Hyderabad: Robbery At Jewelry Shop In Chanda Nagar - Sakshi
Sakshi News home page

చందానగర్‌ నగల దుకాణంలో భారీ చోరీ.. గోడకు కన్నం వేసి..

Published Tue, Aug 1 2023 3:45 PM | Last Updated on Tue, Aug 1 2023 4:37 PM

Robbery At Jewelery Shop In Chandanagar - Sakshi

హైదరాబాద్‌: చందానగర్‌లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 

నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు.      

ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి


   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement