'తెలంగాణ మరో బిహార్లా మారుతుంది' | telangana will become another bihar says tpcc spokes person sravan | Sakshi
Sakshi News home page

'తెలంగాణ మరో బిహార్లా మారుతుంది'

Published Thu, Feb 4 2016 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

'తెలంగాణ మరో బిహార్లా మారుతుంది'

'తెలంగాణ మరో బిహార్లా మారుతుంది'

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల గవర్నర్ జోక్యం చేసుకొని విభజన చట్టంలోని సెక్షన్-8 ను అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం మరో బిహార్లా మారుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అంటే టీఆర్ఎస్ భయపడుతోందని  ఎద్దేవా చేశారు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టకపోగా, దాడికి గురైన తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, పోలీసులు కలిసి పాతబస్తీలో అరాచకాలు సాగిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టిన విషయాన్ని శ్రవణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement