Workout
-
అవుట్ ఫిట్.. వ్యాయామం హిట్..
ఎన్ని గంటలు చేయాలి? ఏం డైట్ తీసుకోవాలి? సరిగా వర్కవుట్ చేస్తున్నానా లేదా? వ్యాయామం చేయాలనుకునే/ చేసే వారిలో ఎన్నో సందేహాలు.. మరి డ్రెస్ సంగతేంటి? వ్యాయామానికి తగ్గ అవుట్ ఫిట్ ధరిస్తున్నానా?అనేది ఆలోచించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు. దీనిపై నగరానికి చెందిన వ్యాయామ నిపుణులతో కలిసి హామ్స్టెక్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. నిశ్చల జీవనశైలి, ఎక్కువ గంటలు కూర్చోడం వల్ల వచ్చే మధుమేహం, రక్తపోటు గుండె సమస్యలు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోడంలో రెగ్యులర్ వ్యాయామం అవసరం. ఇది ఎండార్ఫిన్స్‌ను రిలీజ్ చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రనిస్తుంది. అయితే వర్కవుట్ సమయంలో సరైన యాక్టివ్ వేర్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం. అనుచితమైన జిమ్‌వేర్ వ్యాయామాలకు అవసరమైన కండరాల సపోర్ట్‌ని అందించవు. మన ఫిట్నెస్ లక్ష్యాలకు సహకరించవు. జిమ్ వేర్.. టేక్ కేర్.. వ్యాయామ సమయంలో సరైన యాక్టివ్‌వేర్ ఉత్సాహం పెంచడంతో పాటు అధిక చెమట, దుర్వాసనల నుంచి రక్షిస్తుంది. గాయాలను నివారించి శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి పనిచేసే కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు సామర్థ్యం మేరకు వ్యాయామాలు చేసేలా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సులభమైన కదలికలకు సహకరిస్తూ బరువులు ఎత్తడంలో సహాయపడి కండరాల పునరుద్ధరణను సులభతరం చేస్తుంది.శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం నుంచి తేమ ఆవిరైపోవాలి. కాబట్టి తేమను సులభంగా ఆరబెట్టడానికి, చెడు వాసనను నిరోధించడానికి చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి మైక్రోఫైబర్‌తో కూడిన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పాలియెస్టర్, స్పాండెక్స్, పాలీ–డ్రై, నైలాన్ కూడా మంచివే. 👉 కొన్నిరకాల దుస్తులు అంటువ్యాధులు, దద్దుర్లు, దురదలకు దారితీయవచ్చు. శరీరపు సహజ ఉష్ణోగ్రతను దెబ్బతీసి, డీ హైడ్రేషన్, అలసట లేదా బరి్నంగ్ సెన్సేషన్‌కు దారితీస్తాయి. 👉 వేసవి కాలంలో సౌకర్యవంతమైన, చల్లదనాన్నిచ్చే దుస్తులు, వర్షాకాలంలో అంటువ్యాధులు, అలెర్జీలు, చర్మ వ్యాధులను నివారించడానికి పొడిగా, తాజా అనుభూతిని కలిగించే దుస్తులను ఎంచుకోవాలి. శీతాకాలంలో వెచ్చగా ఉంచేవి, అవుట్డోర్ వ్యాయామ సమయంలో లేయర్లలో దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అనుసరించి ఒక్కో లేయర్‌ను తొలగించొచ్చు. 👉 గుండె ఆరోగ్యానికి, శక్తికి రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు అవసరం. రన్నింగ్, జాగింగ్ చేసేవారి కోసం లైట్ వెయిట్ స్వెట్ అబ్సార్బింగ్, టీషర్ట్స్, షార్ట్స్, బి రన్నింగ్ అండ్ కార్డియో హెచ్ఆర్ఎక్స్ తదితర బ్రాండ్స్ అందిస్తున్నాయి. 👉కీళ్ల మధ్య సమన్వయం, బ్యాలెన్సింగ్‌కి యోగా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఉపకరిస్తాయి. దీనికి యోగా ఫ్లెక్సిబులిటీ, బ్లిస్ క్లబ్ వంటి బ్రాండ్స్ హై స్ట్రెచ్ లెగ్గింగ్స్, తేమను పీల్చుకునే స్పోర్ట్స్ బ్రాల తదితర అవుట్‌ఫిట్స్‌ను అందిస్తున్నాయి. జీవమే బ్రాండ్ కూడా ఫ్లెక్సిబులిటీ, సౌకర్యంగా ఉండే స్ట్రెచ్బుల్ యోగా గేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 👉 బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్‌కి, మన దేశపు నేలకు తగ్గట్టుగా మెత్తగా ఉండే కుషన్ కలిగిన షూస్‌ని ప్యూమా ఇండియా అందిస్తోంది. యోగాతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కి ఉపకరించే లైట్ వెయిట్, ఎకో ఫ్రెండ్లీ దుస్తుల్ని ప్రయోగ్ తయారు చేస్తోంది. 👉 స్టైలిష్ అత్లీజర్, ఫ్యాషన్, ఫంక్షన్ రెండింటి మేలి కలయికతో డి.అథ్లీజర్ అం ఆల్ డే యాక్టివ్ వేర్‌ను లులులెమన్ ఇండియా అందిస్తోంది. తేలికపాటి వ్యాయామాలతో పాటు రోజువారీ ఉపకరించే దుస్తులను నష్ యాక్టివ్ సమరి్పస్తోంది. 👉 చేసే వ్యాయామంపై అవగాహనతో పాటు ధరించే అవుట్ఫిట్పై కూడా జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం పలు రకాల బ్రాండ్స్, ఏ వ్యాయామ శైలికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను అందిస్తున్నాయి. వాటిలో నుంచి లేదా తామే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కస్టమైజ్డ్ దుస్తులను ఫిట్నెస్ లవర్స్ వినియోగించుకోవచ్చు. – హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అవుట్ ఫిట్.. ఇంపార్టెంట్వ్యాయామం చేసే సమయంలో సరైన అవుట్ ఫిట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఇప్పుడు చాలా మందిలో అవగాహన పెరిగింది. చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి జిమ్ వర్కవుట్‌కి డ్రై ఫిట్ పేరిట అందుబాటులోకి వచ్చిన దుస్తులు, అదే విధంగా యోగ డ్రెస్సింగ్‌కు వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ వినియోగిస్తున్నారు. జాగింగ్ చేసేవారికి జాగర్స్ సూట్స్, సైక్లింగ్కి స్కిన్ టైట్ ప్యాంట్ ఇలా వర్కవుట్ స్టైల్‌ని బట్టి ప్రత్యేక దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి. – విజయ్ గంధం, ఫిట్నెస్ ట్రైనర్ -
నేనోపాఠం నేర్చుకున్నాను
వ్యాయామాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తనలానే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇంతకీ విషయం ఏంటంటే... వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ఇటీవల హెవీ వర్కౌట్ చేశారు. ఈ కారణంగా ఆమెకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి నేనొక అప్డేట్ ఇస్తున్నాను. నేనొక పిచ్చి పని చేశాను. నా శరీరం చెప్పే మాటను నేను పట్టించుకోలేదు. హెవీ వర్కౌట్ చేశాను. ఇందుకు ఫలితంగా నేను గాయపడ్డాను.ఆరు రోజులుగా నేను బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనిపిస్తోంది. నేను తొందరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. అలాగే నేనొకపాఠం కూడా నేర్చుకున్నాను. మీకు మీ శరీరం ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు పట్టించుకోండి. తేలికగా తీసుకుని బలవంతంగా వర్కౌట్స్ చేయకండి. నాకు తెలిసి నా శరీరం కన్నా నా బ్రెయిన్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను. కానీ అన్ని వేళలా ఇది వర్కౌట్ కాదు. ఇక నా మేలును ఆశించి నాకు సందేశాలు పంపుతున్న వారికి థ్యాంక్స్. నేను త్వరలోనే కోలుకుని, మరింత స్ట్రాంగ్‌గా వస్తాను’’ అని పేర్కొన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇదిలా ఉంటే.. 80 కేజీల బరువు ఎత్తడంవల్లే రకుల్‌కి గాయం అయిందని బాలీవుడ్ టాక్. -
Zumba Dance: జుంబా హాయిరే..
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్‌లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్‌ను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గేందుకు.. నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్‌లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్‌సైజ్‌లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.హార్ట్‌కు మాంచి ఎక్సర్సైజ్.. జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్‌లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మరెన్నో లాభాలు.. జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ.. గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్‌గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. – ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో ఆహ్లాదం.. ఆరోగ్యం.. బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్టైన్మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్‌గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు. – బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా -
బిడ్డకు తల్లయినా అంతే గ్లామర్‌గా ఆలియా! ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్‌నెస్‌తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్ చేస్తుంది. అలియా తన ఫిట్నెస్ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్‌గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్‌బెల్‌తో బరువున్న హిప్ థ్రస్ట్‌లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.అలాగే ఆలియా ఫిట్‌నెస్‌లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్ టెక్నీక్లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.ఇవన్నీ పాటించాలంటే..ఆలియా భట్ మాదిరిగానే ఫిట్నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం. మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేయాలి. అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి. View this post on Instagram A post shared by alia💓shukria (@aliabhatt_love28) (చదవండి: అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?) -
12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్, దెబ్బకు ఊబకాయం పరార్! ఇంట్రస్టింగ్ స్టోరీ
బరువు తగ్గడం అనేది చిటికెలోనో, చిట్కాలతోనో జరిగేది కాదు. దీనికోసం సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం కావాలి. వీటన్నింటికీ మించి పట్టుదల, చిత్తశుద్ధి, నిరంతర సాధన ఉండాలి. ఈ విషయాన్నే అక్షరాలా నిజం చేసి చూపించింది ఇంగ్లాండ్‌లోని నార్త్ ఆప్టన్షైర్కు చెందిన 20 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ స్లేటర్. చిన్న జిమ్ చిట్కాతో ఏడాది పాటు శ్రమించి బరువు ఎలా తగ్గిందో తెలుసుకుందాం రండి!మిల్లీ స్లేటర్ 2023లో 115 కేజీల బరువుండేది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. జిమ్ చేసి ఒక్క ఏడాదిలో48 కిలోల బరువు తగ్గింది. ఇపుడు టోన్డ్ ఫిజిక్‌తో నాజూగ్గా తయారైంది. ఇపుడు ఆమె బరువు 67 కిలోలు. తన వెయిట్ లాస్ జర్నీని టిక్‌టాక్‌లో(టిక్‌టాక్‌పై ఇండియాలో నిషేధం) పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రెడ్‌మిల్‌పై వెయిట్ ట్రైనింగ్, ట్రెడ్మిల్ ఇంక్లైన్ వాకింగ్ ద్వారా తన జిమ్ అనుభవాన్ని గణనీయంగా పెంచిందని స్లేటర్ వెల్లడించింది. ఫిట్నెస్కి పోషకాహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో వివరించింది. జిమ్‌లో సాధనతోపాటు, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ల ఆహారంపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాయామం అనేది ఆహ్లాదకరంగా ఉండాలని సూచించింది. 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్‌తో ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తానని తెలిపింది. ఇది లారెన్ గిరాల్డో చెప్పిన 12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్ లా ఉంటుందని స్లేటర్ తెలిపింది. మరోవైపు బయోమెకానిక్స్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం చదునైన నేల మీద నడిచిన దానితో పోలిస్తే ట్రెడ్మిల్ మీద 5 శాతం ఇంక్లైన్లో నడిస్తే 17 శాతం, 10 శాతం ఇంక్లైన్లో నడిస్తే 32 శాతం అదనంగా కేలరీలు ఖర్చు అవుతాయట. మరోవైపు 12-3-30 వర్కవుట్‌తో కేవలం 30 నిమిషాల్లో 150 పౌండ్ల బరువున్నవ్యక్తి దాదాపు 300 కేలరీలు ఖర్చు చేయగలడని హెల్త్ సెంట్రల్ చెబుతోంది. -
30 మినిట్స్... మీకోసం
వాకింగ్ లాంజెస్, బర్పీస్, జంప్ స్క్వాట్స్, సైడ్ కిక్స్, హై నీస్, స్టెయిర్స్, జంపింగ్ జాక్స్, మౌంటెయిన్ క్లైంబర్స్... మొత్తం ఎనిమిది ఎక్సర్సైజ్లు. ఒక్కో ఎక్సర్‌సైజ్‌కి ఒక్క నిమిషం. ‘రోజుకో అరగంట కేటాయించండి చాలు. దేహం ఫిట్‌గా ఉంటుంది’ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాట. ఫిట్నెస్ అనేది మగవాళ్లకు మాత్రమే కాదు మహిళలకు కూడా అవసరమే. మచిలీపట్నంలో మహిళలకు ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు సౌమ్యారావు. ‘‘మహిళ కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమిస్తుంది. కానీ తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనే ధ్యాస ఉండదు. దేహాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రోజుకో అరగంట తన కోసం తాను కేటాయించుకునే వెసులుబాటు కూడా ఉండడం లేదు. ఈ విషయంలో నగరాలు ఒక అడుగు ముందున్నాయి. పట్టణాలు, గ్రామాలు మాత్రం మహిళ ఫిట్నెస్ గురించి మాట్లాడడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి. ఆ అయిష్టతను తొలగించానికి సౌమ్యారావు చేస్తున్న ప్రయత్నమిది. బందరమ్మాయి! మాది మచిలీపట్నం. పూణేలో ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఏరోబిక్స్ మీద ఆసక్తి కలిగింది. ఇంజినీరింగ్ చేస్తూనే ఏరోబిక్స్‌లో కోర్స్ చేసి, ట్రైనర్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేశాను. అమ్మాయిలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని చెప్పేవారు నాన్న. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని మచిలీపట్నం రావడం, అదే ఏడాది మా ఊరి అబ్బాయితోనే పెళ్లీ జరిగిపోయాయి. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే మన పని ్ర΄ారంభించాలనుకున్నాను. అలా 2007లో మూడు లక్షల పెట్టుబడి తో మచిలీపట్నంలో ఏరోబిక్స్ సెంటర్ పారంభించాను. అప్పుడు నా దగ్గర నేర్చుకోవడానికి ఇద్దరు మాత్రమే పేరు నమోదు చేసుకున్నారు. నెల తిరిగేసరికి యాభై మంది ఎన్రోల్ అయ్యారు. రెండు నుంచి యాభైకి... మధ్య మచిలీపట్నంలో ఉన్న ప్రతి డాక్టర్నీ సంప్రదించాను. ఏరోబిక్స్ని ఫిట్నెస్ అనే ఒక్కకోణంలో చూడకుండా, దేహం అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్‌కీ అవసరమైనట్లు కస్టమైజ్డ్గా డిజైన్ చేయాల్సిన అవసరాన్ని సూచించారు. సిజేరియన్ తర్వాత దేహం తిరిగి పటుత్వాన్ని సంతరించుకోవడం, ఒబేసిటీ, పీసీఓడీ వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు డిజైన్ చేశాను. మన సమాజం నిర్లక్ష్యం చేసే మరో సమస్య మెనో΄ాజ్. ఈ దశ తర్వాత మహిళల దేహం చాలా వేగంగా శక్తిని కోల్పోతుంది. ఈ దశలో ఫిట్‌నెస్‌ని పరిరక్షించుకోవడం ఎంత అవసరమో తెలియచేస్తున్నాను. అలాంటి వాళ్లకు సెల్ఫ్‌కేర్ గురించి కౌన్సెలింగ్‌తో΄ాటు ఉచితంగా ఫిట్నెస్ శిక్షణనిస్తున్నాను. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే యాభై దాటినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ దశను ఆరోగ్యకరంగా దాటగలిగితే మహిళలు అరవై, డెబ్భైలలో నాణ్యమైన జీవితాన్ని సాగించగలుగుతారు. అలాగే మిడిల్ ఏజ్‌లో మహిళలకు ఎదురయ్యే డిప్రెషన్, మెంటల్ ట్రామాలకు కూడా ఫిట్నెస్ యాక్టివిటీ మంచి పరిష్కారం. ఏరోబిక్స్ శిక్షణ కోసం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ క్లాసులు తీసుకుంటున్నాను. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియాల్లో ఉన్న మా మచిలీపట్నం వాళ్లే ఎక్కువ మంది. ఆవేదన తప్పడం లేదు కొంతమంది భర్తలు ‘నీకిప్పుడు ఫిట్నెస్ అవసరమా, డబ్బు తగలేస్తావా’ ఇలా రకరకాలుగా అంటారట. ఆ మాటలకు భయపడి ముందడుగు వేయని వాళ్లు కొందరైతే, రహస్యంగా నేర్చుకోవాలనుకునే వాళ్లు కొందరు. ఇరవై ఒకటో శతాబ్దం కూడా మహిళల విషయంలో ఇలా ఉండడం ఏమిటో అని ఆవేదన కలుగుతుంటుంది. చైతన్యవంతం కావాల్సింది మహిళలు మాత్రమే కాదు మగవాళ్లు కూడా’’ అన్నారు సౌమ్యారావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిపిల్లల డైలీ రొటీన్ పిల్లలకు బ్రష్ చేయడం దగ్గర్నుంచి తగినన్ని నీళ్లు తాగడం వరకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పిస్తాం. కానీ ఫిట్నెస్ కోసం సమయం కేటాయించడం మన ఇండియన్ పేరెంటింగ్ డిక్షనరీలో కనిపించదు. స్కూళ్లలో ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ లేదా జుంబా డాన్స్ వంటి ఏదో ఒక వ్యాయామ ప్రక్రియ ప్రవేశ పెడితే పిల్లలకు డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ ఒక భాగంగా మారుతుంది. ఇప్పుడున్న విద్యావిధానం విద్యార్థుల్లో ఒత్తిడిని పెంచుతోంది. ఆ ఒత్తిడిని తొలగించే మార్గం ఫిజికల్ ఎక్సర్సైజ్. కనీసం మూడు నిమిషాల ్ర΄ాక్టీస్ చాలు. నేనే స్వయంగా స్కూళ్లకు వెళ్లి ఉచితంగా నేర్పిస్తానని ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ ΄ాఠశాల యాజమాన్యాలకు తెలియచేశాను. – సౌమ్యారావు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, మచిలీపట్నం -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్‌కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్‌లో తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్‌కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
Janhvi Kapoor: జిమ్‌లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
చిరు సినిమాలో ఛాన్స్? వర్కౌట్ వీడియోతో హీరోయిన్ సర్ప్రైజ్!
కన్నడ బ్యూటీ షాక్ ఇచ్చింది. సినిమాల్లో వయ్యారంగా కనిపించి, యాక్టింగ్‌తో ఇరగదీసిన ఈ హీరోయిన్.. జిమ్‌లో వావ్ అనేలా రెచ్చిపోయింది. సరిగ్గా చెప్పాలంటే శరీరాన్ని ఎటు పడితే అటు వంచేసి అందరూ నోరెళ్లబెట్టి చూసేలా చేసింది. ఇకపోతే ఈ బ్యూటీకి చిరు కొత్త సినిమాలో ఆఫర్ వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడీ విషయం మెగా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమైంది. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. గతేడాది 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాఫ్ అయింది. కానీ నాగార్జున 'నా సామి రంగ' చిత్రంలో ఈమె వరాలు అనే పాత్ర చేసింది. రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా మాత్రం ఆషిక అదరగొట్టేసింది. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) అలా యాక్టింగ్ పరంగా అలరిస్తున్న ఆషికకు తాజాగా చిరు 'విశ్వంభర'లో అవకాశమొచ్చిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. సరే ఇదంతా వదిలేస్తే చుడటానికి సుకుమారంగా ఉండే ఆషిక.. జిమ్‌లో మాత్రం మొత్తం రఫ్ అండ్ టఫ్‌గా అల్లాడించేసింది. ఇందుకు సంబంధించిన వర్కౌట్ వీడియోని తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తున్నంతసేపు చేస్తున్న ఆషికకు ఏమో గానీ మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వర్కౌట్ అలా ఉంది. మరి ఈ వర్కౌట్ అంతా చిరు సినిమా కోసమా లేదంటే వేరే ఏదైనా మూవీ కోసమా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుందిలే. (ఇదీ చదవండి: 'టిల్లు 2' కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ.. ఎంతిచ్చారో తెలుసా?) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
విశ్వంభర కోసం మెగాస్టార్ కసరత్తులు..
-
సామ్ ఇయర్ ఎండింగ్ వర్కౌట్ వీడియో వైరల్
-
2023 చివరి వీడియో.. ఏకంగా అన్ని కిలోలు ఎత్తిపడేసిన సామ్
హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పేదేం లేదు. గ్లామరస్ బ్యూటీగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకుంది. ఏ విషయంలోనూ తగ్గేదేలా అన్నట్టుగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్.. విదేశాలకు వెళ్లి మరీ చికిత్స తీసుకుంది. వైద్య చికిత్స తీసుకుంటూనే యోగా, ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక బాటపట్టింది. అలానే వర్కౌట్స్ చేయడం అస్సలు మానలేదు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సమంత యాక్టర్‌గా ఎంత ఫెర్ఫెక్ట్గా ఉంటుందో.. ఫిజికల్‌గా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తుంది. ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలా దాదాపు 100 కిలోల బరువుని తలపై వరకు ఎత్తి మరీ అమ్మ బాబోయ్ అనిపించేస్తోంది. 2023కి ఇది చివరి వర్కౌట్స్ వీడియో అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!
మోహన్ లాల్.. పేరుకే మలయాళ హీరో గానీ దక్షిణాది ప్రేక్షకులు అందరినీ తన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో నటించి మనవాళ్లకు బాగా దగ్గరైపోయాడు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వయసు ప్రస్తుతం 63 ఏళ్లు. అయితేనేం కుర్రాళ్లే భయపడిపోయేలా రిస్కులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) మలయాళంలో స్టార్ హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మోహన్‌లాల్.. ప్రస్తుతం వాలిబన్, వృషభ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్'లోనూ ఓ పాత్ర చేశాడు. ఈ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇలా మూవీస్ గురించి పక్కనబెడితే ప్రతిరోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటుంటాడు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ మోహన్‌లాల్ కనిపించాడు. వేరే ఎవరో ఈ బరువు ఎత్తితే పెద్దగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. 63 ఏళ్ల వయసులో ఈ స్టార్ హీరో ఇలా చేయడంతో అందరూ షాకవుతున్నారు. ఓవైపు మెచ్చుకుంటూనే, మరోవైపు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
వీడియో: మెడ విరిగి కుప్పకూలిన ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్
-
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్‌గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
ఫుల్ జోష్ లో మహేష్ బాబు...
-
ప్రాణాలు తీసిన వెయిట్ లాస్ వ్యామోహం
స్థూలకాయంతో బాధపడుతున్నవారితో పాటు, బరువు పెరిగిపోతున్నామనే భయంతో కొందరు రకరకాల వెయిట్ లాస్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా భరిస్తున్నారు. అయితే వెయిట్ లాస్ వ్యామోహం పెంచుకున్న కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శరీర బరువు తగ్గాలనే తపనలో 21 ఏళ్ల యువతి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె 90 కిలోల బరువు తగ్గాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం తీసుకునే ఆహారపానీయాలను ఒక్కసారిగా తగ్గించేసింది. ఖాళీ కడుపుతో వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో ఆమె ఆనారోగ్యం పాలయ్యింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చైనాలోని షాంక్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. షాంఘై మార్నింగ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం చైనా సోషల్ మీడియాలో కుయ్‌హువా అనే యువతి ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఆమెకు వేలమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. గత శనివారం ఆమె వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించారు. డౌయిన్(చైనా టిక్‌టాక్ వెర్షన్)లో ఆమె తల్లిదండ్రులు ఇలా రాశారు... ‘ మా అమ్మాయి ఇక లేదు. మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు అభినందనలు. ప్లీజ్ మీరంతా ఇలా చేయకండి’ అని రాశారు. కుయ్‌హువా తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే వర్క్ అవుట్ తరువాతనే ఇలా జరిగిందని తెలిపారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కుయ్‌హువా భారీ కాయంతో బాధపడుతోంది. దీంతో 90 కిలోల వరకూ బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఒక ఫిట్నెస్ క్యాంపులో చేరింది. అక్కడ ఆమె ప్రతిరోజూ వర్క్ అవుట్ చేస్తూ వస్తోంది. కఠినమైన డైటింగ్ ఫాలో అయ్యేది. త్వరగా బరువు తగ్గించుకోవాలనే తపనతో ఆహారాన్ని పూర్తిగా మానేసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ నేపధ్యంలో ఆమె 25 కిలోల వరకూ బరువు తగ్గింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో తెలియజేసింది. అలాగే పలు ఫొటోలను కూడా షేర్ చేసింది. రాబోయే 6 నెలల్లో మరో 10 కిలోల బరువు తగ్గాలను కుంటున్నట్లు తెలియజేసింది. అయితే ఈ టార్గెట్ పూర్తయ్యేలోగానే ఆమె కన్నుమూసింది. కుయ్‌హువా ఇటీవలి కాలంలో షేర్ చేసిన ఫోటోలలో వర్క్ అవుట్‌కి సంబంధించిన ఫొటోలే అధికంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమె మృతికి సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా, ఆమె బరువు తగ్గేందుకు అవలంబించిన విధానం సరైనదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ.. -
194 కేజీల బరువున్న వైద్యుడు 110 కిలోల బరువు తగ్గాడు.. తన సీక్రెట్ ఇదేనంటూ...
శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని కొనసాగించడం ద్వారా ఎవరైనా బరువు తగ్గవచ్చని చెబుతుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఒక వైద్యుడు ఏకంగా 110 కిలోల బరువు తగ్గారు.ఈ వైద్యుని పేరు డాక్టర్ అనిరుద్ధ్ దీపక్. ఆయన సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. చెన్నైకి చెందిన ఈయన 5 అడుగుల 7 ఇంచుల ఎత్తు కలిగివున్నారు. డాక్టర్ అనిరుద్ధ్ బరువు ఒకప్పుడు 194 కిలోలు ఉండేది. అయితే ఇప్పుడు అతని బరువు 80 కిలోల కన్నా తక్కువగానే ఉంది. 194 కిలోల నుంచి 80 కిలోలకు తగ్గిన అతని ఫిట్ నెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ అనిరుద్ధ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూవుండటం అలవాటు. ఈ కారణంగానే నా శరీర బరువు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ విషయన్ని నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్ మొదలైనవాటిని ఎంతో ఇష్టపడేవాడిని. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ పొట్ట నింపేసేవాడిని’ అని తెలిపారు. 2018లో అతని ఎంబీబీఎస్ పూర్తయ్యింది. అయితే ఇంతలోనే అనిరుద్ధ్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఆ సమయంలో వైద్యులు అనిరుద్ధ్తో ఇదే శరీర బరువుతో ఉంటే మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. బరువు తగ్గాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నారు. తాను బరువు తగ్గిన విధానం గురించి అనిరుద్ధ్ మాట్లాడుతూ ‘ఒక ట్రైనర్ నాకు డైట్, వర్కవుట్ ప్లాన్ చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా అనుసరిస్తూ రెండేళ్లలో 110 కిలోల బరువు తగ్గాను. రోజులో కేవలం 5 మిల్లీలీటర్ల వంట నూనెను మాత్రమే తీసుకునేవాడిని. 2000 కేలరీలు మాత్రమే ఉండేలా చూసుకున్నాను.బ్రేక్ ఫాస్ట్‌లో పోహా లేదా చపాతీ, సోయా చంక్స్, సలాడ్ తీసుకునేవాడిని. స్నాక్స్‌లో పండ్లు, బాదాం మాత్రమే తినేవాడిని. మధ్యాహ్నం భోజనంలో రైస్ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకున్నాను.ఈవెనింగ్ స్నాక్స్‌లో ప్రొటీన్, రాత్రి ఆహారంలో రైస్ లేదా రోటీ, పన్నీర్, కూర ఉండేలా చూసుకునేవాడిని. నేను ఫిట్నెస్ జర్నీ ప్రారంభించినప్పుడు లాక్డౌన్ నడుస్తోంది.దీంతో హోమ్ వర్క్అవుట్ మాత్రమే చేయగలిగాను. ఈ సమయంలో నేను డంబెల్స్, ఫ్లోస్‌తో వ్యాయామాలు చేసేవాడిని. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, జంప్ రోప్, సర్కిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ మొదలైనవి చేసేవాడిని’ అని డాక్టర్ అనిరుద్ధ్ తెలిపారు. -
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
సిక్స్ ప్యాక్ లుక్‌లో మాళవిక..
-
Allu Arjun: పుష్ప-2 కోసం తెగ కష్టపడుతున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చాలా 'రా అండ్ రగ్గడ్'గా ఉంటుంది. దీనికోసం ఆయన కొన్ని నెలల పాటు ప్రత్యేక డైట్‌ను ఫాలో అయ్యారట. షూటింగ్ లేకపోయినా బన్నీ ఫిట్నెస్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే 41 ఏళ్ల వయసులోనూ అంత ఫిట్ అండ్ స్టైలిష్‌గా ఉంటారు. ఇక టాలీవుడ్లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన తొలి హీరోగా బన్నీకి పేరుంది. ఈ క్రమంలో పుష్ప-2లో మరింత రగ్గడ్ లుక్‌లో కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ వర్కవుట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి మరి. @alluarjun Mannn back on duty to entertain us💥#AlluArjun𓃵 pic.twitter.com/UExDyWC448 — k🅰️nh🅰️ (@OnlyAlluArjun08) April 18, 2023 -
ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేస్తున్న రామ్ చరణ్ వర్కౌట్ వీడియోస్
-
ఆరోగ్యంగా తగ్గండి.. లేదంటే బరువు తగ్గినా ఈ సమస్యలు తప్పవు!
Weight Loss Tips: బరువు తగ్గాలి అంటే వ్యాయామం, డైటింగ్ ఒక్కటే సరిపోదు. సరైన వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన తిండి, నిలకడగా వ్యాయామాలు చేయడం కొంచెం ఓపిక అవసరం. బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాల పాత్ర 20 శాతం ఉంటే, ఆహారం పాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరీలు అవసరం. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ తమకు అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే మన శరీరానికి 2,200 క్యాలరీలు అవసరమనుకుంటే, అంతకన్నా కొద్దిగా తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు: రోజుకు 2000 క్యాలరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం... అంటే కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి తీసుకోవాలి. ముందుగా ఇంతకుముందు తింటున్న ఆహార పరిమాణాన్ని కొంచెం తగ్గించాలి. తీపి పదార్థాలు, శీతల పానీయాలు, బయట తిండి పూర్తిగా తగ్గించాలి. తోపుడు బండి వాళ్ల దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ల వరకూ అందరూ తమ ఆహారం రుచిగా ఉండాలి అనే కోరుకుంటారు గాని ఆరోగ్యంగా ఉండాలి అని కాదు. ఆరోగ్యం అంటే శుభ్రత ఒకటే కాదు, తక్కువ క్యాలరీలు అని కూడా. ఎంతసేపు చేస్తున్నాము అన్నదానికన్నా ఎంత తీవ్రతతో చేస్తున్నాము, ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నాం అన్నది ముఖ్యం. ఉదా – ఒక గంటన్నర నడవడం వల్ల 500 క్యాలరీలు కరిగితే, 45 నిముషాలపాటు చేసే వర్కవుట్స్ వల్ల కూడా 500 క్యాలరీలు కరుగుతాయి. కాబట్టి చేసే వ్యాయామాల వల్ల రోజుకు ఎన్ని క్యాలరీలు కరుగుతాయో అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు తినడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా బరువు తగ్గగలం. లేదంటే బరువు తగ్గినా, నీరసం, అనారోగ్యం పాలవక తప్పదు. చదవండి: Stammering: మాట్లాడేటపుడు నత్తి వస్తోందా? ఈ చిట్కాలు పాటించారంటే! -
ఆ హీరోను నామినేట్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ?
మనకు ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీల్లో 'ఎటాక్ ఛాలెంజ్' నడుస్తోంది. ఈ ఎటాక్ ఛాలెంజ్‌తో సినీ తారలు మరింత ఫిట్‌గా మారనున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వర్క్ అవుట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సామ్ హై ఆక్టేన్ వర్క్ అవుట్ చేస్తూ కనువిందు చేసింది. చదవండి: అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: సమంత ఈ వర్క్ అవుట్ వీడియోను ఎటాక్ ఛాలెంజ్‌లో భాగంగా షేర్ చేసింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. 'నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా. చూద్దాం మీరు ఎలా చేస్తారో.' అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు 'నేను కచ్చితంగా ఇలా చేయలేను' అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ ఎటాక్ ఛాలెంజ్‌ను టైగర్ ష్రాఫ్‌కు కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సవాలు విసిరింది. తర్వాత వారి వెర్షన్లను చూపించమని సమంత, నిర్మాత జాకీ భగ్నానీలను నామినేట్ చేశాడు టైగర్ ష్రాఫ్. చదవండి: సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం 'ఎటాక్: 1'. లక్ష్య రాజ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్ ప్రీత్, జాక్వెలిన్ ఈ 'ఎటాక్ ఛాలెంజ్'ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
జిమ్ చేస్తూనే మృతి చెందిన మహిళ