ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉందన్న నటుడు! | Kollywood Actor RJ Balaji reacts to Nayanthara vs Dhanush | Sakshi
Sakshi News home page

Kollywood Actor: ధనుశ్- నయనతార వివాదం.. ఫుల్ ఎంటర్‌టైనర్‌ అంటోన్న నానుమ్‌ రౌడీదాన్‌ నటుడు!

Published Mon, Nov 18 2024 4:30 PM | Last Updated on Mon, Nov 18 2024 4:30 PM

Kollywood Actor RJ Balaji reacts to Nayanthara vs Dhanush

ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన్ తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‌ రిలీజ్‌ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.

అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్‌ నటుడు  ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్‌ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైనర్‌గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.

(ఇది చదవండి: నయనతార- ధనుష్‌ వీడియో క్లిప్‌ వివాదం.. హీరో తండ్రి షాకింగ్‌ కామెంట్స్‌!)

వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్‌తో  చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement