ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు | ankur, sravan placed in under 16 india's team | Sakshi
Sakshi News home page

ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు

Published Thu, Sep 15 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ankur, sravan placed in under 16 india's team

సాక్షి, హైదరాబాద్: ఇండియా అండర్-16 ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ క్రికెట్ సంఘానికి చెందిన అంకుర్, శ్రవణ్‌లు సాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో సత్తా చాటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

 

ఎస్‌ఎస్‌పీఎఫ్ మొత్తం 38 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు వీరిరువురూ అక్టోబర్ మొదటి వారంలో డెహ్రాడూన్‌లో జరిగే క్యాంపుకు హాజరవుతారు. క్యాంపులో శిక్షణానంతరం 16 మందితో కూడిన భారత తుదిజట్టును ఎంపిక చేస్తారు. ఈ జట్టుకు కె. సునీల్ బాబు మేనేజర్‌గా వ్యవహరిస్తారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement