నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్‌ఫ్లూయెన్సర్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ | Woman weight Loses journey 18kg with 4Step Formula Workout And Diet | Sakshi
Sakshi News home page

నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్‌ఫ్లూయెన్సర్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ

Published Fri, Dec 27 2024 3:47 PM | Last Updated on Fri, Dec 27 2024 3:59 PM

Woman weight Loses journey 18kg with 4Step Formula Workout  And Diet


అధిక బరువు తగ్గించుకోవాలని, స్లిమ్‌గా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ప్రణాళికా బద్ధంగా ప్రయత్నించి సక్సెస్‌ సాధిస్తారు. ఇందులో ఒక్కొక్కరి సక్సెస్‌ ఒక్కోలా ఉంటుంది. అలా పట్టుదలగా సాధన చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ తన బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా మారింది. ఎలా? తెలుసుకుందాం...రండి!

అనేక రకాల ఆహార, వ్యాయామ నియమాలు ప్రచారంలోఉన్నాయి. వీటిల్లో ఏది పాటించాలో తెలియక, చాలామంది గందరగోళంలో పడి పోతారు.  ఇవన్నీ  చూశాక బరువు తగ్గడం కష్టం రా బాబూ అని ఊరుకుంటారు. మరికొంత మంది బరువు తగ్గించుకునే క్రమంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మాడీసే అనే మహిళ. తన విజయాన్ని సోషల్‌ మీడియాలో  పంచుకొని మరో నలుగురికి ప్రేరణగా  నిలిచింది. 

ఇన్‌స్టాలో తన వెయిట్‌ లాస్‌ జర్నీని  షేర్‌ చేసింది.  మేడీ. 4 దశల ఫార్ములా,  వర్కౌట్స్‌, ఆహార నియమాలతో 18 కిలోల బరువు తగ్గించుకున్నట్టు తెలిపింది.   అనుకున్న  ఫలితం పొందాలంటే.. దీర్ఘకాలిక ఆచరణ, కచ్చితమైన యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలని చెప్పింది. ఫిట్‌నెస్ , వెల్‌నెస్‌ రెండింటి మేళవింపుతో బరువు తగ్గించుకోవాలని  సూచించింది. 

 

మాడీ సే పాటించిన నాలుగు సూత్రాలు

కంబైన్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ & కార్డియో (వారానికి 4-6 సార్లు)
కండరాలు బలంగా ఉండేందుకు  జీవక్రియను పెంచుకునేందుకు  కార్డియోతో పాటు పవర్‌ ట్రైనింగ్‌
ఈ కాంబో కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.

రోజుకి 2-3లీటర్లు నీళ్లు తాగడం
పుష్కలంగా నీరు  తాగడ వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. 
ఎనర్జీ వస్తుంది. 
విష పదార్థాలు తొలగిపోతాయి
జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది

సమతుల్య ఆహారం
80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే,  20 శాతంమాత్రమే ఇష్టమైన అనుకూలమైన ఫుడ్‌  తీసుకోవాలి.  
ఫలితంగా అవసరమైన విటమిన్లు , మినరల్స్‌ శరీరానికి అందుతాయి, అదే సమయంలో  స్వల్ప పరిధిలో మిగిలిన ఆహారం, ట్రీట్స్‌ ఎంజాయ్‌ చేయొచ్చు.

ప్రతి 10 రోజులకు ఫోటోలు
సాధారణ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అసలు విషయం తెలుస్తుంది. ఉత్సాహం వస్తుంది.  కండరాల బలం, హార్మోన్ల మార్పులను పరిశీలించుకోవాలి. అలాగే కామెంట్లు కూడా చాలా ముఖ్యం.

శరీర ఆకృతి,  మార్పులను  చూసుకోండం తనను సరియైన్‌ దారిలో నడవటానికి ఉపయోగపడింది అని చెప్పింది. అలాగే  ఈ వెయిట్‌ లాస్‌ జర్నీలో కఠినంగా ఉండాలని ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూడాలని కూడా ఆమె వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement