Author Ankur Warikoo Fitness journey goes viral - Sakshi
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్‌నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్‌స్టా పోస్ట్‌తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్.
కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్‌లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్‌లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్‌గా స్వీకరించి చేసి చూపించాడు.
రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్‌నెస్‌ను, 6 ప్యాక్‌ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్‌కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment