద్రపోయాడు. తర్వాతి రోజు దుకాణానికి వెళ్లేడు. అక్కడ ఉన్న చెప్పులన్నింటిని దారంతో కొలిచాడు. వాటిలో మంచి చెప్పుల జతను ఎంచుకున్నాడు. దానిపై ధర చూశాడు. చాలా ఎక్కువగా ఉంది. కానీ జేబులో మూడు రూపాయలే ఉన్నాయి. ఇంటిదారి పట్టాడు. వెళ్లేదారిలో ఉన్న కొండపైన కొన్ని మంచుబిందువులను ఏరుకున్నాడు. ఆ మంచుబిందువులను తీసుకుని దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో మూడు రూపాయలు, మంచుబిందువులు ఇచ్చాడు. దుకాణంలో ఉన్న అమ్మాయి ఇది చూసి ఆశ్చర్యపోయింది.ఆ సంవత్సరంలో అవి తొలి మంచు బిందువులు. ప్రజలంతా గుగుడ్సెని పొగిడారు, కానీ గుగుడ్సె వాళ్ల అమ్మకు బహుమతి కొనలేకపోయాడు. ‘ఫర్లేదు. రేపు ఇంకొన్ని మంచు బిందువులను ఏరుకొస్తాను’ అనుకున్నాడు పిల్లవాడు.ఆ రోజు రాత్రి మంచువర్షం కురిసింది.ఆ ప్రాంతమంతా మంచుబిందువులతో నిండిపోయింది. కిటికీని ఆనుకుని గాఢనిద్రలో ఉన్న పిల్లవాడిని వాళ్ల అమ్మ నిద్రలేపింది. అతని చేతిలోని మూడు రూపాయల బిళ్లలు, అందమైన గుండీ జారి కిందపడ్డాయి.ఆ అందమైన గుండీ, వాళ్ల అమ్మకు ఇదివరకే ఉన్న పెళ్లిగౌనుకు చక్కగా సరిపోయింది. -
పేదోడిపై ప్రతాపం
పేదోడి బతుకుపై ‘పచ్చ’ భూతాలు పడ్డాయి. జీవీఎంసీ యంత్రాంగం ద్వారా ఆ బడుగు కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. తమకు వ్యతిరేకంగా ఓ వేదికపై మాట్లాడడన్న ఆక్రోశంతో బతుకుదెరువుగా ఉన్న ఆ నిరుపేదకు ఆసరా లేకుండా చేశాయి. అధికారం ఉందన్న అహంకారానికి.. ప్రజలు మరో పార్టీని అభిమానించకూడదన్న దుర్బిద్ధికి.. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు నిదర్శనంగా.. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ‘ఆంజనేయస్వామి’ సాక్షిగా ఈ ఘటన సోమవారం జరిగింది. పెందుర్తి: వేపగుంటలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు ఆవాల గొల్లయ్య దుకాణాన్ని టీడీపీ నాయకులు కూలగొట్టించారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పోరాటంలో భాగంగా ఆదివారం సాయంత్రం వేపగుంట కూడలి వద్ద జరిగిన సభలో ప్రజల తరపున ప్రసంగించడమే గొల్లయ్య చేసిన పాపం. దీంతో గొల్లయ్యపై స్థానిక టీడీపీ నాయకులు ఆక్రోశం పెంచుకుని తెల్లారే సరికే అతడి బతుకుదెరువుగా ఉన్న పూజాసామగ్రి దుకాణాన్ని జీవీఎంసీ అధికారులను ఉసిగొల్పి నేలమట్టం చేయించారు. అంతా అయిపోయాక తీరిగ్గా వచ్చిన జోనల్ కమిషనర్ తమ సిబ్బందిది తొందరపాటు చర్యే అని వ్యాఖ్యానించడం ఈ ఘటనపై టీడీపీ నాయకుల ప్రభావం ఎంత ఉందో తేటతెల్లం అయ్యింది. ఈ ఘటన వెనుక స్థానిక టీడీపీ నాయకులు ప్రత్యక్షంగా, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అతని కుమారుడు పరోక్షంగా ఉన్నట్లు వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు ఆరోపించారు. దగ్గరుండి కూల్చేశారు.. పంచగ్రామాల భూ సమస్యపై పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గొల్లయ్య మాట్లాడుతూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యలు చాలా కాలంగా తాను చూస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు దాన్ని పరిష్కరించాలని కోరాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన స్థానిక టీడీపీ నాయకులు గొల్లయ్యను దెబ్బకొట్టాలని కుట్ర పన్ని రాత్రికిరాత్రే స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద(జోనల్ కార్యాలయం ఎదురుగా) ఉన్న గొల్లయ్య పూజాసామగ్రి దుకాణాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయాన్నే జీవీఎంసీ సిబ్బందిని పంపి క్షణాల్లో దుకాణాన్ని నేలమట్టం చేయించారు. దుకాణంలోని సామగ్రిని తీసుకుంటామని గొల్లయ్య కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. కూలగొట్టిన దుకాణంలోనే ఆంజనేయస్వామి ఆలయ విద్యుత్ మీటర్, ఇతర సామగ్రి ఉండడం గమనార్హం. జీవీఎంసీ అధి కారుల దుందుడుకు చర్య వల్ల సోమవారం రాత్రి ఆలయంలో చీకట్లు అలముకున్నాయి. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీప్‌రాజ్ నిరసన: విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీసీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ నాయకులు, గంగిరెడ్లకాలనీ(ఆంజనేయులునగర్) వాసులు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొల్లయ్యకు మద్దతుగా నిలిచి జోనల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళితే ఇలా దిగజారుడు పనులు చేయడం టీడీపీకి మాత్రమే చెల్లిందని మండిపడ్డారు. 30 ఏళ్లుగా ఇక్కడ ఉన్న గొల్లయ్య దుకాణాన్ని నోటీసులు ఇవ్వకుండా, కనీసం మౌఖిక సమాచారం లేకుండా కూల్చివేసే హక్కు జీవీఎంసీ అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు తీసేస్తున్నామని చెబుతున్న అధికారులు టీడీపీ నాయకుల అజమాయిషీలో ఉన్న దుకాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు వచ్చి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ సిబ్బందిది తొందరపాటు చర్యే అంటూ అదీప్‌రాజ్‌కు సర్దిచెబుతున్న జోనల్ కమిషనర్ శివాజీ మా సిబ్బందిది తొందరపాటు చర్యే.. జెడ్పీ శివాజి జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అదీప్‌రాజ్, బాధితులతో జెడ్సీ శివాజీ, పెందుర్తి సీఐ మురళి చర్చించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణాలను తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, అయితే దుకాణదారులకు సమయం ఇవ్వకుండా కూల్చివేయడం తమ సిబ్బంది తొందరపాటు చర్యే అని జెడ్సీ వివరించారు. దుకాణంలో ఉన్న సామగ్రిని తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం లోపు గొల్లయ్యకు న్యాయం జరగకపోతే తాము మళ్లీ ఆందోళనకు దిగుతామని అదీప్‌రాజ్ స్పష్టం చేసి ధర్నా విరమించారు. రామరాజే దగ్గరుండి కూలగొట్టించాడు మాది నిరుపేద కుటుంబం. గత 30 ఏళ్లుగా ఈ ఆంజనేయస్వామిని నమ్ముకుని చిన్న దుకాణంలో పూజాసామగ్రి, ఇతర వస్తువులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. పంచగ్రామాల ప్రజల సమస్యపై మా పార్టీ నేత అదీప్‌రాజ్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని వేదికపై ప్రసంగించాను. అంతే తెల్లారేసరికి టీడీపీ నాయకులు మా పొట్ట కొట్టేశారు. స్థానిక నాయకుడు బుజ్జి(రామరాజు) దగ్గరుండి నా దుకాణాన్ని కూలదోయించాడు. జీవీఎంసీ అధికారులు న్యాయం చేయాలి.–ఆవాల గొల్లయ్య బాధితుడు -
బోరబండలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం
-
పచ్చని పల్లెలో మద్యం మంటలు
మద్యం షాపు వద్దంటూ ఆందోళన షాఫు ధ్వంసం, షాపు యజమాని దాడి వైఎస్సార్ సీపీ నేత చిట్టిబాబు సహ పలువురికి గాయాలు రాస్తారోకోలు, ధర్నాలతో తీవ్ర ఉద్రిక్తత ముమ్మిడివరం : మండలంలోని అయినాపురంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆదివారం మద్యం షాపును అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తులపై షాపు యజమాని అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీసీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుతో పాటు పలువురికి బలమైన గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు కోపోద్రిక్తులై మద్యం షాపుపై దాడి చేశారు. గ్రామస్తులపై అనుచరుడితో కలిసి షాపు యజమాని దాడి చేయగా, పోలీసు స్టేషన్లో వారితో టీడీపీ నాయకులు ఉండడం సమస్య మరింత తీవ్రమైంది. షాపు వద్దని పంచాయతీ తీర్మానం చేసినా... జూలై 29న గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని కోరుతూ అయినాపురం çపంచాయతీలో తీర్మానం చేసి ఎక్సైజ్ జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆదివారం షాపు యజమాని అయినాపురంలో షాపును ప్రారంభించారు. దీంతో సర్పంచ్ మట్టపర్తి సత్యకుమారి, మాజీ సర్పంచ్ పెయ్యల భూలక్ష్మి, వందలాది మంది మహిళలు, గ్రామస్తులు మద్యం షాపు వద్ద ఆందోళనకు దిగారు. మూసివేతకు యత్నం... షాపును మూసి వేయడానికి ప్రయత్నించిన మహిళలపై షాపు యజమాని మట్టా సూరిబాబు(పండు), అనుచరుడు వెల్లిగట్ల సుధీర్ ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుకు, కాట్రు శ్రీనివాసరావుకు తలపై బలమైన గాయాలయ్యాయి. పంతగడ సత్యనారాయణకు చేతులపై గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు షాపు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. షాపు మూసి వేసి దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ముమ్మిడివరం పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ హైవేపై రాస్తారోకో చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆందోళన విరమించాలని సీఐ కేటీవీవీ రమణారావు వారిని కోరారు. నిందితులను అరెస్ట్ చేసేవరకు ఆందోళన విరమించమంటూ వాహనాలు అడ్డుకున్నారు. గంటలోగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాడి చేసిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుస్టేషన్లో నిందితులతో టీడీపీ నేతలు.. విషయం తెలుసుకున్న దళిత నాయకులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకునేసరికి.. స్టేషన్లో నిందితులతోపాటు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు స్టేషన్లో ఉండడంతో అభ్యం తరం తెలిపారు. నిందితులకు స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారని, టీడీపీ నేతలకు ఇక్కడ పనేంటంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒక దశలో వారు స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరికి టీటీపీ వారిని పోలీసులు బయటకు పంపడంతో ఆందోళన విరమించారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయం వద్ద... అనంతరం వారు ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినాపురంలో మద్యం షాపు లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వద్ద లంచాలు తీసుకుని బెల్టు షాపులకు అనుమతులిస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎక్సైజ్ ఎస్సై స్వామిరెడ్డి వారిని బుజ్జగించినా వారు శాంతించలేదు. సీఐ రావాలని షాపు లైసెన్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై స్వామిరెడ్డి సెల్లో సీఐతో వైఎస్సార్ సీపీ నేత చిట్టిబాబుతో మాట్లాడించారు. గ్రామస్తుల అ«భ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి షాపు మూసి వేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. షాపుపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు షాపు యజమాని సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది గ్రామస్తులపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకా రామారావు, కాట్రు అప్పారావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, అమరా శ్రీను, మట్టా చిరంజీవి, జొన్నాడ నాగేశ్వరరావు, ఏఎస్వీ సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు కాశి బాలమునికుమారి, జనిపెల్ల బాలశ్రీనివాసరావు, కుడిపూడి శ్రీనివాసరావు, దళిత నాయకులు పామురాజేంద్రప్రసాద్, చీకురుమిల్లి శ్రీనివాసరావు, దేవరపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
38 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం : స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఒక షాపులో అక్రమంగా నిల్వచేసిన 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ ఎం.కేశవరావు తమ సిబ్బందితో దాడిచేసి బుధవారం పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సివిల్ సప్లయిస్ డీటీ డి.వి.సత్యనారాయణ, వీఆర్వోలు రవి, గఫూర్ , ఎస్కే వలి, కె.రవి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు డీటీ సత్యనారాయణ వెల్లడించారు. -
284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అమలాపురం : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 284 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. డిమాండ్‌ను బట్టి అవసరమైతే ప్రజాప్రతిని««దlుల సూచనల మేరకు కేంద్రాల సంఖ్య పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్లోని తహసీల్దార్లతో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్డీవో జి.గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ నీటి తీరువా వసూలు, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, రుణ అర్హత కార్డులు, పౌ ర సరఫరా, ఈ–పాస్ పుస్తకాలు తది తర అంశాలపై సమీక్షించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి కేంద్రాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యానికి పెంచిన కనీస మద్దతు ధరపైన... ధాన్యం కొనగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది వంటి వివారాలపై గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని తహసీల్దార్లకు సూచించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పారామీటర్ల ప్రకారం జిల్లా రెవెన్యూ శాఖ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఈ సమయంలోనే అంకిత భావంతో పనిచేస్తే ప్రథమ స్థానానికి వెళ్తామన్నారు. నీటి తీరువా పన్ను వసూళ్లలో కూడా రెండో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్ 15 నాటికి నీటి తీరువా నూరు శాతం వసూలు చేయాలని జేసీ ఆదేశించారు. రుణ అర్హత కార్డులపై జిల్లాలో ఇప్పటి వరకూ రూ.97 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఈ విషయంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రెవెన్యూ సేవల పరంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలోనూ... కొన్ని అంశాల్లో ప్రథమ స్థానంలోనూ ఉన్నందుకు ఆర్డీవో గణేష్‌కుమార్, తహసీల్దార్లను జేసీ సత్యనారాయణ అభినందించారు. -
అలుపెరుగని ఉద్యోగి!
న్యూయార్క్: అమెరికాలోని ఓ కిరాణ కొట్టులో పిల్లి తొమ్మిదేళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తోంది. ఇది నిజం. న్యూయార్క్‌లో చైనాటౌన్‌లోని స్టోర్‌లో ఉద్యోగి ఒకరు తొమ్మిదేళ్ల క్రితం బోబో అనే పిల్లి కూనను తీసుకొచ్చారు. అప్పటినుంచి దాని యోగక్షేమాలను కస్టమర్ అయిన ఓ న్యాయవాది, ఉద్యోగి ఆనీసహా స్టోర్ సిబ్బంది చూస్తున్నారు. స్టోర్ ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని వచ్చిపోయే కస్టమర్లను పలకరిస్తుంది. ఎవరూ దొంగతనాలకు పాల్పడకుండా గస్తీ కాస్తుంది. సరుకు నిల్వలను పరిశీలిస్తుంది. బోబో చేష్టలు, పనులతో కూడిన ఓ ఇన్స్టాగ్రామ్ పేజీని త్వరలో తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆనీ చెప్పింది. -
రూ.1.20 కోట్లకు వస్త్రవ్యాపారి ఐపీ
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో నివాసముంటున్న వస్త్రవ్యాపారి రూ.1.20 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు అతను రెండు రోజుల క్రితం ప్రముఖ న్యాయవాది ద్వారా కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 100 మందికి పైగా బాకీ ఉన్నట్లు అతను పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. వ్యాపారి గత కొన్నేళ్ల నుంచి శ్రీరాములపేటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అతను దుకాణం తెరవకపోవడంతో రుణ దాతలు ఆందోళన చెందసాగారు. ఈ క్రమంలోనే కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. -
తినుబండారాల దుకాణాలపై దాడులు
భువనగిరి భువనగిరి బస్టాండ్‌లోని దుకాణాలల్లో అనధికారికంగా అమ్ముతున్నతినుబండారాలను అర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎం కిషన్‌రావు అధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. బస్టాండ్ ఆవరణలో ఉన్న 8 దుకాణాల్లో అగ్రిమెంట్లో ఉన్న తినుబండారాలను కాకుండా ఇతర వస్తువులు అమ్ముతున్న విషయాన్ని గుర్తించారు. ఆయా దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. మరో సారి ఇలా అక్రమంగా అమ్మితే నిబంధనల ప్రకారం లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా బస్టాండ్‌లో హాకర్లను అమ్మకుండా చూడాలని స్టేషన్ మేనేజర్‌కు డీఎం చార్జిషీట్ ఇచ్చారు. కాగా తామే కాదు బస్టాండ్ వ్యాపార సముదాయాలన్నింటిలో అగ్రిమెంట్లో ఉన్న విధంగా కాకుండా ఇతర వ్యాపారాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యాపారం పేరుతో టెండర్ సంపాదించి వేరే వ్యాపారం చేస్తున్న వారందరిపైన చర్యలు తీసుకోవావాలని కోరుతున్నారు. -
దుకాణం నడుపుకోవాలంటే రూ.50 వేలు ఇవ్వాలి
నరసరావుపేట టౌన్ (గుంటూరు): ‘‘రూ.50 వేలు ఇస్తేనే దుకాణం పెట్టుకో.. లేకుంటే ఆ స్థలంలో పార్టీ కార్యాలయం పెడతాను. అప్పుడు నువ్వు చేయగలిగిందేమీ లేదు.. ఏ అధికారి కూడా నా వైపు కన్నెత్తి చూడలేడు. నాకు అధికారపార్టీ అండ ఉంది. ఎన్నికల్లో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆ లోటు పూడ్చుకోవాలిగా..’’ అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్త ఓ దివ్యాంగురాలిని వేధిస్తున్న తీరిది.. నరసరావు పేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వెనుకభాగంలో భగీరథ గంగాభవాని అమ్మవారి ఆలయం ఉంది. ఆలయంలో దూపదీపనైవేద్యాలు చేసుకుంటూ దివ్యాంగురాలైన నంద్యాల నాగసుబ్బమ్మ కుటుంబం ఆలయం పక్కన నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆలయం ద్వారా వస్తున్న ఆదాయంతో ఇల్లు గడవక పోవడంతో ఇంటి పక్కన సులభ్æ కాంప్లెక్స్, ఈ రెండింటి మధ్య టైలరింగ్ దుకాణం ఏర్పాటుచేసుకొని నాగసుబ్బమ్మ కుటుంబాన్ని సాకుతోంది. ఆ వార్డు మహిళా కౌన్సిలర్ భర్త కె సంజీవరావు ఆమె వద్దకు వెళ్ళి అక్కడ దుకాణం నిర్వహించుకోవాలంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత ఇవ్వకుంటే ఆ స్థలం ఖాళీ చేయించి అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె వినకపోవడంతో బుధవారం మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణ పేరుతో తొలగించే దుకాణాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. బాధితురాలు అ«ధికారుల చర్యను వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వచ్చిన సిబ్బంది వెను తిరిగారు. అయితే కౌన్సిలర్, ఆమె భర్త మాత్రం ఎలాగైనా నాగసుబ్బమ్మ ఉంటున్న స్థలాన్ని కబ్జా చేయాలని మరింత పట్టుదలగా తమ∙ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇంటిని, దుకాణాన్ని నేలమట్టం చేయాలని కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. పదహారేళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా.. – నంద్యాల నాగసుబ్బమ్మ, బాధితురాలు ఆలయాన్ని నమ్ముకొని మూడు తరాల నుంచి మా కుటుంబం జీవిస్తోంది. భక్తుల ద్వారా వచ్చే కానుకలు ఆలయ నిర్వహణకే సరిపోకపోవడంతో టైలరింగ్ వత్తితో జీవనం కొనసాగిస్తున్నా. గత కొన్నిరోజులుగా కౌన్సిలర్ భర్త సంజీవరావు తనకు రూ.50వేలు ఇస్తేనే దుకాణం నిర్వహించుకోవాలని, లేకుంటే అక్కడ టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరిస్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంటి, కరెంటు పన్నులు చెల్లిస్తున్నా. కేవలం కౌన్సిలర్ ఒత్తిడితో స్థలం ఖాళీ చేయాలని అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. విషయాన్ని వికలాంగుల సంఘం రాష్ట్ర ప్రతినిధుల దష్టికి తీసుకువెళ్ళా. వారి ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నా. చర్యలు తీసుకోవాలి: ఎంఐఎం పార్టీ నేతల డిమాండ్ దివ్యాంగురాలి స్థలంపై కన్నేసిన కౌన్సిలర్, ఆమె భర్త, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ఉపాధ్యక్షుడు మస్తాన్ వలి, పట్టణాధ్యక్షుడు మౌలాలి డిమాండ్ చేశారు. నాగసుబ్బమ్మను గురువారం వారు పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. ౖటైలరింగ్ దుకాణం నడుపుకుంటూ పొట్ట పోసుకుంటున్న దివ్యాంగురాలి పొట్ట కొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలున్నా వాటి జోలికి వెళ్ళకుండా కేవలం నాగసుబ్బమ్మ స్థలాన్ని కాజేయాలన్న దురుద్దేశ్యంతో కౌన్సిలర్ భర్త చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సహకరించడం సరికాదన్నారు. ఎవ్వరికీ అభ్యంతరం లేని ప్రదేశంలో ఆమె దుకాణం పెట్టుకొని జీవిస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు పద్ధతి మార్చుకోకుంటే నాగసుబ్బమ్మ చేసే న్యాయపోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాపు దగ్ధం
సూర్యాపేట మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్‌తో ఓ మోబైల్ షాపు దగ్ధమైన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పూలసెంటర్లో గల గౌస్ మోబైల్స్ దుకాణాన్ని శనివారం రాత్రి రోజుమాదిరిగానే బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూటై దుకాణం నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన చుట్టుపక్కల వారు దుకాణ యజమానికి సమాచారం అందించారు. యజమాని వెంటనే లబోదిబోమంటూ దుకాణం వద్దకు చేరుకునే సరికి రూ. 20 లక్షల ఆస్తి బుగ్గిపాలైపోయింది. దుకాణంలో ఉన్న విలువైన మోబైల్స్, ఇతర సామగ్రి పూర్తి కాలిబూడిదైపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వై.మొగలయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు గౌస్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
కాఫీ విత్ ఫీలింగ్
పెదగంట్యాడ: ఒకప్పటి ప్రేమ వ్యక్తం చెయ్యడానికి పావురాలు, శునకాలు, ఇతరత్రా ప్రాణులు పనికొచ్చేవి( అవి రాజుల కాలం), 1980లో లెటర్లు, తర్వాత గ్రీటింగ్ కార్డులు, తర్వాత గిఫ్ట్‌లు పుట్టుకొచ్చాయి. ఎప్పుడైనా ఒక కొత్త పద్ధతి పుట్టిందంటే కొద్ది రోజులకే అది పాతబడుతుంది. ఇప్పుడున్న నెట్ లోకంలో ప్రేమ వ్యక్తీకరణ చాలా ఈజీ అయిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్‌లో చెప్పేసుకుంటున్నారు. ట్రెండ్ ఎప్పుడూ కొత్తగానే ఉండాలి. అలా పుట్టుకొచ్చిన కొత్త వేదిక కాఫీ షాప్.... ఇప్పుడు ప్రేమను వ్యక్తం చేయడానికి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి దేనికైనా ఒక్క కాఫీ సరిపోతుంది. ఎందుకంటే మన మనసులోని ఫీలింగ్స్‌ను కాఫీషాప్‌లో డిజైనర్‌కు చెబితే ఫోమ్‌తో అందంగా బొమ్మవేసి కాఫీ పంపిస్తాడు. ఈ ట్రెండ్ విదేశాల్లో ఉన్నా విశాఖలో కొత్తదే. ఎక్కువ మంది యూత్ ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. కాలేజ్ జంటలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కాఫీ అంటే పడిపోతారు. అందుకే కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ అంత పాపులర్ అయిపోయింది. ఇక కాఫీ ఫోమ్‌తో చేసే మ్యాజిక్ గురించి చెప్పాలంటే ముందుగా కాఫీపై తయారు చేసిన డిజైన్స్ గురించి తెలియాలి. అందులో అంత స్పెషల్ ఏమీ ఉండదు. చిక్కగా ఉన్న పాలను కాఫీలో సున్నితంగా వేసి కలపడం ద్వారా సష్టించే డిజైన్లే స్పెషాలిటీ చిక్కగా ఉన్న బ్లాక్ కాఫీలో వైట్ మిల్క్‌ను మెల్లగా వేసి పైన కొంచెం మిల్క్ ఫోమ్‌తో డిజైన్ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉండకపోయినా కాఫీ తయారు చేసే వ్యక్తి సజనాత్మకత ఆధారంగా కొత్త డిజైన్లు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మెనూ కార్డ్ సైతం మారిపోయింది. ఇంతకు ముందు క్యాపుచినో, ఎక్స్‌ప్రెస్సో, కోల్డ్ కాఫీ వంటివి ఉండేవి ప్రస్తుతం క్యాపిచినో ఆర్డర్ చెబితే మెనూ ఇచ్చి ఇందులో ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకోమనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాఫీ ధర మినిమం 80 రూపాయల నుంచి 250 రూపాయల వరకూ ఉంది. డిజైన్ కోసం ఏమీ చార్జ్ చెయ్యరు కాని మన భావాలు అవతలి వ్యక్తులతో షేర్ చేయాలంటే ఇప్పుడు కాఫీ ద్వారా సందేశం ఇస్తున్నారు. కాఫీషాప్‌లో కాఫీకి మన ఇంట్లో కాఫీకి తేడా ఎక్కడ వస్తుందంటే మనం పొడిని వాడతాం. వాళ్లు గింజల్ని బ్లెండ్ చేసి కాఫీలో కలుపుతారు. ఎక్కువగా బెంగళూరులో పండే అరబికా అనే గింజలే టేస్ట్‌కు ప్రత్యేక కారణం. ఏది ఏమైనా కాఫీలో వస్తున్న మార్పులు మరి కొన్ని రోజులు అయితే ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అందుకే ముందుగా ఆలోచించడం మానేసి కాఫీ తాగండి డిజైన్ ప్రాక్టీస్ చెయ్యాలంటే ముందుగా మిల్క్ ఫోమ్‌ను సిద్ధం చేసుకోండి. -
షాపులో రూ.15 లక్షల చోరీ
గుంటూరు ఈస్ట్ : షాపు తాళాలు పగులకొట్టి రూ.15 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి పల్లవి థియేటర్ సమీపంలోని సాంబశివపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి కథనం మేరకు....సాంబశివ ఇంజినీరింగ్ వర్క్‌షాపు యజమాని పామర్తి సాంబశివరావు గురువారం రాత్రి షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం షాపునకు వచ్చి చూసేటప్పటికి షాపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. షాపులో పరిశీలించగా కౌంటర్ తాళాలు పగులకొట్టి అందులోని రూ. 15 లక్షలు చోరీకి గురయినట్లు గుర్తించాడు. దీంతో సాంబశివరావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ తిరుపాల్, డీఎస్పీ సంతోష్ కుమార్, ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి, క్లూస్ టీమ్ షాపును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి గస్తీలో ఉన్న సీసీఎస్ సీఐ తన విధులు సక్రమంగా నిర్వహింలేదన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సీఐని అతని జీపు డ్రై వర్ను విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ జిన్నాటవర్ సెంటర్లోని ఓ ఏటీఎమ్‌లో రాత్రి నిద్రించినట్లు సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిసింది.