Watch: Actor Mohanlal Lifts 100 Kg Weight At Age Of 63, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Mohanlal Workout Video: జిమ్‌లో ఇరగదీస్తూ.. డెడికేషన్ వేరే లెవల్!

Published Wed, Jul 26 2023 12:42 PM | Last Updated on Wed, Jul 26 2023 1:08 PM

Actor Mohanlal Weight Lifting Video Latest - Sakshi

మోహన్ లాల్.. పేరుకే మలయాళ హీరో గానీ దక్షిణాది ప్రేక్షకులు అందరినీ తన సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో నటించి మనవాళ్లకు బాగా దగ్గరైపోయాడు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వయసు ప్రస్తుతం 63 ఏళ్లు. అయితేనేం కుర్రాళ్లే భయపడిపోయేలా రిస్కులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

(ఇదీ చదవండి: ప్రభాస్‌ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్‌లో!)

మలయాళంలో స్టార్ హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మోహన్‌లాల్.. ప్రస్తుతం వాలిబన్, వృషభ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్'లోనూ ఓ పాత్ర చేశాడు. ఈ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇలా మూవీస్ గురించి పక్కనబెడితే ప్రతిరోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటుంటాడు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు.

అయితే ఈసారి మాత్రం 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ మోహన్‌లాల్ కనిపించాడు. వేరే ఎవరో ఈ బరువు ఎత్తితే పెద్దగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. 63 ఏళ్ల వయసులో ఈ స్టార్ హీరో ఇలా చేయడంతో అందరూ షాకవుతున్నారు. ఓవైపు మెచ్చుకుంటూనే, మరోవైపు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇ‍ప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement