sravan
-
చంద్రబాబూ.. మీ పాలనలో ఇంకెంతమంది బలి కావాలి?: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: గత నాలుగు నెలల నుంచి ఏపీలో అత్యంత భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయంటూ కూటమి ప్రభుత్వంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని ధ్వజమెత్తారు.‘‘కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కూడా అమ్మాయిలను టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నట్లున్నారు. మొన్న తిరువూరు, సత్యవేడు ఘటనలు చూస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. పరిపాలన ఎలా చేయాలో కాకుండా ఆడవాళ్లకు ఎలా మెసేజ్‌లు పెట్టాలి, ఆడవాళ్లను ఎలా రూములకు పిలిపించుకోవాలని అనే అంశాల్లో బాగా బిజీగా ఉన్నట్లున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడితే.. దగ్గరుండి రాజీ చేయించారు. మీ రాజ్యంలో అత్యాచారం చేస్తే అడిగేవాడే లేదు.. మర్డర్ చేస్తే మాట్లాడేవాడు లేడు. చంద్రన్నరాజ్యం అని చెప్పుకుంటూ సీఎం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు’’ అంటూ శ్రవణ్ నిప్పులు చెరిగారు.‘‘జనసేన కార్యకర్తలు, నాయకులు దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రండి. ఈ రాష్ట్రంలో మహిళలపై మీ నాయకుడు అప్పుడేం మాట్లాడాడో.. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం గడ్డిపీకుతున్నాడో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చిద్దాం రండి. అధికారంలో లేనప్పుడు.. ఉప ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీ సచ్ఛీలత ఏంటో ప్రజల ముందు నిరూపిద్దాం. కుప్పం నియోకవర్గంలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఉమెన్ మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అన్ని కేసులు నమోదైతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా?. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ లేదు.. ఉద్యోగాలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా అని సందేహం కలుగుతోంది’’ అంటూ శ్రవణ్ దుయ్యబట్టారు. -
కళ్లెదుటే తండ్రిని చంపడంతో.. కొడుకు అతడిని వెంబడించి మరీ..
సాక్షి, ఆదిలాబాద్: పాత కక్షలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పట్టణంలోని బెస్తవాడకు చెందిన బామ్మె శ్రీను(30), గుబుడె శ్రావణ్(45) హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవాడకు చెందిన బామ్నె శ్రీను కూలీ పని చేసుకుని జీవిస్తుండగా, అదే కాలనీకి చెందిన గుబుడె శ్రావణ్ చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాలనీలో ఇద్దరి నివాసాలు దగ్గరదగ్గరే ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి తాగిన మైకంలో బామ్నె శ్రీను గొడ్డలితో గుబుడె శ్రావణ్ మెడపై దాడి చేశాడు. రక్తం మడుగులో కింద పడిపోయిన శ్రావణ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన గొడ్డలి అక్కడే పడేసిన శ్రీను లొంగిపోయేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు. ఇది గమనించిన శ్రావణ్ కుమారుడు అనిల్ అక్కడి నుంచి శ్రీనును వెంబడించాడు. పట్టణంలోని గణేశ్ మందిర్ సమీపంలో రోడ్డుపై అదే గొడ్డలితో శ్రీను మెడపై నరకడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు హత్యల విషయం పట్టణంలో సంచలనం రేపింది. సమాచారం అందుకున్న ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలు తెలుసుకున్నారు. పాత కక్షలతోనే హత్యలు జరిగినట్లు భావిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మృతుడు శ్రీనుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా, శ్రావణ్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇవి చదవండి: పాత కక్షలతో వ్యక్తిని విచక్షణారహితంగా పొడిచి.. -
గవర్నర్ తీరు బాధాకరం: కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పంపించిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందని అన్నారు. బడుగు బలహీనర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ఆపటం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. #WATCH | BRS MLC K Kavitha says, "Rejecting the 2 names proposed by BRS for the MLC seats is nothing but a clear violation of the federal spirit of the nation. This nation is a federal nation and it works on federal traditions that were established a long time back and that kind… pic.twitter.com/GrwjdeX42J — ANI (@ANI) September 26, 2023 చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో నివాళులు అర్పించిన కవిత అనంతరం మాట్లాడుతూ.. 'గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజ్యాంగ బద్దంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు సరికాదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం దేశంలో అమలు అవుతుంది.' అని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ ప్రకాశ్.. తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమె పేరును స్మరిస్తూ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై -
ప్రేమ పేరుతో గర్భవతిని చేసి.. చెకప్ పేరుతో అబార్షన్
సాక్షి, హైదరాబాద్: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలంలోని ఖుదాబక్షుపల్లికి చెందిన బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన తిరుసంగి శ్రవణ్ గర్భవతిని చేశాడు. ఐదు రోజుల క్రితం బాలికను చెకప్ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన శ్రవణ్ తన తల్లి సహాయంతో అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలిక జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు అసలు విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి రంగమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. చదవండి: (వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానన్నాడు.. అయితే..) -
‘డిమాండ్‌కు తగ్గట్టు గ్యాస్ సిలిండర్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటంతో వంటగ్యాస్ వినియోగం పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రవణ్ ఎస్. రావు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభంలో సిలిండర్ బుకింగ్ బాగా పెరిగిపోయినప్పటికీ.. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిమాండ్‌కు తగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సకాలంలో సిలిండర్లు అందించేందుకు ఇండియన్ పంపిణీదారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సరఫరా యంత్రాంగానికి అవగాహన కల్పిస్తూ, గ్యాస్ నింపే ప్రదేశాల్లోనూ యాజమాన్యం అన్నివిధాలా అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. (రైతులకు తీపికబురు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ట్రక్కుల పరిశుభ్రతపైనా శ్రద్ధ వహిహస్తున్నామని తెలిపారు. ఖాళీ సిలిండర్లతో వచ్చే వాహనాలు తిరిగి గ్యాస్ నింపిన సిలిండర్లు తీసుకెళ్లేదాకా అన్ని స్థాయిల్లోనూ అత్యంత అప్రమత్తత పాటిస్తుమన్నారు. జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తూ వాహనాల రాకపోకలు, సిలిండర్ల సరఫరా కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తోందన్నారు. సిలిండర్ల బిల్లు చెల్లింపు నిమిత్తం కరెన్సీ నోట్లకు బదులుగా సాధ్యమైనంత వరకూ డిజిటల్ పద్ధతిని ఉపయోగించే విధంగా ఐఓసీఎల్ ఖాతాదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్క ఉచిత సిలిండర్ అందజేయదానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 73000 ఇండియన్ సిలిండర్లను (14.2 కేజీలు), 468 మంది లబ్దిదార్లకు 5 కేజీల సిలిండర్లను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంచితంగా పంపిణీ చేసిందన్నారు. (ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ ) శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు వేలాది ప్రాణాలు బలికాగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలన్నీ మందగించాయి. ఈ భారీ ఆరోగ్య సంక్షోభంలో దేశమంతా దిగ్బంధమైన వేళ అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దేశానికి, ప్రజలకు మద్దతుగా ఐఓసీఎల్ సిబ్బంది శక్తివంచన లేకుండా తమవంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు.ఈ పరీక్షా సమయంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా క్రమం కుంటుపడకుండా పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలందించేందుకు ఐఓసీఎల్ సిబ్బంది పూర్తి వ్యక్తిగత రక్షణ సరంజామాతో విధులు నిర్వర్తిస్తున్నారు’’. (ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. ) ‘‘ప్రాంతీయ కార్యాలయాలు, పంపిణీదారు ప్రాంగణాల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశాము. వలస కార్మికుల వంటి అన్నార్తులకు ఆహారం, నీరు, పాలు తదితర నిత్యావసరాలను మానవతా దృష్టితో సరఫరా చేస్తున్నాము. వాహనాల డ్రైవర్లు సొంతంగా వంట చేసుకునేందుకు వీలుగా కూరగాయలు, కిరాణా సరకులు, వంటగ్యాస్ తదితరాలన్నీ ఉచితంగా అందిస్తున్నాము. అనూహ్య సంఘటనల్లో దురదృష్టవశాత్తూ సిబ్బందికి, కార్మికులకు ప్రాణనష్టం వాటిల్లితే రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు కంపెనీ చేసింది. వివిధ ప్రభుతరంగ సంస్థల తరహాలో ‘పీఎం కేర్స్’ సహాయ నిధిసహా ఇతర సహాయ నిధులకూ ఐఓసీఎల్ సంస్థతోపాటు ఉద్యోగులు, సిబ్బంది తమ జీతాల నుంచి విరాళమిచ్చారు’’. అని శ్రవణ్ తెలిపారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) -
ఇలా చితికి..
మిర్యాలగూడ: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. మారుతిరావు భార్య గిరిజ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఇంటి నుంచి మారుతిరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు షాబ్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మారుతిరావు చితికి ఆయన తమ్ముడు శ్రవణ్ నిప్పంటించారు. అమృతను అడ్డుకున్న బంధువులు.. ఇదిలా ఉండగా తన తండ్రిని కడసారి చూడటానికి అమృత పోలీసు బందోబస్తుతో శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. పోలీసు వాహనంలోనే అమృతను ఇంటి వద్ద నుంచి శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కాగా అమృత అక్కడికి చేరుకునే లోగా మారుతిరావు మృతదేహాన్ని చితిపై ఉంచారు. చితివద్దకు పోలీసులతో కలసి వెళ్లిన అమృతను మారుతిరావు బంధువులు, పట్టణ వాసులు అడ్డుకున్నారు. అమృత గోబ్యాక్.. మారుతిరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించి పోలీసులు అమృతను వెంటనే తమ వాహనంలో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఆస్తి కోసం అమృత డ్రామాలు : శ్రవణ్ ‘మారుతిరావు చస్తే తనకు శుభవార్త’అని చెప్పిన అమృతకు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అతనిపై ప్రేమ పుట్టుకురావడం చూస్తే, ఆస్తికోసం డ్రామా ఆడుతున్నట్టు ఉందని మారుతిరావు తమ్ముడు శ్రవణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన అన్న నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, మారుతిరావు భార్య పుస్తె తీసిన రోజే తాను పుస్తె తీస్తానని అమృత చెప్పిందని, అలాగే మారుతిరావును బహిరంగంగా ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసిందని అన్నారు. తన వల్ల ఎవరికీ ప్రాణహాని ఉండదని, అమృత తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రణయ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా శిక్ష అనుభవించానని, కేసు విషయంలో ఏనాడు కూడా రాజీ కోసం అమృత వద్దకు వెళ్లలేదని తెలిపారు. శ్మశానవాటిక వద్ద ఆమెను తాను అడ్డుకోలేదని, తల్లిపై ప్రేమ ఉంటే ఆమె అక్కడే ఉన్నా ఎందుకు మాట్లాడలేదన్నారు. తన అన్న మారుతిరావుకు అప్పులు ఉంటే వడ్డీతో సహా తీర్చుతానని వెల్లడించారు. ఆస్తిపై ఎలాంటి ఆశలు లేవు: అమృత తండ్రి ఆస్తిపై తనకు ఆశల్లేవని మారుతిరావు కూతురు అమృత చెప్పారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మారుతిరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. పశ్చాత్తాపం చెందో, శిక్షపడుతుందనో ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు అని అంది. ఆయనకు బినామీ పేర్లపై ఆస్తులున్న ట్లు తెలిసిందని, ఆస్తి విషయంలో మారుతిరావును బాబాయి శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది. శ్రవణ్ వల్ల తన తల్లికి కూడా ప్రాణ హాని ఉండొచ్చని అనుకుంటున్నానంది. తాను తల్లి వద్దకు వెళ్లనని, ఆమే తనవద్దకు వస్తే చూసుకుంటానని తెలిపింది. -
డబ్బుల కోసం అమృత డ్రామాలు..
సాక్షి, మిర్యాలగూడ : తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. శ్రవణ్ సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రణయ్ హత్యకేసులో నా ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. (బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత) మా అన్న మారుతీరావు చనిపోయే వరకూ ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసింది. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్ హత్యకు ముందు మా అన్నకు నాకు మాటలు లేవు. అమృత విషయంలోనే గొడవలు జరిగాయి. ఆమె చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి. తండ్రి చనిపోతే ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదు. తండ్రి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు? నేను బెదిరించే వాడిని అయితే నా పేరు ఎందుకు బయటకు రాలేదు? మా అన్న చనిపోయాక ..అమృతకు ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది? (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాట రావడం లేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. (మిస్టరీగా మారుతీరావు మరణం!) -
బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత
సాక్షి, మిర్యాలగూడ : ‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్ (శ్రవణ్) పేరు ఉంటే అనుమానం వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’ అని మారుతీరావు కుమార్తె అమృతా ప్రణయ్ తెలిపారు. (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. వాళ్ల ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాటి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. గతంలో పరువు విషయంలో మా నాన్నను బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఇవాళ ఉదయం శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్ వాళ్ల అమ్మాయి. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నేను అయితే ప్రణయ్ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో... ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను. ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే’ అని అన్నారు. (మారుతిరావు ఆత్మహత్య) -
ఏపీ కేబినెట్లోకి కొత్తగా ఇద్దరు మంత్రులు
-
తూతూ‘మంత్రం’గా
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమా చారం ఇచ్చినట్లు తెలిసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. రేపు గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. ఫరూక్, కిడారి శ్రవణ్‌లను కేబినెట్లోకి తీసుకోవడంతోపాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సంతలో పశువులను కొన్నట్టు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతుల ఆత్మహత్యలను, రైతు సమన్వయ కమిటీలను ప్రధానంగా లేఖలో ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు. లేఖలో ముఖ్యమైన అంశాలు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితులు రైతు సమన్వయ సమితులు కావు, రాజకీయ సమన్వయ సమితులు అని ఆయన విమర్శించారు. ఇమేజ్ తగ్గుతుందని భావించినప్పుడు ఏదో ఒక అంశాన్ని తెచ్చి హంగామా చేయడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన రైతులను ఏనాడూ పట్టించుకోకుండా, ఇవాళ రైతులకు ఏదో మేలు చేస్తున్నాట్టు నటిస్తున్నారని తెలిపారు. సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీ నాయకులను కేసీఆర్ కొంటున్నారని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చడానికే రైతు సమన్వయ కమిటీల పేరుతో ఓ దళారి సంస్థను నెలకొల్పారని మండిపడ్డారు. దానికి గుత్తా సుఖేందర్ అనే ఓ రాజకీయ దళారి(బేహారి)ని అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు. సమన్వయ సమితుల్లో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకే రైతు సమన్వయ సమితుల్లో అవకాశం కల్పిస్తామనడం రాజకీయ దివాళా కోరుతననాకి నిదర్శనమని అన్నారు. కౌలు రైతును పట్టించుకోకుండా వారి ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. భూ సర్వేలో 1,61,000,00 లక్షల ఎకరాలు గుర్తించి కేవలం వారికి మాత్రమే పంట సాయం అందిస్తామంటే కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి చావులను అపహాస్యం చేశారని అన్నారు. రైతులను రౌడీ మూకలుగా మంత్రి తుమ్మల, భీమ డబ్బుల కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హోం మంత్రి నాయని అంటుంటే రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని పేర్కోన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే తీరిక లేని వ్యక్తి రైతుల బాధలు తీర్చడానికే సమన్వయ సమితులంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రైతుల భూములు లాక్కుంటూ.. వారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు అరికట్టలేని అసమర్థులంటూ ఘటైన విమర్శలు చేశారు. ఇన్నాళ్లు ప్రధాని మోదీ అడుగులకు మడుగులోత్తుతూ.. ఇప్పుడు వాడు వీడు అనడంలో మతలబు ఏమిటంటూ నిలదీశారు. ప్రధానితో చేసుకున్న లోపాయికారి ఒప్పందాలు చెడిపోయయా అని ప్రశ్నించారు. విభజన హామీ నెరవేర్చకున్న, బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించిన కేంద్రాన్ని పల్లేత్తు మాట అనని ముఖ్యమంత్రి ఇప్పుడేందుకు ఒంటి కాలిపై లేస్తున్నారంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన వాటిని రీ-డిజైన్ పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను ఎక్కువ సార్లు మోసం చేయలేరని, మోసపోతున్నాం అని ప్రజలు గ్రహించిన మరుక్షణం వారి ఆగ్రహ జ్వాలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ మాడిపోతుందని అన్నారు. -
లోఫర్లు ఎవరో తేల్చుకోడానికి సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: లోఫర్లు ఎవరో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకున్న కేటీఆర్.. కేసీఆర్ రాజకీయం ఎక్కడ ప్రారంభించారో తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లోనే చాలాకాలం పాటు కేసీఆర్ పనిచేశారని, ఆయన కూడా లోఫరేనా అని ప్రశ్నించారు. ఎవరు లోఫర్లో తేల్చుకోవడానికి అమరవీరుల స్మారక స్తూపం దగ్గరైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. -
కేసీఆర్ కూడా లోఫరేనా: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లోఫర్ల పార్టీ అయితే, గతంలో ఈ పార్టీలో పనిచేసిన కేసీఆర్ కూడా లోఫరేనా? అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారమదంతో మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ జన్మను ఇచ్చిన కాంగ్రెస్‌ను లోఫర్ల పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడటం నీచమన్నారు. రాహుల్ దద్దమ్మ అయితే, ఆయన ఇంటికి కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లారో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. -
కేబినెట్లో 9 మంది బీసీలకు అవకాశమిస్తే నమ్ముతాం
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో 52 శాతం జనాభా ఉన్న బీసీల నుంచి 9 మందికి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించాలని.. అలా చేస్తే సీఎం కేసీఆర్‌కు బీసీలపై నిజంగా ప్రేమ ఉన్నట్లు విశ్వసిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆయన మాట్లాడారు. దళిత సీఎం, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ల అమలుపై సీఎం మాట తప్పారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీసీలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. అందుకే కమిటీలు అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కేబినెట్లో 9 మందికి చోటు కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇక కేబినెట్లో ఒక్క మహిళకు చోటు కల్పించని చరిత్ర కేసీఆర్‌కే దక్కిందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లు రవి పాల్గొన్నారు. -
శిరీష మృతికేసు విచారణ ముగిసింది: డీసీపీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ స్పష్టమైందని ఆయన అన్నారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది. అత్యాచారం జరగలేదు.. ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది. కాగా, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ కొనసాగుతున్నదని పోలీసు వర్గాలు తెలిపారు. రెండు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా శిరీష ఆత్మహత్య కేసు విచారణకు సంబంధించి తమను కుకునూర్‌పల్లి తీసుకెళ్లి తమ అనుమానాలను పోలీసులు నివృత్తి చేయలేదని ఆమె బంధువులు తెలిపారు. ఆమె మృతిపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని వారు పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ నిరాకరణ ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. శిరీష కుటుంబసభ్యుల అనుమానాలపై దర్యాప్తు దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. -
శిరీష మృతి కేసు : రాత్రంతా సాగిన హైడ్రామా
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష మృతికేసులో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా సాగింది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత నిందితులు రాజీవ్, శ్రావణ్లను బంజారాహిల్స్ పీఎస్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తీసుకువెళ్లారు. రాత్రి 1:20 గంటలకు ఉస్మానియాలో రాజీవ్, శ్రావణ్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా వద్ద మీడియా కళ్లుగప్పి కుకునూర్‌పల్లి తీసుకువెళ్లారు. తెల్లవారుజామున 3:30 గంటలకు కుకునూర్‌పల్లి చేరుకున్నారు. పోలీసులు మీడియాను చూసి కుకునూర్‌పల్లి పీఎస్‌కు వెళ్లకుండా సిద్దీపేట వైపు 25 కి.మీ వెళ్లారు. కుకునూర్‌పల్లి రోడ్డుపై 45 నిమిషాలసేపు రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తిప్పారు. ఉదయం 4:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వైపు రాజీవ్, శ్రావణ్లను తరలించారు. ఉ.5:30కి రాజీవ్, శ్రావణ్‌ను బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఏ క్షణంలోనైనా రాజీవ్, శ్రావణ్లను కుకునూర్‌పల్లి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్‌లో ఏం జరిగిందో నమోదు చేయనున్నారు. రాజీవ్, శ్రావణ్లను రెండ్రోజులు పోలీసులు విచారించారు. రాజీవ్, శ్రావణ్‌లు చెప్పిన వివరాలపై కేసును రీ కన్స్ట్రక్షన్ చేసేపనిలో పోలీసులు ఉన్నారు. -
‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
హైదరాబాద్ :ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే బ్యూటీషియన్ శిరీష మృతి కేసు పెద్దది కాదని ఈ కేసులో ప్రధాన నిందితుల తరఫు న్యాయవాది వెంకట్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా ఈ కేసులో సమగ్ర విచారణ నిమిత్తం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వారిని పోలీసులు విచారణ చేయనున్నారు. అంతకు ముందు వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైన కూడా సమగ్రంగా విచారణ జరపనున్నారు. శిరీష మృతి కేసులో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ‘శిరీష ఆత్మహత్య చేసుకుందా?, హత్యకు గురయిందా?. ఆమెను కుకునూర్‌పల్లిలో ఏ సెటిల్మెంట్కు తీసుకు వెళ్లారు. ఇంతకీ శిరీష డిమాండ్ ఏంటి?. రాజీవ్ ఏం కావాలనుకున్నాడు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది.అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారా? ఈ కేసులో తేజస్విని పాత్ర ఏంటి?. తేజస్విని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు విచారించలేదు?. శిరీష ఆడియో రికార్డింగ్‌లు ఎవరు బయటపెట్టారు?. కుకునూర్‌పల్లి నుంచి వచ్చే దారిలో శిరీషను ఎందుకు కొట్టారు?. అసలు ఆర్జే స్టూడియోలో ఏం జరిగింది? సీసీ పుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. కాల్ రికార్డులో ఉన్న నందు, నవీన్ ఎవరు?. వారిని పోలీసులు విచారించారా?. తేజస్విని సంగతి చూడమని శిరీష ఎవరెవరికి చెప్పింది?. ఆమెను ఎవరెవరు బెదిరించారు?. ఈ విషయం రాజీవ్‌కు తెలుసా?.’ అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు మాత్రం బయటకు రాలేదు. -
శిరీష కేసులో తాజా అప్డేట్స్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అంతకుముందు వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి వీరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అందుకు వీరు పరోక్షంగా కారణమవడం, ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం వంటి కారణాల దృష్ట్యా కనీసం వీరిద్దరికి పదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి శిరీషది ఆత్మహత్యే -
దురహంకారంతోనే కోదండరాంపై విమర్శలు
-
దురహంకారంతోనే కోదండరాంపై విమర్శలు
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) దురహంకారంతోనే కోదండరాంను విమర్శిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ అన్నారు. కోదండరాం కేవలం భూనిర్వాసితుల సమస్య గురించి మాట్లాడారే తప్ప ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న శ్రవణ్.. కోదండరాం వెనుక యావత్ తెలంగాణ ఉందన్నారు. -
ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియా అండర్-16 ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ క్రికెట్ సంఘానికి చెందిన అంకుర్, శ్రవణ్‌లు సాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎస్ఎస్పీఎఫ్ మొత్తం 38 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు వీరిరువురూ అక్టోబర్ మొదటి వారంలో డెహ్రాడూన్‌లో జరిగే క్యాంపుకు హాజరవుతారు. క్యాంపులో శిక్షణానంతరం 16 మందితో కూడిన భారత తుదిజట్టును ఎంపిక చేస్తారు. ఈ జట్టుకు కె. సునీల్ బాబు మేనేజర్‌గా వ్యవహరిస్తారు. -
కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారు
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నెల్లూరు(వేదాయపాళెం) : విక్రమ సింహపురి యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకంలో చోటుచేసుకున్న అవినీతిపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు విచారణ జరపారన్నారు. వర్సిటీ మూసివేతకు సిఫార్సు చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన వర్సిటీ ఆయన మరణాంతరం అవినీతిమయంగా మారిందన్నారు. మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లినా ఆయన తగిన రీతిలో స్పందించటం లేదన్నారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.హరికృష్ణయాదవ్, బి.సత్యకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి టి.వినీల్, కార్యదర్శి సుమంత్, నాయకులు రాహుల్, తరుణ్‌లు పాల్గొన్నారు. -
బోరబండలో గ్యాంగ్ వార్
- యువకుడిపై కత్తితో దాడి హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో గ్యాంగ్ వార్ జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రవణ్ అనే యువకుడిపై గురువారం సాయంత్రం నలుగురు యువకులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మరణించిన నేతపై అబద్ధాలా?: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై అబద్ధాలు మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు మంచిదికాదని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. బుధవారం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144 టీఎంసీల నీటిలభ్యత ఉందని కేసీఆర్ శాసనసభలోనే అంగీకరించారని.. 1,144 టీఎంసీల నుంచి 170 టీఎంసీలు తీసుకున్నా ఇంకా 950కి పైగా టీఎంసీలు సముద్రంలోనే కలుస్తాయన్నారు. మన అవసరాల కన్నా ఎక్కువ లభ్యత ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీ మార్చడానికి కేసీఆర్ రీడిజైన్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టివద్దే ప్రాజెక్టును ప్రతిపాదించేలా వ్యాప్కోస్ సర్వే సంస్థచేత దివంగత నేత వైఎస్ చెప్పించారంటూ అబద్ధాలను చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. -
'కాంట్రాక్టులు కావాలంటే టీఆర్ఎస్లోకి వెళ్లొచ్చు'
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించేలా ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడం క్రమశిక్షణా రాహిత్యమేనని చెప్పారు. టీఆర్ఎస్కు మద్దతుగా కోమటిరెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టులు కావాలంటే టీఆర్ఎస్లోకి వెళ్లొచ్చునని సూచించారు. అంతేకానీ కోవర్టు రాజకీయాలు చేయొద్దని శ్రవణ్ హితవు పలికారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ‘రూల్స్’: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకర్ పునఃసమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డి.శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను గవర్నర్ ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు ఈటల, హరీశ్‌రావు, కేటీఆర్ పోటీపడి బెంచీలెక్కి, గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేశారన్నారు. కాగా, మాజీ స్పీకర్ డి.శ్రీపాదరావు జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, శ్రవణ్ ప్రారంభించారు. -
దద్దమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది: దాసోజు
హైదరాబాద్: చట్టసవరణ చేయాలంటే చట్టసభల ద్వారానే చేయాలనే కనీస నిబంధనలు తెలియని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 207 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం అర్డినెన్స్ను తీసుకురావడం చీకటి రాజకీయం అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా.. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బానిసలుగా మారారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చట్టసభలని, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హేతుబద్ధమైన జీవో అని న్యాయస్థానానికి చెప్పిన ప్రభుత్వం దానిని రాత్రికి రాత్రే ఎందుకు రద్దుచేసిందని ఆయన ప్రశ్నించారు. -
'తెలంగాణ మరో బిహార్‌లా మారుతుంది'
హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల గవర్నర్ జోక్యం చేసుకొని విభజన చట్టంలోని సెక్షన్-8 ను అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం మరో బిహార్‌లా మారుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అంటే టీఆర్ఎస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టకపోగా, దాడికి గురైన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, పోలీసులు కలిసి పాతబస్తీలో అరాచకాలు సాగిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టిన విషయాన్ని శ్రవణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నారు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటున్నారని కాంగ్రెస్ నేత శ్రవణ్ విమర్శించారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని అంటున్న కేసీఆర్.. సెటిలర్లను తరిమెయ్యడని గ్యారెంటీ ఎంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు అన్నాతమ్ముళ్ల మాదిరిగా వరసలు కలుపుతున్నారన్నారు. టీఆర్ఎస్, టీడీపీ రెండు పార్టీలు ఒకటేనని అనిపిస్తోందని శ్రవణ్ అన్నారు. ఇంతకాలం సీఎం కేసీఆర్ పల్లకిని మోసింది బీజేపీ మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలే అని శ్రవణ్ విమర్శించారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రంటే రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటమే అని ఆయన విమర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
వరంగల్ జిల్లా మంగపేట మండలం జాకారం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. గామ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఇసుక లారీని బైక్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాల్సాబ్పల్లికి చెందిన నర్సింహారెడ్డి(30), ములుగుకు చెందిన శ్రవణ్(25) అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోంది'
హైదరాబాద్: తెలంగాణలో ఏడాదిన్నర కాలంగా రాక్షసపాలన కొనసాగుతోందని టి.పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అభద్రతాభావంతోనే ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని..మిగతా ఎంపీలకు లేని అభద్రతాభావం కవితకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలోనే విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ పాలన పూర్తిగా కామెడీ అయిందని.. జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ బూటకంగా మార్చేసిందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించిందన్నారు. మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల్లో సవాల్ విసిరే నైతికత లేదని ఆయన అన్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే... కేసీఆర్ రాజీనామా చేస్తారాన్న కోమటిరెడ్డి సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదని శ్రవణ్ ప్రశ్నించారు. -
'బహిరంగ చర్చకు మంత్రి సిద్ధమా?'
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓపెన్ బిడ్ పిలవకుండా ఛత్తీస్‌గఢ్‌తో ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలపై బహిరంగ చర్చకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సిబ్బంది మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అధికారులను బదిలీ చేస్తున్నారని శ్రవణ్ విరుచుకుపడ్డారు. -
కేసీఆర్‌ది రాజకీయ జూదం: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజకీయ జూదంవల్లనే వరంగల్‌కు ఉప ఎన్నిక జరుగుతోందని, ఈ ఎన్నికలో కేసీఆర్‌ను ప్రజలే బర్తరఫ్ చేయాలని పీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అకారణంగా, ఏకపక్షంగా బర్తరఫ్ చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు. కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణను ఎందుకు దాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సోమేశ్ కుమార్ బలిపశువు అయ్యారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను నమ్ముకున్న వారికి ఇదే గతి పడుతుందని గుర్తుంచుకోవాలని శ్రవణ్ హెచ్చరించారు. ఇందిరకు నివాళి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతి కార్యక్రమాలను గాంధీభవన్‌లో శనివారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు డి.శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలెక్కలు చెప్పింది'
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ నేతలు కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 97మంది రైతులు మాత్రమే చనిపోయారని పార్లమెంట్లో టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించిందని వారు సోమవారమిక్కడ విమర్శించారు. టీఆర్ఎస్ దొంగలెక్కలు చెప్పిందనడానికి కేంద్రానికి పంపిన నివేదికే నిదర్శనమని కోదండరెడ్డి, శ్రవణ్ అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులను ఆదుకునేందుకు 420 జీవోను అమలు చేయకపోవడం దారుణమని, మానవత్వం లేని రాక్షసత్వ ప్రభుత్వమని టీపీసీసీ నేతలు ధ్వజమెత్తారు. 1007మంది రైతుల ఆత్మహత్యల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నామని, విచారణ జరిపి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. తెలంగాణ రైతు సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
వేటకొడవలితో యువతిపై దాడి
మహిళా హాస్టల్లో యువకుడి ఘాతుకం హైదరాబాద్: ప్రేమించమని ఓ యువతిని ప్రేమోన్మాది కొద్దికాలంగా వేధిస్తున్నాడు. అం దుకు యువతి నిరాకరించడంతో ఆమెను హతమార్చేందుకు నగరానికి వచ్చా డు. యువతి డ్యూటీకి వెళ్లడంతో ఆమె గదిలో ఉన్న మరో యువతిని కొడవలితో నరికిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శ్రావణ్ అలియాస్ చరణ్ తన ఊరికే చెందిన సమీపబంధువు చెతన్యను ప్రేమించాలని వెం టపడేవాడు. అందుకు యువతి నిరాకరించడం తో కోపం పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన శ్రావణ్ సోమవారం మధ్యాహ్నం యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. చైతన్య తనకు చెల్లి అవుతుందని, ఆమెను పిల వాలని వాచ్‌మెన్‌కు చెప్పాడు. చైతన్య డ్యూటీకి వెళ్లిందని చెప్పడంతో ఆమె గదిలోనే ఉండి వచ్చిన తర్వాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వాచ్మెన్ కళ్లుగప్పి నేరుగా చైతన్య ఉండే గదిలోకి వెళ్లాడు. అయితే గదిలో చైతన్య రూంమేట్ మమత ఉంది. తాను వేసిన పథకానికి మమత అడ్డొస్తుందని భావించి తన వెంట తీసుకొచ్చిన వేటకొడవలితో ఆమె తలపై వేటువేశాడు. అతడి నుంచి తప్పించుకుని మమత అరుస్తూ గది నుంచి బయటకు రావడాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది శ్రావణ్‌ను పట్టుకున్నారు. గాయపడిన మమతను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మమత స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. ఆమె ఈసీఐఎల్‌లోని ఓ కంపనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. మమత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్ టికెటా...? వద్దు బాబోయ్.!
మెదక్ నుంచి పోటీచేసేందుకు నేతల అనాసక్తి పోటీకి నో అంటున్న విజయశాంతి, జగ్గారెడ్డి, శ్రవణ్ హస్తం ఇక భస్మాసుర హస్తమేనంటున్న నేతలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరగబోయే మొట్టమొదటి ఎన్నిక కాబోతుండడంతో రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్, బీజేపీల తరపున పోటీ చేసే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదనే భయం ఆ పార్టీనేతలను వెంటాడుతోంది. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు చేసుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మేలనే భావనలో వారున్నారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ పి.శ్రవణ్కుమార్రెడ్డిసహా జిల్లా నేతలంతా ఇదే ఆలోచనతో ఉన్నారు. కేసీఆర్ రాజీ నామా చేసిన పార్లమెంట్ స్థానం కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ సీటును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కూడా ఆ పార్టీకే గెలుపు అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలంటే జిల్లాలో రాజకీయంగా పట్టున్న మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డిలలో ఒకరిని ఉపఎన్నికల్లో పోటీ చేయించడమే మేలని భావిస్తున్నారు. అయితే వారిద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని, మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు ఖర్చుచేసి పరువు పోగొట్టుకోవడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని వారు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం వీరిలో ఎవరు ఒకరు పోటీ చేస్తేనే మేలనే భావనతో ఒప్పించే పనిలో పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పలుదఫాలుగా జగ్గారెడ్డి, విజయశాంతిలతో మంతనాలు జరుపుతున్నారు. వారు ఒప్పుకో ని పక్షంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ఉప ఎన్నికల్లో దింపాలని యోచిస్తున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను పోటీచేయించాలని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నప్పటికీ ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. కమలం గుర్తుపై పోటీకి సై : బీజేపీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరపున పోటీచేసే ఆలోచనలో విజయశాంతి, జగ్గారెడ్డి ఉన్నారు. వీరు గతంలో బీజేపీలో పనిచేసిన వారే. దేశమంతటా మోడీ గాలి ఉన్నందున కమలం గుర్తుపై పోటీ చేస్తే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలిచే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, మెదక్ లోక్ సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనైతే నాకు లేదు. బీజేపీ వాళ్లు పిలిచి టికెట్ ఇస్తానంటే పోటీచేస్తా. లేకపోతే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. -
సన్నాసులు మీరా ? మేమా ?
-
శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్‌లో కాక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన శ్రవణ్‌ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. షబ్బీర్ అలీ పదవిని తీసి శ్రవణ్‌కు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో పొన్నాల పునరాలోచించకపోతే అందరం రాజీనామా చేసి తమ నిరసన తెలియజేస్తామని సీనియర్ నాయకుడు నిరంజన్ హెచ్చరించారు. దాసోజు శ్రవణ్‌తో పాటు కట్టెల శ్రీనివాస యాదవ్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే పొన్నాల వారికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో శ్రవణ్‌ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. ఇదే ఇప్పుడు పార్టీలో విభేదాలకు కారణమైంది. -
కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ కీలక నేత శ్రవణ్
-
కాంగ్రెస్‌లో చేరిన టిఆర్ఎస్ నేతలు శ్రవణ్, కట్టెల
హైదరాబాద్: టిఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్, ఆ పార్టీ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో శ్రవణ్ బలంగా వినిపించే వారు. ఈ ఎన్నికల్లో భువనగిరి లేక ముషీరాబాద్‌లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేయాలని ఆయన అనుకున్నారు. అయితే ఆయనకు టిఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు.కేంద్ర మంత్రి జైరామ్ రమేష్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వెంటనే శ్రవణ్‌ను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా పొన్నాల ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా టీఆర్ఎస్ సొమ్ము చేసుకోవాలనుకుంటుందని పొన్నాల అన్నారు. అందుకే శ్రవణ్ లాంటి ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. -
బిల్లును తగులబెట్టినవారిపై సుమోటోగా కేసు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీఆర్ఎస్ వినతి సాక్షి, హైదరాబాద్: శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగులబెట్టిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్టు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పంపిన బిల్లును భోగిమంటల్లో తగులబెట్టడంద్వారా రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బిల్లు ముసాయిదాను తగులబెట్టాలంటూ పిలుపునిచ్చిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై, బిల్లు ప్రతులను తగులబెట్టిన నేతలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
భార్య మరణించినా.. 20 మందిని రక్షించాడు
అనంతపురం : పెను ప్రమాదం జరిగినప్పుడు చాకచక్యంగా స్పందించేవారు కొందరుంటారు. మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి మరీ తోటివారిని కాపాడడానికి ముందుకు ఉరికివస్తారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కూడా ఓ వ్యక్తి అలాగే తెగించాడు. తన జీవన సహచరి కళ్ల ముందు సజీవ దహనమైనా కన్నీటిని దిగమింగుకుంటూ తోటి ప్రయాణికులను కాపాడడంలో మునిగిపోయాడు శ్రవణ్ అనే ప్రయాణికుడు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో శ్రవణ్ భార్య, అత్త, మావయ్య అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. ఆ బాధను భరిస్తూనే అతడు... 20 మంది ప్రయాణికులను రక్షించాడు. చాకచక్యంగా వ్యవహరిస్తూ వారందరినీ ప్రమాదం నుంచి తప్పించాడు. అయితే కట్టుకున్న భార్యను.. వికలాంగుడైన ఆమె తండ్రిని మాత్రం కాపాడలేకపోయాడు. భార్యను కాపాడుకోలేకపోయాను గానీ.. దాదాపు 20 మంది ప్రాణాలను మాత్రం కాపాడగలిగానంటూ కన్నీంటి పర్యంతమయ్యాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది సజీవ దహనం కాగా, 15మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బీ1 ఏసీ బోగీలో 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
నియమిద్దామా..వద్దా?
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఈసేవ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టు భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రస్తుతం నియామకం చేపడదామా? వద్దా? అనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నియమిద్దామా..వద్దా? ప్రక్రియ చేపట్టిననాటి నుంచి అంతా అయోమయ పరిస్థితి నెలకొనడంతో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక అధికారులు ప్రస్తుతం ఓ అభ్యర్థిని ఎంపికచేసినా నియామక ఉత్తర్వులను జారీచేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని మొదటి నుంచి ఏం జరుగుతుందోననే కథనంతో ‘సాక్షి’ ప్రధానంగా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు ఎంపికను జాగ్రత్తగా చేపడుతున్నారు. కానీ పోస్టు భర్తీ ప్రక్రియ మాత్రం రోజుకో మలుపు తిరుగుతుండటంతో చివరికి భర్తీ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వారం రోజుల్లో పూర్తిచేస్తామని గతనెలలో చెప్పిన అధికారులు రెండునెలలైనా ఇంతవరకు పూర్తిచేయడంలో విఫలమయ్యారు. నాన్‌లోకల్ అభ్యర్థి చేరికపై గందరగోళం ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు ముం దుగా గడువులోగా ‘ఆన్లైన్’లో రూ 100 చెల్లిం చాలని, వారినే అర్హుల గుర్తిస్తామని అధికారు లు నిబంధనవిధించారు. అలా రుసుం చెల్లిం చిన వారిలో 63 మంది అభ్యర్థులు ఉన్నారు. కా నీ తెలంగాణేతర ప్రాంతానికి చెందిన అభ్యర్థి శ్రీనివాస్అమర్ ఎలాంటి రుసుం చెల్లించకుం డానే నేరుగా రాతపరీక్షకు ఎంపికకావడం పట్ల అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ఈఅభ్యర్థిని ఎంపికచేద్దామని భావించిన అధికారులు ఆఖరు నిమిషంలో నాన్‌లోకల్ అనే ధోరణితో వెనక్కితగ్గినట్లు ఎంపికైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అభ్యర్థి విషయం లో ఎవరు ఎందుకంతా శ్రద్ధ తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై మి గిలిన అభ్యర్థులు ప్రస్తుతం ఆరాతీసే పనిలోపడ్డారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం ఎంపికచేసిన జి.చంద్రశేఖర్ అనే అభ్యర్థికి నాలుగున్నరేళ్ల అనుభవం మాత్రమే ఉందని, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారిని పక్కనపెట్టి అధికారులు అన్యాయం చేశారని శ్రావణ్ అనే అభ్యర్థి వాపోయాడు. ఈ విషయమై అధికారులను అడిగేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో ఆవేదనను చెప్పుకున్నాడు.