
నేను ఏ తప్పూ చేయలేదు, మీరు అనవసరంగా పొరబడుతున్నారు అంటున్నాడు హీరో మాధవన్ (R Madhavan). ఇటీవల ఆయన అమ్మాయితో చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో యువతి కిస్ ఎమోజీలతో చేసిన మెసేజ్‌కు మాధవన్ రిప్లై ఇవ్వడంతో చాలామంది ఆయన క్యారెక్టర్‌నే అనుమానించారు. ఈయనేంటి, అలాంటి మెసేజ్‌లకు స్పందిస్తున్నారని కొంత అసహనం వ్యక్తం చేశారు.
ఓ అమ్మాయి మెసేజ్..
తాజాగా అతడు సోషల్ మీడియా (Social Media)లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ తన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 'పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. మీకో ఉదాహరణ చెప్తా.. నేను ఒక నటుడిని. ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల ద్వారా నాకు జనాలు మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. అలా ఓ అమ్మాయి.. మీ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. మీరు నిజంగా గొప్ప యాక్టర్. మీరు నన్ను ఇన్‌స్పైర్ చేశారు అని మెసేజ్ చేసింది. కానీ చివర్లో హార్ట్, లవ్ సింబల్స్ పెట్టింది.

రిప్లై ఇచ్చిన పాపానికి..
నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా? వద్దా? సాధారణంగా.. థాంక్యూ సో మచ్, గాడ్ బ్లెస్ యు.. ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. తనకూ అదే రిప్లై ఇచ్చాను. వెంటనే ఆమె దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్, కిస్, లవ్ ఎమోజీలను మాత్రమే చూశారు. వాటికే నేను రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు.. కేవలం తన మెసేజ్‌కు స్పందించాను.
అందుకే భయం
మీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడా? అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను. మరి నాలాగా అనుభవం లేనివారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించారా? అని ప్రశ్నించాడు. మాధవన్ చివరగా హిసాబ్ బరాబర్ సినిమా (Hisaab Barabar Movie)లో కనిపించాడు. తమిళంలో అధిర్శ్తసాలి, టెస్ట్ సినిమాలు చేస్తున్నాడు. హిందీలో అమీర్కీ పండిత్, దేదే ప్యార్ దే 2, కేసరి చాప్టర్ 2, ధురంధర్ మూవీస్‌లో కనిపించనున్నాడు.
చదవండి: ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
Comments
Please login to add a commentAdd a comment