Ankur
-
#Shyam Benegal శారదకు దక్కని అంకుర్.. షబానాను వరించింది!
ఓల్డ్ అల్వాల్ పోరడు– బి. నరసింగ రావు, దర్శకులుశ్యామ్ బెనగళ్ (Shyam Benegal) కూ నాకూ 12 ఏళ్ల వయసు తేడా ఉంది. ఆయనకు 90 అయితే నాకు 78. మా ఓల్డ్ అల్వాల్‌లో వాళ్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. గతంలో శ్యామ్ అన్నయ్య మధు అందులో ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కనిపించడం లేదు. శ్యామ్ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ల నాన్నకు ఫొటో స్టుడియో ఉండేది. అందులో మేము చిన్నప్పుడు ఫొటోలు దిగేవారం. శ్యామ్ చాలా యాక్టివ్. నిజాం కాలేజీలో (Nizam College) మేగజీన్ ఎడిటర్‌గా ఉండేవాడు. ఫిల్మ్ సొసైటీ నడిపాడు. సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయ్యి వెంటనే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకునేవాడు ఆటలకు. గురుదత్ ఆయనకు కజిన్. బాంబే వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలంటే చార్జీలకు కూడా డబ్బులు లేవు. అప్పుడు మా మిత్రుల్లో అమ్రేష్ అనే అతని అన్న రైల్వేలో ఉండేవాడు. అతను పాస్ ఇస్తే వెళ్లాడు. గురుదత్ ఇంట్లోనే ఉండి సినిమాలు తెలుసుకున్నాడు. ‘అంకుర్’ (Ankur) కథలో హీరోకు మా మిత్రబృందంలోని ఒక వ్యక్తి జీవితమే ఇన్స్పిరేషన్. ‘నీ కథే తీస్తున్నానురా’ అని ఆ మిత్రుడికి చెప్పి మరీ ఆ సినిమా తీశాడు. ఆఫ్కోర్స్... సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడు. తన నిర్మాణ సంస్థకు ‘సహ్యాద్రి ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం శంకరమంచి కథలను దూరదర్శన్ కోసం తీస్తున్నప్పుడు నన్ను కలిశాడు. వాటి నిర్మాణంలో నా మాటసాయం ఉంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆఖరుసారి మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడలేదు. చాలా క్వాలిటీతో ఎక్కువ పని చేసిన దర్శకుడు శ్యామ్. శారదకు మిస్సయిన ‘అంకుర్’ శ్యామ్ బెనగళ్ తన మొదటి సినిమా ‘అంకుర్’లో హీరోయిన్గా వహీదా రెహమాన్‌ను (Waheeda Rehman) అనుకున్నాడు. ఆమె మొదట చేస్తానని తర్వాత నో చెప్పింది. అప్పుడు శారదకు ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుందని ఆమెను సంప్రదించాడు. ఆమెకు కథ నచ్చినా, దక్కనీ భాషలో డైలాగులు చెప్పగలనో లేదో అనే సందేహంతో చేయలేదు. అపర్ణసేన్ కూడా వెనుకా ముందు ఆడటంతో చివరకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన షబానా ఆజ్మీని ఎంచుకున్నాడు. షబానాకు ఒకరకంగా హైదరాబాద్‌తో బంధం ఉన్నట్టే కదా. ఆమె తల్లి షౌకత్ హైదరాబాదీ. షబానా, స్మిత, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి... వీరంతా బెనగళ్ సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించారు.సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్యామ్ బెనగళ్ నివాసం ప్రస్తుత స్థితి -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్‌స్టా పోస్ట్‌తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్‌లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్‌లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్‌గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్‌ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్‌కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
సక్సెస్ స్టోరీ: యంగ్ అండ్ ఎనర్జిటిక్
కరెంటు బిల్ అనే మాట వినబడగానే... కొండంత భయం ఎదురొచ్చి నిలుచుంటుంది. ఆ కొండను కోడిగుడ్డు స్థాయికి తగ్గించలేమా? కరెంటు బిల్లు అనేది పెద్ద ఖర్చు కాదు. విద్యుత్ వృథాను అరికడితే ‘బిల్’ మనల్ని కనికరిస్తుంది. ‘వెరీగుడ్’ అని వెన్నుతట్టేలా చేస్తుంది. మరి విద్యుత్ వృథాను అరికట్టాలంటే? 26 సంవత్సరాల గోకుల్ శ్రీనివాస్ సక్సెస్ స్టోరీని తెలుసుకోవాల్సిందే... ఒకప్పటి మాదిరిగా ఇంట్లో లైట్ వెలగడానికి మాత్రమే మనం కరెంట్‌ను ఖర్చు చేయడం లేదు. ఇస్త్రీ పెట్టె, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వోవెన్, కంప్యూటర్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. విద్యుత్ వినియోగానికే పరిమితమైన మనం ‘వృథా’ను అంతగా పట్టించుకోవడం లేదు. లేదా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే ‘మినియన్’ డివైజ్. దీని సృష్టికర్త గురించి... హైస్కూల్ రోజుల్లో గోకుల్ శ్రీనివాస్‌కు ‘హాకీ’ అంటే ప్రాణం. ఈ ఆటలో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అయితే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని కలలు అవిరైపోయాయి. హాకీ గట్టిగా ఆడలేని పరిస్థితి. కట్ చేస్తే... చదువు పూర్తయిన తరువాత అమెజాన్ ఐటీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పూర్తయిన తరువాత ‘ఇది మనకు సెట్ అయ్యే జాబ్ కాదు’ అనిపించింది. తనకు ‘ఎలక్ట్రానిక్స్’ అంటే చా...లా ఇష్టం. రకరకాల డివైజ్‌లు తయారుచేశాడు. అలా తయారు చేసిందే మినియన్ (మిని+ఆన్) సంప్రదాయ విధానాల్లో ‘ఎనర్జీ మానిటరింగ్’ అనేది సంక్లిష్టమైన విషయం.‘మినియన్’ డివైజ్‌తో మాత్రం విద్యుత్ వాడకానికి సంబంధించి మానిటరింగ్, ఎనాలసిస్ చేయడం సులభం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్) వైర్లెస్ డివైజ్ ‘మినియన్’అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్‌లో ఉంటుంది. వృథాను అరికట్టడం మాత్రమే కాదు... ఏదైనా విద్యుత్ ఉపకరణాన్ని రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వస్తే అలర్ట్ చేస్తుంది. ‘మినియన్ ల్యాబ్స్’ పేరుతో బెంగళూరులో అంకుర సంస్థను మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయింది. ఇళ్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ...లలో ఇంధన వృథాను గణనీయంగా అరికడుతూ ప్రశంసలు అందుకుంటోంది. ‘విద్యుత్ వృథాను అరికట్టడం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా’ అంటారు. యువత ‘మినియన్’లాంటి ఇంధన వృథాను అరికట్టే పరికరాలను మరిన్ని తయారుచేస్తే ఆ బాధ్యత నెరవేర్చడం సులువవుతుంది. -
ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియా అండర్-16 ప్రాబబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ క్రికెట్ సంఘానికి చెందిన అంకుర్, శ్రవణ్‌లు సాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎస్ఎస్పీఎఫ్ మొత్తం 38 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ మేరకు వీరిరువురూ అక్టోబర్ మొదటి వారంలో డెహ్రాడూన్‌లో జరిగే క్యాంపుకు హాజరవుతారు. క్యాంపులో శిక్షణానంతరం 16 మందితో కూడిన భారత తుదిజట్టును ఎంపిక చేస్తారు. ఈ జట్టుకు కె. సునీల్ బాబు మేనేజర్‌గా వ్యవహరిస్తారు. -
చదువు తన కోసం, జ్ఞానం ప్రపంచం కోసం!
ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అధ్యయనం చేస్తున్న ఎంతోమంది అంతర్జాతీయ సదస్సులలో మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ అవకాశం అంకుర్‌కు వరసగా రావడమే కాదు... ఇతడి సలహాలు, సూచనలపై మంచి చర్చ కూడా జరుగుతోంది. ఇది స్పీడు యుగం. రిటైర్మెంట్ వరకు సాధించలేనిది కూడా మూడునాలుగేళ్లలో సాధించగలిగిన సత్తా నేటి తరం సొంతం. అంతేకాదు, అనుకున్న ఆలోచనను అమలు చేసేయగలిగిన ‘రిస్కీ బిహేవియర్’ ఈ తరంలో బాగా ఎక్కువ. 21 ఏళ్లకే అసాధారణమైన అంశాల్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ కుర్రాడి దూకుడు చూడండి! చదువు అనేది మనిషికి అవగాహనను పెంచాలి... విజ్ఞానవంతుడిని చేయాలి... ఆ విజ్ఞానం సమస్యలను పరిష్కరించాలి... బాధ్యతలను నెరవేర్చాలి. అయితే ఈ ప్రపంచంలో చాలా మంది చదువుకున్న విజ్ఞానవంతులే. కానీ వారిలో అత్యధికులకు చదువుకు తగ్గ ఉపాధిని ఎంచుకోవడమే ఇష్టం. అలాంటి వారిలో ఒకరిగా మిగలకుండా ప్రత్యేకంగా నిలిచాడు అంకుర్ ఠాకూరియా. వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తున్న సమస్యల గురించి అధ్యయనం చేస్తూ... పిన్న వయసులో ప్రపంచదేశాలకు ఈ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నాడు అంకుర్! అంకుర్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్నాడు. ఈ ఏడాదితో గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. మరి పేరున్న ఆ విద్యాసంస్థలో చదువు పూర్తి చేశాడు కాబట్టి... మంచి ఉద్యోగం వస్తుంది.. పెద్ద జీతం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా అయితే ఆలోచించే తీరిది. అయితే అంకుర్ మాత్రం ఇప్పటికే చదువుతున్న విద్యాసంస్థ కన్నా, వ్యక్తిగతంగా ఎంతో పేరు తెచ్చుకొన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచాడు. సాదాసీదాగా బతకడం మీద పెద్దగా ఇష్టంలేని అంకుర్ ఏదైనా సామాజిక సేవా సంస్థతో కలిసి పనిచేయాలని భావించాడు. ఆ ఉద్దేశంతో 17 యేళ్ల వయసులోనే కాలిఫోర్నియా నుంచి పనిచేసే ‘ఫౌండేషన్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ వరల్డ్’కు భారత్‌లో వలంటీర్ అయ్యాడు. చిన్న వయసులోనే అంకుర్ ఆలోచనలు ఆ ఫౌండేషన్ వాళ్లను ఆకట్టుకొన్నాయి. అంకుర్ ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటూ ఉంటాడు. ఆ సంస్థలో వలంటీర్‌గా తొలిసారి నిర్వహించిన భారీ ర్యాలీలో ఐదువేల మందిని ఉద్దేశించి ప్రసంగించడంతో అంకుర్‌కు తనమీద కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఈ కార్యక్రమంలో అంకుర్ ప్రతిభను చూసి మరికొంతమంది కూడా అతడిపై నమ్మకాన్ని పెంచుకొన్నారు. జీ 20 నుంచి ఆహ్వానం సామాజిక సమస్యల గురించి ‘జీ 20’ సమావేశంలో జరిగిన చర్చ సమయంలో అంకుర్ ప్రస్తావన వచ్చింది. ఈ భారతీయ యువకుడిని, వలంటీర్‌గా అతడి శక్తి యుక్తులను ఉపయోగించుకోవచ్చని... అతడిని యువతకు ప్రతినిధిగా భావించవచ్చని జీ20 జాబితాలోని దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 2011 లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంకుర్ యువ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అక్కడ నుంచి జీ 20 దేశాల తరపున వివిధ సామాజిక సమస్యల గురించి స్పందించే సామాజిక కార్యకర్తగా గుర్తింపు సంపాదించుకొన్నాడు. డ్రగ్స్ నివారణతో మొదలుపెట్టి... ఇప్పుడు వాతావరణ మార్పులు, పర్యవ సానంగా తలెత్తే సమస్యల గురించి అవగాహన నింపడానికి ఈ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సదస్సులకు హాజరవుతున్నాడు. మార్పు తీసుకురాగల శక్తి ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రసంగాలు చేస్తున్నాడు. అంతేకాదు, వాతావరణ మార్పులు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి చర్చించే ‘వరల్డ్ బిజినెస్ డైలాగ్’ సదస్సులో వరసగా 2012, 2013 సంవత్సరాల్లో ప్రసంగించే అవకాశాన్ని సంపాదించుకొన్నాడు.ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న సమస్యల గురించి తన ఆలోచనా విధానంతో అంకుర్ గొప్పవాడయ్యాడు. తనకు ఈ గుర్తింపు రావడంతో తల్లిదండ్రుల, తోబుట్టువుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని అంకుర్ చెబుతాడు. ఈ ఏడాదితో చదువు పూర్తి కాగానే ఏం చేద్దామనుకొంటున్నావు?అని అంకుర్‌ని అడిగితే... మంచి ఉద్యోగం చేస్తూనే, సామాజిక సేవాకార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకొన్నానని అంటున్నాడు. వలంటీర్‌గా తన సమ్మోహక శక్తిని ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగిస్తానని చెబుతున్నాడు. అంతేకాదు క్యాంపస్రైటింగ్.కామ్ (http://campuswriting.com/) ద్వారా యువత కోసం ఓ బ్లాగును వెబ్సైట్ రేంజ్లో నిర్వహిస్తున్నాడు.