నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..! | Kollywood Star Dhanush Files Case Against Nayanthara Couple | Sakshi
Sakshi News home page

Dhanush: నయనతార డాక్యుమెంటరీ.. కోర్టులో దావా వేసిన ధనుశ్!

Published Wed, Nov 27 2024 1:38 PM | Last Updated on Wed, Nov 27 2024 2:00 PM

Kollywood Star Dhanush Files Case Against Nayanthara Couple

కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్‌.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. 

గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. 

‍‍అసలేం జరిగిందంటే..

ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార  డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement