
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో తమిళంలో హీరోగా అద్భుతమైన సినిమాలు తీసి నడిగర్ తిలగం అనే బిరుదు సంపాదించుకున్నారు శివాజీ గణేశన్(Sivaji Ganesan). ఈయన వారసులు ఇప్పుడు నటులుగా చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మనవడు చేసిన అప్పు వల్ల శివాజీ గణేశన్ కి ఎంతో ఇష్టమైన ఇంటిని జప్తు చేయామని మద్రాస్ హైకోర్ట్(Madras Highcourt) ఆదేశించింది.
(ఇదీ చదవండి: దుబాయ్‌లోనే నిర్మాత 'కేదార్' అంత్యక్రియలు)
ఏం జరిగింది?
శివాజీ గణేశన్ వారసుడు రామ్ కుమార్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. ఈయన కొడుకు దుష్యంత్ మాత్రం భార్యతో కలిసి ఈశాన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. ఒక్క మూవీ తీసి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే ధనభాగ్యం ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ నుంచి రూ.3.74 కోట్లు రూపాయల్ని ఏడాదికి 30 శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. 'జగజాల కిలాడి' అనే సినిమా మొదలుపెట్టాడు.
ఇదంతా జరిగి చాన్నాళ్లయిపోయింది. ఈ క్రమంలోనే తమ దగ్గర తీసుకున్న అప్పుని దుష్యంత్ చెల్లించలేదని.. సదరు ధనభాగ్య సంస్థ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. మధ్యవర్తి ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పింది.
(ఇదీ చదవండి: ఆస్కార్ మెచ్చిన వేశ్య కథ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)

ఈ క్రమంలోనే తీసిన సినిమాను ధనభాగ్య సంస్థకు ఇచ్చేయాలని దుష్యంత్ తో మధ్యవర్తి చెప్పాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. తాను ఇంతవరకు సినిమా పూర్తి చేయలేదని, అప్పుగా తీసుకున్న డబ్బుతో తన పాత బాకీలు తీర్చుకున్నానని దుష్యంత్ చెప్పాడు. ఈ విషయంలో తమని తప్పుదారి పట్టించాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో దుష్యంత్ కి ఉమ్మడి ఆస్తిగా దక్కిన తాత శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని, ఇంటికి తాళాలు వేయాలని అధికారుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇది తెలిసిన దిగ్గజ హీరో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
Comments
Please login to add a commentAdd a comment