గవర్నర్ తీరు బాధాకరం: కవిత | MLC Kavitha Says Governor Actions Are Sad Over Rejecting The Proposal Of MLCs Sent By Govt - Sakshi
Sakshi News home page

MLC Kavitha: గవర్నర్ తీరు బాధాకరం

Published Tue, Sep 26 2023 11:22 AM | Last Updated on Tue, Sep 26 2023 4:32 PM

MLC Kavitha Says Governor Actions Are Sad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం పంపించిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందని అన్నారు. బడుగు బలహీనర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ఆపటం ఎందుకని ప్రశ్నించారు.  ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు.

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో నివాళులు అర్పించిన కవిత అనంతరం మాట్లాడుతూ.. 'గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్‌ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజ్యాంగ బద్దంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు సరికాదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం దేశంలో అమలు అవుతుంది.' అని అన్నారు. 

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ ప్రకాశ్.. తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమె పేరును స్మరిస్తూ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. 

ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement